బరువు తగ్గాలంటే, ఎట్టి పరిస్థితిలో ఈ ఆహారాలను తినకూడదు

By: Mallikarjuna
Subscribe to Boldsky

ఈ రోజుల్లో ప్రతి మనషి బరువు తగ్గించుకోవాలి అని కోరుకుంటారు. కానీ, రోజు చివరన ఈ పనిలో విఫలమవుతుంటారు. అందుకు సరైన సమయం, సరైన వ్యాయామం లేదా సరైన డైట్ నియమాలు పాటించకపోవడం వల్ల, బరువు తగ్గించుకోవడంలో ఇలా విఫలం అవ్వడం జరగుతుంది. బరువు తగ్గించుకోవడంలో డైటింగ్ చాలా ఎఫెక్టివ్ ప్రభావాన్ని చూపిస్తుంది. అంతే కాదు, ఇది అత్యంత కఠినమైన పని. కాబట్టి డైట్ విషయంలో మనం తీసుకొనే ఆహారాల గురించి(ఏవి తినాలి, ఏవి తినకూడదనే) సరైన అవగాహన కల్పించుకోవడం డైటర్స్ కు చాలా అవసరం. ఎందుకంటే, మీరు డైట్ ఫాలో చేస్తున్నప్పుడు మీ శరీరం పొందే పోషకాంశాలు, శరీరంలో ఎనర్జీస్థాయిలను నింపుతుంది.

పది ఆహారాలను రోజూ తీసుకుంటే బరువు తగ్గడం తేలికే!

అయితే, మీరు తినే కొన్నిఆహారాలు లోఫ్యాట్ కలిగినవి, అదే సమయంలో ఎక్కువ న్యూట్రీషియన్స్ కలిగి ఆహారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అదే సమయంలో కొన్ని ఆహారాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. ఈ ఆహారాలు నిశ్శబ్దంగా బరువు వారించటానికి వెళ్ళి కోల్పోయే ప్రయత్నాలు చేయవచ్చు. అటువంటి ఆహారాలు అనేకం ప్రమాదకరమైనవిగా అనిపించకపోవచ్చు, కానీ, అవి మీరు పరిపూర్ణ శరీరం పొందడానికి సహాయపడవచ్చు . అందువల్ల మీరు ఖచ్చితంగా కొన్ని పౌండ్ల బరవును తగ్గించాలనుకుంటుంటే మీరు తీసుకొనే ఆహారం మీద ఒక ఖచ్చితమైన నిఘాను అనుసరించడం చాలా ముఖ్యం..

మీరు బరువు తగ్గించుకొనేందుకు ప్రయత్నిస్తుంటే, మీరు ఖచ్చితంగా నివారించాల్సిన 10 ఆహారాలు క్రింది విధంగా ఉన్నాయి...

బరువు తగ్గించుకోవడానికి ఉదయం తీసుకొనే టాప్ 10 ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ...

ఫ్రైడ్ పొటాటో చిప్స్ :

ఫ్రైడ్ పొటాటో చిప్స్ :

మీరు తినే ఈ చిరుతిండి నూనెలో వేయించినది..ముఖ్యంగా ఫ్రైడ్ పొటాటో చిప్స్ వంటివి అయితే, బరువెక్కటం మరింత తేలిక. చికెన్ వేపుడు, ఫ్రెంచి ఫ్రైలు, ఏదైనప్పటికి అది కొలెస్టరాల్, కేలరీలు ను పెంచుతుంది. గుండెకు అనారోగ్యం కలిగిస్తుంది. వేపుడులుకు బదులు, ఉడికించిన పదార్ధాలు తినండి.ఉడికించిన బంగాళదుంపలను తినడం వల్ల ఆరోగ్యానికి అంత హాని చేయదు , అయితే బరువు పెరగడానికి కారణమవుతుంది. ఫ్రైడ్ పొటాటో తినడం వల్ల బరువు పెరగడం మాత్రమే కాదు, క్యాలరీలు ఫ్యాట్ పెరగడం వల్ల శరీరంలో ఇన్సులిన్ లెవల్స్ పెరిగి, శరీరం మీద చెడు ప్రభావం చూపుతుంది.

కార్బొనేటెడ్ డ్రింక్స్ :

కార్బొనేటెడ్ డ్రింక్స్ :

బరువు తగ్గాలనేకుంటే కార్బొనేటెడ్ డ్రింక్స్ తాగడం అత్యంత ప్రమాదకరం. వీటి వల్ల పొట్ట ఉబ్బరంగా ఉంటుంది. వీటిలో క్యాలొరిఫిక్ విలువలు పెరుగుతాయి. గెరిలిన్ ఆకలిని పెంచే హార్మోన్లు పెరుగుతాయి. డైట్ సోడాలో కూడా క్యాలరీలు కలిగి ఉంటాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం సోడాలు బరువు పెరగడానికి ప్రధాన కారణం అవుతుంది. పరిశోధనల ప్రకారం డైట్ సోడాలో ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ను వాడటం వల్ల ఇవి మరింత ఆకలిని పెంచుతాయి. కాబట్టి, సోడా బరువు పెంచే క్యాలరీలను కలిగి ఉంది.

