For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శరీర బరువును తగ్గించుకోవడానికి ఎలాంటి అల్పాహారాన్ని తీసుకోవాలి ?

|

అల్పాహారం అనేది మనము రోజులో చేసే మొదటి భోజనం వంటిది. ఇతర విషయాలలో మనము బిజీగా ఉన్నప్పుడు అల్పాహారాన్ని తీసుకోవడం మానివేస్తాము. మీ శరీరానికి రోజువారీ అవసరమయ్యే ఇంధనాన్ని (శక్తిని) అల్పాహారం ద్వారా సమకూరుతుంది కావున, దీనిని తీసుకోవడం చాలా అవసరం. ఎవరైతే బరువు తగ్గాలనుకుంటున్నారో అలాంటి వారు ఖచ్చితంగా అల్పాహారాన్ని తీసుకోవాలి.

అవును ఇది నిజమే, మీరు సరైన పోషకాలతో కూడిన ఆరోగ్యకరమైన అల్పాహారాన్ని తీసుకోవడం వల్ల మీ బరువును తగ్గేలా చేస్తుంది. మీరు బరువు తగ్గడం కోసం అల్పాహారాన్ని తినడం గురించి కాదు, మీ బరువును తగ్గించడంలో సహాయపడే ఆరోగ్యకరమైన, సరైన అల్పాహారాన్ని తీసుకోవడం అనేది చాలా ముఖ్యం.

భారతీయ వంటకాలలో చాలా రకాల పదార్థాలు అనగా వనమూలికలు, సుగంధ ద్రవ్యాలు, బీన్స్ మరియు కూరగాయలతో సహా ఇతర ఆహార పదార్థాలతో పూర్తిగా నిండి ఉంటుంది. మీరు సరైన ఆహార పదార్ధాలను ఎంచుకోవడం వల్ల శరీర బరువు తగ్గటంలో మీరు ఎంచుకున్న లక్ష్యాన్ని నిశ్చయించుకోగలరు, అలాగే మీ రోజువారి కార్యకలాపాలకు అవసరమయ్యే కేలరీలను కూడా తగ్గించుకోవాలి.

కాబట్టి, మీరు బరువు కోల్పోవటానికి ప్రయత్నిస్తున్నప్పుడు తీసుకోవలసిన అల్పాహారము గురించి ఈ వ్యాసంలో తెలియజేసిన మరిన్ని విషయాలను చదివి, తెలుసుకోండి.

అల్పాహారంలో లభించే కేలరీలు :

అల్పాహారంలో లభించే కేలరీలు :

మీరు బరువు కోల్పోయే విషయానికి వస్తే, మీకు రోజులో అవసరమయ్యే మొత్తం క్యాలరీలను పూర్తిగా అల్పాహారం ద్వారా తీసుకోవాలి. రోజువారీ శరీర బరువును కోల్పోయేందుకు గానూ 1200 - 1800 వరకూ క్యాలరీల స్థాయి ఉండాలి. కాబట్టి, మీకు రోజువారీ క్యాలరీల పరిమితి గూర్చి బాగా తెలిసినప్పుడు ఆ మొత్తాన్ని మీరు మూడు సమాన భోజనాలుగా విభజించి, 100 - 200 కేలరీలను మీరు సాయంత్రం వేళలో తినే చిరుతిండి కోసం వదిలేయాలి.

మీరు శరీర బరువును కోల్పోవడానికి, మీ అల్పాహారం 350 - 550 కేలరీలను కలిగి ఉండాలి. కానీ, ప్రతిరోజూ బరువు తగ్గడానికి అవసరమైన కేలరీల సంఖ్యను నిర్ణయించి, వాటిని ధ్రువీకరించడానికి మీరు డాక్టర్ను సంప్రదించండి.

ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న పదార్థాలు :

ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న పదార్థాలు :

మీరు బరువు కోల్పోవటానికి ప్రయత్నిస్తున్నప్పుడు ప్రతి ఉదయం అల్పాహారంలో తినడం కోసం ప్రోటీన్ లను ఎక్కువగా కలిగి ఉన్న ఆహార పదార్థాన్ని వినియోగించండి. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్ల కంటే ఎక్కువగా, మీ కడుపు నిండిన భావన కలుగజేస్తూ ఉండటమే కాకుండా, మరోపక్క మీ శరీరంలో కొలువున్న అవాంఛిత కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది.

