For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కేట్ మిడిల్టన్ పాటించిన వెయిట్-లాస్ డైట్ ఏమిటో తెలుసా?

|

బ్రిడ్జ్ డచెస్ (బ్రిటిష్ డ్యూక్ భార్య లేదా డ్యూక్ తో సమాన మైన హోదా) గా వ్యవహరించబడుతున్న కేట్ మిడిల్టన్ కాలానుగుణంగా ఆధునిక శైలిని అనుసరిస్తుంటుంది. ఈ వ్యాసంలో, కేట్ మిడిల్టన్ తన బరువు నష్టం ప్రక్రియలో భాగంగా అనుసరించిన ఆహార ప్రణాళికతో పాటు, తను అనుసరించిన మరికొన్ని ప్రత్యేకమైన ఆహార ప్రణాళికల గురించి కూడా తెలుసుకోబోతున్నాము.

మూడవ చైల్డ్ లూయిస్ ఆర్థర్ చార్లెస్ పుట్టిన తరువాత కేట్ మిడిల్టన్ తన ఆరోగ్యం మరియు ఫిట్నెస్ గురించిన శ్రద్ద తీసుకోవడం తిరిగి ప్రారంభించింది. ఈ క్రమంలో భాగంగా భారీ వ్యాయామ ప్రణాళికను మరియు ఖచ్చితమైన ఆహారప్రణాళికను నిర్వహిస్తుంది.

What is Kate Middletons Weight Loss Diet?

డచెస్ ఆహారం విషయంలో అత్యంత క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా చెప్పబడింది. మరియు జంక్ ఫుడ్ కు ఆమడ దూరంలో ఉండే కేట్, తన ఆహార ప్రణాళికను సిద్దం చేసుకోవడంలో అత్యంత జాగ్రత్తను కనపరుస్తుంది.

కేట్ మిడిల్టన్ పాటించిన వెడ్డింగ్, ప్రెగ్నెన్సీ, స్కిన్, వెయిట్ లాస్ డైట్ గురించి తెలుసుకోడానికి ఈ వ్యాసం చదవండి.

కేట్ మిడిల్టన్ వెడ్డింగ్ డైట్:

కేట్, తన రాయల్ వెడ్డింగ్ లో, అందమైన గౌనులో నాజూగ్గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరచింది. ముఖ్యంగా ఆరోజు లోపున తన జీవన శైలిలో, ప్రణాళికలలో మార్పులను తీసుకురావడంలో అత్యంత శ్రద్దని కనపరచడంతో పాటు, తగిన ఫలితాలను కూడా చూపించి అందరినీ ముక్కున వేలేస్కునేలా చేసింది.

డ్యూకన్ ఆహార ప్రణాళిక అధిక ప్రోటీన్ స్థాయిలను కలిగి ఉంటుంది. మరియు తక్కువ కార్బో హైడ్రేట్లతో కూడి ఉంటుంది. ఈ ఆహారం ముఖ్యంగా నాలుగు దశలను కలిగి ఉంటుంది. అవి వరుసగా అటాక్, క్రూయిజ్, కన్సాలిడేషన్(ఏకీకరణ) మరియు స్టెబిలైజేషణ్(స్థిరీకరణ). అటాక్ దశలో, నాలుగు నుండి ఆరు రోజులు కేవలం ప్రోటీన్ సంబంధిత ఆహారాలు తీసుకోవలసి ఉంటుంది. ఈ సమయంలో పండ్లు మరియు కూరగాయలకు స్థానం లేదు.

క్రూయిజ్ దశలో, కొన్ని రోజులు మాత్రం కూరగాయలు తీసుకోడానికి అనుమతి ఉంటుంది. స్థిరీకరణ దశలో, పండ్లు, కార్బోహైడ్రేట్లు కలిగిన ఆహారం మరియు జున్ను స్వీకరించవచ్చు.

రెండవ మరియు మూడవ దశలలో ఎంతకాలం మీరు ఉంటున్నారు అనేది, మీరు కోరుకునే బరువు తగ్గుదల మీద ఆధారపడి ఉంటుంది. స్థిరీకరణ దశలో వారానికి ఒకసారి అటాక్ దశను పునరావృతం చేయడం.

కేట్ మిడిల్టన్ గర్భధారణ సంబంధిత ఆహార ప్రణాళిక:

కేట్ గర్భవతిగా ఉన్నప్పుడు, ఆమె తీవ్రమైన ఆహార విరక్తి మరియు ఉదర సంబంధిత రోగాలకు గురయింది. ఆమె మూడవ గర్భధారణ సమయంలో అథికమైన గర్భాదారిత సమస్యలను ఎదుర్కొంది (గర్భధారణ సమయంలో తీవ్రమైన వాంతులు, బరువు తగ్గడం, వికారం మరియు ఎలక్ట్రోలైట్లు తగ్గడం మొదలైనవి).

సరైన ఆరోగ్యానికి తిరిగి వచ్చే క్రమంలో భాగంగా, ఆమె తరచుగా బెర్రీలు, వోట్మీల్ మరియు అవోకాడోస్ వంటి హృదయారోగ్యకరమైన ఆహారాలను తీసుకుంది. ఈ ఆహారాలు తీసుకోవడం మూలంగా ఆమె కొంత బరువు పెరిగింది కూడా. క్రమంగా మార్నింగ్ సిక్నెస్ ముఖ్యంగా వికారంతో పోరాడుటకై ఆమె అల్లాన్ని ఎక్కువగా తీసుకునేది.

