బరువు తగ్గించే బెస్ట్ వెయిట్ లాస్ మసాలా దినుసులు, డ్రింక్స్

Posted By:
Subscribe to Boldsky

మీ శరీరమే మీకో మంచి ఫ్యాషన్ స్టేట్ మెంట్. ఫిట్ గా మరియు హెల్తీగా ఉన్నట్లైతే ప్రపంచాన్నే జయించవచ్చు అంటారు కొందరు నిపుణులు. మంచి ఫిట్ నెస్ ను మెయింటైన్ చేయడం ప్రతి ఒక్కరికి సాధ్యం కాదు. అలాగని అందరూ సైలెంట్ గా ఉండరు. కొందరు ఎంత కష్టమైన ఫిట్ గా హెల్తీగా ఉండటానికి ప్రయత్నిస్తుంటారు.

ఫిట్ నెస్ ను మెయింటైన్ చేయడం ఆరోగ్య పరంగా ఒక దినచర్యలో ఒక భాగం. అందువల్ల ఫిట్ గా ఉండటం కోసం..వేగంగా బరువు తగ్గించుకోవడం కోసం సాధ్యమైన్ని ప్రయత్నాలు చేయడం, చిట్కాలను వెదకడం చేస్తుంటాము.

బరువు తగ్గించుకోవడానికి జిమ్ లు, వ్యాయామలు కష్టమైనవి కాకుండా సింపుల్ గా బరువు తగ్గించుకోవాలని చూసే వారికి కొన్ని సింపుల్ మార్గాలున్నాయి. మనం రెగ్యులర్ గా తినే ఆహారాలే అయినా ఫ్యాట్ బర్న్ చేయడానికి కొన్ని మసాలాలు సహాయపడుతాయి.

Best Spices and Drinks That Will Help You Lose Weight

శరీరంలో మెండిగా మారిన ఫ్యాట్ ను సింపుల్ గా తగ్గించుకోవడానికి రెగ్యులర్ డైట్ లో హెర్బ్స్ , స్పైసెస్ ను చేర్చుకోవాలి. ఎందుకంటే రెగ్యులర్ వంటల్లో మసాలాలు, హెర్బ్స్ జోడించడం వల్ల వాటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, మినిరల్స్ , విటమిన్ మరియు ఇతర ఔషధ గుణాలు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాట్ శరీరాన్ని ఫిట్ గా తయారుచేస్తుంది.

వేగంగా..ఎఫెక్టివ్ గా బరువు తగ్గించే గుప్పెడు మసాలా దినుసులను మరియు కొన్ని ఎఫెక్టివ్ డ్రింక్స్ ను ఎంపిక చేయడం జరిగింది. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల బరువు తగ్గడంతోపాటు, హెల్తీగా వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. మరి అలాంటి మసాలా దినుసులేంటో ఒక సారి చూద్దాం..

పసుపు:

పసుపు:

పసుపులో కుర్కుమిన్ అనే యాక్టివ్ కంటెంట్ ఉంటుంది. పసుపు మెటబాలిజం రేటును పెంచుతుంది. ఆల్జైమర్స్, క్యాన్సర్ వంటి వ్యాధులను నివారిస్తుంది. అంతే కాదు బరువు తగ్గించడంలో ఇది ఒక బెస్ట్ పోపు దినుసుగా సూచిస్తారు.

దాల్చిన చెక్క :

దాల్చిన చెక్క :

దాల్చిన చెక్క రెగ్యులర్ డైట్ లో చేర్చడం ద్వారా బ్లడ్ షుగర్ లెవల్స్ బ్యాలెన్స్ అవుతుంది. ఆకలి కోరికలు తగ్గిస్తుంది. ఎక్కువ సమయం పొట్ట నిండుగా ఉన్న అనుభూతి కలిగిస్తుంది. ఎఫెక్టివ్ గా బరువు తగ్గిస్తుంది.

 కేయాన్ పెప్పర్:

కేయాన్ పెప్పర్:

కేయాన్ పెప్పర్ పౌడర్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చడం వల్ల ఒక సర్వింగ్ కు 100 క్యాలరీలు బర్న్ అవుతాయి. ఈ మసాలా దినుసు మెటబాలిజం రేటు పెంచుతుంది. దాంతో ఎఫెక్టివ్ గా బరువు తగ్గుతారు.

