For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  బరువు తగ్గడం ఎందుకు అంత కష్టంగా ఉంటోంది?

  By Telugu Samhitha
  |

  నేటి వేగవంతమైన రోజువారీ జీవితంలో ఆరోగ్యంగా ఉండటం అత్యంత అవసరం.

  అనారోగ్యం, కాలం యొక్క రేసులో మిమ్మల్ని వెనక్కి నెట్టవచ్చు. ప్రతి ఒక్కరూ ఒక మంచి సంతృప్తికరమైన జీవితానికై పోరాడుతూ ఉంటారు. కొందరు ప్రజలు ఆరోగ్యకరంగా ఉన్నప్పటకీ సాధారణంగా అధికంగా తినడం లేదా ఊబకాయం వంటి లక్షణాలను కలిగి ఉంటారు. కానీ వాస్తవంగా చెప్పాలంటే ఊబకాయం అనేది కేవలం అతిగా తినడం అనే అంశానికి మాత్రమే పరిమితమా?

  దీనికి సమాధానం 'కాదు' అనే చెప్పాలి. అతడు లేదా ఆమె రోజువారీ బరువు తగ్గే ప్రయత్నాల యొక్క ప్రణాళికలతో ఉన్నప్పటికీ, అధిక బరువుకు అనేక కారణాలు ఉండవచ్చు.

  Why Is It So Hard To Lose Weight?

  21 వ శతాబ్దంలో బరువు తగ్గడం అనేది ఎంతో క్లిష్టమైన సమస్యగా మనిషి జీవితానికి దారితీస్తోంది. ఇది ఒక మనిషి యొక్క వ్యక్తిగతం లేదా వృత్తి పరమైన అంశాల కారణంగా ఉంది. నేటి తరం ప్రజలు తమ కార్యకలాపాలు, రోజువారీ దైనందిన సమయంలో ఆహార నియమాల విషయంలోనూ, లేదా ఆరోగ్యకరంగా జీవించడానికి అవసరమయ్యే ఆచరణల విషయంలోనూ ఎంతో నిర్లక్ష్యం చేస్తున్నారు.

  మీ రోజువారీ జీవితంలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేయడం వలన బరువు తగ్గడానికి మీరు పడే కష్టాలకు బదులుగా పొందే ఫలితాలను చూసి మీరు ఆశ్చర్యానికి గురికావచ్చు.

  Why Is It So Hard To Lose Weight?

  మీ వైఖరిని బరువు తగ్గే ఉపకరణాల వైపుగా ఎలా మళ్ళించవచ్చు?

  బరువు తగ్గడానికి చేసే ప్రయత్నంలో ఇతరుల సూచనలను ఆచరించినంత మాత్రాన ఫలితం లేదు. దానితో పాటుగా ఇతర ప్రేరణా మూలాలను కూడా అంతర్గతంగా అభివృద్ధి చేసుకోవడం అవసరం.

  మీ శరీరంలో అదనంగా ఉన్న బరువుని వాస్తవంగా ఎందుకు మీరు కోల్పోవాలనుకుంటున్నారు అనే దాని గురించి మీకు స్పష్టమైన అవగాహన లేదు అన్న విషయం ఒక కష్టతరమైన వాస్తవం.

  ఒక పరిపూర్ణ శరీరాకృతిని సాధించడానికి మీ యొక్క బరువు తగ్గాలనుకునే లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో కావాల్సిన నిరీక్షణకు అవసరమైనంత సహనాన్ని కలిగి ఉండాలి.

  రోజువారీ వ్యాయామ ఆచరణా క్రమాన్ని రికార్డు చేసుకోవడానికి ఒక పుస్తకాన్ని ఉంచుకోవడం ద్వార అది మీ లక్ష్యానికి ప్రతి రోజు స్వల్ప క్రమంలో మిమ్మల్ని ఎలా ముందుకు తెసుకువెల్తుందో పరిశీలించడానికి ఒక ఖచ్చితమైన మార్గంగా ఉంటుంది.

  Why Is It So Hard To Lose Weight?

  సమతుల్యత కలిగిన తక్కువ కేలరీల ఆహారం బరువును తగ్గించుకోవటానికి తగినంతగా సరిపోతుందా?

  బరువు తగ్గడానికి చేసే ప్రయత్నంలో సరైన ఆహార నియమాలు మాత్రమే మీకు సహాయం చేస్తాయని మీరు ఆలోచిస్తున్నట్లు అయితే అది అంగీకరించడానికి వాస్తవంగా కాస్త కష్టమే. సరైన ఆహార నియమాలు ఒంటరిగా బరువు స్థిరత్వాన్ని కొనసాగించడానికి మీకు సహాయం చేయలేవు.

  మీరు టార్గెట్ బరువు సాధించడానికి నిలకడగా వ్యాయామం చేయాలి. మీరు భారీ వ్యాయామాలను ఉపయోగించకపోయినట్లితే కనీసం తేలికపాటి వ్యాయామాలు అయినా ఖచ్చితంగా మీ రోజువారీలో వ్యాయామంలో భాగంగా ఉండాలి. నడక, జాగింగ్ లేదా స్విమ్మింగ్ కూడా మీరు పటిష్టంగా మరియు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి, తద్వారా మీ శరీరాన్ని అదనపు బరువుకు పెరగకుండా నివారించడానికి మీకు సహాయపడుతుంది.

  అసమతుల్య ఆహారం మీరు బరువు తగ్గాలి అనుకున్న లక్ష్యాన్ని ఒక పీడకలగా మార్చవచ్చు.

