Latest Updates
-
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే
కలబంద మరియు ఉసిరికాయ రసాల మాయాఔషధంతో సులభంగా బరువు తగ్గండి
ఆలోవెరా మరియు ఉసిరి రసాలు ఆయుర్వేదంలో శక్తినిచ్చే ఔషధాలు. వాటిలో అధికంగా ఖనిజలవణాలు, విటమిన్లుండి, అనేక వ్యాధులను దూరం చేస్తాయి.
పొడి రూపంలో లేదా రసంలాగా వీటి లాభాలను మీరు పచ్చళ్లలో, స్మూతీలలో పొందవచ్చు. ఈ అద్భుత కలయిక బరువు తగ్గటానికి చాలా ఉపయోగపడుతుంది.

ఉసిరిలో ఎక్కువగా ఉండే విటమిన్ సి యాంటిఆక్సిడెంట్లు మరియు వాపులకి కూడా వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఈ తీపి-పుల్లటి పండులో అమినో యాసిడ్లు, ఐరన్, విటమిన్ ఎ, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం మరియు కాల్షియం ఉంటాయి.
అలోవెరాలో 32 విటమిన్లు, ఖనిజలవణాలు మరియు వందలాది ఎంజైములు, సూక్ష్మపోషకాలు ఉంటాయి.ఈ ఎంజైములు, పోషకాలు వాపులకి వ్యతిరేకంగా మరియు ఫంగస్ కి వ్యతిరేకంగా పనిచేసే లక్షణాలను కలిగిఉంటాయి.

బరువు తగ్గటానికి ఆలోవెరా, ఉసిరి ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు చూద్దాం.
ఉసిరి,ఆలోవెరా రసాన్ని రెగ్యులర్ గా తాగుతూ ఉండటం వలన మీ మెటబాలిజం వేగం పెరుగుతుంది. అందుకని శరీరంలోంచి విషపదార్థాలు మరింత ప్రభావవంతంగా బయటికి వెళ్ళిపోతాయి.
ఆయుర్వేదం ప్రకారం, విషపదార్థాలు శరీరంలో పేరుకుపోవటం బరువు పెరిగేలా చేస్తుంది మరియు శరీరంలో అవి అన్నిటికీ అడ్డంపడే అవకాశం ఉన్నది.

ఆలోవెరా మరియు ఉసిరి రసాలు శరీరాన్ని విషపదార్థాల నుంచి దూరం చేయటానికి బాగా పనిచేస్తాయి.
ఇంకా నీటిశాతాన్ని కూడా తగ్గకుండా చేసి, మీకు ఆకలిలేకుండా చేస్తాయి, మీ చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. ఆమ్లా, ఆలోవెరా రసాల్లో ఉన్న పోషకాల వలన వ్యాయమం చేసి అలసిపోతే మీకు వెంటనే శక్తినిస్తాయి.
అరకప్పు ఉసిరి, ఆలోవెరా రసాన్ని కలపండి. బాగా కలిపి తాగండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
