For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ ఏడాదైనా ఇలా చేయండి.. వారంలో పొట్ట తగ్గించుకోండి

కొత్త సంవత్సరంలో కూడా మీరు మీ నడుము చుట్టూ లేదంటే పొట్ట చుట్టు ఉన్న కొవ్వును తగ్గించుకునేందుకు చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. మీరు కొన్ని రకాల సూచనలు పాటిస్తే పొట్ట చుట్టూ ఉండే కొవ్వు తగ్గుతుంది

By Bharath
|

ప్రతి ఒక్కరూ పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించుకునేందుకు గతేడాది నానా తంటాలుపడి ఉంటారు. అయినా ఫలితం ఉండి ఉండదు. కొత్త సంవత్సరంలో కూడా మీరు మీ నడుము చుట్టూ లేదంటే పొట్ట చుట్టు ఉన్న కొవ్వును తగ్గించుకునేందుకు చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే మీరు కొన్ని రకాల సూచనలు పాటిస్తే కచ్చితంగా పొట్ట చుట్టూ ఉండే కొవ్వు ఏడురోజుల్లోనే కొద్దిగా అయినా తగ్గడానికి చాలా అవకాశాలున్నాయి. అదే విధానాలను మీరు రెగ్యులర్ గా పాటిస్తే ఇంకా మేలు.

ఉదయమే లేవండి

ఉదయమే లేవండి

ఆరోగ్య కోసం పాటించే సూత్రాల్లో ప్రధానమైనది మీరు ఉదయమే లేవడం. ఉదయం పూట లేటుగా లేచే వాళ్లు ఎక్కువగా ఊబకాయానికి గురవుతూ ఉంటారని చాలా అధ్యయనాల్లో వెల్లడైంది. అందువల్ల మీరు వీలైనవరకు ఉదయం లేవడానికి ప్రయత్నించండి.

బెర్రీస్

బెర్రీస్

బెర్రీస్ ఆరోగ్యానికి చాలా మంచివి. బెర్రీల ద్వారా పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు తగ్గిపోతుంది. బెర్రీల్లో చాలా రకాలుంటాయి. అన్నిరకాల బెర్రీలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. స్ట్రాబెర్రీలు, రాస్ప్బెర్రీస్, బ్లాక్బెర్రీస్ వంటి వాటిని ఉదయం లేచిన వెంటనే తినడం మంచిది.

హైడ్రోజెన్డ్ ఆయిల్స్ వాడకండి

హైడ్రోజెన్డ్ ఆయిల్స్ వాడకండి

ఇలాంటి ఆయిల్ తో తయారు చేసే ఆహారపదార్థాలను తినకండి. ఈ ఆయిల్ తో తయారు చేసే పదార్థాలను తినడం వల్ల మీలో కొవ్వు పేరుకుపోతుంది. అలాగే గుండె జబ్బులకు గురవుతారు. అధిక కొలెస్ట్రాల్ తో ఇబ్బందులుపడాల్సి వస్తుంది. అందువల్ల ఇలాంటి ఆయిల్స్ తో తయారు చేసిన ఆహారపదార్థాలను తినకండి.

వివిధ ధాన్యాలతో తయారు చేసిన బ్రెడ్

వివిధ ధాన్యాలతో తయారు చేసిన బ్రెడ్

మనకు మార్కెట్లో తెల్లగా నిగనిగలాడే బ్రెడ్ దొరుకుతూ ఉంటుంది. అయితే దాన్ని తినకపోవడం మంచిది. కొన్ని రకాల బ్రెడ్ లు గోధుమ రంగులో ఉంటాయి. అంలాంటి బ్రెడ్ తినడం మంచిది. వీటిలో న్యూట్రిషన్ ఎక్కువగా ఉంటుంది. మీ నడుము చుట్టూ ఉన్న కొవ్వు తగ్గడానికి, అసలు కొవ్వు పేరుకుపోకుండా ఉండేందుకు ఈ బ్రెడ్ బాగా ఉపయోగపడుతుంది.

వర్క్ అవుట్స్

వర్క్ అవుట్స్

కొన్ని రకాల వర్క్ అవుట్స్ కూడా మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. వెయిట్ లిఫ్ట్ చేయడంలాంటివి చేయాలి. అలాగే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తగ్గేందుకు అవసరమైన వర్క్ అవుట్స్ కూడా చేయడం మంచిది. రోజూ ఉదయం ఇలాంటి వ్యాయామాలు చేయండి.

స్వీట్లను తినకండి

స్వీట్లను తినకండి

కొందరు ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన కొన్ని రకాల స్వీట్లన్ల తింటూ ఉంటారు. ఎక్కువ మందికి వీటిని తినాలని అనిపిస్తూ ఉంటుంది. అయితే వీటిని తినడం మంచిదికాదు. దీని వల్ల పొట్ల దగ్గర కొవ్వు అలాగే ఉండిపోతుంది.

