ప‌ద్మావ‌త్ లుక్ కోసం దీపికా ప‌దుకొణె ఇంత‌లా క‌ష్ట‌ప‌డింది!

By: sujeeth kumar
Subscribe to Boldsky

బాలీవుడ్‌లో అత్య‌ధిక పారితోషికం అందుకుంటున్న న‌టీమ‌ణుల్లో దీపికా ప‌దుకొణె ఒక‌రు. టాప్ ఫ్యాష‌న్ మోడ‌ల్‌గా కెరీర్‌ను ఆరంభించిన ఆమె ఇప్పుడు సినీ ప‌రిశ్ర‌మ‌ను ఏలుతున్నారంటే అతిశ‌యోక్తి కాదు.

అందాల భామకు అథ్లెటిక్ శ‌రీరం క‌లిసొచ్చింది. ఆమె త‌న‌కున్న స‌గం స‌మ‌యం తీరైన శ‌రీరాకృతిని పెంపొందించేందుకే వెచ్చిస్తారు. ఆమెకున్న టోన్డు బాడీ షేప్ క‌ష్ట‌ప‌డేత‌త్వం, క‌ఠిన ఆహార నియ‌మాలు, క్ర‌మ‌శిక్ష‌ణ‌తో సాధించుకున్నారు.

ఈ పొడుగు కాళ్ల సుంద‌రి డైట్‌, వ్యాయామాల‌తో ఎల్ల‌ప్పుడూ స్లిమ్‌గా ఉండేలా జాగ్ర‌త్త‌ప‌డ‌తుంది. ఆమె క‌ఠిన‌మైన డైట్ పాటిస్తార‌ని చెబుతారు. జంక్‌, ఆయిల్ ఫుడ్ జోలికి వెళ్ల‌కుండా తాజా కూర‌గాయ‌లు, ప‌ళ్ల‌ను తీసుకుంటారు.

దీపికా ఫిట్‌నెస్ మంత్ర కార్డియో, వెయిట్ ట్ర‌యినింగ్‌, డ్యాన్స్‌, యోగా ఎక్స‌ర్‌సైజ్‌లు. ఆమె స్వ‌తహాగా బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి. ఫిట్‌గా ఉండేందుకు అప్పుడ‌ప్పుడు ఈ ఆట ఆడుతుంటారు.

ప‌ద్మావ‌త్ సినిమా విడుద‌ల సంద‌ర్భంగా ఆమె డైట్‌, వ‌ర్క‌వుట్ టిప్స్ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలుసుకుందాం.

1. యోగా ఎక్స‌ర్‌సైజులు

1. యోగా ఎక్స‌ర్‌సైజులు

దీపికా ప‌దుకొణె యోగా, ఆస‌నాలు, ప్రాణాయామం, మెడిటేష‌న్ ఎంతో ఇష్టంతో చేస్తారు. వ‌ర్క‌వుట్‌లో భాగంగా ప్ర‌తి యోగా భంగిమ‌ను ప్ర‌య‌త్నిస్తారు. యోగా మంచి రీఫ్రెషింగ్ భావ‌న ఇస్తుంద‌ని ఆమె అంటారు. శ‌రీరానికి, మ‌న‌సుకు సాంత్వ‌న చేకూరుస్తుంద‌ని అన్నారు. యోగాలో భాగంగా సూర్య న‌మ‌స్కారాలు, ప్రాణాయామం, మార్జారియాస‌నం లాంటివి చేస్తారు.

2. డ్యాన్స్ వ్యాయామాలు

2. డ్యాన్స్ వ్యాయామాలు

ఈ గార్జియ‌స్ బ్యూటీ డ్యాన్స్ ప‌ట్ల అత్యంత అంకిత‌భావాన్ని ప్ర‌ద‌ర్శిస్తారు. ఫిట్‌నెస్‌లో డ్యాన్స్ కీల‌క పాత్ర పోషిస్తుంది. ఎప్పుడైనా జిమ్‌కు వెళ్ల‌క‌పోతే ఆ రోజు నేరుగా డ్యాన్స్ క్లాసుల‌కు వెళ్లిపోతుంది. భ‌ర‌త‌నాట్యం, క‌థ‌క్‌, జాజ్ లాంటి ర‌క‌ర‌కాల డ్యాన్సులు చేసేందుకు ఆమె ఇష్ట‌ప‌డ‌తారు.

3. కార్డియో ఎక్స‌ర్‌సైజులు

3. కార్డియో ఎక్స‌ర్‌సైజులు

దీపికా ఎన్నో ర‌కాల ఫ్రీ హ్యాండ్ వెయిట్ వ్యాయామాలు.. నాలుగు లేదా ఐదు సెట్ల స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజ్‌లు చేస్తారు. దీంతో పాటు 10 నుంచి 12 పైలేట్లు, స్ట్రెచింగ్ రొటీన్‌లు చేస్తారు. ప‌రుగు పెట్టే వ్యాయామం చేయ‌కుండా కేవ‌లం లో ఇన్‌టెన్సిటీ వ‌ర్క‌వుట్ల‌పై శ్ర‌ద్ధ పెడ‌తారు. స‌రైన టెక్నిక్‌, పోశ్చ‌ర్‌ను ఉప‌యోగించాల్సి వ‌స్తుంది.

