For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సర్ స్ప్రైజ్ : 15 రోజుల్లో 15 పౌండ్ల బరువు తగ్గించే ఎగ్ డైట్ ..!

By Lekhaka
|

బరువు తగ్గించుకోవడం కోసం ఈ రోజులు అనేక రకాల డైట్ ప్లాన్ ను ఫాలో అవుతున్నారు. వాటిలో ఎగ్ డైట్ ఒకటి. ఇది బాగా పాపులర్ అయినటువంటి డైట్ . ఎగ్ డైటా..? అనే సందేహం రావచ్చు..ఎగ్ డైట్ వల్ల 15 రోజుల్లో 15 పౌండ్ల బరువు తగ్గొచ్చా..అదెలా ...

కొన్ని పరిశోధనల ప్రకారం డైట్ ప్లాన్ వల్ల మెటబాలిజం రేటు పెరుగుతుంది. దాంతో ఫ్యాట్ బర్న్ అవుతుందని వెల్లడిచేశారు. అంతే కాదు, ఇటువంటి డైట్ ప్లాన్స్ వల్ల ఆకలి, జంక్ ఫుడ్స్, స్వీట్స్ మీద కోరికలు అండర్ కంట్రోల్లో ఉంటాయి.

ఈ డైట్ లో కేవలం గుడ్డు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ మాత్రమే తినడం జరగుతుంది. మీరు నాన్ వెజిటేరియన్ అయితే ఈ డైట్ ప్లాన్ లో చికెన్ కూడా తీసుకోవచ్చు. అయితే మీరు సరిపడా నీళ్ళు తాగాలి. నీళ్ళు ఎక్కువగా తాగడం వల్ల శరీరం హైడ్రేషన్ లో ఉంటుంది. మరియు శరీరంలోని టాక్సిన్ బయటకు నెట్టివేయబడుతాయి. ఇంకా నీళ్ళు ఎక్కువగా తాగడం వల్ల ఆకలి కూడా కంట్రోల్లో ఉంటుంది. ఈ డైట్ ను ఫాలో అయ్యేటప్పుడు సోడా, షుగర్ ప్రొడక్ట్స్, లేదా సాల్ట్ స్నాక్స్ వంటి వాటికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి.

సూచన: ఇటువంటి కఠినమైన డైట్ ను ఫాలో అవ్వడానికి ముందు పోషకాహార నిపుణులు, లేదా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది . ఈ ఆర్టికల్ కేవలం ఇన్ఫర్ఫేషన్ అందివ్వడానికి మాత్రమే..ఎందుకంటే మీ శరీర తత్వం, వైద్యపరమైన విషయాలను ఫర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు డాక్టర్ సలహా మేరకు ఈ డైట్ ను ఫాలో అవ్వడం మంచిది. కొన్ని ప్రత్యేమైన డైట్స్ రొటీన్ గా కొద్ది రోజుల కంటే ఎక్కువ ఫాలు అవ్వకూడదు. మరి 15 రోజుల్లో 15 పౌండ్ల బరువు తగ్గించే ఎగ్ డైట్ ప్లాన్ ఏంటో తెలుసుకుందాం...

డే 1:

డే 1:

బ్రేక్ ఫాస్ట్ లో 2 ఉడికించిన గుడ్లు, ఫ్రూట్స్ తినాలి. లంచ్ కు 2 స్లైస్ బ్రౌన్ బ్రెడ్ . రాత్రి డిన్నర్ కు సలాడ్స్ మరియు ఉడికించిన చికెన్ లేదా 2గుడ్లు.

డే 2:

డే 2:

బ్రేక్ ఫాస్ట్ కు ఉడికించిన గుడ్లు 2, మరియు ఫ్రూట్స్. లంచ్ కు లోఫ్యాట్ చీజ్ కొద్దిగా, టమోటో, బ్రౌన్ బ్రెడ్ ఒక స్లైస్. డిన్నర్ కు రెండు ఉడికించిన గుడ్లు సలాడ్ తినాలి.

డే 3 :

డే 3 :

రెండు బాయిల్ చేసిన గుడ్లు, ఫ్రూట్స్ బ్రేక్ ఫాస్ట్ గా, లచ్ కు గ్రీన్ సలాడ్ మరియు గుడ్లు. రాత్రి భోజనానికి సలాడ్, 2ఉడికించిన గుడ్లు , ఒక గ్లాసు ఆరెంజ్ జ్యూస్ .

డే 4:

డే 4:

ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో రెండు ఉడికించిన గుడ్డు మరియు ఫ్రూట్స్, లంచ్ కు స్టీమ్ లో ఉడికించిన వెజిటేబుల్స్ . రాత్రి డిన్నర్ కు సలాడ్ మరియు చేపలు.

డే 5:

డే 5:

ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో రెండు ఉడికించిన గుడ్డు మరియు ఫ్రూట్స్, లంచ్ కు ఫ్రూట్స్జ్ , డిన్నర్ కు సలాడ్ మరియు ఉడికించిన గుడ్లు . లేదా సలాడ్ తో పాటు, స్టీమ్ చేసిన చికెన్ తినాలి .

డే 6:

డే 6:

బ్రేక్ ఫాస్ట్ లో రెండు ఉడికించిన గుడ్లు , ఫ్రూట్ తినాలి. లంచ్ కు టమోటోలను మిక్స్ చేసిన సలాడ్ తినాలి. దీంతో పాటు జ్యూస్ తాగాలి. డిన్నర్ లో గుడ్లు 2 , ఉడికించిన వెజిటేబుల్స్ ఒక కప్పు.

డే 7:

డే 7:

బ్రేక్ ఫాస్ట్ లో ఉడికించిన 2 గుడ్డు, ఫ్రూట్స్ తినాలి. లంచ్ కు ఫ్రూట్స్ తినాలి. డిన్నర్లో ఉడికించిన గుడ్లు, చికెన్ ముక్కలు కలిపిన సలాడ్ ,ఒక గ్లాసు ఆరెంజ్ జ్యూస్ తీసుకోవాలి.

English summary

The Egg Diet-Lose 15 Pounds In 15 Days

Today, there are so many diet plans promising quick weight loss. Among them, the egg diet has become quite popular. What is it? And does it help you lose 15 pounds in 15 days? Let us discuss...
Desktop Bottom Promotion