పెళ్లయ్యాక లావును ఇలా తగ్గించుకోవొచ్చు

Posted By: Bharath
Subscribe to Boldsky

పెళ్లి అయ్యాక ప్రతి ఒక్కరూ సాధారణంగా లావు పెరిగిపోతుంది. పెళ్లికాకముందు డైట్ పాటిస్తూ స్లిమ్ గా ఉండేవాళ్లు తర్వాత సంసారం బాధ్యతలు పెరిగిపోవడంతో కాస్త ఆరోగ్యాన్ని పట్టించుకోరు. దీంతో అనుకోకుండా లావు అయిపోతారు. మొదట్లో ఇది పెద్ద సమస్యగా అనిపించదు. రానురాను ఇదే పెద్ద సమస్య అవుతుంది. బరువు పెరగడం వల్ల అధిక రక్తపోటు, గుండె సంబంధిత వా్యధులు, ఆస్టియో ఆర్థరైటిస్ వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఒకవేళ మీరూ కూడా పెళ్లయిన తర్వాత ఇలా లావు పోతున్నారనుకో.. వెంటనే మేల్కొనండి. కొన్ని చిట్కాలు పాటించి అధిక బరువు, ఊబకాయం, పొట్ట చుట్టు పేరుకుపోయిన కొవ్వు వంటి సమస్యల నుంచి బయటపడండి.

సరైన ఆహారం తీసుకోకపోవడం

సరైన ఆహారం తీసుకోకపోవడం

వివాహం అయ్యాక సరిగ్గా అన్నం తినరు. ఒక సమయం అంటూ ఉండకుండా పోతుంది. బాధ్యతలు పెరిగిపోతాయి. దీంతో ఆటోమేటిక్ గ్గా బాడీలో కొవ్వు పేరుకుపోతుంది. లావు అయి పోతారు.

ప్రాధాన్యతలు మారుతాయి

ప్రాధాన్యతలు మారుతాయి

పెళ్లి అయిన తర్వాత అందరి ప్రాధాన్యతలు మారిపోతాయి. కొత్త జీవితం ప్రారంభవుతుంది. భాగస్వామితో కలిసి భోజనం చేసే సంప్రదాయాలు కూడా ఉంటాయి. వీటన్నింటి వల్ల ఒక్కోసారి అల్పాహారం తినరు. భోజనం కూడా సరిగ్గా చేయరు.

ఒక్కోసారి ఎక్కువగా తినడం

ఒక్కోసారి ఎక్కువగా తినడం

సరిగ్గా తిన్నా, ఎక్కువగా తినకపోయినా కచ్చితంగా లావు అయిపోతారు. కొందరు పెళ్లి అయిన తర్వాత ఎక్కువగా రెస్టారెంట్లు, హోటలల్లో భోజనం చేస్తుంటారు. ఇలా ఎక్కువగా తినడం వల్ల కూడా లావైపోతుంటారు.

వ్యాయామం చేయాలి

వ్యాయామం చేయాలి

అయితే లావు తగ్గేందుకు రెగ్యులర్ వ్యాయామాలు చేస్తూ ఉండాలి. కార్డియో వ్యాయామాలు, వెయిట్ ట్రైనింగ్ వంటివి చేస్తూ ఉంటే మేలు. దీంతో కాస్త త్వరగా బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది. యోగా చేస్తే కూడా చాలా మేలు.

గ్రీన్ టీ

గ్రీన్ టీ

గ్రీన్ టీ జీవక్రియను పెంచుతుంది. శరీరంలో ఫ్యాట్ ను తొలగించడానికి గ్రీన్ టీ బాగా సాయం చేస్తుంది. అందువల్ల రెగ్యులర్ గా గ్రీన్ టీ తాగితే కూడా చాలా మంచిది. ఇది శరీరంలోని కొవ్వును మొత్తం కరిగించేస్తుంది.

ఆహారాన్ని నమిలి తినాలి

ఆహారాన్ని నమిలి తినాలి

మీరు ఆహారాన్ని బాగా నమిలి తింటే మంచిది. దీని వల్ల మీరు ఇకపై అదనపు బరువు పెరగకుండా ఉంటారు. ఈ విధానాన్ని కూడా మీరు రోజూ తినేటప్పుడు పాటించండి.