4. తాజా ఆహార ప‌దార్థాలు

4. తాజా ఆహార ప‌దార్థాలు

అంద‌రూ తాజా, ఆరోగ్య‌క‌ర‌, పోష‌క‌భ‌రిత ఆహారం తీసుకోవాల‌ని దీపికా ప‌దుకొణె సూచిస్తారు. అల్పాహారంలో భాగంగా లో ఫ్యాట్ మిల్క్‌, రెండు ఎగ్ వైట్స్‌, ఇడ్లీ, ర‌వ్వ ఉప్మా తీసుకుంటారు. ఆమె ద‌క్షిణ భార‌త‌దేశానికి చెందిన‌వారు కాబ‌ట్టి ద‌క్షిణాది వంట‌కాలు అంటే మ‌క్కువ ఎక్కువ‌.

5. మితంగా డిన్న‌ర్‌

5. మితంగా డిన్న‌ర్‌

దీపికా డైట్‌లో ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు స‌మ‌పాళ్ల‌లో ఉంటాయి. ఆమెకు అన్న‌మంటే ఇష్టం కానీ రాత్రిపూట మాత్రం తిన‌దు. అదీ కాకుండా రాత్రి మాంసం తిన‌రు. డిన్న‌ర్ సాదాసీదాగా ఉండేలా చూసుకుంటారు. చ‌పాతీ, కూర‌లు, తాజా స‌లాడ్‌, రైతా తీసుకునేందుకు ఇష్ట‌ప‌డ‌తారు.

6. స‌మ‌తుల ఆహారం

6. స‌మ‌తుల ఆహారం

ప్ర‌తి 2 గంట‌ల‌కోసారి దీపికా ప‌దుకొణె తాజా పండ్లు, జ్యూసులు తీసుకుంటారు. సాయంత్రంపూట ఫిల్ట‌ర్‌కాఫీ, న‌ట్స్‌, డ్రై ఫ్రూట్స్ తీసుకుంటారు.

7. ఉప‌వాసాలు వ‌ద్దు

7. ఉప‌వాసాలు వ‌ద్దు

బ‌రువు త‌గ్గాలంటే నోరు క‌ట్టేసుకోవాల్సిన అవ‌స‌రం లేదు. దానికి బ‌దులు స‌రైన ఆహారం తీసుకోమ‌ని దీపిక స‌ల‌హా ఇస్తారు. మీకు త‌గిన ఆహారం ఏదో తెలుసుకొని దానికి త‌గిన‌ట్టు తినాలంటారు. ఒక రోజు బాగా తింటే మ‌రుస‌టి రోజు త‌గ్గించి తింటారు.

8. వీకెండ్స్‌లో తీపి ప‌దార్థాలు

8. వీకెండ్స్‌లో తీపి ప‌దార్థాలు

దీపికా ప‌దుకొణెకు స్వీట్లు అంటే చాలా ఇష్టం. అప్పుడ‌ప్పుడు తీసుకోవ‌డం వ‌ల్ల పెద్ద న‌ష్ట‌మేమీ లేదంటారు. త‌క్కువ క్యాల‌రీలు ఉన్న స్వీట్ల‌ను డైట్‌లో భాగం చేసుకోవ‌డం మంచిదే అంటారు. ఆమె చాక్లెట్లు అప్పుడ‌ప్పుడు తీసుకుంటారు.

9. స్ట్రెచింగ్ వ్యాయామాలు

9. స్ట్రెచింగ్ వ్యాయామాలు

దీపికా ట్రెయిన‌ర్ యాస్మిన్ క‌రాచీవాలా ఆమెతో ఎక్కువ‌గా స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయిస్తుంటారు. రోజువారీ వ‌ర్క‌వుట్ల‌లో భాగంగా దీన్ని ఆచ‌రిస్తారు. శ‌రీరాన్ని ఫ్లెక్సిబుల్‌గా ఉంచుకునేందుకు ఈ వ్యాయామం ఉప‌యోగ‌ప‌డుతుంది.

10. యాబ్స్ ఎక్స‌ర్‌సైజ్‌లు

10. యాబ్స్ ఎక్స‌ర్‌సైజ్‌లు

ఫ్లాట్ పొట్ట కావాల‌నుకునేవారు యాబ్స్ పైన ఎక్కువ‌గా దృష్టి పెట్టాలి. జంక్ ఫుడ్‌ను వ‌దిలేయాలి అని దీపికా స‌ల‌హా ఇస్తున్నారు. యాబ్స్ వ‌ర్క‌వుట్లు చేస్తే మంచి షేప్ త్వ‌ర‌గా వ‌స్తుంది. దృఢ‌మైన కండ‌లు, తొడ‌లు రూపొందుతాయి.

English summary

Deepika Padukone Reveals 10 Diet And Workout Tips For Her Look In Padmavat

Deepika Padukone manages to keep herself lean and slim with her diet and exercise. The sultry actress is also known for her strict and controlled diet. She is fond of fresh healthy diet and avoids junk, spicy and oily foods. Her fitness mantra is a mix of cardio, weight training, dance and yoga exercises. The actress is a fitness freak
Story first published: Thursday, January 25, 2018, 18:30 [IST]
Subscribe Newsletter