For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నీటిని ఎక్కువగా తీసుకోవడం వలన ఊబకాయం తగ్గుతుందా?

నీటిని ఎక్కువగా తీసుకోవడం వలన ఊబకాయం తగ్గుతుందా?

|

నీరు మన దాహాన్ని సంతృప్తి పరచడమే కాకుండా, మన శరీరంలోని అనేక ముఖ్యమైన పాత్రలని పోషిస్తుంది కూడా. మన శరీరంలో 60 శాతం కంటే ఎక్కువగా నీరు ఉంటుంది. అనగా మన శరీరం లోని దాదాపు ప్రతి భాగం కొంతమేర నీటిని కలిగి ఉన్నట్లు సూచిస్తుంది. అది మన అంతర్గత అవయవాలు, కండరాలు, ఎముకలు, చర్మం, లేదా మన వెంట్రుకలు అలా ఏమైనా కావొచ్చు. వీటన్నిటి నిర్వహణకు మరియు తయారీకి, అన్నింటికి నీటి అవసరం ఉంటుంది.

నీరు సాధారణంగా మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు మన శరీరానికి కావలసిన ఒక ముఖ్యమైన వనరుగా ఉంది. శరీర జీవక్రియను మెరుగుపరచడమే కాకుండా, ముక్కు సమస్యలను తగ్గిస్తుంది మరియు మలబద్ధకాన్ని సైతం నిరోధిస్తుంది. అందుకనే పెద్దలు చెప్తూ ఉంటారు. రోజుని గ్లాసుడు నీళ్ళతో మొదలుపెట్టమని.

Does Increasing Water Intake Aid Weight Loss?,

నీటి రసాయన సూత్రం హెచ్2ఓ, అనగా రెండు హైడ్రోజన్ మరియు ఒక ఆక్సిజన్ అణువుల సమ్మేళనం. అందుచే ఎక్కువ నీరు తీసుకోవడం మూలంగా మన శరీరానికి ఆక్సిజన్ సరఫరా సమృద్ధిగా ఉంటుంది.

నీరు మన జీవితంలో ముఖ్యమైన భాగం కాబట్టి, అది ఊబకాయం తగ్గించడంలో సహాయపడుతుందా? ఇప్పుడు చూద్దాం.

నీరు శరీర జీవక్రియను మెరుగుపరుస్తుంది:

నీరు శరీర జీవక్రియను మెరుగుపరుస్తుంది:

మన జీర్ణాశయ వ్యవస్థ నీరు మరియు ఆహారాన్ని ఒకే విధంగా పరిగణిస్తుంది. దీని అర్థం కడుపుకి ఆహారం జీర్ణం కావడమే ముఖ్యం. ఎక్కువ నీరు తీసుకోవడం అంటే జీర్ణ వ్యవస్థ యొక్క పనితీరుని పెంచడమే అవుతుంది. అనగా పునరావృతo అవుతూనే ఉంటుంది. తద్వారా జీర్ణక్రియ మెరుగవుతుంది. దీనిని "ఆహార ప్రేరేపిత థర్మోజెనిసిస్" గా సూచిస్తారు. ఈ పద్దతి శరీర జీవక్రియను పెంచడమే కాకుండా ఊబకాయం తగ్గడంలో సహాయం చేస్తుంది.

అనేక అధ్యయనాలలో ఆహారంలో భాగంగా 0.5లీటర్ల నీటిని త్రాగటం మూలంగా 23 అదనపు కేలరీలు కరిగినట్లుగా ఫలితాలు చూపించాయి. అందువల్ల, మీరు ప్రతిరోజూ తగినంత నీరు త్రాగడానికి అలవాటు చేసుకుంటే, బరువు తగ్గించే ప్రక్రియలో మీకు సహాయపడుతుంది మరియు మీ జీవక్రియ పెరుగుతుంది. కాబట్టి మీరు రోజులో త్రాగే నీటి మొత్తాన్ని పెంచడం ద్వారా శరీరంలోని అదనపు కాలరీలను కరిగించవచ్చు.

ఆకలిని నియంత్రిస్తుంది:

ఆకలిని నియంత్రిస్తుంది:

మీ భోజనం ముందు తాగే నీరు మీ ఆకలిని నియంత్రిస్తుంది. ప్రతి భోజనానికి ముందు కనీసం 400 మల్లీలీటర్ల నీటిని త్రాగాలి, తద్వారా ఆహారం అతిగా తీస్కోకుండా నిరోధిస్తుంది. అనగా మీరు తక్కువ కాలరీలను తీసుకున్నారని అర్ధం. క్రమంగా ఈ పద్దతి బరువుని తగ్గించడంలో ఎంతగానో దోహదం చేస్తుంది.

