For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువు తగ్గేందుకు మహిళలు పాటించవలసిన డైట్ ఛార్ట్

బరువు తగ్గేందుకు మహిళలు పాటించవలసిన డైట్ ఛార్ట్

|

ఊబకాయం అలాగే అధిక బరువు సమస్య అనారోగ్యానికి దారితీస్తుంది. అంతేకాక, మీ ఆకృతి గురించి దిగులు కలిగిస్తుంది. మహిళలు ఆరోగ్యంగా ఉండటం ఎంతో ముఖ్యం. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నట్టుగానే ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటేనే తాను ఇంట్లో అందరి ఆరోగ్యం గురించి మరింత శ్రద్ధ వహించగలుగుతుంది. మహిళలు తగినంత బరువు ఉండేవిధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. బరువులో సమస్యలు తలెత్తితే ఆరోగ్యంపై దుష్ప్రభావం కలుగుతుంది. బాడీ మాస్ ఛార్ట్స్ ను అనుసరించి ఎంత బరువుండాలో తెలుసుకోవాలి. తద్వారా, ఆరోగ్యకరమైన బరువును మెయింటెయిన్ చేయాలి.

డైటింగ్ తో బరువును నియంత్రణలో ఉంచుకోవడం సాధ్యమే. అయితే, డైటింగ్ ను సరైన పద్దతిలో పాటించాలి. ఆకలితో కడుపు మాడ్చుకున్నంత మాత్రాన బరువు నియంత్రణలో ఉండదన్న విషయాన్ని గుర్తించాలి. ఆకలితో ఇబ్బంది పడితే ఎసెన్షియల్ ఎనర్జీ అనేది తరిగిపోతుంది. రోజువారీ పనులకు కావాల్సిన శక్తి తగ్గముఖం పడుతుంది.

Heres A Diet Chart For Women To Lose Weight

విపరీతంగా డైటింగ్ చేయడం వలన కూడా అనారోగ్యం పాలయ్యే సూచనలు కలవు. కాబట్టి, బరువు తగ్గేందుకు డైట్ లో మార్పులూ చేర్పులు చేసుకునేందుకు డైటీషియన్ సలహా గాని లేదా న్యూట్రిషనిస్ట్ ను గాని సంప్రదించడం మంచిది. ఈ విధంగా మీరు వెయిట్ లాస్ ను ఆరోగ్యకరంగా అఛీవ్ చేసే అవకాశం ఉంది. బరువు తగ్గాలనుకునే మహిళలు దృష్టిలో ఉంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను ఇక్కడ ప్రస్తావించాము. వీటిని చదివి అర్థం చేసుకుని పాటిస్తే ఆరోగ్యకరమైన పద్దతిలో వెయిట్ లాస్ ను అఛీవ్ చేయగలుగుతారు.

ఈ మధ్యకాలంలోనే అధిక బరువు సమస్యకు గురైతే మళ్ళీ తిరిగి బరువును నియంత్రణలో పెట్టుకుని సరైన ఆకృతిలోకి రావడం కాస్తంత కష్టతరమైన విషయమే. శరీరాకృతి అందంగా ఉండాలనే ఎవరైనా కోరుకుంటారు. అధిక బరువు వలన శరీరాకృతిలో తేడా రావటం సహజం. మీకు నచ్చిన దుస్తులను ధరించలేరు. కాబట్టి, డైటింగ్ ద్వారా బరువును నియంత్రణలో ఉంచుకోవటం తప్పనిసరి. లైఫ్ స్టైల్ ను అనుసరించి డైట్ లో మార్పులూ చేర్పులూ చేసుకోవాలి. వెయిట్ లాస్ కోసం ఫ్యాన్సీ డైట్ ను పాటిస్తే లాభం లేదు. అనారోగ్యం పాలయ్యే సూచనలు కూడా కలవు.

ఫ్యాట్ పేరుకుపోవటానికి ఏ కారకాలు దారితీస్తున్నాయి తెలుసుకోవడం ముఖ్యం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అదనపు కేలరీలను కరిగించాలి. బాలన్స్డ్ డైట్ ను తీసుకోవాలి. ఈ క్రింద వివరించబడిన టిప్స్ మహిళలకు వెయిట్ లాస్ కోసం తోడ్పడతాయి.