తెల్లని గుడ్డులో ఉండే కేలరీలు - 17, సహజసిద్ధమైన పెరుగులో ఉండే కేలరీలు - 100, తక్కువ కొవ్వు కలిగిన జున్నులో ఉండే కేలరీలు - 82, టోఫులో 46 కేలరీలుగా ఉన్న ఇలాంటి ప్రోటీన్లను కలిగిన పదార్థాలను ఎక్కువగా వినియోగించాలి.

ఫైబర్ ఎక్కువగా ఉన్న పదార్థాలు :

ఫైబర్ ఎక్కువగా ఉన్న పదార్థాలు :

ఈ ఫైబర్ కూడా మీ కడుపును పూర్తిగా నిండినట్లుగా ఉన్న భావనను దీర్ఘకాలం పాటు కలిగి ఉండేలా చేస్తుంది. ఫైబర్ ను అధికంగా కలిగి ఉండే మరి కొన్ని ఆహారపదార్ధాలు ఓట్మీల్, సంపూర్ణ ధాన్యములు, తృణధాన్యములు, స్ట్రాబెర్రీలు, ఆపిల్స్, టమోటాలు అలాగే బాదం కూడా.

అవోకాడోస్, నట్ బట్టర్స్, అవిసె గింజల వంటివి చాలా ఆరోగ్యకరమైన కొవ్వులను అలాగే ఫైబర్లను అధికంగా కలిగి ఉంటాయి.

ఆరోగ్యకరమైన అల్పాహార-మిశ్రమాలు :

ఆరోగ్యకరమైన అల్పాహార-మిశ్రమాలు :

మీ బరువు తగ్గుదలను విజయవంతం సాధించడానికి మీరు తీసుకునే అల్పాహారంలో అధికమైన ఫైబర్లను - ప్రోటీన్లను కలిగిన ఆహారాలను కలిపి వినియోగించే ప్రయత్నం చెయ్యండి. ఉదాహరణకు :- మీరు తృణధాన్యాలకు - తక్కువ కొవ్వును కలిగిన పాలను కలిపి వినియోగించవచ్చు. అదేవిధంగా వాటిని కొన్ని ముక్కలుగా చేసిన స్ట్రాబెర్రీస్ (లేదా) బాదములతో కలిపి కూడా తినవచ్చు.

మీరు గ్రీకు పెరుగులను ఓట్మీల్తోనూ, అలాగే ముక్కలుగా చేసిన ఆపిల్తోనూ కూడా కలిపి వినియోగించవచ్చు. మీరు గోధుమ పిండితో చేసిన 2 చపాతీలలో ఒకదాన్ని వెజ్ కూరతోనూ, మరొకదాన్ని తక్కువ కొవ్వును కలిగిన పాలతో కలిపి తినవచ్చు.

మీరు లాక్టోస్ను సరిపడని విధంగా ఉన్నట్లయితే, మీలో మీరు ప్రోటీన్ల స్థాయిలను అధికంగా పొందేందుకు స్ట్రాబెర్రీస్, గ్రీకు పెరుగు, పాలకూర, బాదాము లాంటి మొదలైన వాటిలో అల్పాహారముగా తీసుకోండి.

ఇతర అల్పాహారాలు :

ఇతర అల్పాహారాలు :

మీరు మీ చేతిలో ఎక్కువ సమయాన్ని కలిగి ఉంటే, మీరే సంప్రదాయమైన, ఆరోగ్యకరమైన అల్పాహారమును తయారు చేసుకోవచ్చు. ఉదాహరణకు :- తేనే, దాల్చిన చెక్కలతో కలిసిన అరటి పాన్-కేక్ (లేదా) ఓట్మీల్ పాన్-కేక్ వంటివి మీ బరువును తగ్గించడంలో సహాయపడే ఒక పరిపూర్ణ ఆహారము. అలాగే మీరు ఉప్మాతో పాటు దోసెను (లేదా) ఇడ్లీని కలిగి ఉండవచ్చు, ఇది కూడా మీ శరీర బరువు తగ్గటంలో మీకు బాగా సహాయపడుతుంది.


English summary

What To Eat For Breakfast When Trying To Lose Weight

A healthy nutritious breakfast can boost your weight loss. The daily weight loss calorie needs range from 1200 calories to 1800 calories a day. Choose one protein-rich food to eat for breakfast every morning because protein increases satiety. To make your weight loss process successful, try combining high-protein foods with fibre-rich foods for breakfast.
Story first published:Friday, March 16, 2018, 17:53 [IST]
Desktop Bottom Promotion