ఆహారంలో సరైన నీటి మొత్తాన్ని తీసుకోవడం మూలంగా, ఇతర భారీ పానీయాలైన సోడా మరియు కాఫీ వంటి వాటి నుండి దూరంగా ఉండగలుగుతారు. వాటి పైకి మనసెళ్ళకుoడా నిరోధించగలుగుతుంది. నీటికి బదులుగా అధిక కేలరీల పానీయాలను భర్తీ చేస్తే కేలరీల నిష్పత్తి ఊహించని రీతిలో పెరిగిపోయి అనేక సమస్యలకు కారణమవుతుంది. ఉదాహరణకు ఫాస్ట్ ఫుడ్ తో కార్బోనేటేడ్ డ్రింక్స్ తీసుకోవడం వంటివి.

ఒకవేళ సాదా నీటిని తీసుకోడానికి సుముఖంగా లేని ఎడల, నీటిలో నిమ్మకాయ మరియు తేనె జోడించడం ద్వారా రుచికి ఆటంకం లేకుండా ఉంటుంది. నిమ్మకాయ నుండి విటమిన్ సి అదనపు ప్రయోజనం ఉంటుంది.

వ్యాయామంలో మీకు సహాయం చేస్తుంది :

వ్యాయామంలో మీకు సహాయం చేస్తుంది :

నీరు ప్రాణవాయువును, కండరాలు మరియు మెదడుకు సరఫరా చేస్తూ వాటిని ఉత్తేజంగా ఉంచడంలో సహాయం చేస్తుంది. కావున వ్యాయామం సమయంలో తగినంత నీరు త్రాగటం మంచిది. తద్వారా డీహైడ్రేషన్ వంటి సమస్యల నుండి బయటపడవచ్చు కూడా.

వ్యాయామం సమయంలో నీటిని సరిగ్గా తీసుకోని వారికి కళ్ళు తిరగడం, ఆరోగ్య సమయాలు రావడం మనం చూస్తూనే ఉంటాం. దీనికి కారణం డీహైడ్రేషన్ లేదా మెదడుకు, కండరాలకు సరైన ఆక్సిజన్ సరఫరా లేకపోవడమే.

మీ శరీరంలోని నీటి శాతo రెండు శాతం తగ్గినప్పుడు డీహైడ్రేషన్ వస్తుంది. ఇది మీ శరీరాన్ని అలసటకు గురిచేస్తుంది. తద్వారా వ్యాయామంలో సరైన ఫలితాలను కూడా పొందలేరు.

శరీరానికి తగినంత నీటిని అందివ్వడం ద్వారా కణాలు మరియు కణజాలాలు చక్కగా పనిచేస్తాయి. మరియు కండరాల సమస్యలు రాకుండా, ఉత్తేజంగా ఉంచడంలో దోహదం చేస్తుంది. కావున వ్యాయామంలో నీటిని భాగం చేయడం తప్పనిసరి.

నీరు మీ శక్తిని పెంచుతుంది:

నీరు మీ శక్తిని పెంచుతుంది:

ఒక్కోసారి శరీరం డస్సిపోతున్న అనుభూతికి లోనవుతూ ఉంటుంది, దీనికి కారణం శరీరంలో తగినంత నీరు లేకపోవడమే. తద్వారా వ్యాయామం సెషన్ల సమయంలో మీరు శ్రద్ధ చూపలేకపోవచ్చు. కాబట్టి ఇకనుండి వ్యాయామం చేసే సమయంలో, చివరి సారిగా మీరు నీళ్ళు ఎప్పుడు తాగారు అని మనసులో ఉంచుకోండి. అవసరాన్ని బట్టి, టైమర్ వంటివి సెట్ చేసుకోవడం ద్వారా అయినా నీటిని తీసుకోవడం అలవాటుగా చేసుకోండి.

మీరు ఒక రోజులో కనీసం 8 కన్నా ఎక్కువ గ్లాసుల నీటిని త్రాగిన ఎడల, మీ శరీరం ఆక్సిజన్ మరియు పోషకాలతో సమృద్దిగా ఉంటుంది.