  మీ దినచర్యలో భాగంగా సక్రమమైన వ్యాయామం చేస్తున్నప్పటికీ మీ బరువులో మార్పు కనిపించడంలేదా? అయితే, సమాధానం అల్పాహారం, భోజనం మరియు విందు సమయంలో మీ టేబుల్ వద్ద ఏర్పాటు చేసుకునే రోజువారీ మీ మెను కావచ్చు.

  మీరు కేలరీలు తీసుకోవడం తగ్గించాలనుకుంటే కిరాణా దుకాణం వద్ద ఆహార ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నప్పుడు ఆహార లేబుల్స్ చూడటం మంచి అలవాటుగా ఉంటుంది. అంతేకాకుండా, మీ వ్యాయామాల కోసం ఒక వ్యాయామ దినచర్య పుస్తకాన్ని నిర్వహించడం మాత్రమే కాకుండా అందులో భాగంగా మీరు తీసుకునే ఆహార వివరాల్ని ఆ పుస్తకంలో క్రింద రాసుకోవాలి.

  ఇది ఒక రకమైన మార్గదర్శకాన్ని ఏర్పరుస్తుంది. అది మీ బరువు తగ్గాలనుకునే ప్రయత్నంలో సరిపడనటువంటి వాటిని మిమ్మల్ని మీరు చుసుకున్నట్లయితే అవి మీ దృష్టికి తీసుకురాగలవు.

  మీ రెగ్యులర్ విరామాల్లో భోజనాన్ని సమయానికి అనుకూలంగా చిన్న భాగాలుగా తినడం ఎల్లప్పుడూ మంచిది. ఈ పద్ధతి మీకు ఒక మంచి అలవాటుగా ఉంటుంది. అంతే కాకుండా మీరు అతిగా తినడాన్ని నివారించేందుకు సహాయం చేస్తుంది.

  Why Is It So Hard To Lose Weight?

  జంక్ ఫుడ్ త్యాగం చేయాల్సిన అవసరం.

  పిజ్జాలు, బర్గర్స్, వేపుళ్ళు మొదలైన జంక్ ఫుడ్స్ మిమ్మల్ని నోరూరించే విధంగా తప్పకుందా ఊరడిస్తాయి. కానీ వాటిపైకి మీ ధ్యాసను మళ్ళించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. అవి మీ బరువు తగ్గే కార్యక్రమానికి ఒక అవరోధం మాత్రమే కాదు, మీ జీర్ణ వ్యవస్థకు తీవ్రంగా హాని చేస్తాయి కూడా.

  రాబోతున్న వారం కోసం అయినా కనీసం ఒకసారి కూర్చుని ఒక మెనూ రుపొందించుకోవడం చాలా మంచి సలహా. ఈ విధంగా మీరు బరువు తగ్గడానికి చేసే ప్రయత్నంలో మంచి మార్గంలో వెళ్తున్నారా లేదా అని స్పష్టంగా తెలుసుకోగలరు.

  మీ జీవనశైలి సరియైనది కాకపోతే, మీరు బరువు తగ్గడానికి చేసే ప్రయత్నాలకు మాత్రమే ఆటంకాలు కలిగించడం కాకుండా మీ శరీరం యొక్క సాధారణ కార్యాచరణ కూడా భంగపడుతుంది.

  నేటి తరంలో మీరు ఉద్యోగాల్లో గంటలు గంటలు మీ డెస్క్ వద్ద కూర్చుని గడపాల్సి వస్తుంది. అది ఖచ్చితంగా మిమ్మల్ని ఊబకాయంకు గురి చేస్తుంది. మీరు దాన్ని ఎలా అధిగమించగలరు?

  సమాధానం - విరామాలను తీసుకోండి. అత్యధికమైన అంకితభావంతో పనిచేయడం చాలా అవసరం, కానీ ఖచ్చితంగా ఒక ఆరోగ్యకరమైన శరీరం కోల్పోయే పరిస్థితి వద్ద కాదు. మీ కుర్చీ నుండి నిలవండి మరియు కనీసం మూడు, నాలుగు గంటలకొకసారి చిన్న నడక నడవండి.

  చివరి మాటగా, ఒత్తిడి లేని జీవితం ప్రశాంతమైన జీవితానికి దారి తీస్తుంది. రోజువారీ ఆందోళనలు పని వద్ద లేదా ఇంట్లో మిమ్మల్ని నిరుత్సాహపరచవచ్చు, చివరికి ఇది మీ ఆరోగ్యకరమైన రోజువారీ జీవితాన్ని వదులుకోవడానికి దారితీస్తుంది. దాని మీద దృష్టి సారించడానికి ప్రయత్నించండి, తద్వారా మీరు మీ బరువు తగ్గడానికి చేస్తున్న ప్రయత్నాల నుండి విఫలం కాకుండా అది మీకు సహయం చేస్తుంది. అంతేకాకుండా మీ బరువు తగ్గించుకునే ప్రయత్నంలో అడ్డంకులను అధిగమించడానికి మరియు మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవడంలో సహాయపడగలదు.

  English summary

  Why Is It So Hard To Lose Weight?

  Why Is It So Hard To Lose Weight?,If you are wondering why it is hard to lose weight, the primary reason is unrealistic expectations! Losing weight is a process that requires patience, diligence, and the ability to be kind to yourself. So here’s everything you need to know to start off your weight-loss journey.
  Story first published: Monday, March 5, 2018, 16:30 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more