For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శరీర బరువును తగ్గించుకోవడానికి రోజుకు ఎంత మొత్తంలో కెఫిన్ను వాడాలి ?

|

మీ శరీర బరువును తగ్గించుకోవడానికి రోజులో ఎంత కెఫిన్ను తీసుకోవాలి ? ఒక అధ్యయనం ప్రకారం, మీరు మీ బృందంతో కలిసి పనిచేయడానికి వెళ్ళే ముందు డార్క్ కాఫీని తాగటం వల్ల మీరు మరింత సమర్థవంతంగా పని చేస్తారు. ఈ కాఫీ మిమ్మల్ని అలర్ట్గా ఉంచడమే కాకుండా శరీర బరువు తగ్గించడానికి సహాయపడుతుంది. అవును, మీరు చదివింది నిజమే !

కాఫీ, కెఫిన్ అనే పదార్ధమును కలిగి ఉంటుంది. ఇది సాధారణంగా వినియోగించబడే మానసిక స్థితి ప్రభావ పదార్థము. ఈ పదార్థాన్ని, కొవ్వును కరిగించే సప్లిమెంట్గా కూడా ఉపయోగించబడుతుంది అని మీకు తెలుసా ?

How Much Caffeine Should You Take Per Day For Weight Loss? - A Simple Guide

మీరు తాగే కాఫీ మీ శరీర బరువును తగ్గించడంలో ప్రభావం చూపుతుందా ? రండి, ఇప్పుడు మనము ఈ విషయం గూర్చి తెలుసుకుందాం.

* కాఫీ మిమ్మల్ని చైతన్యవంతులను చేస్తుంది :-

* కాఫీ మిమ్మల్ని చైతన్యవంతులను చేస్తుంది :-

కాఫీ గింజలు జీవసంబంధ క్రియాశీల పదార్థాలను కలిగి ఉంటాయి. అవి చాలా వరకు మీ జీవక్రియను ప్రభావిరియను ప్రభావితం చేయవచ్చు. కెఫీన్, థియోబ్రోమైన్, క్లోరోజెనిక్ ఆమ్లం & థియోఫిలైన్ వంటి చురుకైన పదార్థాలను ఇది కలిగి ఉంటాయి.

అడెనోసిన్ అని పిలవబడే న్యూరోట్రాన్స్మిటర్ను కెఫిన్ అడ్డుకుంటోంది. ఇది నాడీకణాలను ప్రభావితం చేసే డోపమైన్ అనబడే నోర్పైన్ఫ్రైన్ & న్యూరోట్రాన్స్మిటర్లను వంటి సమ్మేళనాలను విడుదల చేస్తుంది. ఇది మిమ్మల్ని శక్తివంతులుగా చేసి మిమ్మల్ని అలర్ట్ గా ఉంచుతుంది. కాఫీ మిమ్మల్ని ఎల్లప్పుడు చురుకుగా పెంచుతుందనేది ప్రధాన కారణంగా చెప్పవచ్చు.

కొవ్వు కణజాలం నుంచి కొవ్వును సమీకరించడానికి కాఫీ సహాయపడుతుంది :-

కొవ్వు కణజాలం నుంచి కొవ్వును సమీకరించడానికి కాఫీ సహాయపడుతుంది :-

కొవ్వు కణజాలం నుంచి కొవ్వును విచ్చిన్నం చేసే సంకేతాలను సూచించే విధంగా మీ నాడీవ్యవస్థను ప్రేరేపిస్తుంది. ఇది ఎపినాఫ్రిన్ హార్మోన్కు రక్త సరఫరాను పెంచడం ద్వారా పనిచేస్తుంది. ఎపినాఫ్రిన్ను "అడ్రినాలిన్" అని కూడా పిలుస్తారు, ఇది రక్తం ద్వారా ప్రయాణించి క్రొవ్వు కణజాలాలను చేరి, కొవ్వులను విచ్ఛిన్నం చేయవలసిందిగా సంకేతాలను అందజేస్తుంది.

 కాఫీ మీ జీవక్రియ రేటును పెంచుతుంది :-

కాఫీ మీ జీవక్రియ రేటును పెంచుతుంది :-

మీరు అధిక జీవక్రియ రేటును కలిగి ఉండటానికి, మీరు సులభంగా బరువు కోల్పోవడానికి, మీరు ఎంత తిన్నా తిరిగి శరీర బరువు రాకుండా ఉండటానికి - మీరు కాఫీను ఎల్లప్పుడూ తాగుతూ ఉండండి. మీ శరీరంలో కొవ్వు అధికంగా కరగడం వల్ల ఇది మీ జీవక్రియను మరింత ఎక్కువగా మెరుగుపరుస్తుంది.

ఒక అధ్యయనం ప్రకారం, సన్నగా వున్న వారిలో 29% వరకు కొవ్వును & ఊబకాయం ఉన్న వారిలో 10% వరకు కొవ్వును కాఫీయే తగ్గిస్తుంది.

కెఫిన్, థెర్మోజెనిసిస్ పెరుగుదలకు తాత్కాలికంగా మద్దతును ఇస్తుంది :-

కెఫిన్, థెర్మోజెనిసిస్ పెరుగుదలకు తాత్కాలికంగా మద్దతును ఇస్తుంది :-

కెఫిన్ను నేరుగా (లేదా) ఇతర పదార్ధాల కలయికతో తీసుకోవడం వల్ల అది మీ జీవక్రియను పెంచుతుంది, కొవ్వును తాత్కాలికంగా తగ్గించే ప్రయత్నాన్ని చేయవచ్చు. కాఫీ తాగే అలవాటు ఉన్న వారిని దానితో పోలిస్తే, చాలా తక్కువ ప్రభావాన్ని కలిగి ఉంటుంది.

