For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముడి (పచ్చి) ఆహార పదార్థాలను తినడం వల్ల కలిగే లాభాలు, నష్టాలు !

ముడి (పచ్చి) ఆహార పదార్థాలను తినడం వల్ల కలిగే లాభాలు,నష్టాలు !

|

ఈరోజుల్లో వివిధ రకాల డైట్ పద్ధతులను చాలామంది ప్రజలు ఫాలో అవుతున్నారు. ఇందుకు గల మొదటి కారణం :- మారుతున్న కాలానికి అనుగుణంగా కొంతమంది తమ జీవన విధానంలో తగిన మార్పులను కోరుకుంటారు. రెండో కారణం :- తమ ఆరోగ్యం గురించి ఆందోళన చెందేవారు నూతన డైట్ పద్ధతులను అనుసరిస్తారు.

కారణాలేవైనా అత్యధిక శాతం జనాభా ముడి ఆహార పదార్థాలను తీసుకోవడానికి మక్కువ చూపుతున్నారు. ఈ ఆహారం యొక్క ప్రధాన ఉద్దేశం, ఆహారపదార్ధాలను ఏమాత్రం ప్రాసెస్ చేయకుండానే తీసుకోవటాన్ని నిర్ధారిస్తుంది.

Raw Food Diet : Benefits And Side Effects You Should Know

అంటే దీని అర్థం, మీరు తీసుకునే ఆహారంలో హానికరమైన సంకలనాలకు తావులేకుండా పూర్తి పోషకాలను పొందవచ్చని భరోసా ఇవ్వడం. ఈ వ్యాసం ద్వారా, మీరు ముడి ఆహారపదార్థాలను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు & దుష్ప్రభావాల గురించి మీకు పూర్తిగా తెలియజేస్తుంది.

ఇంతకీ, ఈ ముడి (పచ్చి) ఆహార పదార్థాల డైట్ అంటే ఏమిటి ?

మీరు పాటించే ఈ డైట్ లో, చాలావరకు తాజాగా ఉన్న ఆహార ఉత్పత్తులను వినియోగిస్తారు. ఆకుపచ్చగా ఉన్న ఆకుకూరలు ఇందులో ముఖ్య భాగంగా ఉంటాయి. అంతేకాకుండా, వీటిలో గింజలు, నట్స్, మొలకలు వచ్చిన ధాన్యాలు & సీ-వెజిటేబుల్స్ వినియోగం కూడా ఉంటుంది.

మీరు ఈ రకమైన డైట్ ను పాటించడానికి, మీరు శాఖాహారానికి మాత్రమే కట్టుబడి ఉండనవసరం లేదు. గుడ్లు పచ్చి పాల ఉత్పత్తులు & కొన్నిరకాల మాంసాహారాలను మీ ఆహారంలో భాగంగా చేర్చుకోవచ్చు. ఈ డైట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యమేమంటే, సజాతీయమైన & సుక్ష్మక్రిమిరహితమైన ఆహార ఉత్పత్తులను వినియోగించడం.

అందువల్ల మీరు రిఫైన్డ్ ఆయిల్తో ప్రోసెస్ చేయబడిన ఆహారాలను & మాంసాహారాలను, జున్ను, తృణధాన్యాలు, బిస్కెట్లు, రొట్టెల వంటివే కాకుండా చాక్లెట్లు, ఐస్క్రీంలు వంటి వాటికి కూడా చాలా దూరంగా ఉండాలి.

ముడి (పచ్చి) ఆహార పదార్థాల డైట్ వల్ల కలిగే లాభాలు :-

ముడి (పచ్చి) ఆహార పదార్థాల డైట్ వల్ల కలిగే లాభాలు :-

మీరు తీసుకునే ఈ పచ్చి ఆహార పదార్థాల విషయంలో ఖచ్చితమైన స్వీయ నియంత్రణను కలిగి, మీపై మీరు విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు చివరగా మీకు ఎదురయ్యే ఫలితాలు చాల ఆశ్చర్యకరంగా ఉంటాయి.

