For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ వ్యాయామ చిట్కాల ద్వారా మీ ముఖంలో ఉన్న కొవ్వుని తగ్గించుకోవచ్చు :

By R Vishnu Vardhan Reddy
|

కొవ్వు ఎక్కువగా ఉన్న మీ ముఖాన్ని అద్దంలో చూసుకొని విసుగు చెందారా లేక కలత చెందారా ? ఆలా అయితే ఈ వ్యాసం మీకోసం. ఇప్పుడు చెప్పబోయే వ్యాయామాల ద్వారా చాలా సులభమైన పద్ధతుల్లో మీ ముఖం లో ఉన్న కొవ్వుని తీసివేయవచ్చు. కొంతమంది వ్యక్తులు యోగా ద్వారా లేదా లైపోసక్షన్ అనే చికిత్స ద్వారా కూడా ముఖంలో ఉన్న కొవ్వుని తీసివేయించుకుంటుంటారు. యోగా ఇందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కానీ, ఫలితాలు రావడానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది మరియు లైపోసక్షన్ కూడా ఇందుకు పనిచేస్తుంది, కానీ, ఫలితాలు అంత ఆశాజనకంగా ఉండటం లేదు.

ముఖంలో మరీ ఎక్కువ కొవ్వు ఉన్నట్లైతే ఈ విషయం కొంతమంది వ్యక్తులను ఇది విపరీతంగా బాధిస్తూ ఉంటుంది. ఏదైనా వృత్తిలో శరీరాకృతి బాగా ఉండాల్సి వచ్చినట్లైతే, అటువంటి వృత్తులకు ఇటువంటి వ్యక్తులు చాలా దూరంగా ఉంటారు. ముఖం చాలా లావుగా ఉండి, మిగతా శరీరం చాలా సన్నగా ఉన్నట్లయితే, మీ గురించి ఇతరులు అవహేళనగా మాట్లాడే అవకాశం ఉంది. అంతేకాకుండా మీరు అందవిహీనంగా కనపడతారు. మీ ముఖంలో ఉన్న కొవ్వుని తీసివేయడానికి, ఆ కొవ్వుని తగ్గించడానికి మీరు చాలా సులభమైన చిట్కాలు పాటించాల్సి ఉంది. ఇందుకోసం మీరు కొన్ని ఉత్తమమైన ముఖానికి సంబంధించిన వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ చిట్కాలు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా మీరు మీ ముఖం నుండి కొవ్వుని తీసివేయాలని భావిస్తున్నట్లైతే అందుకోసం మీరు చాలా సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఎందుచేతనంటే, బరువు తగ్గే విషయంలో మిగతా శరీర భాగాలతో పోల్చి చూసినప్పుడు ముఖంలో ఉండే కండరాలు చాలా సున్నితంగా ఉంటాయి మరియు అంత శక్తివంతంగా కూడా ఉండవు.

ముఖం నుండి కొవ్వుని తీసివేయడానికి అవసరమైన వ్యాయామాలు ఏంటి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

 ముఖానికి సంబంధించిన యోగా :

ముఖానికి సంబంధించిన యోగా :

ముఖానికి సంబంధించిన యోగా చేయడం ద్వారా మీ ముఖంలో ఉన్న కొవ్వుని తగ్గించుకోవచ్చు. ఇందుకు ఇది ఉత్తమంగా పనిచేస్తుంది. కానీ, ఈ ప్రక్రియ చాలా నిధానమైనది. ఇందుకోసం మీరు చేయాల్సిన పని ఏమిటంటే, ప్రతిరోజూ పదినిమిషాల పాటు ముఖానికి సంబంధించిన యోగాని చేయండి. ఇలా చేయడం ద్వారా మీ ముఖంలో ఉండే కొవ్వుని తీసేయవచ్చు.

ఫేషియల్స్ కూడా ఇందుకు ఎంతగానో ఉపయోగపడతాయి :

ఫేషియల్స్ కూడా ఇందుకు ఎంతగానో ఉపయోగపడతాయి :

మీరు క్రమం తప్పకుండా ఫేషియల్స్ గనుక చేపించుకున్నట్లైతే, మీ ముఖం నుండి కొవ్వుని తీసి వేయవచ్చు. ఫేషియల్స్ చేయించుకోవడం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది మరియు ముఖంలో ఉన్న కొవ్వుని కరిగించడానికి కూడా అది ఎంతగానో ఉపయోగపడుతుంది.

X మరియు O యొక్క విపరీతమైన శక్తి :

X మరియు O యొక్క విపరీతమైన శక్తి :

ముఖంలో ఉన్న కొవ్వుని కరిగించడం అంత సులభమైన ప్రక్రియ ఏమీకాదు. ఇందుకోసం మీరు X మరియు O ఆకారంలో, రోజుకి 15 నిమిషాల పాటు వ్యాయామం చేయండి. ఇలా చేసే క్రమంలో రెండు చిన్న విరామాలు తీసుకోండి. ఇలా చేయడం ద్వారా మీ ముఖం లో ఉన్న కొవ్వుని తగ్గించుకోవచ్చు.

