For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలా వ్యాయామం చేస్తే బాడీ రాదు.. పైగా ఉన్న బాడీ షేప్ కూడా పోతది

శరీర వ్యాయామలలో ఈ వ్యాయామాన్ని వదిలిపెట్టకుండా సాధన చేస్తూ ఉండాలి. ఇక చాలా వరకు వర్క్ అవుట్స్ గరిష్టంగా 5 సెట్లు చేస్తుండాలి. విశ్రాంతి సమయం ఎప్పుడూ 90 సెకన్లు మించి ఉండకూడదు.

|

శారీరక వ్యాయామం కోసం యువత జిమ్‌కి వెళ్లడం నేటి ఆధునిక కాలంలో సర్వసాధారణం. క్రమం తప్పకుండా ఎక్సర్‌సైజు చేస్తూ బాడీని బిల్డప్‌ చేసుకునే ఆసక్తి వీరిలో రోజురోజుకూ పెరుగుతోంది. అయితే, కొందరు కండలు పెంచుకోవడానికి కసరత్తు చేస్తారు కానీ.. ఇతర విషయాలపై దృష్టి పెట్టరు.

ఒకప్పుడు కేవలం బాడీ బిల్డింగ్‌పై దృష్టి ఉన్నవాళ్లు మాత్రమే జిమ్‌కు వెళ్లేవాళ్లు. తర్వాతి కాలంలో బరువు తగ్గడం కోసం వర్కవుట్లు చేయడం మొదలైంది. ఇప్పుడు కాలేజ్‌ ఏజ్‌ వచ్చిన కుర్రాళ్లు చాలా మంది జిమ్‌కు సై అంటున్నారు. మెరుగైన శరీరాకృతి కోసం ఫుల్‌గా వర్కవుట్లు చేస్తున్నారు.

మానసికంగా ఫిట్ గా ఉండాలి

మానసికంగా ఫిట్ గా ఉండాలి

ఆరోగ్యంపై అవగాహన పెరగడం కూడా యువతను జిమ్‌వైపు నడిపిస్తోంది. బాడీఫిట్‌గా ఉంచడంతో పాటు జిమ్‌కు వెళ్లేవాళ్లు మానసికంగా కూడా ఫిట్‌గా ఉంటున్నారని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. అయితే జిమ్‌కు వారం రోజులు వెళ్లినంత మాత్రాన తీరైన ఆకృతి రాదు.

ఓపిక అవసరం

ఓపిక అవసరం

ఓపికగా వర్కవుట్స్‌ చేస్తుండాలి. అయితే చాలామంది జిమ్‌కు వెళ్లే తొలిరోజుల్లో ఉత్సాహంగా బయల్దేరుతారు. ఓ పదిరోజులు పోగానే డుమ్మాలు కొడుతుంటారు. ఇలాంటి వారు ఎన్ని నెలలు జిమ్‌కు వెళ్లినా ఫలితం అంతగా కనిపించదు. ఆరునెలల పాటు రెగ్యులర్‌గా వెళ్తేగాని బాడీ ఫిట్‌గా మారదని చెబుతున్నారు జిమ్‌ ట్రైనర్లు.

బాగా తినిస్తే

బాగా తినిస్తే

ఎక్సర్‌సైజ్‌ పూర్తయ్యాక ఒక్కసారి నిస్సత్తువగా అనిపిస్తుంది. అందుకు కారణం వర్కవుట్స్‌ తర్వాత శరీరం కెలోరీలతో పాటు కొన్ని బలవర్థకమైన పోషకాలను కోల్పోతుంది. అందుకే వ్యాయామం అయిపోయిన తర్వాత బాగా ఆకలిగా అనిపిస్తుంది. ఆకలిగా ఉందని మళ్లీ రుచికరమైన భోజనంతో పొట్టంతా నింపేస్తే... బరువు తగ్గకపోగా పెరుగుతాం. జిమ్‌కు వెళ్లడం మొదలుపెట్టాక ప్రొటీన్స్‌ ఎక్కువగా ఉండే డైట్‌ ఫాలో అవ్వాలి.