1. మీల్స్ ను స్కిప్ చేయకండి:

1. మీల్స్ ను స్కిప్ చేయకండి:

వెయిట్ తగ్గేందుకు డైట్ ఛార్ట్ అనేది మహిళలకు ఉపయోగపడకపోవటానికి మీల్స్ ను స్కిప్ చేయడం ప్రధాన కారణం. మీల్స్ ను స్కిప్ చేయడం వలన బరువును తగ్గవచ్చన్నది కేవలం అపోహ మాత్రమే. నిజానికి, మీల్స్ ను స్కిప్ చేయటం వలన ఆకలి విపరీతంగా పెరగటంతో ఎదో ఒక అనారోగ్యకర ఆహారాన్ని తీసుకోవటం ప్రారంభిస్తారు. ఆ విధంగా, మీ వెయిట్ లాస్ గోల్స్ కు ఆటంకం ఎదురవుతుంది.

2. తరచూ ఆహారాన్ని తీసుకోవటం :

2. తరచూ ఆహారాన్ని తీసుకోవటం :

చిన్న చిన్న మోతాదులో ఆహారాన్ని తరచూ తీసుకోవటం ద్వారా వెయిట్ లాస్ గోల్ అనేది నెరవేరుతుంది. ఆకలితో ఇబ్బంది పడకండి. తరచూ, స్నాక్స్ లేదా ఫ్రూట్స్ ను తీసుకుంటూ ఉండండి.

3. ఇంటి ఆహారానికే ప్రాధాన్యతనివ్వండి:

3. ఇంటి ఆహారానికే ప్రాధాన్యతనివ్వండి:

ఇంటి ఆహారానికే ప్రాధాన్యతనివ్వడం వలన అనారోగ్య సమస్యలు దరిచేరే ప్రమాదం తగ్గుతుంది. ఇంటి ఆహారం ఆరోగ్యకరమైనది. ఇప్పటి బిజీ లైఫ్ స్టైల్ వలన చాలా మంది ఇంటి ఫుడ్ ఏర్పాటు చేసుకోలేక బయటి ఫుడ్ పై ఆధారపడి అధిక బరువు సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

4. ఆరోగ్యకరమైన ఫుడ్ ను అందుబాటులో ఉంచుకోండి:

4. ఆరోగ్యకరమైన ఫుడ్ ను అందుబాటులో ఉంచుకోండి:

ఇంట్లో ఆరోగ్యకరమైన ఫుడ్ ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి. దాని వలన హంగర్ ప్యాంగ్స్ నియంత్రణలో ఉంటాయి.

5. సరైన డైట్ ప్లాన్ ను పాటించండి:

5. సరైన డైట్ ప్లాన్ ను పాటించండి:

మీ డైట్ లో పోషకాలు, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్ తో పాటు గుడ్ ఫ్యాట్ తగినంత లభించేలా జాగ్రత్తలు తీసుకోండి.

6. చిన్న ప్లేట్స్ లేదా పాత్రలను ఉపయోగించండి:

6. చిన్న ప్లేట్స్ లేదా పాత్రలను ఉపయోగించండి:

చిన్న ప్లేట్స్ ను అలాగే పాత్రలను ఉపయోగించటం ద్వారా తక్కువ ఆహారాన్ని తీసుకుంటారని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. సాధారణ ప్లేట్స్ లో ఆహారాన్ని తెలియకుండానే ఎక్కువగా తీసుకుంటున్నారని ప్లేట్ పరిణామం చిన్నదిగా ఉంటే ఆహారాన్ని తక్కువగానే తీసుకుంటారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

7. జీరో కార్బ్ డైట్ ప్లాన్స్ ను అవాయిడ్ చేయండి:

7. జీరో కార్బ్ డైట్ ప్లాన్స్ ను అవాయిడ్ చేయండి:

మన శరీరానికి అన్ని రకాల పోషకాలు అవసరం. డైట్ ప్లాన్స్ లో కొన్ని పోషకాలకే చోటు నివ్వటం వలన పోషకాహార లోపం తలెత్తుతుంది. కాబట్టి, వెయిట్ లాస్ గోల్స్ ను అఛీవ్ చేయడానికి డైట్ ప్లాన్ ను చక్కగా డిజైన్ చేసుకోవాలి. వెయిట్ లాస్ ను ఆరోగ్యకరమైన పద్దతిలో అఛీవ్ చేసేందుకు డైట్ లో మార్పులూ చేర్పులు ఆరోగ్యకరమైన విధంగానే ఉండాలి.

English summary

Here's A Diet Chart For Women To Lose Weight

Being obese and overweight not just looks unhealthy but in reality is deeply rooted with illness and various health ailments. For a female, staying fit is directly linked with her body being within the window of the desired and healthy weight according to the standard weight and body mass charts.
Story first published:Thursday, June 28, 2018, 13:39 [IST]
Desktop Bottom Promotion