ఆస్పరాగస్

ఆస్పరాగస్

ఆస్పరాగస్ ను ఎక్కువగా తీసుకుంటే కూడా చాలా మంచిది. దీని వల్ల శరీరంలోని కొవ్వు మొత్తం కూడా కరిగిపోతుంది. జీర్ణశక్తి మెరుగవుతుంది.

సిట్రస్ పండ్లు

సిట్రస్ పండ్లు

సిట్రస్ పండ్లు అన్నీ కూడా శరీరంలోని కొవ్వును కరిగించేస్తాయి. ఆరెంజ్, గ్రేఫ్ ఫ్రూట్, నిమ్మకాయలు వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అలాగే వీటిలో పొటాషియం కూడా అధికంగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తింటే చాలా మంచిది.

దోసకాయలు

దోసకాయలు

దోసకాయలు కూడా శరీరంలోని ఫ్యాట్ మొత్తాన్ని కరిగించేయగలవు. వీటిలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. అందువల్ల వీటిని ఎక్కువగా తింటూ ఉండాలి.

అవకాడో

అవకాడో

అవకాడో కూడా కొవ్వును బాగా కరిగిస్తుంది. అలాగే గుండె సంబంధిత వ్యాధులను తగ్గించడంలోనూ ఇది బాగా ఉపయోగపడుతుంది. కేలరీలను తగ్గించడానికి ఈ పండును ఎక్కువగా తింటూ ఉండాలి.

ఆకుకూరలు

ఆకుకూరలు

పాలకూరు వంటి తాజా ఆకుకూరలను ఎక్కువగా తింటూ ఉండాలి. దీంతో పొట్ట దగ్గర ఉండే కొవ్వు మొత్తం కరిగిపోతుంది. తరుచుగా తాజా ఆకుకూరలను తీసుకోవడం చాలా మంచిది.

చేపలు

చేపలు

చేపలు కూడా చాలా ఆరోగ్యకరమైనవి. వీటిలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ట్యూనా, సార్డినెస్, సాల్మొన్ వంటి చేపలను ఎక్కువగా తింటూ ఉండాలి. దీంతో శరీరంలోని కొవ్వు మొత్తం కరిగిపోతుంది.

బెర్రీలు

బెర్రీలు

బెర్రీలను కూడా ఎక్కువగా తీసుకుంటే మంచిది. రాస్ప్బెర్రీస్, స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్ వంటి బెర్రీలను తింటూ ఉండాలి. వీటిలో పాలిఫేనోల్స్, ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి.

గుడ్లు

గుడ్లు

వీటిలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. వీటిలోని అర్జినిన్ కొవ్వును బాగా కరిగిస్తుంది. పొట్టు చుట్టూ ఉండే కొవ్వును తగ్గిండానికి వీటిని రెగ్యులర్ గా తింటూ ఉండాలి.

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్

రోజూ తినే ఆహార పదార్థాలను ఆలివ్ ఆయిల్ తో తయారు చేసుకుంటే మంచిది. రెగ్యులర్ మీరు ఉపయోగించే నూనెలకు బదులు ఆలివ్ ఆయిల్ ఉపయోగించండి.

నట్స్

నట్స్

కొన్ని రకాల నట్స్ కూడా లావు తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి.బాదం, పీనట్స్, వాల్నట్, పిస్తాపప్పులు మొదలైన నట్స్ పొట్ట చుట్టూ ఉండే కొవ్వును తగ్గిస్తాయి.

ఆర్టిచోకెస్

ఆర్టిచోకెస్

ఆర్టిచోకెస్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తీసుకుంటే చాలా మంచిది. ఇక్కడ ఇచ్చిన ఆహారాలన్నీ రోజూ తింటూ ఉంటే క్రమంగా మీరు బరువుతగ్గిపోతారు.

English summary

15 ways on how to reduce belly fat after marriage

15 Ways On How To Reduce Belly Fat After Marriage
Subscribe Newsletter