For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ 7 సాధారణ అలవాట్లు మీ బెల్లీ ఫ్యాట్ ను ఎప్పటికీ తగ్గనివ్వవు

|

బెల్లీ ఫ్యాట్ గురించి మీరు దిగులు చెందుతూ ఉన్నారా? టమ్మీ చుట్టూ పేరుకున్న కొవ్వు ఒక కుండను పోలేలా మీ పొట్టను తయారుచేసిందా? అందువలన, మీ పొట్ట గురించి మీరెప్పుడు కాన్షియస్ గా ఉంటూ ఫిగర్ హగ్గింగ్ క్లాత్స్ కి దూరంగా ఉంటున్నారా?

అయితే, బెల్లీ ఫ్యాట్ ను తొలగించుకునే వాటి గురించి మీరు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండుంటారు. ఈ మొండి బెల్లీ ఫ్యాట్ ను తొలగించుకునే మార్గాల గురించి పట్టు విడవని విక్రమార్కునిలా మీ అన్వేషణ సాగిస్తూ ఉండుంటారు. నిజమేనా?

అయితే, మీరు సరైన దారిలోనే ఉన్నారు. బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవాలన్న ఆలోచన మంచిదే. ఎందుకంటే, బెల్లీ ఫ్యాట్ మీ అందాన్ని దెబ్బతీయడంతో పాటు రాను రాను మీ ఆరోగ్యానికి అనేకవిధాలుగా ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. నచ్చిన వస్త్రాలను ధరించలేరు. అదే సమయంలో, బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవాలన్న తాపత్రయంలో నచ్చిన ఆహారాన్ని మనఃస్పూర్తిగా ఆస్వాదించలేరు.

7 Common Habits Which Never Let You Lose Belly Fat! ,

బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా ఉండటం వలన అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అవి చిన్నవి కావచ్చు లేదా కొన్ని సార్లు ప్రాణాపాయం కలిగించేవి కావచ్చు.

ఒబెసిటీ, డయాబెటిస్, జాయింట్ పెయిన్, హై కొలెస్ట్రాల్, బ్లడ్ ప్రెషర్, గాల్ స్టోన్స్, లివర్ డిసీజెస్, డైజెస్టివ్ డిసీజెస్, హార్ట్ డిసీజెస్, కొన్ని రకాల క్యాన్సర్, డిప్రెషన్ వంటివి బెల్లీ ఫ్యాట్ వలన తలెత్తే కొన్ని ఆరోగ్య సమస్యలు.

ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు రెగ్యులర్ గా వ్యాయామం చేయడం ద్వారా బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవచ్చు. ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ ను పాటించడం ద్వారా బెల్లీ ఫ్యాట్ బెడద నుంచి ఉపశమనం పొందవచ్చు.

అయితే, కొన్ని అలవాట్లను మనం రోజువారీ పాటిస్తూ ఉంటాం. ఇవి బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవడానికి తోడ్పడవు.

బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలకు ఈ అలవాట్లు అవరోధంగా మారతాయి. మరి, ఆ అలవాట్లు ఏంటో చూసేద్దామా!

1. సోషల్ మీడియా అడిక్షన్:

1. సోషల్ మీడియా అడిక్షన్:

ఫోన్లలో అలాగే కంప్యుటర్లో సోషల్ మీడియాను ఎక్కువగా వాడటం వలన కళ్ళకు ఇబ్బందులు అలాగే ఒత్తిడితో పాటు మరెన్నో సమస్యలు తలెత్తవచ్చు. అయితే, ఇవన్నీ బెల్లీ ఫ్యాట్ కి అస్సలు సంబంధం లేదన్నది ఇప్పటి వరకు ఉన్న ఒక భావన.

అయితే, హార్వర్డ్ హెల్త్ బ్లాగ్ లో పబ్లిష్ అయిన ఒక అధ్యయనం ప్రకారం సోషల్ మీడియా అడిక్షన్ వలన ఒక వ్యక్తి ఒకే ప్లేస్ లో మరీ ఎక్కువ సేపు కూర్చుని ఉండవలసి వస్తుంది. దాంతో, ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోతుంది. తద్వారా, బెల్లీ ఫ్యాట్ పేరుకుపోవడం అనేది పెరుగుతుంది.

2. వ్యాయామం క్రమపద్ధతిలో చేయకపోవటం:

2. వ్యాయామం క్రమపద్ధతిలో చేయకపోవటం:

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వ్యాయామం చేయడం వలన బరువును తగ్గించుకోవచ్చు. అయితే, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తేనే ప్రయోజనాలను అందుకోగలుగుతారు.

వారంలో కేవలం రెండు రోజులు మాత్రమే వ్యాయాయం చేసి లేదా నెలలో కొన్ని రోజులు మాత్రమే వ్యాయామానికి కేటాయిస్తే ఇది ఆకలి స్థాయిలను పెంచుతుంది. తద్వారా బెల్లీ ఫ్యాట్ మరింత ఎక్కవగా పేరుకుంటుంది. కాబట్టి, ఈ పద్దతి ఫ్యాట్ ను కరిగించడానికి పనికిరాదు.

3. ప్రోబయాటిక్స్ లోపం:

3. ప్రోబయాటిక్స్ లోపం:

ప్రోబయాటిక్స్ అనే పోషకాహార గ్రూప్ లో ఆరోగ్యకరమైన బాక్టీరియా లభిస్తుంది. ఇది డైజెస్టివ్ సిస్టమ్ కు మంచిది. పెరుగు మరియు గ్రీక్ యోగర్ట్ లో ప్రోబయాటిక్ కంటెంట్ పుష్కలంగా లభిస్తుంది.