ఓట్స్, షేక్స్ తీసుకోవాలి

ఓట్స్, షేక్స్ తీసుకోవాలి

ప్రొటీన్‌ షేక్స్‌ ఎక్కువగా తీసుకోవాలి. ఇది సాధ్యం కానప్పుడు జిమ్‌ నుంచి వచ్చిన తర్వాత ఉడికించిన ఓట్స్‌, ఎండు ద్రాక్ష, జీడిపప్పు, బాదాం పుప్ప కలిపి తినాలి. ఒక అరటి పండు, ఒక గ్లాస్‌ పాలు తీసుకున్నా తక్షణ శక్తి పొందవచ్చు. ఉడికించిన గుడ్డును, పొట్టు తీయని తృణ ధాన్యాలతో కలిపి తినడం వల్ల రోజంతటికీ కావాల్సినంత మాంసకృత్తులు అందుతాయి. ఉడికించిన చిలకడదుంపలు రెండు తిన్నా.. రెడిమేడ్‌ ఎనర్జీ వచ్చేస్తుంది. మరెందుకాలస్యం ఈ టిప్స్‌ ఫాలో అవుతూ జిమ్‌కు వెళ్లిపోండి.

దుస్తులను పట్టించుకోం

దుస్తులను పట్టించుకోం

ఇక జిమ్‌కి వెళ్లి వ్యాయామం చేయటం మీదే దృష్టి పెడతాం. కానీ అందుకోసం వేసుకోవలసిన దుస్తులు, షూ గురించి పెద్దగా పట్టించుకోం. కానీ వ్యాయామం సౌకర్యంగా ఉండాలన్నా, వ్యాయామం వల్ల శారీరక సమస్యలు తలెత్తకుండా ఉండాలన్నా జిమ్‌ డ్రస్సింగ్‌లో కొన్ని నియమాలు పాటించాలి.

రన్నింగ్ షూ

రన్నింగ్ షూ

సింపుల్‌ వర్కవుట్‌కి ఉపయోగపడే బేసిక్‌ రన్నింగ్‌ షూస్‌ వేసుకోవాలి. వ్యాయామం చేసే సమయంలో కాలి కీళ్లు దెబ్బతినకుండా ఉండాలంటే మేలు రకం స్పోర్ట్స్‌ షూ వేసుకోవటం తప్పనిసరి.

హుడీ అవసరం

హుడీ అవసరం

హుడీ వేసుకోవటం అలవాటున్నా లేకపోయినా అప్పుడప్పుడూ వేసుకుని వ్యాయామం చేస్తూ ఉండాలి. ఇది వేసుకుని వ్యాయామం చేయటం వల్ల చమట ఎక్కువగా పట్టి అదనపు కిలోలు తరుగుతాయి.

అలాంటి టీ షర్ట్

అలాంటి టీ షర్ట్

ట్రైనింగ్‌ టీషర్ట్స్‌ ఎంచుకోవాలి. వ్యాయామం చేయటం వల్ల చమట పట్టి, ఆ చమటతో టీషర్ట్‌ తడిసిపోతే...అలాగే వర్కవుట్‌ చేయటం మనతోపాటు పక్కనున్నవాళ్లకూ అసౌకర్యంగా ఉంటుంది. కాబట్టి స్వెట్‌ రెసిస్టెంట్‌ మెటీరియల్‌తో తయారైన టీషర్ట్‌నే వేసుకోవాలి.

ట్రాకర్ అవసరం

ట్రాకర్ అవసరం

ఫిట్‌నెస్‌ గురించి అప్‌ టు డేట్‌ ఉండాలంటే ఫిట్‌నెస్‌ ట్రాకర్‌ ధరించాలి. గుండె కొట్టుకునే వేగం, ఖర్చయ్యే కెలోరీల లెక్క తెలియటం కోసం జిమ్‌కి వెళ్లేటప్పుడు ఫిట్‌నెస్‌ ట్రాకర్‌ని వెంట తీసుకెళ్లండి.