 ఎంత నీరు త్రాగాలి?

ఎంత నీరు త్రాగాలి?

నీటి అవసరం అనేది వాతావరణం మరియు వ్యక్తుల వివిధ జీవనశైలి మీద ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైనా రోజులో కనీసం సగటున 1.5 లీటర్ల నీటిని తరచుగా తీసుకోవలసినదిగా సిఫార్సు చేస్తారు.

చురుకుగా మరియు క్రమబద్ధమైన వ్యాయామం చేసే వ్యక్తులకు ఎక్కువ నీరు అవసరం కావచ్చు. అదేవిధంగా, మీరు ఎండలో ఎక్కువసేపు తిరుగుతూ ఉన్నట్లయితే, శరీరం నుండి చమట రూపంలో నీరు బయటకు వెళ్ళడం కారణంగా శరీరం డీహైడ్రేషన్ కు గురి కావొచ్చు. కావున, ఎండలో బయటకు వెళ్ళునప్పుడు కనీసం ఒక వాటర్ బాటిల్ ఉంచుకొనవలసినదిగా సూచిస్తుంటారు. శీతల వాతావరణంలో నివసించేవారు, వేడి వాతావరణంలో నివసించే వారి కంటే తక్కువ నీటి అవసరాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా వేసవి కాలంలో గంటకొకసారి కనీసం గ్లాసుడు నీళ్ళు లేదా మజ్జిగ తాగమని మన పెద్దలు చెప్తూనే ఉంటారు. తద్వారా శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా తట్టుకోగలుగుతుంది. డీహైడ్రేషన్ సమస్యలు వడదెబ్బ వంటి తీవ్రమైన సమస్యలకు కారణభూతమవుతాయి. ఒక్కోసారి ఇవి ప్రాణాంతకం కూడా కావొచ్చు. మరియు వేసవి కాలంలో నీళ్ళకు బదులుగా శీతల పానీయాల వైపుకు మొగ్గు చూపుతూ ఉంటారు. కొన్ని ప్రదేశాలలో ఆయా వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వారికి ఎటువంటి ప్రతికూల ప్రభావాలు కనపడకపోవచ్చు. కానీ, మనలాంటి ఉష్ణ మండలాల్లో శీతల పానీయాలు కొత్త సమస్యలను తెచ్చిపెడుతుంటాయి. తాత్కాలిక ఉపశమనం ఇచ్చినా, ఊబకాయం, మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యలకు ప్రధాన కేంద్రంగా తయారవుతాయి. మరియు డీహైడ్రేషన్ తరచుగా గురవడానికి కూడా కారణమవుతాయి. శీతలపానీయాలే కాకుండా కాఫీ వంటి కేఫీనేటెడ్ పానీయాలు కూడా ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు. ఒకవేళ నీటికి ప్రత్యామ్నాయంగా కోరుకున్న ఎడల పండ్ల రసాలను ఎంచుకోవచ్చు.

మీరు దాహంతో ఉన్నప్పుడు లేదా కొంచెం ఆకలితో ఉన్నప్పుడు నీటిని మాత్రమే త్రాగాలి. అలా కాకుండా కొందరు కార్బోనేటెడ్ లేదా ఇతర భారీ పానీయాలకు మొగ్గు చూపుతుంటారు. ఇవి సమస్యను తీర్చకపోగా శరీరాన్ని సమస్యల పాలు చేస్తుంది. కొన్నిసార్లు శరీరానికి ఆకలి, దాహానికి మద్య గందరగోళం నెలకొంటుంది; ఆహారం తీసుకున్న కొద్దిసేపటి తర్వాత మరలా ఆకలిగా అనిపిస్తే స్నాక్స్ తీసుకునే కన్నా నీళ్ళను తీసుకోవడం ఉత్తమం. స్నాక్స్ తీసుకోవడం వంటి అలవాట్లు, క్రమంగా మీ శరీరంలో కాలరీల సంఖ్య పెరగడానికి దారితీస్తుంది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో లేదా ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆరోగ్య సంబంధిత వివరాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి.

English summary

Does Increasing Water Intake Aid Weight Loss?

Water is one of the important elements of our body and we also need it when thirsty. Can increasing the water intake also help in weight loss? Yes, this is true! It increases our metabolism rate, controls our appetite preventing us from overeating, reduces the calorie intake, and provides oxygen to our body and brain that helps better performance during a workout.
Desktop Bottom Promotion