For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  సలాడ్లు, పండ్లు మూలంగా అధిక బరువు కోల్పోవడం వీలవుతుందా ?

  |

  సలాడ్ అనునది బరువు తగ్గడానికి సూచించబడిన ఆరోగ్యకరమైన ఆహారాలలో ముఖ్యమైనది. పండ్లు, కూరగాయలు కలపడం ద్వారా సలాడ్లను తయారుచేస్తారు. అందువలన ఎప్పుడూ ఒకే రకమైన రుచిని కలిగి ఉండడం జరగదు, తద్వారా రకరకాలను రుచులను ఆస్వాదిస్తూ విసుగు లేకుండా తీసుకోవచ్చు. అసలు సలాడ్స్ నిజంగానే బరువును కోల్పోవుటలో సహాయం చేస్తాయా? ఇప్పుడు చర్చించుకుందాం.

  కేవలం న్యూట్రిషన్ స్థాయిలు కలిగి ఉన్న సలాడ్లు తీసుకోవడం మూలంగా బరువు తగ్గడం అనేది ఉండదు. రోజూవారీ ప్రణాళికలు, సిఫార్సుల ప్రకారం పండ్లు, కాయగూరల వినియోగం అనేది మీ బరువు తగ్గడంలో సహాయం చేస్తాయి అనేది నిజం. తద్వారా శరీరానికి అవసరమైన అన్నిరకాల పోషకాలను, మినరల్స్, ఖనిజాలని అందించి బరువు తగ్గడం లో కీలకపాత్ర పోషించేలా చేయవచ్చు.

  సలాడ్స్ ప్రోటీన్లతో కూడిన అధిక బరువుని తగ్గించే ఆహార పదార్ధంగా చెప్పబడుతుంది. కానీ సలాడ్స్ చేయు విధానంలో ఒక క్రమబద్దీకరణ ఉండాలి, లేకుంటే వేరే ఇతరములైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. కావున సలాడ్స్ ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించాలి.

  Can You Lose Weight By Eating Salad And Fruits

  సలాడ్స్ మరియు పండ్ల వలన ఉపయోగాలు:

  పండ్లు మరియు కూరగాయలలో విటమిన్ సి యొక్క అద్బుతమైన మూలాలు ఉంటాయి. ఈ విటమిన్ సి జుట్టు మరియు చర్మ సౌందర్యానికి చక్కగా సహాయపడుతుంది. మరియు రోగ నిరోధక శక్తిని కలిగి ఉండడం వలన మీ చర్మ కణాలను ఉపరితల ప్రభావాల నుండి కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తుంది. సలాడ్లు మరియు పండ్లు ఫైబర్ ని కలిగి ఉంటాయి, కావున కడుపునిండిన అనుభూతిని కలిగించుట మూలంగా, భోజనం తక్కువగా తీసుకునేలా చేస్తుంది. ఈ ప్రక్రియ మూలంగా అధికబరువుని తగ్గించుటలో సహాయం చేస్తుంది. మరియు పొటాషియం, విటమిన్ ఎ వంటి అనేక ఇతరములైన పోషకాలను కూడా కలిగి ఉంటాయి.

  సలాడ్లు మరియు పండ్లలో ప్రోటీన్ స్థాయిలు తక్కువగా ఉంటాయి:

  సలాడ్లు మరియు పండ్లలో ప్రోటీన్ స్థాయిలు తక్కువగా ఉంటాయి:

  పండ్లు మరియు పచ్చని ఆకు కూరలలో ప్రోటీన్ల శాతం తక్కువగా ఉంటుంది. ఆరోగ్యకరమైన కణజాలాలను, ప్రాణవాయువు సరఫరా నిర్వహించడానికి మరియు రోగనిరోధక వ్యవస్థను పెంచడానికి శరీరానికి కావలసిన అమైనో ఆమ్లాలను అందించడానికి మీ ఆహారంలో ప్రోటీన్ కచ్చితంగా అవసరం.

  హార్వర్డ్ హెల్త్ నివేదికల ప్రకారం, ఆరోగ్యకరమైన ప్రోటీన్ బరువు కోల్పోవడంలో సహాయం చేస్తుంది. ప్రోటీన్ఉండడం మూలంగా కడుపు నిండిన అనుభూతికి లోనై, జంక్ ఆహార పదార్ధాలపై మనసు వెళ్లకుండా చేయగలుగుతుంది.

  మీరు ఇతర పోషకాలను కోల్పోతారు:

  మీరు ఇతర పోషకాలను కోల్పోతారు:

  కేవలం పండ్లు, సలాడ్లు పైన మాత్రమే ఆధారపడి వేరే ఆహారపదార్ధాల జోలికి పోని ఎడల ఇతరములైన పోషకాలను కోల్పోతున్నారనే అర్ధం. తద్వారా ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ బి 12, కాల్షియం, జింక్ మరియు విటమిన్ డి వంటి అనేక పోషక లోపాల ప్రమాదానికి కారణమవుతుంది. ఇది మీ ఆరోగ్యంపై తీవ్రమైన దుష్ప్రభావాలను కలిగజేయడమే కాకుండా బోలు ఎముకల వ్యాధి(ఆస్ట్రియో పొరాసిస్) ప్రమాదాన్ని పెంచుతుంది.

