For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ శరీర బరువును తగ్గించే ఈ 8 ఆయుర్వేద చిట్కాలు గూర్చి మీకు తెలుసా ?

|

భారతదేశంలో "ఆయుర్వేదం" అనేది చాలా పురాతనమైన మూలాలను కలిగి ఉంది, అంటే సుమారుగా 15,000 సంవత్సరాల ప్రాచుర్యాన్ని కలిగి ఉన్నది. మీరు మీ శరీర బరువును తగ్గించుకోవడం గురించి ఆలోచించినప్పుడు - మీ మనసులో అనేక వేల ఆలోచనలు మెదులుతాయి. ఈ విషయం కోసం అవసరమైన సమాచారాన్ని పొందడానికి మీరు ఇంటర్నెట్లో సర్ఫింగ్ను ప్రారంభిస్తారు.

అయితే, ఇంటర్నెట్లో మీకు లభించే సమాచారం పూర్తిగా తప్పయినది కావచ్చు, కావున అలాంటి సమాచారాన్ని మీరు పూర్తిగా నమ్మలేరు. కానీ, ఇప్పుడు బరువు నష్టం కోసం మీరు ఎలాంటి మార్గాన్ని వెతుకుతారు ? దానికి గల సరైన సమాధానమే సహజసిద్ధమైన ఆయుర్వేద మార్గము !

Did You Know About These 9 Ayurveda Tips For Weight Loss

ఆయుర్వేద మీ శరీర బరువు తగ్గడానికి సరళమైన, సులభమైన సహజ చిట్కాలను మీకు అందిస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఖరీదైన మాత్రల జోలికి, బరువును తగ్గించే వ్యాయామాలపై దృష్టిని పెట్టవలసిన అవసరం లేదు. మీరు ఏ రకమైన సప్లిమెంట్స్ను ఉపయోగించవలసిన అవసరం లేదు. మీరు ఆకలితో అలమటించవలసిన అవసరం కూడా లేదు.

ఆయుర్వేదం అనేది సహజ పద్ధతుల్లో, సహజ మార్గంలో మీ బరువును తగ్గించే చిట్కాలపై పూర్తిగా దృష్టిని పెడుతుంది. ఈ వ్యాసంలో, మీ శరీర బరువును కోల్పోవటానికి 9 ఉత్తమమైన ఆయుర్వేద చిట్కాలను మీకు అందిస్తుంది. ఈ చిట్కాలను మీరు అనుసరించినట్లయితే మీరు ఏ సమయంలో అయినా మీ శరీరంలో ఉన్న అదనపు కొవ్వుకి చెక్ పెట్టగలరు.

నిమ్మకాయ జ్యూస్ + వెచ్చని నీరు :-

నిమ్మకాయ జ్యూస్ + వెచ్చని నీరు :-

తాజా నిమ్మరసానికి ఒక గ్లాసు వెచ్చని నీటిని కలిపి తీసుకోవడం ద్వారా మీ రోజును ప్రారంభించండి. ఇది మీ ప్రేగులను యాక్టివేట్ చేస్తుంది. వెచ్చని నీరు + నిమ్మరసం మీ జీర్ణవ్యవస్థను పూర్తిగా మెరుగుపరుస్తాయి, అలాగే మీరు మీ రోజును ప్రారంభించినప్పుడు తాజాగా అనుభూతిని పొందేలా చేస్తాయి.

ధ్యానం తప్పనిసరి :-

ధ్యానం తప్పనిసరి :-

మీరు ధ్యానం (లేదా) యోగా చెయ్యడానికి - శాంతియుత, ప్రశాంతమైన వాతావరణం అనేది కేవలం సూర్యోదయం అయినప్పుడు మాత్రమే ఉంటుంది కాబట్టి అదే మీకు అనుకూలమైన సమయం. మీ శరీరాన్ని & మనస్సు విశ్రాంతిగా ఉంచడం కోసం మీరు 10-15 నిమిషాల పాటు ధ్యానము చేయండి. ధ్యానం, మీ మనస్సును మాత్రమే ఉపశమనపరచటం కాకుండా, మీ బరువు పెరగటానికి ముఖ్యమైన కారణాలలో ఒకటైన ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది,

మీ పనిలో మరింత శ్రద్ధను & దృష్టిని ప్రేరేపించేలా చెయ్యడంలో సహాయపడుతుంది. అవసరమైన పరిస్థితులలో మీరు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ధ్యానం బాగా సహాయపడుతుంది.

సీజన్ ప్రకారం వచ్చే పండ్లను తినండి :-

సీజన్ ప్రకారం వచ్చే పండ్లను తినండి :-

ప్రకృతి మనకు ప్రతి సీజన్లో పండ్లను & కూరగాయలు పుష్కలంగా అందిస్తుంది. ఉదాహరణకు :- వేసవిలో మనము వేడితాపాన్ని తట్టుకునేలా ఉండేందుకు ఈ ప్రకృతి మనకు తాజా శక్తిని అందిచేలా సహాయపడే కార్బోహైడ్రేట్ కంటెంట్తో ఉన్న పండ్లను మనకి అందించి మన శక్తిని పెంచడమే కాక, మనల్ని మరింత కూల్గా కూడా ఉంచుతుంది.