గార్జియస్ స్కిన్ కోసం కేట్ మిడిల్టన్ యొక్క డైట్:

ఆమె కాన్పు తర్వాత బరువు కోల్పోయినందున, ఆమె ఆహారం నుండి మరింత ఆరోగ్య ప్రయోజనాలను పొందాలని కోరుకుంది. క్రమంగా, కేట్ తీసుకున్న ఆహార ప్రణాళిక ఆమె చర్మాన్ని స్పష్టంగా మరియు ఆరోగ్యకరంగా మార్చడంలో ఎంతగానో సహాయం చేసింది. ఈసమయంలో ఎక్కువగా ముడి ఆహారాలనే ఎక్కువగా తీసుకునేలా ఆహార ప్రణాళికను సిద్దం చేసుకుంది. ఈ ఆహార ప్రణాళికలో కెవిచే (లాటిన్ అమెరికా వంటకం) , నిమ్మరసం లేదా నిమ్మ మరియు సుగంధ ద్రవ్యాలతో మారినేట్ చేసిన ముడి చేపలను, పుచ్చకాయ సలాడ్లు, గోజీ బెర్రీస్, గజ్పాచో మరియు టబ్బౌలెహ్ వంటి పదార్ధాలను కలిగి ఉంది. ఈ ముడి ఆహారాలు వండిన ఆహారాల కన్నా ఎక్కువగా విటమిన్లు మరియు ఖనిజాలను కలిగి ఉన్నాయి.

కేట్ మిడిల్టన్ అనుసరించే బరువు-నష్టానికి సంబంధించిన ఆహారప్రణాళిక గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా?

కేట్ మిడిల్టన్ యొక్క బరువు నష్టం డైట్ ప్లాన్:

ముడి కూరగాయలు, పండ్లు, ప్రోటీన్ ఆధారిత ఆహారాల కన్నా, ఆమె కూరగాయలతో చేసిన కూరలు తీసుకోడానికే ఎక్కువ మొగ్గు చూపుతుంది.

ప్రతిరోజూ ఉదయం స్మూతీ కోసం, స్పిరులినా పొడిని కాలే(ఆకుకూర)లో కలిపి తీసుకోడానికి సుముఖత చూపుతుంది. ఈ స్పిరులినా పొడిలో రోగనిరోధక వ్యవస్థను పెంచే విటమిన్లు, ఖనిజాలు, అనామ్లజనకాలు మరియు మాంసకృత్తులు కలిగి ఉండి, అలెర్జీ నిరోధకాలుగా రక్షణ కల్పిస్తూ మరియు ఇన్ఫెక్షన్ల నుండి పోరాడే తత్వాలను కూడా కలిగి ఉంటుంది.

బాదం పాలు నచ్చవు:

కేట్ మిడిల్టన్ ఎక్కువగా కార్బోహైడ్రేట్ల తగ్గింపు మరియు లీన్ ప్రోటీన్ పెంపుదల మీదనే ఎక్కువ దృష్టి సారిస్తుంది. క్రమంగా పండ్లు, కూరగాయలు మరియు గోధుమ పదార్ధాలనే ఎక్కువగా తీసుకుంటుంది.

డచెస్ యొక్క మాజీ ఫిట్నెస్ మరియు ఆరోగ్య నిపుణుడు లూయిస్ పార్కర్ ఒక స్థిరమైన మరియు అంకితభావం అనేవి ఆరోగ్యకరమైన జీవనశైలికి కీలకమని సూచించాడు. ఆమె ప్రతిరోజూ మూడు పూటలా భోజనం, రెండు పూటలా స్నాక్స్ తీసుకోవాలని సిఫారసు చేస్తుంది.

అల్పాహారంలో అరటి పండ్లు, బ్లూ బెర్రీస్ టాపింగ్ చేసిన మ్యూస్లీతో ఓట్-బ్రాన్ తీసుకుంటుంది. భోజనం ముందు, వేరుశెనగ వెన్నతో వోట్-కేక్స్ స్నాక్స్ గా తీసుకుంటుంది. భోజనం కోసం, ఆకుపచ్చని బీన్స్ మరియు లెంటిల్ సలాడ్తో కాల్చిన చికెన్. మధ్యాహ్నం చిరుతిండి కోసం క్రాకర్స్లో స్మూతీ లేదా హుమ్ముస్ ఉంటుంది. మరియు డిన్నర్ కోసం, అల్లం, వెల్లుల్లి మూలికలు లేదా నిమ్మరసం వంటివి జతచేసిన కూరగాయలతో కూడిన స్టీక్స్ ఇష్టపడుతుంది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆరోగ్య, ఆహార, జీవన శైలి తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

What is Kate Middleton's Weight Loss Diet?

Kate Middleton, the Duchess of Cambridge, follows a particular diet and her eating habits change from time to time. In this article, we will be writing about Kate Middleton's weight loss diet.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more