జీలకర్ర:

జీలకర్ర:

ఒక స్పూన్ జీలకర్రను రెగ్యులర్ వంటల్లో చేర్చుకోవడం వల్ల బాడీ ఫ్యాట్ ను మూడు రెట్లు తగ్గిస్తుంది. ఆహారాలకు మంచి ఫ్లేవర్ ను అందిస్తుంది.

 అల్లం:

అల్లం:

అల్లం ఫ్యాట్ బర్నింగ్ కు అవసరమయ్యే థర్మోజెనిక్ లక్షణాలు కలది. ఇది బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. కార్బోహైడ్రేట్స్ రిచ్ మీల్స్, లేదా స్వీట్స్ తిన్నప్పుడు గ్లూకోజ్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. బరువు తగ్గించడంలో ఇది ఒక బెస్ట్ మసాలా దినుసు.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

వెల్లుల్లిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల శరీరంలో బాడీ ఫ్యాట్ వేగంగా బర్న్ అవుతుంది. ఇందులో ఉండే న్యూట్రీసియన్స్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. రక్త ప్రసరణను మెరుగ్గా ఉంచుతుంది.

బ్లాక్ పెప్పర్:

బ్లాక్ పెప్పర్:

బ్లాక్ పెప్పర్ లో ఫ్యాట్ బర్నింగ్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఈ పోపు దినుసు ఫ్యాట్ సెల్స్ ఏర్పడకుండా నివారిస్తుంది. బరువు పెరగకుండా నివారిస్తుంది.

యాలకలు:

యాలకలు:

యాలకలు మరో ఫ్యాట్ బర్నింగ్ మసాలా దినుసు. ఇది మెటబాలిజం స్పీడ్ పెంచుతుంది. బరువు తగ్గించే లక్ష్యంలో తప్పనిసరిగా చేర్చుకోవల్సినది.

డ్యాండలైన్ :

డ్యాండలైన్ :

డ్యాండలైన్ , ఇదో ఒక హెల్తీ హెర్బ్. ఇందులో విటమిన్ ఎ, సి, ఇలు అధికంగా ఉన్నాయి. ఇందులో ఉండే మినిరల్స్, పొటాషియం బరువు తగ్గించడంలో గొప్పగా సహాయపడుతుంది. కడుపుబ్బరాన్ని తగ్గిస్తుంది.

ఆవాలు:

ఆవాలు:

పరిశోధనల ప్రకారం ఆవాలు దాదాపు 25శాతం మెటబాలిక్ రేటును పెంచుతుందని సూచిస్తున్నారు. 3/4టీస్పూన్ ఆవాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే, ఒక గంటలో 45 క్యాలరీలు తగ్గుతాయి .

బరువు తగ్గడం చాలా అవసరం అని ఎందుకు అనుకుంటారు?

జీవితంలో బరువు తగ్గడం అంత ముఖ్యం కాదని చాలా మంది అనుకుంటారు. వెయింట్ స్కేల్ ను నిర్లక్ష్యం చేస్తారు. మరి ఇంక వేటికి ప్రాధాన్యత ఇస్తారు. అయితే బరువు తగ్గించుకోవడం వల్ల కేవలం ఒక నడుము చుట్టుకొలత మాత్రమే కాదు, కొన్ని టాప్ బెనిఫిట్స్ ను ఈ క్రింది విధంగా సూచించడం జరిగింది..

1. క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది:

1. క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది:

ఓవర్ వెయిట్ వల్ల ఎండోమెట్రియల్ లేదా బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. బాడీ ఫ్యాట్ ను తగ్గించుకోవడం వల్ల క్యాన్సర్ రిస్క్ తగ్గించుకోవచ్చు.

2. షార్ప్ గా ఉండటానికి సహాయపడుతుంది:

2. షార్ప్ గా ఉండటానికి సహాయపడుతుంది:

ఓబేసిటితో బాధపడే వారు వయస్సైన లక్షణాలు, నిద్రలేమి, మతిమరుపు సమస్యలను ఎదుర్కుంటుంటారు. బెల్లీ ఫ్యాట్ వల్ల పొట్ట ఉదరంలో ఎక్కువగా ఇన్ఫ్లమేటరీ ఫ్యాక్టర్స్ ఉత్పత్తి అవ్వడం ఆరోగ్యానికి మరింత ప్రమాధకరం అవుతుంది.

