For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  రాత్రికి రాత్రే మెడభాగంలోని క్రొవ్వును తగ్గించుకునే వీలుందా?

  |

  మీ మెడ చుట్టూ అదనపు కొవ్వు ఉందా మరియు దాన్ని వదిలించుకోవలసిన ఆవశ్యకం మీకు కనిపిస్తూ ఉందా? అయితే ఈ ఆర్టికల్ మెడ చుట్టూ చేరిన కొవ్వును వేగంగా తొలగించడంలో మీకు సహాయం చేస్తుంది.

  మెడ చుట్టూ చేరిన అధికమైన కొవ్వు వికారoగా మాత్రమే కాదు, అది ఊబకాయం యొక్క చిహ్నం కూడా కావచ్చు. వృద్ధాప్యం, నీరు నిలుపుదల మరియు హైపోథైరాయిడిజం మరియు పాలీసిస్టిక్ అండాశయ సిండ్రోమ్ (పిసిఒఎస్) వంటి ఇతర ఆరోగ్య పరిస్థితులు వంటి వివిధ కారణాల వలన అదనపు కొవ్వు మీ మెడ చుట్టూ చేరే అవకాశాలు ఉన్నాయి. అయితే, ప్రధాన కారణం అధిక శరీర బరువు మరియు ఊబకాయంగా ఉంది.

  How To Lose Neck Fat Overnight?

  గుండె జబ్బులు, మధుమేహం, మరియు అధిక కొలెస్ట్రాల్తో ముడిపడి ఉన్నందున, మెడ చుట్టూ చేరిన కొవ్వును వదిలించుకోవటం అన్నిటికన్నా ముఖ్యం.

  సంబంధం లేకుండా మీ మెడ చుట్టూ చేరిన అదనపు కొవ్వును తగ్గించుకొనుటలో భాగంగా, కింది ఆహార చిట్కాలు మీకు ఖచ్చితంగా సహాయం చేయగలవు.

  1. గ్రీన్ టీ

  1. గ్రీన్ టీ

  గ్రీన్-టీ కాటెచిన్స్ కలిగి ఉంటుంది, ఇవి అధిక అనామ్లజనకాలు కలిగిన పాలిఫినోల్స్. కాటెచిన్స్ బరువు తగ్గించడంలో సహాయం చేస్తాయి. అలాగని కప్పుల మీద కప్పులు తాగడం వంటివి చేయరాదు. దేనికైనా ఒక పరిమితి అనేది ఉంటుంది. 2 కప్పుల మించి గ్రీన్-టీ తీసుకోకుండా జాగ్రత్త తీసుకోవాలి.

  ఒక టీ స్పూన్ గ్రీన్ టీని ఒక కప్పు నీటిలో వేయాలి.

  ఒక 5 నిమిషాలు మరగనివ్వాలి.

  కొంచం చల్ల బడేదాకా ఉంచి, వడకట్టాలి

  తర్వాత ఒక చెంచా తేనెను జోడించి త్రాగాలి.

  2. పుచ్చకాయ

  2. పుచ్చకాయ

  పుచ్చకాయలు క్యాలరీలు మరియు కొవ్వులో తక్కువగా ఉంటాయి మరియు విటమిన్ ఎ, పొటాషియం వంటి ముఖ్యమైన విటమిన్లు మరియు ఖనిజాలతో సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలు మీకు మెడ కొవ్వును తొలగిస్తున్నందున ప్రయోజనకరమైనదిగా చెప్పబడుతుంది .

  తాజా పుచ్చకాయలు లేదా పుచ్చకాయ రసాన్ని నేరుగా తీసుకోవడమే కాకుండా, సలాడ్లలో కూడా కలిపి తీసుకోవచ్చు.

  రోజువారీ ఆహార ప్రణాళికలో భాగంగా 2 నుంచి 3 గ్లాసుల పుచ్చకాయల రసం కలిగి ఉండండం మంచిది.

  3. నీరు

  3. నీరు

  నీరు మీ మెడ చుట్టూ చేరిన కొవ్వు వదిలించటంలో ఎంతగానో సహాయపడుతుంది. ఇదొక చక్కటి పరిష్కారం. నీరు మీ ఆదర్శ శరీర బరువును(బిఎంఐ) నిర్వహించడమే కాకుండా, శరీరంలోని విషతుల్య రసాయనాలను తొలగిస్తుంది కూడా. మరియు, ఇది మీ ఆకలిని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది తద్వారా అతిగా తినడం నుండి మిమ్మల్ని నిరోధిస్తుంది.

  రోజువారీ ప్రణాళికలో కనీసం 8,10 గ్లాసుల నీరు త్రాగాలి.

  ఎక్కువ నీటిని కలిగి ఉండే పండ్లు మరియు కూరగాయలను తీసుకోండి.

  నీటికి బదులుగా కాఫీ, సోడా వంటి పానీయాలను తీసుకోవడం తగ్గించడం కూడా మంచిది.

  4. కొబ్బరి నూనె

  4. కొబ్బరి నూనె

  వేగంగా మెడ చుట్టూ చేరిన కొవ్వు వదిలించుకోవటం గురించి ఆలోచన చేస్తున్నారా? అయితే ఆహార ప్రణాళికలో భాగంగా కొబ్బరి నూనెను ఉపయోగించండి. కొబ్బరి నూనె వినియోగిస్తున్నప్పుడు, షార్ట్ -చైన్ కొవ్వు ఆమ్లాలు కణ త్వచంలోకి నేరుగా ప్రవేశించి, నిల్వ చేయబడిన కొవ్వును శక్తిగా మారుస్తాయి. క్రమంగా మీ ఊబకాయం కూడా తగ్గుముఖం పట్టడమే కాకుండా, మీ జీవక్రియ అభివృద్ధిలో సహాయపడుతుంది కూడా.