కెఫిన్, గ్రీన్-టీతో పనిచేస్తుంది :-

కెఫిన్, గ్రీన్-టీతో పనిచేస్తుంది :-

గ్రీన్-టీ అనేది కాటెచిన్స్ EGCG అనే సమ్మేళనమును కలిగి ఉంటుంది, ఇది బరువును కోల్పోయేలా ప్రోత్సహించడంలో చాలా బాగా పనిచేస్తుంది. ఇది కెఫిన్తో కలిసి ఉన్నప్పుడు, మీ బరువును తగ్గించే గొప్ప సమ్మేళనముగా పనిచేస్తుంది. ఇలాంటి గొప్ప కలయిక వల్ల నూర్పిన్ఫ్రిన్కు అధిక రక్త ప్రవాహ స్థాయిలను అందజేయడంలో సహాయపడుతుంది, ఇది శరీరంలో నిల్వవున్న కొవ్వు యొక్క పతనాన్ని ప్రేరేపిస్తుంది.

మీరు రోజుకు ఎంత కాఫీను తాగాలి ?

మీరు రోజుకు ఎంత కాఫీను తాగాలి ?

ఆరోగ్యంగా ఉన్న పెద్దలు, ఒక రోజుకు 400 మిల్లీగ్రాముల కెఫిన్ను తీసుకోవటం మంచిది. పిల్లలు కాఫీ వినియోగానికి దూరంగా ఉండాలి & యుక్తవయసులో ఉన్నవారు కెఫిన్ వినియోగాన్ని పరిమితం కాటెచిన్స్.

మీరు రోజుకు 4 కప్పుల కంటే ఎక్కువ కాఫీను తాగితే ఏమవుతుంది?

మీరు రోజుకు 4 కప్పుల కంటే ఎక్కువ కాఫీను తాగితే ఏమవుతుంది?

పనిలో చురుకుగా, అప్రమత్తంగా ఉండాలనుకునేవారు ఒక రోజులో 4 కప్పుల కంటే ఎక్కువ కాఫీను తాగుతారు. కానీ ఇది తీవ్రమైన దుష్ప్రభావాలను కలగజేస్తుంది అనగా తలనొప్పి, నిద్రలేమి, భయము, విశ్రాంతి లేకపోవటం, చిరాకు, కడుపునొప్పి, వేగవంతమైన హృదయ స్పందన, తరచుగా మూత్రవిసర్జన కావడం, కండరాలు అదరడం వంటివి జరుగుతుంటాయి.

కెఫిన్ అత్యధిక వినియోగాన్ని ఆపడం ఎలా?

కెఫిన్ అత్యధిక వినియోగాన్ని ఆపడం ఎలా?

మీరు ఆకస్మికంగా కాఫీ వినియోగాన్ని తగ్గించడం వల్ల అలసట, తలనొప్పి, మీరు చేసే పనులలో వచ్చే ఇబ్బందులను అధిగమించలేక పోవటం, విసుగుచెందడం వంటి ఇతర లక్షణాలు ఏర్పడవచ్చు.

ఈ క్రింద తెలియజేసిన చిట్కాలను అనుసరించి మీరు కెఫిన్ వినియోగాన్ని తగ్గించుకోవచ్చు :

ఈ క్రింద తెలియజేసిన చిట్కాలను అనుసరించి మీరు కెఫిన్ వినియోగాన్ని తగ్గించుకోవచ్చు :

1. పని ఒత్తిడిలో ఉన్నప్పుడు మీరు ఎన్ని కాఫీలను తాగారో గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు ఈ పనిభారం వల్ల ఎన్ని కాఫీలను తాగడం మానేశారో అనేది కూడా గుర్తుపెట్టుకోండి.

2. ప్రతిరోజు చిన్న కప్పుతో కాఫీను తాగండి, ఆ రోజు మొత్తంలో కెఫిన్ను కలిగి ఉన్న పానీయాలను తాగటం మానేయండి.

3. ఈరోజుల్లో కెఫిన్ లాంటి రుచిని కలిగియున్న అనేక పానీయాలు మనకు చాలానే అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీరు నేరుగా కెఫిన్ను కలిగి ఉన్న పానీయాలను కాకుండా, కెఫిన్ లాంటి రుచిని అందించే పానీయాలను తీసుకోవడంపై శ్రద్ధ పెట్టండి.

4. మీరు అతి తక్కువ సమయాల్లోనే కాఫీను తయారు చేయడం వల్ల, మీరు వినియోగించే హెర్బ్స్లో ఉన్న కెఫిన్ కంటెంటు అనేది పూర్తిగా కాఫీలోకి చేరదు. లేదంటే మీరు కెఫిన్ సమ్మేళనమును కలిగి లేని ఇతర హెర్పిస్ను వాడి, టీ / కాఫీలను తయారు చేసుకోవడం మంచిది.

English summary

How Much Caffeine Should You Take Per Day For Weight Loss? - A Simple Guide

How Much Caffeine Should You Take Per Day For Weight Loss? - A Simple Guide, How much caffeine should you take per day for weight loss? According to a research, people who drank coffee before going to work were more efficient when it came to teamwork. Not only coffee would make you alert, but also it will help in weig
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more