Latest Updates
-
ఉదయం 5 గంటలకు నిద్రలేస్తేనే సక్సెస్ వస్తుందా?.. ప్రముఖ న్యూరోసైంటిస్ట్ చెబుతున్న సంచలన నిజాలివే! -
ఎండ దెబ్బకు చెక్: బార్లీ నీళ్లా? చెరకు రసమా? వేసవి వ్యర్థాలను తరిమికొట్టే బెస్ట్ డ్రింక్ ఏది? -
ఇప్పటి ప్రేమ పరిచయాలు యువతను ఎందుకు మానసికంగా అలసిపోయేలా చేస్తోంది -
మధురై తణ్ణి చట్నీతో ఇడ్లీ, దోశల టేస్ట్ డబుల్!..ఎలా చేసుకోవాలంటే.. -
బాధ్యతలు ఏవైనా ఒత్తిడి సమానమే.. మహిళలూ వీటిపై నిర్లక్ష్యం వద్దు.! -
జూన్ 4: గ్రహాల కదలికలతో ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం, కెరీర్లో అద్భుతమైన మార్పులు! -
జూన్ 4న అరుదైన బ్రహ్మ యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీదే! -
వేసవిలో కడుపుకు హాయినిచ్చే బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..5 నిమిషాల్లో దహీ పోహా ఎలా చేయాలంటే.. -
ఆంధ్రప్రదేశ్లో తప్పకుండా సందర్శించాల్సిన 10 అతి పురాతన శివాలయాలు -
12 ఏళ్ల తర్వాత కర్కాటకంలో గురు ఉచ్ఛ స్థితి: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీదే!
బిగోరెక్సియా అంటే ఏంటి? అది అపాయకరమా?
మనలో చాలామందికి అనోరెక్సియా గురించే తెలుసు. కానీ దీనికి పూర్తి వ్యతిరేకమైన మరో లోపం ఉన్నది, అదే బిగోరెక్సియా.
బాడీబిల్డర్లలో చాలా తక్కువశాతం మంది ఈ వ్యాధికి లోనవుతుంటారు. ఇది ఎందుకు ముప్పు అంటే డిప్రెషన్, ఆత్మహత్యల వరకు కూడా ఇది దారితీయవచ్చు.
నిజానికి, ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు స్టెరాయిడ్ల దుర్వినియోగం, డ్రగ్స్ వ్యసనం వంటి వాటిల్లో సులువుగా చిక్కుకుంటారు. ఈ వ్యాధి గూర్చి మరిన్ని నిజాలు తెలుసుకోండి.

ఎలా మొదలవుతుంది?
బిగోరెక్సియాతో బాధపడే వ్యక్తి భారీగా కనిపించాలని తపిస్తాడు. అలా పెరగటానికి, అతను పిచ్చిగా, అదేపనిగా బరువులు ఎత్తడం వంటి వ్యాయామాలు చేస్తాడు. అయితే కండలు తిరిగి, భారీగా మారినాకూడా, అతన్ని అతను శరీరాకృతిలో చిన్నగానే భావిస్తాడు. దీనివల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన ప్రారంభమవుతాయి.

మరో పేరు
ఈ రుగ్మతకి మరోపేరు కూడా ఉంది. దీన్ని మజిల్ డిస్మార్ఫియా అని కూడా అంటారు. కానీ ముఖ్యంగా ఇది మానసికమైన భావన.

ఇది నియంత్రణలేని స్వభావమా?
బిగోరెక్సియాతో బాధపడే వ్యక్తి అనుక్షణం బాడీబిల్డింగ్ పనిలోనే ఉండవచ్చు లేదా ఆలోచిస్తూ గడపచ్చు. పెద్ద పెద్ద కండల పిచ్చితో అతను ఎవరితో కలవక, రోజులో చాలాసేపు జిమ్ లోనే గడుపుతాడు.

స్టెరాయిడ్ల దుర్వినియోగం
మెల్లమెల్లగా, స్టెరాయిడ్ల దుర్వినియోగంలోకి దిగుతారు. ప్రొటీన్ పౌడర్లు, సహాయకాల నుంచి ఉత్ప్రేరకాల వాడకం వరకూ భారీగా ఎదగటానికి ఏది ఉపయోగపడుతుందో దాన్ని ఒక్కటీ వదలరు.

కండలవీరుడు అయ్యాక…
అంత పెద్దగా అనుకున్నట్టు శరీరాన్ని పెంచాక కూడా, మానసిక రుగ్మత వల్ల అతనికి సంతృప్తి కలగదు. పైగా తనను తాను చిన్నదృష్టితో, సరిపోనని భావించుకుంటాడు !

ఎవరిపై ప్రభావం పడుతుంది?
ప్రస్తుత అధ్యయనాల ప్రకారం, అసలు చాలావరకూ కేసులు బయటకి తెలీకుండానో, చికిత్స వరకూ రాకుండానోనే ఉంటాయి. ఏవో కొన్ని రికార్డు అయిన కేసుల ప్రకారం, బిగోరెక్సియా, తక్కువ ఆత్మవిశ్వాసం, ఆందోళన వంటి వాటికి సమంగా కన్పిస్తుంది. అందువల్ల రోగి చుట్టూ ఉన్నవారు దీన్ని పట్టించుకోరు. ఎప్పుడైతే బాధితుడు డిప్రెషన్ లోకి వెళ్ళటం మొదలుపెడతాడో, అప్పుడు అసలు ప్రమాదం మొదలవుతుంది.

దేని వల్ల వస్తుంది?
ఇది వంశపారంపర్యంగా కూడా రావచ్చు. మెదడులోని రసాయనాల అసమతుల్యత వల్ల కూడా కలగచ్చు. యుక్తవయస్సులో వారి బలహీనతలను ఎగతాళి చేయబడి, బాధపడ్డవారిలో ఈ రుగ్మత ఎక్కువ కన్పిస్తుంది.
చాలా మంది మగవారిని చిన్నప్పటి నుంచి ధృఢంగా, కండలు తిరిగి, బలంతో ఉండాలని, అదే పురుషలక్షణమని సహజంగా నూరిపోస్తారు. ప్రతి పురుషుడు రహస్యంగా కూడా సూపర్ హీరోలా ఉండాలని కలలు కంటాడు.

చికిత్స
బిగోరెక్సియా ఉన్న వ్యక్తి తప్పనిసరిగా వైద్యసాయం తీసుకోవాలి. కాగ్నెటివ్ బిహేవియరల్ థెరపీ మరియు మందుల వాడకం కూడా సాయపడవచ్చు.



Click it and Unblock the Notifications