1. మీ ప్రేగుల ఆరోగ్యానికి చాలా మంచిది :-

మీరు తీసుకునే పచ్చి ఆహారపదార్ధాలు మీ జీర్ణవ్యవస్థలో ఎక్కువకాలం పాటు దాగి ఉండవు (అంటే దాని అర్థం త్వరగా జీర్ణమవుతాయని) ! తత్ఫలితంగా, అవి మీ శరీరాన్ని వదిలిపెట్టడానికి ముందుగా ఇది తక్కువ సమయంలోనే పులియబెట్టబడుతుంది. నిజానికి, మీరు తీసుకునే ఆహారం కిణ్వప్రక్రియకు గురికాబడే ప్రక్రియలో భాగంగా వల్ల ప్రేగులలో విషపూరితమైన వాయువు చేరడానికి దారితీస్తుంది. ఇది క్రమంగా వాపు, గ్యాస్ మరియు ఇతర ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుంది.

ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనేవారిలో పేగులపై ఉన్న శ్లేష్మము దెబ్బతినడంవల్ల "లీకీ గట్ సిండ్రోమ్" అనే పరిస్థితి ఎదురవడానికి కారణం కాగలదు. పచ్చి ఆహార పదార్థాలను తినే వారిలో ఇలాంటి పరిస్థితి ఎదురవ్వదని నిర్ధారిస్తుంది.

2. పోషకాలను గరిష్టంగా పొందగలరు :-

2. పోషకాలను గరిష్టంగా పొందగలరు :-

ఏదైనా ఆహారాన్ని వండేటప్పుడు దానిలో రసాయనిక మార్పులు చాలా జరుగుతాయి. ఈ కారణం చేత ఆహారంలో ఉన్న ముఖ్యమైన ఎంజైములు & ఇతర పోషకాలను కోల్పోతుంది.

యాంటీ ఆక్సిడెంట్లను అధికంగా కలిగిన ఆహార పదార్థాలలో ఫైటోన్యూట్రియంట్స్ అనేవి చాలా ముఖ్య భాగంగా ఉన్నాయి. ఇలాంటి ఆహారపదార్ధాలను వండేటప్పుడు అధిక ఉష్ణోగ్రతల వద్ద దానిలో ఉండే పోషక విలువలను కోల్పోతుంది. అందువల్ల, మీరు పచ్చి ఆహారపదార్థాలను తీసుకోవడం వల్ల వాటిలో ఉన్న పోషకాలను గరిష్టస్థాయిలో పొందగలరు.

3. శరీర బరువును తగ్గిస్తుంది :-

3. శరీర బరువును తగ్గిస్తుంది :-

పచ్చి ఆహారపదార్థాలు రకరకాల రూపాలలో మనకు లభిస్తాయి. వీటిలో ఎక్కువభాగం ఫైబర్ & ఖనిజాలకు మంచి మూలంగా ఉంటాయి. ఈ రకమైన ఆహారాలు మీలో తినాలన్న వాంఛను నెమ్మదించేలా చేస్తాయి.

తత్ఫలితంగా, మీరు తినే ఈ పచ్చి ఆహారాలను ఇతర స్పైసి ఫుడ్తో పోల్చి చూస్తే చాలా తక్కువగా తింటారు. అధిక బరువును కలిగి ఉన్న వారు తరచుగా ఎదుర్కొనే ఆకలి తీవ్రతను నియంత్రించడానికి ఈ రకమైన పచ్చి ఆహార పదార్థాలను తీసుకోవడమే సరైన మార్గము.

ఈ పచ్చి ఆహార పదార్థాల డైట్ వల్ల కలిగే నష్టాలు :

మీరు తీసుకునే ఈ పచ్చి ఆహార పదార్థాలు కొన్ని ప్రతికూలతలను కూడా కలిగి ఉంది. పచ్చి ఆహార పదార్థాల డైట్ను పాటించడం వల్ల కలిగే లాభాలు ప్రతీ ఒక్కరికి సరిపోకపోవచ్చు. ఇలాంటి ఆహారాన్ని డైట్గా తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి మరింతగా తెలుసుకోవడానికి ఈ వ్యాసాన్ని చదవండి.