బబుల్ గమ్ ని నమలడం ద్వారా :

బబుల్ గమ్ ని నమలడం ద్వారా :

ముఖం లోపల ఉన్న కొవ్వుని తగ్గించే చిట్కాలలో బబుల్ గమ్ ని నమలడం కూడా ఒకటి. బబుల్ గమ్ ని నమలడం వల్ల మీ దవడలకు విపరీతమైన వ్యాయామం జరుగుతుంది. దీనివల్ల కొవ్వు కూడా తగ్గుతుంది.

నోటి లోపలే మీ యొక్క నాలుకను గుండ్రటి ఆకారంలో తిప్పండి :

నోటి లోపలే మీ యొక్క నాలుకను గుండ్రటి ఆకారంలో తిప్పండి :

రోజుకి పది నిమిషాల పాటు నోటి లోపలే మీ యొక్క నాలుకను గుండ్రటి ఆకారంలో తిప్పడం ద్వారా, ముఖంలో ఉన్న కొవ్వు పూర్తిగా తగ్గిపోతుంది. ముఖంలో కొవ్వుని తగ్గించే ఈ వ్యాయామ చిట్కాల వల్ల మొదట్లో అవి మనకు బాధించవచ్చు. కానీ, కేవలం 6 వారాల్లోనే మీ యొక్క ముఖ ఆకృతిని మార్చి అందంగా కొవ్వు లేకుండా చేయడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.

తరచూ అలక బూనండి :

తరచూ అలక బూనండి :

మీరు ఎప్పుడైనా మీ భాగస్వామితో చిత్రం తీసుకుంటున్నట్లైతే, ఆ సమయంలో అలక బూనినట్లు మీ ముఖాన్ని పెట్టండి. మీ ముఖాన్ని తరచూ ఇలా అలక బూనేలా పెట్టడం ద్వారా లేదా దీనినే ఒక అలవాటుగా మార్చుకోవడం వల్ల మీ ముఖంలో కొవ్వుని తగ్గించుకోవచ్చు.

నవ్వడం ద్వారా ముఖంలో కొవ్వు తగ్గుతుంది :

నవ్వడం ద్వారా ముఖంలో కొవ్వు తగ్గుతుంది :

చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, నవ్వడం వల్ల ముఖంలో కొవ్వుని తగ్గించుకోవచ్చు. ముఖంలో ఉన్న కొవ్వుని తగ్గించుకోవడానికి ఉండే ఉత్తమమైన వ్యాయామ చిట్కాల్లో ఇది కూడా ఒకటి. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా ఏమిటంటే, నవ్వడం. ఇది చాలా సులభం కదా, మరి ప్రయత్నించండి.

నోటి ద్వారా గాలిని బయటకు వదలడం :

నోటి ద్వారా గాలిని బయటకు వదలడం :

గాలిని ముక్కుల ద్వారా తీసుకొని, నోటి ద్వారా వదలండి. రోజుకు రెండు సార్లు ఇలా చేయడం వల్ల మీ ముఖంలో ఉన్న కొవ్వు మాయం అవుతుంది.

క్రింది పెదవుల సహాయం తీసుకోండి :

క్రింది పెదవుల సహాయం తీసుకోండి :

ముఖంలో నుండి కొవ్వుని తీసివేయాలని భావించినట్లైతే, ఈ బరువు తగ్గించే చిట్కాను ప్రియత్నించండి. మీరు ఎప్పుడైతే పని చేస్తుంటారో ఆ సమయంలో మీ క్రింది పెదవిని ఉపయోగించి పై పెదవిని గట్టిగా నొక్కి పట్టుకోండి. రోజులో 10 నిమిషాల పాటు ఇలా చేయండి.

కళ్ళు ఆర్పడం :

కళ్ళు ఆర్పడం :

ఒకదాని తరవాత ఒకటి, కళ్ళను ఆర్పడం ద్వారా మీ ముఖంలోని కొవ్వుని తీసివేయవచ్చు. ఇది కూడా మంచి వ్యాయామమే. అయితే ఇలా చేస్తున్నప్పుడు మీ చుట్టుపక్కల ఎవ్వరూ లేకుండా చూసుకోండి.

English summary

Remove Fat From Face | Losing Fat From Face | Exercise Tips To Lose Fat From Face

Tired of looking into the mirror and seeing a fat face? Well, with these exercises, you can now remove the fat from your face in simple ways.. There are some people who have tried to lose fat from the face through means of yoga and liposuction too. The former will work but the process is slow and the latter will work too, but the end results are poor.
Story first published:Saturday, March 3, 2018, 15:02 [IST]
Desktop Bottom Promotion