వాకింగ్ తప్పనిసరి :-

వాకింగ్ తప్పనిసరి :-

మీరు అధిక మొత్తంలో భోజనాన్ని తీసుకున్న తర్వాత కొంచెం దూరం నడవటంపై దృష్టిని పెట్టండి. మీరు తక్కువ దూరాలు ఇలా నడవటం వల్ల పెరిస్టాలిసిస్ & జీర్ణక్రియను ప్రోత్సహించడానికి ఒక గొప్ప మార్గంగా ఉంటుంది. మీరు మధ్యాహ్నం భోజనం తర్వాత కొంత దూరం వరకు నడక సాగించటం మంచిది. సగటు వేగంతో మీరు సుమారుగా 10-20 నిమిషాల పాటు నడవడం చాలా మంచిది. మీ జీర్ణక్రియను మరింత మెరుగుపరచడానికి, 10 నిమిషాల నడక తర్వాత మీరు ఎడమ వైపుకు తిరిగి పడుకోవడం చాలా మంచిది.

తగు సమయానికి భోజనం చెయ్యండి :-

తగు సమయానికి భోజనం చెయ్యండి :-

ఒక రోజులో 3 పూటలు మాత్రమే భోజనం చేయడం వల్ల మీ శరీరంలో ఉన్న అధిక బరువును తగ్గించుకోవడానికి సహాయపడుతుంది. ఇలా కాకుండా మీకు నచ్చిన సమయంలో కోరిన పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల, మీ శరీరంలోనికి అవసరంలేని కేలరీలు అధికమొత్తంలో చేరటంవల్ల మీ శరీర బరువు పెరిగేలా ప్రేరేపిస్తుంది. కావున ఈ అలవాటును మీరు మానుకోవాలి.

మధ్యాహ్నం 12-2 గంటల మధ్యలో మీరు అధిక మొత్తంలో ఆహారాన్ని తీసుకోవచ్చు. అలా అని మీరు మీ అల్పాహారాన్ని మాత్రం దూరం చేయవద్దు ఎందుకంటే మీ రోజును ప్రారంభించడంలో మీరు తీసుకునే మొదటి భోజనం ఇది. కాబట్టి మీరు అల్పాహారాన్ని తీసుకోవడం వల్ల ఆ రోజంతా శక్తివంతులుగా ఉంటూ, బాగా పనిచేయగలుగుతారు. ఉదయం 8-9 గంటల మధ్యలో మీ అల్పాహారం ఉండేటట్లుగా నిర్ధారించుకోండి.

మీరు ఎక్కువగా నీటిని తాగండి :-

మీరు ఎక్కువగా నీటిని తాగండి :-

మీ శరీర బరువు తగ్గడానికిగానూ, మీ శరీరంలో నీటి స్థాయిలను అతిగా పెంచడమనేది అత్యంత ప్రభావవంతమైన చిట్కాలలో ఒకటి. ప్రతిరోజూ మీరు కనీసం 8 - 10 గ్లాసుల నీటిని తాగాలి. భోజనానికి ముందు నీరు తాగటం వల్ల మీ ఆకలిని నియంత్రించడానికి సహాయపడుతుంది.

మీరు మినరల్ వాటర్ కంటే, సాధారణమైన నీటిని తాగడానికి ఉపయోగించండి ఎందుకంటే ఇవి ఎటువంటి ఫ్లవర్స్ను కలిగి ఉండవు. మీరు శరీర బరువును కోల్పోయే క్రమంలో అన్ని రకాల పానీయాలు కన్నా మొట్టమొదటి స్థానంలో రంగు, రుచి లేని ఈ సహజమైన నీరే అధిక ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. అలాగే ఇది సహజసిద్ధంగా అని చోట్ల కూడా లభిస్తుంది.

త్వరగా పడుకొని, త్వరగా లేవాలి :-

త్వరగా పడుకొని, త్వరగా లేవాలి :-

మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంతో పటిష్టమైన శరీర నిర్మాణాన్ని కలిగి ఉండాలని కోరుకుంటే ఈ పాత సామెతను తప్పక ఆచరించాలి. అది

"ఒక వ్యక్తి ఆరోగ్యంగా, దీర్ఘాయుష్షును కలిగి ఉండటానికి రాత్రిళ్ళు త్వరగా పడుకొని, తెల్లవారుజామునే త్వరగా నిద్ర లేవాలి" !

మీ అమ్మమ్మలు తాతయ్యలు వారి నడి వయస్సులో కూడా పటిష్టమైన శరీరాన్ని కలిగి, ఎలా ఆరోగ్యంగా ఉన్నారో అని - మీకు ఆశ్చర్యం కలగక మానదు. వారు పాటించే రోజువారి కార్యాచరణను మీరు గమనించినట్లయితే, వాళ్ళు రాత్రిళ్ళు త్వరగా నిద్ర పోయి - తిరిగి వేకువజామునే లేస్తారు. కానీ మీరు దీనికి విరుద్ధంగా, టీవీలను చూస్తూ / ఆన్లైన్లో మీ స్నేహితులతో చాట్ చేస్తూ రాత్రిళ్ళు చాలా ఆలస్యంగా నిద్రపోతారు.

English summary

Did You Know About These 9 Ayurveda Tips For Weight Loss

Did you know you can lose weight naturally by following 9 Ayurveda tips? Drink lemon juice and warm water after you wake up, walk, exercise & meditate regularly, eat according to the season, relish all 6 tastes in your everyday diet, drink water in abundance, also sleep and wake up early. These are the simplest and easiest natural tips for weight loss.
Story first published: Wednesday, July 25, 2018, 16:15 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more