బరువు తగ్గాలా.. అయితే ఇవి తినండి

By: Bharath Reddy
Subscribe to Boldsky

అధిక బరువు అనేది నేడు అధిక శాతం మందిని ఇబ్బందులకు గురి చేసే సమస్య. ఇది వచ్చిందంటే చాలు, దాంతో ఇతర అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికంగా ఉన్న బరువును తగ్గించుకునేందుకు అనేక రకాల పద్ధతులను సంబంధిత వ్యక్తులు పాటిస్తున్నారు.

జామపండుతో కొలెస్ర్టాల్ కరిగి స్లిమ్ అవడం ఖాయం..

శరీరం బరువు తగ్గాలంటే.. మనం తినే ఆమారంలో కొన్ని ఉండేలా చూసుకోవాలి. శరీరానికి తక్కువ క్యాలరీల శక్తిని అందించి, శరీరంలో ఉన్న క్యాలరీలలో ఎక్కువ క్యాలరీలను కరిగించే మార్గాలు చూడాలి. అధిక బరువు, ఈ సమస్య ముఖ్యంగా యువతరం మీద చాలా ప్రభావం చూపిస్తుంది. దీనితో యువకులు ఆలోచన విధానం మారిపోయి వారు అనుకున్న రంగంలో రాణించలేక పోతున్నారు. అధిక బరువు ఉన్నవారు ఈజీగా ఇంట్లోనే సమస్యను పరిష్కరించుకోవొచ్చు.

కృత్రిమ పద్దతులలో బరువు తగ్గడం వలన భవిష్యత్ లో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సహజ పద్ధతుల్లో బరువు తగ్గితే ఎంతో మంచిది. అధిక బరువుకు ముఖ్య కారణం అధిక ఆహారపు అలవాట్లు. అలాగే కొవ్వు పదార్థాలు ఉండే ఆహారం కావున ఉదయం పూట ఎక్కువగా ప్రోటీన్స్ ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇలా చేయడం వలన రోజంతా తక్కువగా ఆకలి అవుతుంది. దానితో తక్కువగా ఆహారం తీసుకుంటాం. కింద పేర్కొన్న వాటిని మీ ఆహారంలో భాగంగా చేసుకుంటే మీరు బరువు తగ్గడం తేలికవుతుంది. సహజంగా బరువు తగ్గడానికి ఉపయోగపడే చిట్కాలేమిటో ఇప్పుడు చూద్దాం.

బరువు తగ్గాలనుకొనే వారు 10 కేజీల బరువు తగ్గించే హెల్తీ సూప్స్

మెగ్నిషియం

మెగ్నిషియం

మన శరీరంలోని ప్రతి కణము తన విధిని సరిగ్గా నిర్వహించాలంటే మెగ్నిషియం ఎంతో అవసరం. అలాగే బరువు తగ్గడానికి కూడా మెగ్నీషియం ఉన్న ఆహారపదార్థాలు తీసుకోవండం ఎంతో అవసరం. పచ్చని ఆకుకూరలు, సముద్రపు ఆహరం, పచ్చి కోకో, కొత్తిమీర ఆకులు, నట్స్, సీడ్స్, చేపలు, అవకాడో, బాదం, వెన్న, డార్క్ చాక్లెట్ ఆహార పదార్థాలలో తగినంత మెగ్నీషియాన్ని పొందవచ్చు. అలాగే పొద్దుతిరుగుడు విత్తనాలు, బీన్స్, తేనె, ఎండుద్రాక్ష, ఎండిన జల్దారు, గోధుమ, బార్లీ, బచ్చలికూర, అరటి, పుచ్చకాయ పండు, క్యారెట్, దుంపల్లో ఎక్కువగా మెగ్నిషియం ఉంటుంది.

