For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎప్పుడూ ఫిట్ గా ఉండేందుకు ‘హిట్ మ్యాన్’ఏమి చేస్తాడో చూసేయ్యండి...

|

అంతర్జాతీయ క్రికెట్లో రెండుసార్లు డబుల్ సెంచరీలు చేసిన ఆటగాడు ఎవరని అంటే టక్కున మన రోహిత్ శర్మ పేరే అందరికీ గుర్తొస్తుంది. ఇండియా తరపున ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎవ్వరు సాధించలేని ఫీట్ ను సాధించాడు రోహిత్.

అదొక్కటే కాదు.. టి20ల్లో, వన్డేల్లో రోహిత్ శర్మ సిక్సర్లను అలవోకగా బాదేస్తాడు. ఇలా రికార్డుల మీద రికార్డులు కొట్టడానికి కారణమేంటో తెలుసా... తన ఫిట్ నెస్ అండ్ వర్కవుట్లతో, కఠోర శ్రమ అని రోహిత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

రోహిత్ శర్మ మాటల్ని బట్టే తను ఫిట్ నెస్ మరియు డైట్ పై ఎలాంటి శ్రద్ధ తీసుకుంటాడో అర్థమవుతోంది. ఈ సందర్భంగా రోహిత్ శర్మ ఎలాంటి వర్కవుట్లను చేస్తాడు.. రోటీన్ డైట్ లో ఏమేమి తీసుకుంటాడనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ధోనీ డైట్ సీక్రెట్స్, వర్కవుట్లను ఫాలో అయితే మీకు సిక్స్ ప్యాక్ ఖాయం...!

ఉదయాన్నే..

PC : twitter

రోహిత్ శర్మ ప్రతిరోజూ ఉదయాన్నే ప్రోటీన్లు ఉండే ఆహారంతో ప్రారంభిస్తాడు. ఉదయాన్నే వ్యాయామం తర్వాత ఓట్స్ మరియు పాలను తీసుకుంటాడు. కొంతమందికి ఓట్స్ అంటే అస్సలు ఇష్టముండదు. అలాంటి వారందరికీ రోహిత్ ఏమి చెబుతున్నాడంటే.. 'మీకు ఓట్స్ ఇష్టం లేకపోతే.. ముందుగా కొద్దిగా ట్రై చెయ్యండి.. మీరు దాన్ని కొంత ఎక్కువగా ఇష్టపడినప్పుడు లేదా అది మీకు రుచికరంగా అనిపించినప్పుడు ఎక్కువగా తీసుకోండి' అని కూడా చెబుతున్నాడు.

రెగ్యులర్ గా గుడ్లు..

PC : Twitter

రోహిత్ శర్మ కచ్చితమైన డైట్ ఫుడ్ తీసుకుంటాడు. తన రెగ్యులర్ ఫుడ్ లో కచ్చితంగా కోడిగుడ్లు తీసుకుంటాడు. అయితే తాను శాకాహారి. కానీ కోడిగుడ్లను మాత్రం తీసుకుంటాడు. ఎందుకంటే గుడ్డు శాకాహారమే అని శాస్త్రవేత్తలు కూడా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే విచిత్రమేమిటంటే తను డజన్ల కొద్దీ గుడ్లను ఒకేరోజులో తినేస్తాడట.

అర్థరాత్రి తినడం..

రోహిత్ శర్మకు అర్థరాత్రి తినడం అలవాటుగా మారిపోయిందట. 'నేను అర్థరాత్రి సమయంలో ఎక్కువగా తినడం వల్ల నేను బరువు త్వరగా తగ్గలేకపోయాను. అప్పుడు నేను అసలు విషయం గ్రహించాను. ఆ తర్వాత నేను ప్రతిరోజూ రాత్రి 8 గంటలకు భోజనం చేయడం ప్రారంభించాను.

ఫిట్ నెస్ సెంటర్లో..

ఫిట్ నెస్ సెంటర్లో..

PC : Twitter

తను ఖాళీగా ఉన్న సమయంలో తన ఫిట్ నెస్ ట్రైనర్ తో కలిసి ఎక్కువగా ఫిట్ నెస్ సెంటర్లో పాల్గొంటారట. అక్కడే చాలా సేపు గడుపుతాడట. రోహిత్ ఎక్కువగా క్రంచీస్, లెగ్ రైజెస్ మరియు పుషప్స్ వంటి కోర్ ఎక్సర్ సైజులపై ఎక్కువ ఫోకస్ పెడతాడట.

అలా చేయడం వల్ల..

అలా చేయడం వల్ల..

అలా ఎక్కువగా ఎక్సర్ సైజ్ చేయడం వల్ల కండరాలు బాగా పెరుగుతాయని చెబుతున్నాడు. అంతేకాదు ఇవి ఎవ్వరికైనా బరువు తగ్గేందుకు చాలా బాగా ఉపయోగపడతాయని సలహా ఇస్తున్నాడు.

కార్బోహైడ్రేట్లు తక్కువగా..

కార్బోహైడ్రేట్లు తక్కువగా..

అలాగే తను తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాడట. వీటిని ఎంత తక్కువగా తీసుకుంటే, మన జీవక్రియ మెరుగుదలకు అంత ఉపయోగపడుతుందని చెబుతున్నాడు. అంతేకాదు ఇది మన బాడీలోని కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా అదుపులో ఉంచుతుందట.

తన కెరీర్ ప్రారంభ దశలో..

తన కెరీర్ ప్రారంభ దశలో..

రోహిత్ కెరీర్ ప్రారంభ దశలో ఫిట్ నెస్ పై ఎక్కువ శ్రద్ధ చూపేవాడు కాదట. ఎందుకంటే తనకు డైట్ అండ్ ఫిట్ నెస్ పై పెద్దగా అవగాహన ఉండేది కాదట. అయితే తనలో కొన్నేళ్లుగా ఫిట్ నెస్ విషయంలో చాలా మార్పు వచ్చిందని.. నేను నిపుణులను కలిసి కొన్ని విలువైన విషయాలను నేర్చుకున్నాను.. అవి నా బాడీ ఫిట్ గా ఉండేందుకు బాగా సహాయపడ్డాయని చెప్పాడు.

వడపావ్, బిర్యానీ ఇష్టం..

వడపావ్, బిర్యానీ ఇష్టం..

రోహిత్ శర్మకు ముంబై నగరానికి చెందినవాడు కావడంతో తనకు వడపావ్ అంటే చాలా ఇష్టమని చెబుతున్నాడు. అలాగే హైదరాబాదీ బిర్యానీ కూడా అమితంగా ప్రేమిస్తాడట రోహిత్. అయితే వాటిని పరిమితికి లోబడి తీసుకుంటాడట.

English summary

Cricketer Rohit Sharma Workout Routine And Diet Plan in Telugu

Here we talking about rohit sharma workout routine and diet plan in telugu. Take a look.