సాక్స్

సాక్స్

వారం మొత్తానికి సరిపడా ఏడు జతల సాక్స్‌ ఉంచుకోవాలి. రోజూ సాక్స్‌ మారుస్తూ ఉంటే అవి దుర్వాసన రాకుండా ఉంటాయి. పాదాలకు ఇన్‌ఫెక్షన్‌ రాకుండా ఉంటుంది.

బిగుతైన దుస్తులు ధరించడం

బిగుతైన దుస్తులు ధరించడం

తరుచుగా మనం ధరించిన దుస్తులు అనగా లోతు మెడ కల టీషర్ట్ లేదా బిగుతైన ప్యాంటు వంటివి మనకు ఇబ్బందికర అనుభూతిని కలిగేలా చేయవచ్చు. మనం అతి జాగ్రత్తతో ఎన్ని పనులు చేసినప్పటికీ సరైన దుస్తులు ధరించనట్లయితే అవి అన్నీ వ్యర్ధమే కావున బిగుతైన దుస్తులను ఎపుడూ ధరించకూడదు.

వార్మ్ అప్ చేయాలి

వార్మ్ అప్ చేయాలి

అతి ముఖ్యంగా వార్మ్అప్ చేయకుండా వ్యాయమం ప్రారంభించినట్లయితే తక్కువ సమయంలోనే గుండె వేగం పెరిగి శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది ఎదుర్కోవల్సి వస్తుంది, శక్తిని కోల్పోయి మరియు అనాయాసంగా వ్యాయామ సాధనను పూర్తి చేసుకోవాల్సివస్తుంది. వార్మ్అప్ వ్యాయామాలను సక్రమంగా చేయనట్లయితే ఎముకలు, కండరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.

అవగాహన ఉండాలి

అవగాహన ఉండాలి

జిమ్ లోని సామగ్రి, పరికరాలను ఉపయోగించే విధానంపై అవగాహన ఉండాలి. చాలా మంది అక్కడున్న పరికరాలతో వ్యాయామాలను ఎలా చేయాలనే విషయాలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండరు. వాటిన్నింటిపై అవగాహన పెంచుకునే వర్క్ అవుట్స్ చేయాలి. ఇక శిక్షకుడు అందుబాటులోనే ఉన్నట్లయితే, అతని సహాయాన్ని తప్పక తీసుకోవాలి.

90 సెకన్లు మించి ఉండకూడదు

90 సెకన్లు మించి ఉండకూడదు

కండరాలను, ఎముకలను ఎక్కువ శ్రమకు గురి చేయకూడదు.

అతి తక్కువ సమయంలో అతి ఎక్కువగా వ్యాయామం చేయడం మంచిద కాదు. కార్డియో వ్యాయమాలను ఎక్కువగా చేయడం వలన బరువును ఎక్కువగా తగ్గించుకోలేని స్థితి ఏర్పడుతుంది. శరీర వ్యాయామలలో ఈ వ్యాయామాన్ని వదిలిపెట్టకుండా సాధన చేస్తూ ఉండాలి. ఇక చాలా వరకు వర్క్ అవుట్స్ గరిష్టంగా 5 సెట్లు చేస్తుండాలి. విశ్రాంతి సమయం ఎప్పుడూ 90 సెకన్లు మించి ఉండకూడదు.

వ్యక్తిగత శుభ్రత

వ్యక్తిగత శుభ్రత

శారీరక వ్యాయామాలు చేసే వారు వ్యక్తిగత శుభ్రతపై దృష్టి పెట్టాలి. జిమ్‌కి వెళ్లే ముందు స్నానం చేయడం మంచిది. ఎప్పుడూ సౌకర్యవంతమైన దుస్తులు వేసుకోవాలి. వదులుగా ఉండే డ్రెస్సులు ధరించడం ఉత్తమం. చెమటను పీల్చే కాటన్‌ దుస్తులు వేసుకోవడం మంచిది. చంకలను శుభ్రంగా, పొడిగా ఉంచుకోవాలి.