1. ఎసిడిటీని పెంచుతుంది :-

1. ఎసిడిటీని పెంచుతుంది :-

మీరు పాటించే ఈ డైట్ వల్ల శరీరంలోని pH స్థాయిలు ప్రభావితం కాగలదు. మీరు ఈ డైట్ను పాటిస్తూ, అధిక మోతాదులో తీసుకునే పచ్చి ఆహారపదార్థాల వల్ల "యాసిడ్ ఆల్కలైన్ బ్యాలెన్స్" అనేది తీవ్రంగా ప్రభావితం కాబడుతుంది. దాన్ని ప్రభావంగా, మీ శరీరంలోని రోగనిరోధక శక్తిని తగ్గి & వ్యాధులు ఎదురవడానికి కారణమవుతుంది.

ఇలాంటి ప్రతికూలతల ప్రభావాన్ని నిరోధించేందుకు మీరు డైట్ను ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. సరైన డైట్ కోసం ప్రొఫెషనల్ డైటీషియన్ను (లేదా) న్యూట్రిషనిస్ట్ని సంప్రదించడం మంచిది.

2. కొన్ని రకాల వ్యాధులతో బాధపడేవారికి ఈ డైట్ మంచిది కాదు :-

2. కొన్ని రకాల వ్యాధులతో బాధపడేవారికి ఈ డైట్ మంచిది కాదు :-

ఇలాంటి డైట్తో మీరు ప్రయోగాలు చేయడం నిజంగా మంచి ఆలోచనే అయినప్పటికీ మూత్రపిండాల వ్యాధులు, పిత్తాశయంలో రాళ్ళు ఉన్నవారు, ఇతర పిత్తాశయ వ్యాధులతో బాధపడుతున్నవారికి ఇది సిఫారసు చేయబడదు.

ఒకవేళ మీరు హార్మోన్ల అసమతుల్యతను గాని కలిగి ఉంటే ఈ డైట్ను పాటించాలన్న ఆలోచనకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఆటో-ఇమ్యూన్ డిసార్డర్తో బాధపడుతున్న వ్యక్తులు, గుండె వ్యాధులు (లేదా) క్యాన్సర్ తో బాధపడుతున్న వారు ఇలాంటి డైట్ను అస్సలు ప్రయత్నించకూడదు. ఎందుకంటే, ఇలాంటి ఆరోగ్య సమస్యలను కలిగి ఉన్నవారికి ఈ డైట్ను పాటించడం వల్ల కలిగే మార్పులు వారికి ప్రాణాంతకం కూడా మారవచ్చు.

3. ఆహార అసమానతలు పెరుగుతాయి :-

3. ఆహార అసమానతలు పెరుగుతాయి :-

మీరు ఎక్కువ మొత్తంలో ఏదైనా ఆహారాలను తరచుగా తినడం వల్ల అదే మీ అయిష్టతను పెంచడంలో కూడా కారణమవుతుంది. మీరు ఈ పచ్చి ఆహారపదార్ధాల డైట్ను పాటించడంవల్ల, ఈ రోజు వరకు మీ ఆహారంలో అతిముఖ్య భాగాలుగా ఉన్న అనేక విషయాలను వదులుకోవలసి వస్తుంది.

ఈ భావన మీలో ఏర్పడిన నాటి నుంచి మీరు తరచుగా ఎక్కువ మొత్తంలో ఆహారాలను తీసుకునేలా చేస్తుంది. ఇలా మీరు ఎక్కువగా తినడానికి అలవాటు పడతారు ఎందుకంటే మీరు ఎక్కువ పోషక విలువలను కోల్పోకూడదని భావిస్తారు కాబట్టి. ఆ విధంగా, మీరు ఈ డైట్ను దీర్ఘకాలం పాటు కొనసాగించడం వల్ల మీకు తెలియకుండానే కొన్ని రకాల ఆహారాల పై అయిష్టత ఏర్పడుతుంది.

English summary

Raw Food Diet : Benefits And Side Effects You Should Know

Raw food diet is trending these days; it includes green leafy veggies, nuts, seeds, sprouted grains and sea veggies. People on this diet eat unprocessed, raw food aiming to obtain all the nutrients present in the food. The diet is good for the gut, maximizes food value and aids weight loss. But it can increase acidity and food intolerance.
Desktop Bottom Promotion