  పోషక ప్రతిపాదనలు:

  పోషక ప్రతిపాదనలు:

  శీఘ్ర బరువు నష్టం కోసం మీరు సలాడ్లు మరియు పండ్లలోని ప్రోటీన్లను వినియోగిస్తున్నప్పుడు, జంతు మరియు ఆకుకూరల సంబంధిత ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం, ఐరన్ కూడా పొందుతారు.

  కానీ కేవలం వీటిపైనే ఆధారపడడం కాకుండా చేపలు, కొవ్వు రహిత పాల పదార్ధాలు అయిన పెరుగు, పాలు, జున్ను వంటివి తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన కాల్షియంను కూడా అందివ్వగలుగుతారు.

  సలాడ్లలో చేర్చడానికి కావలసినవి:

  సలాడ్లలో చేర్చడానికి కావలసినవి:

  మీరు సలాడ్లు తినడం ద్వారా బరువు కోల్పోవాలని కోరుకుంటే, తాజా పళ్ళు మరియు కూరగాయలను తక్కువ క్యాలరీలో ఉండేలా చూసుకోవలసి ఉంటుంది. అలాగే, కొన్ని పండ్లు మరియు కూరగాయలు నీటి శాతాన్ని ఎక్కువ కలిగి ఉండి , ఫైబర్ తో నిండి ఉంటాయి , వీటి కారణంగా కడుపు నిండిన అనుభూతికి లోనవుతారు.

  ఉదాహరణకు ఒక వెజిటేరియన్ సలాడ్ తీసుకుంటే, దీనికై ముఖ్యంగా కావలసినవి పాలకూర, మొలకలు, టమోటాలు, బీన్స్ మరియు దోసకాయలు వంటివి ప్రధానం. ఇక నాన్వెజిటేరియన్ సలాడ్ కై కాల్చిన చికెన్ లేదా టర్కీ కోడి మాంసాన్ని జత చేస్తారు.

  శాఖాహార-స్నేహపూర్వక వ్యక్తులు, కాయలు, బీన్స్ మరియు సోయ ఉత్పత్తుల వంటి ప్రోటీన్ ఆహారాలు తీసుకోవచ్చు. ఒక ఫ్రూట్ సలాడ్ కోసం ద్రాక్ష, నారింజ, బెర్రీ, బేరి, పుచ్చకాయలు లేదా ఆపిల్ లాంటి పండ్లు ఉన్నాయి.

  సలాడ్స్ లో జతచేయకూడని పదార్ధాలు :

  సలాడ్స్ లో జతచేయకూడని పదార్ధాలు :

  సలాడ్ ని అలంకరించడం మానుకోండి. చాలామంది గార్నిషింగ్ కి ఎక్కువ సమయం కేటాయిస్తుంటారు. సమయం వలన పోషకవిలువలు తగ్గడం తో పాటు , గార్నిషింగ్ లో ఉపయోగించే సాస్, ఆయిల్స్, వెనిగర్ వంటివి కాలరీల సంఖ్యను పెంచడం కూడా చేస్తాయి. కావున ఇవి అధిక కేలరీలు కలిగి ఉన్నందున, బరువు కోల్పోవటానికి ప్రయత్నిస్తున్నట్లయితే యే మాత్రం పని చెయ్యవు. కావున అలాంటి అలంకరణలు మానుకోండి. అలాగే, చీజ్ మరియు బేకన్ వంటి అధిక కొవ్వు మాంసాలను ఉపయోగించకoడి. బదులుగా సలాడ్ గార్నిషింగ్ లేదా డ్రెస్సింగ్ కోసం ఆలివ్ నూనెను జోడించండి.

  మీరు ఒక ఫ్రూట్ సలాడ్ తినేటప్పుడు టాపింగ్ కై అధిక కొవ్వు కలిగి ఉన్న whipped - క్రీమ్ ఉపయోగించడం మానుకోండి.

  బరువు కోల్పోవడానికై మీరు చేయవలసినది:

  బరువు కోల్పోవడానికై మీరు చేయవలసినది:

  అదనపు ఆరోగ్య ప్రయోజనాల కోసం పండ్లు మరియు సలాడ్లలో లీన్ ప్రోటీన్ మరియు తృణధాన్యాలను కలపండి. డైటీషియన్ సూచనల మేరకు పరిమితి మీరకుండా సలాడ్లు తీసుకోవడం కూడా ముఖ్యం. ఇది వరకే మీరు ఒక ఆహార ప్రణాళికను అనుసరిస్తున్నట్లయితే, సలాడ్స్ ను కూడా జత చేసుకోవడం మంచిది. స్నాక్స్ గా కానీ, అల్పాహారంగా కానీ తీసుకోవచ్చు. కొంత కాల్షియం మరియు ప్రోటీన్లను పొందడంకోసం కాస్త పెరుగును కూడా జతచేయవచ్చు.

  English summary

  Can You Lose Weight By Eating Salad And Fruits

  Preparing salads carefully will not only help you to lose weight, but also help you to meet the daily recommendations of fruit and vegetable consumption. Salads and fruits contain fibre, which keeps your tummy satisfied after your meals. Relying only on fruits and salad means you are missing out on other nutrients. Include protein foods as well.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more