ప్రోబయాటిక్ అనేది గ్రెలిన్ అనే హంగర్ హార్మోన్ ను రెగ్యులేట్ చేసేందుకు తోడ్పడుతుంది. అందువలన బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గుముఖం పడుతుంది. అలాగే శరీరంలోని కొవ్వు కూడా కరుగుతుంది. అందువలన, మీ డైట్ లో తగినన్ని ప్రోబయాటిక్స్ లేకపోతే బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవడం కష్టమే.

4. మీల్స్ ను ప్లాన్ చేసుకోకపోవడం:

4. మీల్స్ ను ప్లాన్ చేసుకోకపోవడం:

చాలా మంది మీల్స్ ను ముందుగా ప్లాన్ చేసుకోవడం అవసరం లేదన్న భావనలో ఉన్నారు. అయితే, మనం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలంటే ప్లానింగ్ తప్పనిసరి. ముందుగా మీల్స్ ను ప్లాన్ చేసుకుంటే తగిన మోతాదులోనే ఆహారాన్ని తీసుకుంటాము. ఆరోగ్యకరమైన ఆహారాన్నే తీసుకుంటాము. లేదంటే, అనారోగ్యకరమైన ఆహారాన్ని ఎక్కువగా మోతాదులో తీసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి, మీల్స్ ను ప్లాన్ చేసుకోవడం ముఖ్యమన్న విషయాన్ని గుర్తించి తగిన విధంగా చర్యలు తీసుకోవడం మంచిది.

ఆహారాన్ని ముందుగా ప్లాన్ చేసుకోవడం ద్వారా బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవడానికి మార్గం సుగమం అవుతుంది.

5. ఎమోషనల్ ఈటింగ్ :

5. ఎమోషనల్ ఈటింగ్ :

ఎమోషనల్ ఈటింగ్ అంటే కొన్ని ప్రత్యేక సందర్భాలలో భావోద్వేగానికి అధికంగా గురవడం వలన ఆకలికి ఎక్కువగా గురవడం. అందువలన, ఎక్కువగా ఆహారాన్ని తీసుకోవడం జరుగుతుంది. బాధ, ఆందోళన, ఒత్తిడి లేదా విపరీతమైన సంతోషం కలిగినప్పుడు ఎక్కువగా ఆహారాన్ని తీసుకోవాలని అనిపిస్తుంది.

ఆయా సమయాలలో కొంతమందిలో హంగర్ హార్మోన్స్ అనేవి ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఈ అలవాటు అనేది బెల్లీ ఫ్యాట్ ను పెంచుతుంది. వెయిట్ లాస్ కు తోడ్పడదు.

6. వెజిటబుల్స్ ను తీసుకోకపోవడం:

6. వెజిటబుల్స్ ను తీసుకోకపోవడం:

మీరు వెజిటేరియన్, వెగాన్ లేదా మీట్ ఈటర్ అయినా వెజిటబుల్స్ ని మీ రోజువారీ డైట్ లో భాగంగా చేసుకోవడం ముఖ్యం. వెజిటబుల్స్ లో పోషకాలు అధిక మోతాదులో లభిస్తాయి. ఇవి మెటబాలిక్ రేట్ ను మెరుగుపరుస్తాయి. తద్వారా, బెల్లీ వద్ద పేరుకుపోయిన ఫ్యాట్ ను కరిగించడానికి తోడ్పడతాయి. కాబట్టి, ఒకవేళ ఇప్పటి వరకు మీరు వెజిటబుల్స్ పై శ్రద్ద పెట్టకపోతే ఇక మీదటి నుంచైనా వెజిటబుల్స్ ను మీరు ఆహారంలో భాగంగా చేసుకోండి.

7. క్యాన్డ్ జ్యూస్ ను తీసుకోవడం:

7. క్యాన్డ్ జ్యూస్ ను తీసుకోవడం:

మీలో చాలామందికి క్యాన్డ్ జ్యూస్ లను తీసుకోవడం ముఖ్యంగా ఉదయాన్నే వీటిని తీసుకోవడం అలవాటుగా ఉండి ఉంటుంది. ఉదయాన్నే ఆరెంజ్ జ్యూస్ లేదా జామపండు జ్యూస్ తో రోజును ప్రారంభిస్తారు కొందరు. బ్రేక్ ఫాస్ట్ తో పాటు వీటిని తీసుకుంటారు. అయితే, ఈ జ్యూస్ బ్రాండ్స్ అనేవి ఇవి షుగర్ ఫ్రీ మరియు వంద శాతం సహజమైనవని చెబుతున్నా అసలు విషయం ఏంటంటే వీటిలో షుగర్ మోతాదు ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రిజర్వేటివ్స్ ని వీటిలో వాడతారు. ఇవన్నీ బెల్లీ ఫ్యాట్ ని కరిగించేందుకు ఏ మాత్రం సహాయపడవు.

English summary

7 Common Habits Which Never Let You Lose Belly Fat!

Well, if you have already made up your mind to reduce belly fat, you are stepping in the right direction, as excess belly fat can not only make you look unfit and prevent you from wearing what you like, but more importantly, it can also ruin your health! Having excess belly fat can be the root cause of a number of health problems, both minor and major. Obesity, diabetes, joint pain, high cholesterol, high blood pressure, gall stones, liver diseases, digestive diseases, heart diseases, certain types of cancer, depression, etc., are some of the main health effects of having excess belly fat.
Story first published: Tuesday, June 19, 2018, 19:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more