3. టైప్ 2 డయాబెటిస్ మరియు హైపర్ టెన్షన్ :

3. టైప్ 2 డయాబెటిస్ మరియు హైపర్ టెన్షన్ :

ఓవర్ వెయిట్ ఉండటం ల్ల హార్ట్ అటాక్ వచ్చే అలక్షణాలు అధికంగా ఉంటాయి. అంతే కాదు డయాబెటిస్ మరియు హైపర్ టెన్షన్ తో బాధపడుతారు.

4. డిప్రెషన్ :

4. డిప్రెషన్ :

ఊబకాయ వల్ల కొంత మంది డిప్రెషన్ కూడా గురి అవుతుంటారు. ఓవర్ వెయింట్ వల్ల ఫిజికల్ యాక్టివిటి తగ్గుతుంది.

5. మోకాళ్ళు, మోచేతులకు హాని జరగుతుంది:

5. మోకాళ్ళు, మోచేతులకు హాని జరగుతుంది:

ఓవర్ వెయింట్ కారనంగా మోకాళ్లు, మోచేతులలో జాయింట్ పెయిన్ పెరుగుతాయి.

6. నిద్ర లేమి సమస్యలు:

6. నిద్ర లేమి సమస్యలు:

రోజూ బాగా నిద్రపోవడం వల్ల మెటబాలిజం రేటు పెరుగుతుంది. హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి. బెటర్ క్వాలిటీ లైఫ్ ను పొందొచ్చు.

7. ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది:

7. ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది:

శరీరంలో ఫ్యాట్ ను తగ్గించుకోవడం వల్ల వ్యాధినిరోధకతను తగ్గించుకోవచ్చు. అంతే కాదు మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

కొన్ని మసాలా దినుసులు ఉపయోగించి ఏవిధంగా బరువు తగ్గించుకోవాలో తెలుసుకుందాం. అలాగే ఇది బరువు కూడా ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది.

పసుపులో హీలింగ్ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల పసుపును పాలతో చేర్చి తీసుకోవాలి. బరువు తగ్గించడంలో బెస్ట్ స్పైసీ ఇది.

పసుపు పాలు రెమెడీ తయారీకి కావల్సిన పదార్థాలు:

పసుపు పాలు రెమెడీ తయారీకి కావల్సిన పదార్థాలు:

2 కప్పులు ఫ్రెష్ మిల్క్

1/2 to 1 టీస్పూన్ పసుపు

2-3 బ్లాక్ పెప్పర్ (మిరియాలు )

2-3 యాలకలు (పొడి చేసుకోవాలి)

½ అల్లం

చిటికెడు కుంకుమపువ్వు (పొడి చేసుకోవాలి)

తయారుచేయు విధానం:

తయారుచేయు విధానం:

పైన సూచించిన పదార్థాలన్నింటిని పాలలో వేసి వేడి చేయాలి. అవసరం అనుకుంటే తేనె లేదా చిటికెడు బెల్లం మిక్స్ చేసుకోవచ్చు. గోరువెచ్చగా చల్లార్చి తర్వాత తాగాలి. బరువు తగ్గించడంలో ఇది ఒక బెస్ట్ డ్రింక్.

బరువు తగ్గించుకోవడంలో ఇంత కంటే బెటర్ డ్రింక్ ఉంటుందని మీరు అలోచిస్తున్నారా? మొదట ఈ చిట్కాను ప్రయత్నించి ఫలితాలను చూడండి..మీకే ఆశ్చర్యం కలుగుతుంది..!

English summary

Best Spices & Drinks That Will Help You Lose Weight

Now lose weight fast with the help of natural spices like turmeric, cardamom, ginger, garlic etc. Also read how turmeric milk recipe is your go-to drink to lose weight fast.
Story first published: Tuesday, April 25, 2017, 16:13 [IST]
Subscribe Newsletter