పొటాషియం

పొటాషియం

శరీరంలో ఎలెక్ట్రిక్ చార్జ్ (విద్యుత్ చార్జ్) ద్రావణాల సమతుల్యతలకు పొటాషియం ఎంతో అవసరం. అలాగే నాడీ కణాల ద్వారా వార్తా ప్రసరణకు, కండరాల సంకోచానికి, కణాలు, అవయవాలు విధులు సరిగా నిర్వహించడానికి ఇది చాలా అవసరం. అలాగే మీరు సహజ పద్ధతుల్లో బరువు తగ్గాలంటే పోటాషియం ఉన్న ఆహారపదార్ధాలను తీసుకోవాలి. అరటిపండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆప్రికాట్, బీట్స్, ఫిగ్స్, పుచ్చపండు, నారింజపండు రసం, పై పొరతో కూడిన బంగాళదుంప, సోయా, పాల ఉత్పత్తులు, మాంసం వంటివి కూడా పొటాషియాన్ని అధికంగా కలిగి ఉంటాయి. ఈ రకమైన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటే ఈజీగా బరువు తగ్గొచ్చు. శరీరంలో పొటాషియం స్థాయిలు ఎక్కువగా ఉన్నాయా? తక్కువగా ఉన్నాయా? అని నిత్యం పరీక్ష చేపించుకుంటూ, తగిన జాగ్రత్తలను తీసుకోవడం మంచిది.

రెసిస్టెంట్ స్టార్చ్

రెసిస్టెంట్ స్టార్చ్

రెసిస్టెంట్ స్టార్చ్... ఇది దాదాపు పిండిపదార్థం. ఇది పీచుపదార్థం తరహాలోనే శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపేందుకు దోహదపడుతుంది. పొట్టుధాన్యాలు, గింజలు, అరటికాయలు, బంగాళదుంపలు, పప్పులలో రెసిస్టెంట్ స్టార్చ్ పుష్కలంగా ఉంటుంది. రెసిస్టెంట్ స్టార్చ్ జీర్ణకోశంలో ఉండే బ్యాక్టీరియా ప్రభావం వల్ల ఫ్యాటీయాసిడ్స్‌గా మారుతుంది. ఈ ఫ్యాటీయాసిడ్స్ రక్తంలో కలిసి, కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. అరటి పిండి, ఆకుపచ్చ అరటి నుంచి తీసినది ఒక కప్పులో 42-52.8 గ్రాముల రెసిస్టెంట్ స్టార్చ్ ఉంటుంది. ముడి అరటి పండులో 4.7 గ్రాముల రెసిస్టెంట్ స్టార్చ్ ఉంటుంది. మొక్కజొన్న పిండి 1 టేబుల్ స్పూన్ లో 4.5 గ్రాముల రెసిస్టెంట్ స్టార్చ్ ఉంటుంది. వోట్స్ 1 కప్ లో ఉడకబెట్టని 17.6 గ్రాముల రెసిస్టెంట్ స్టార్చ్ ఉంటుంది. గ్రీన్ బఠానీలు 1 కప్పులో 4.0 గ్రాముల రెసిస్టెంట్ స్టార్చ్ ఉంటుంది. వైట్ బీన్స్ 1 కప్ లో7.4 గ్రాముల రెసిస్టెంట్ స్టార్చ్ ఉంటుంది. కోల్డ్ పాస్తా 1 కప్ లో 1.9 గ్రాముల రెసిస్టెంట్ స్టార్చ్ ఉంటుంది. పెర్ల్ బార్లీ 1 కప్ లో 3.2 గ్రాముల రెసిస్టెంట్ స్టార్చ్ ఉంటుంది.

బంగాళాదుంపలో 1/2 వ్యాసం గల దానిలో 0.6 - 0.8 గ్రాముల రెసిస్టెంట్ స్టార్చ్ ఉంటుంది. వోట్మీల్ 1 కప్ లో 0.5 గ్రాముల రెసిస్టెంట్ స్టార్చ్ ఉంటుంది.

ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్

ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్

ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇవి బాడీలోని బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను త‌గ్గిస్తాయి. బరువు తగ్గేందుకు సాయపడతాయి. వీటిని ఎక్కువగా ఫ్లాక్స్ సీడ్స్, చమురు, చేపల నుంచి పొందవచ్చు. వీటిని సక్రమంగా తీసుకుంటే బరువు తగ్గడతో పాటు అనేక వ్యాధులకు దూరం కావొచ్చు. ఆయా ఆహార పదార్థాల్లో లభించే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఈ కింది విధంగా ఉన్నాయి.