పాస్ట్రైస్ :

పాస్ట్రైస్ :

పాస్ట్రెస్ చూడగానే నోరూరించే విధంగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి ఖచ్చితంగా హానికరం. బరువు తగ్గడం కంటే సులభంగా బరువు పెరిగేలా చేస్తుంది. వీటి తయారికీ ఉపయోగించి షుగర్స్, రిఫైండ్ ఫ్లోర్స్ , ఆర్టిఫిషియల్ ట్రాన్స్ ఫ్యాట్స్, తీపి కోరికను తీర్చగలవు కానీ, తిన్న ప్రతి సారి కొన్ని పౌండ్ల బరువును సులభంగా పెంచుతుంది.

ఐస్ క్రీమ్స్ :

ఐస్ క్రీమ్స్ :

వేడిగా వుండే ఈ రోజుల్లో ప్రతి ఇంటిలోను ఐస్ క్రీమ్ వుంటుంది. మనం వారింటికి వెళ్ళినా, వారు మన ఇంటికి వచ్చినా, లేదా ఏదైనా పార్టీ వంటివి జరిగినా, లేదా సాయంత్రం షికారులో ఐస్ క్రీమ్ తినటం తప్పనిసరి అయిపోతుంది. ఐస్ క్రీమ్ లో కేలరీలు అధికం. శరీరంలో కొవ్వు నిల్వలు ఏర్పడతాయి. ఐస్ క్రీములు తినడానికి రుచికరంగా ఉన్నా, షుగర్ తో తయారుచేయడం వల్ల హై క్యాలరీలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. ముఖ్యంగా శరీర బరువును పెంచుతాయి.. బెస్ట్ చాయిస్ హోం మేడ్ ఐస్ క్రీమ్స్ పెరుగు, ఫ్రూట్స్ తో తయారుచేసే వాటిని ఎంపిక చేసుకోవాలి.

షుగరీ సెరల్స్:

షుగరీ సెరల్స్:

బ్రెక్ ఫాస్ట్ కోసం షుగర్ సెరల్స్ ను పెతినవచ్చు, కానీ వీటిలో షుగర్స్ ఉండటం వల్ల శరీరానికి పరగడపున తినేవాటి వల్ల పొట్టకు ఎక్కువ క్యాలరీలు చేరడం వల్ల ఇది ఆరోగ్యానికి చాలా హానికరం, వ్యాయామంతో క్యాలరీలు కరిగించాలన్నా కష్టం అవుతుంది. అందువల్ల ఫ్యాట్ ను కరిగించే సెరెల్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి, వీటిని ఎంపిక చేసుకోవడం మంచిది.

వైట్ బ్రెడ్ :

వైట్ బ్రెడ్ :

బ్రెడ్ లో వివిధ రకాలున్నాయి. వైట్ బ్రెడ్ మైదా పిండి, షుగర్ తో తయారుచేయడం వల్ల ఓబేసిటికి కారణమవుతుంది. వైట్ బ్రెడ్ బ్లడ్ షుగర్ లెవల్స్ ను వేగంగా పెంచుతుంది. మరియు ఇంకా మీరు వైట్ బ్రెడ్ తో పాటు బటర్ ను కూడా తీసుకోవడం వల్ల మీ శరీరంలో క్యాలరీ కౌంట్ అమాంతం పెరిగిపోతుంది. కాబట్టి వైట్ బ్రెడ్ కు బదులు, గోధుమతో తయారుచేసే బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్ ను ఎంపిక చేసుకోండి. బ్లడ్ షుగర్ లెవల్స్ పెరగడం వల్ల డయాబెటిస్ రిస్క్ పెరుగుతుంది.

కాబట్టి బరువు తగ్గాలనుకునే వారి ఎస్టిపరిస్థితిలో పైన సూచించిన వాటిని తినకపోవడంమంచిది. ఇవి బరువును పెంచడం మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా పరోక్షంగా కారణమవుతాయి.

English summary

Foods You Should Never Eat If You Want To Lose Weight

Read on to know more about the foods you should never eat if you are striving hard to lose weight and be in shape.
Story first published: Tuesday, September 26, 2017, 10:30 [IST]
Subscribe Newsletter