పెట్రోలియం జెల్లీ

పెట్రోలియం జెల్లీ

ఇక రాపిడి సంభవించే శరీర భాగాలకు పెట్రోలియం జెల్లీని పూయడం మంచిది. ఏదైనా జిమ్‌ పరికరాన్ని ఉపయోగిం చడానికి ముందు, తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. హ్యాండ్‌ శానిటైజర్‌ కలిగి ఉండటం మంచిది. వ్యాయామం చేస్తున్నప్పుడు చెమట పట్టాలి. కానీ వ్యాయామం చేసే సమయంలో చెమటతో ఇబ్బంది పడొద్దు. కాబట్టి జిమ్‌కి వెళ్లేటప్పుడు శుభ్రమైన టవల్‌ తీసుకెళ్లండి.

జిమ్‌ బ్యాగులో పడేయొద్దు

జిమ్‌ బ్యాగులో పడేయొద్దు

తరచూ నీరు తాగడం మంచిది. దీనివల్ల ఉత్సాహంగా వ్యాయామం చేయగలుగుతారు. వ్యాయామాన్ని పూర్తి చేసిన తర్వాత చెమటతో నిండిన దుస్తుల్ని అలాగే జిమ్‌ బ్యాగులో పడేయొద్దు. జాగ్రత్తగా ప్లాస్టిక్‌ సంచిలో ఉంచాలి. అలాగే కొద్దిగా ఆరిన దుస్తుల్ని ఎక్కువసేపు వాషింగ్‌ మెషీన్‌లో ఉంచి శుభ్రం చేయడం వల్ల కూడా క్రిములు రావచ్చు.

శుభ్రం చేయడం మరీ మంచిది

శుభ్రం చేయడం మరీ మంచిది

ముందుగా దుస్తులను పూర్తిగా ఆరబెట్టి, తర్వాత వాటిని శుభ్రం చేయాలి. సాధ్యమైతే వాటిని వేరేగా శుభ్రం చేయడం మరీ మంచిది. శుభ్రం చేసిన తర్వాత కూడా దుర్వాసన వస్తే, మళ్లీ దానిని శుభ్రం చేయాలి. మళ్లీ శుభ్రం చేయకుండా ధరించడం మంచిది కాదు.

షాంపు ఉపయోగించొద్దు

షాంపు ఉపయోగించొద్దు

వ్యాయామం చేసిన తర్వాత వెంటనే సోఫాపై వాలిపోవాలనిపిస్తుంది. అలా చేయడం మంచిది కాదు. ముందు స్నానం చేయండి. ఆ తర్వాత తగినంత విశ్రాంతి తీసుకోండి. వ్యాయామం చేసిన తర్వాత ప్రతిసారీ జుట్టుకు షాంపు ఉపయోగించొద్దు. దీంతో జట్టు పొడిగా మారి ఊడిపోయే అవకాశం ఉంది. షాంపూనకు బదు లుగా కండీషనర్‌ ఉపయోగించండి.

అప్పుడు జిమ్ వెళ్లొద్దు

అప్పుడు జిమ్ వెళ్లొద్దు

జలుబు లేదా జ్వరం, ఇతర రుగ్మతలతో బాధపడుతున్న సమయంలో జిమ్‌కి వెళ్లొద్దు. ఆ రోజు వెళ్లకపోవడం వల్ల త్వరగా కోలుకోవచ్చు. అలాగే ఇతరులకు ఇన్ఫెక్షన్‌ ప్రబలకుండా నివారించొచ్చు. కొందరు ఇవేమీ పాటించకుండా ఏదో వారికి తెలిసినట్లుగా, నచ్చినట్లుగా వారికి సౌకర్యవంతంగా ఉండేలా వ్యాయామం చేస్తారు. అలా వ్యాయామం చేస్తే బాడీ రాదు కదా.. ఉన్నది కూడా పోతది.

English summary

20 workout tips for beginners

20 workout tips for beginners
Story first published:Wednesday, May 2, 2018, 11:59 [IST]
Desktop Bottom Promotion