ఫైబర్ ఎక్కువగా తీసుకోండి

ఫైబర్ ఎక్కువగా తీసుకోండి

మీరు ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవడం చాలా మంచిది. దీని వల్ల ఈజీగా కొవ్వు కరిగిపోతుంది. మీరు ఆరోగ్యంగా ఉండేందుకు ఫైబర్ ఫుడ్ బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల రోజూ రెగ్యులర్ గా ఫైబర్ ఫుడ్ తింటూ ఉండండి.

కెచప్

కెచప్

కెచప్ చాలా రుచికరంగా ఉంటుంది. అలాగే ఇది మీ బాడీలోని కొవ్వును చాలా వేగంగా తగ్గిస్తుంది. పొట్ట చుట్టూ ఉండే కొవ్వుతో పాటు బాడీలోని వ్యర్థాలను కెచప్ వెంటనే బయటకు పోగోడుతుంది. అందువల్ల దీన్ని కూడా మీరు రెగ్యులర్ గా తింటూ ఉండండి.

యోగా

యోగా

కొన్ని రకాల ఆసనాలు కూడా మీ పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కూడా తగ్గిస్తుంది. అందువల్ల మీరు అలాంటి ఆసనాలను ఉదయం లేచిన వెంటనే వేస్తే చాలా మంచిది.

నట్స్

నట్స్

కొన్నిరకాల నట్స్ కూడా రెగ్యులర్ గా తీసుకోండి. బాదంలాంటి వాటిని రాత్రి నీళ్లలో నానబెట్టి ఉదయమే తింటే చాలా మంచిది. వీటిని రోజూ ఉదయమే తింటూ ఉండండి.

వెల్లుల్లి

వెల్లుల్లి

మీరు రోజూ తీసుకునే ఆహారంలో వెల్లుల్లి కచ్చితంగా ఉండేలా చూసుకోండి. వెల్లుల్లి బాడీలోని కొవ్వును కరిగిస్తుంది. ప్రతి ఒక్కరు వారి ఆహారంలో కచ్చితంగా వెల్లుల్లిని ఉపయోగిస్తూనే ఉంటారు. వీలైతే పచ్చి వెల్లుల్లి ఒక్కటి తిన్నా చాలు. మంచి ప్రయోజనాలుంటాయి.

చేపలు

చేపలు

మీ ఆహారంలో ఎక్కువగా చేపలుండేలా చూసుకోండి. చేపలు మీ బాడీలోని కొవ్వును తగ్గించగలవు. వారానికొకసారైనా మీరు మీ మెనూలో చేపలుండేలా చూసుకోండి.

కూరగాయలు

కూరగాయలు

కొన్ని రకాల కూరగాయలు ఆరోగ్యానికి చాలా అవసరం. క్యాలీఫ్లవర్, బ్రకోలి, దోసకాయలాంటి వాటిని ఎక్కువగా తినడం మంచిది. వీటి వల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు క్రమంగా తగ్గిపోతుంది.

క్యాల్షియం

క్యాల్షియం

క్యాల్షియం కూడా మీరు ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. పాలు, పాల సంబంధిత పదార్థాలలో ఎక్కువగా క్యాల్షియం ఉంటుంది. వీటిని రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండడం వల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తగ్గిపోతుంది.క్యాల్షియం ఎక్కువగా ఉండే పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది.

చెర్రీలు

చెర్రీలు

మీరు చెర్రీలు కూడా ఎక్కువగా తినాలి. చెర్రీలు కూడా బాడీలోని కొవ్వును తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల పొట్ట చుట్టూ ఉండే కొవ్వు మొత్తం కరిగిపోతుంది.

రన్నింగ్

రన్నింగ్

రోజూ ఉదయమే రన్నింగ్ చేయడం చాలా మంచిది. దీని వల్ల త్వరగా ఫలితాలు వస్తాయి. త్వరగా కొవ్వు తగ్గడానికి రన్నింగ్ బాగా ఉపయోగపడుతుంది.

నిద్రపోవడం

నిద్రపోవడం

సరైన సమయానికి నిద్రపోతూ ఉండడం కూడా చాలా మంచిది. కరెక్ట్ గా నిద్రపోకుండా ఉంటే కూడా బాడీలో కొవ్వు పెరిగిపోతుంది. అందువల్ల రెగ్యులర్ గా కరెక్ట్ సమయానికి నిద్రపోతూ ఉండండి.

English summary

simple tips reduce belly fat within 7 days

simple tips reduce belly fat within 7 days
Story first published:Thursday, January 11, 2018, 10:21 [IST]
Desktop Bottom Promotion