  10 నిమిషాల పాటు కొబ్బరినూనెతో మసాజ్ చేయడం, లేదా పరిమిత మోతాదులో కొన్ని వంట ప్రక్రియల ద్వారా సంగ్రహించడం కూడా చేయవచ్చు. వంటలో ఆలివ్ నూనె వినియోగించడం కూడా శ్రేయస్కరం.

  5. నిమ్మరసం

  5. నిమ్మరసం

  మెడ చుట్టూ చేరిన కొవ్వును వదిలించుకోవడానికి నిమ్మరసం మరొక చక్కటి పరిష్కారంగా చెప్పబడింది. నిమ్మ రసం తీసుకోవడం ద్వారా బరువు నెమ్మదిగా తగ్గుముఖం పట్టడంలో మీకు సహాయం చేస్తుంది. నిమ్మరసంలో విటమిన్ సి కంటెంట్ మీ జీవక్రియలను మెరుగుపరచడానికి మరియు మీ అదనపు కొవ్వును కరిగించడానికి సహాయపడే ఒక శక్తివంతమైన ప్రతిక్షకారిణిగా పనిచేస్తుంది.

  ఒక గ్లాసు వెచ్చని నీటిలో సగం నిమ్మకాయ రసం పిండి, అదనంగా

  తేనె జోడించి ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోండి.

  6. ఫ్లాక్స్ సీడ్స్ (అవిసె గింజలు)

  6. ఫ్లాక్స్ సీడ్స్ (అవిసె గింజలు)

  అవిసె గింజలు అనేవి ఒమేగా 3 కొవ్వు ఆమ్లాల యొక్క అద్భుతమైన మూలంగా ఉంది. ఈ కొవ్వు ఆమ్లాలు ఊబకాయం తొలగించుటలో క్రమంగా జీవక్రియలు మెరుగుపరచడంలో ఎంతగానో సహాయం చేస్తుంది. కాబట్టి, మెడ చుట్టూ చేరిన కొవ్వును వదిలించుకోవడానికి మీ స్మూతీస్ మరియు సలాడ్లు లోకి ఫ్లాక్స్ సీడ్స్ కలుపుకోవడం ఎంతో శ్రేయస్కరంగా చెప్పబడుతుంది.

  ఒక గ్లాసు వెచ్చని నీటికి ఫ్లాక్స్ సీడ్స్ పొడిని ఒక టేబుల్ స్పూన్ జోడించండి.

  దానికి ఒక స్పూన్ తేనె జోడించి, సేవించండి.

  7. బెల్ పెప్పర్స్ (కాప్సికం)

  7. బెల్ పెప్పర్స్ (కాప్సికం)

  వేగంగా బరువు కోల్పోవాలని భావిస్తున్నారా? ఇప్పటి నుండి మీ ఆహార ప్రణాళికలో భాగంగా బెల్పెప్పర్స్ జోడించండి. కాప్సికం 37 కేలరీల శక్తిని కలిగి ఉంటాయి మరియు మీ శరీరాన్ని పుష్కలంగా పోషకాలతో నింపగలవు. మరియు మీ కేలరీల సంఖ్యను పెరగకుండా కాపాడుతుంది.

  వాటిని మీ సలాడ్ లేదా వంటకాలరూపంలో వీటిని తీసుకోవచ్చు. గ్రిల్ చేసిన బెల్ పెప్పర్స్ కూడా మంచిదే.

  8.క్యారెట్లు

  8.క్యారెట్లు

  క్యారట్లు ఫైబర్ మరియు విటమిన్ ఎ యొక్క అద్భుతమైన వనరుగా ఉన్నాయి. ఈ కూరగాయలలోని ఫైబర్ కంటెంట్ కారణంగా జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది, క్రమంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

  రోజువారీ మీ ఆహార ప్రణాళికలో భాగంగా క్యారెట్లు కలిగి ఉండడం శ్రేయస్కరం.

  9.పొద్దుతిరుగుడు విత్తనాలు

  9.పొద్దుతిరుగుడు విత్తనాలు

  పొద్దుతిరుగుడు విత్తనాలు విటమిన్-ఇ మరియు విటమిన్-బి లకు గొప్ప వనరుగా ఉంది. ఇది మెడ కొవ్వును దహించడంలో సహాయపడడమే కాకుండా, అనేక విషతుల్య రసాయనాల బారిన శరీరం పడకుండా కాపాడగలుగుతుంది. కావున, మెడ చుట్టూ చేరిన కొవ్వును వేగంగా కరిగించాలంటే, మీ ఆహార ప్రణాళికలోకి పొద్దుతిరుగుడు విత్తనాలు జోడిoచడం మంచిదిగా సిఫార్సు చేస్తారు.

  ప్రతిరోజూ పొద్దుతిరుగుడు విత్తనాలను ఒక టేబుల్ స్పూన్ తినండి.

  English summary

  How To Lose Neck Fat Overnight?

  Excess fat around the neck is not only unsightly, it can be a sign of obesity. The excess fat may accumulate around your neck due to various factors like ageing, water retention, and other health conditions like hypothyroidism and polycystic ovarian syndrome (PCOS). However, the main reason is excess body weight and obesity.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more