మాకేరెల్: 6,982 మిల్లీగ్రాములు (174 ప్రీపెంట్ DV)

సాల్మోన్ ఫిష్ ఆయిల్: 1 టేబుల్ స్పూన్ (119 శాతం డివి)

కాడ్ లివర్ ఆయిల్: 1 టేబుల్ స్పూన్ (66 శాతం DV)

వాల్నట్స్: 1/4 కప్పులో (66 శాతం DV) 2,664 మిల్లీగ్రాములు

చియా విత్తనాలు: 1 టేబుల్ స్పూన్ (61 శాతం DV)

హెర్రింగ్: 3 ఔన్స్ (47 శాతం DV)

సాల్మోన్ చేప : 3 ఔన్సులలో (42 శాతం DV)

ఫ్లాక్స్ సీడ్స్ : ఒక టేబుల్ స్పూన్ లో (39 శాతం DV)

ట్యూనా చేప : మూడు ఔన్స్ ల్లో (35 శాతం DV)

వైట్ ఫిష్: మూడు ఔన్స్ ల్లో (34 శాతం DV)

సార్డినెస్ ఫిష్ : 1,363 మిల్లీగ్రాములు లేదా 3.75 ఔన్స్ లో (34 శాతం DV)

జనపనారా విత్తనాలు: 1 టేబుల్ స్పూన్ లో (25 శాతం DV)

గుడ్డులోని పచ్చ సొనలు: 1/2 కప్పులో 240 మిల్లీగ్రాములు (6 శాతం DV)

ల్యుసిన్

ల్యుసిన్

ల్యుసిన్ ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండడంతో పాటు బరువు కూడా తగ్గొచ్చు. పర్మేసన్ జున్నులో ఎక్కువ మోతాదులో ల్యుసిన్ ఉంటుంది. ఇక కాల్చిన బీఫ్ వంటకంలో, కాల్చిన సోయాబీన్స్ ఆహారంలోనూ ఇది అధికంగా లభిస్తుంది. ట్యూనా చేపల్లో 84% ల్యుసిన్ లభిస్తుంది. చికెన్ బ్రెస్ట్ సుమారు 97% ఉంటుంది. పంది మాసంలో ఇది సుమారు 94% ఉంటుంది. గుమ్మడికాయ విత్తనాల్లోనూ ఇది ఎక్కువగా ఉంటుంది. ఆక్టోపస్, పీనట్స్, వైట్ బీన్స్ ల్లోనూ ఇది అధికంగా ఉంటుంది. జనపనార విత్తనాలు, సాల్మోన్ చేపలోనూ ఇది ఎక్కువగా మోతాదులో ఉంటుంది. ఇలాంటి ఆహారపదార్థాలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. అలాగే సహజంగా బరువు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది.

విటమిన్ డి

విటమిన్ డి

దీన్నే సన్‌షైన్ విటమిన్ అని అంటారు. సూర్యకాంతిలో రోజూ కొంత సేపు ఉంటే ఈ విటమిన్ మనకు లభిస్తుంది. శారీరక దారుఢ్యం ఉండాలన్నా, ఎముకలు పటిష్టంగా మారాలన్నా విటమిన్ డి మనకు అవసరం. దీంతోపాటు బరువు తగ్గేందుకూ ఇది ఉపయోగపడుతుంది. సూర్యకాంతిలో ఉండే అల్ట్రావయొలెట్ బి కిరణాలు చర్మంపై పడినప్పుడు చర్మం కింద ఉండే పలు పదార్థాలు విటమిన్ డిని తయారు చేసుకుంటాయి. అనంతరం లివర్, కిడ్నీల్లో విటమిన్ డి హైడ్రాక్సిలేషన్ ప్రక్రియకు గురవుతుంది. అనంతరం దాన్ని శరీరం ఉపయోగించుకుంటుంది. విటమిన్ డి మనకు సూర్యకాంతి వల్లే కాదు, పలు ఆహార పదార్థాలను తినడం వల్ల కూడా లభిస్తుంది. చేపలు, బీఫ్ లివర్, చీజ్, కోడిగుడ్లు, కాడ్ లివర్ ఆయిల్, పాలు, పుట్టగొడుగులు తదితర ఆహారాలను తింటే విటమిన్ డి లభిస్తుంది. అయితే విటమిన్ డి లోపిస్తే మాత్రం పలు అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.

English summary

Essential Nutrients You Need To Lose Weight

Essential Nutrients You Need To Lose Weight. Read to know more about...
Story first published: Thursday, October 26, 2017, 17:30 [IST]
Subscribe Newsletter