For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీకు తెలుసా? వెల్లుల్లి తినడం ద్వారా కూడా బరువు తగ్గించుకోవచ్చట!

మీకు తెలుసా? వెల్లుల్లి తినడం ద్వారా కూడా బరువు తగ్గించుకోవచ్చట!

|

నాలుకకు రుచిగా ఉండటం వల్ల మనకి లభించిన ప్రతి ఆహారాన్ని మనం తింటాము. అదేవిధంగా, మనం తినే అనారోగ్యకరమైన ఆహారాల వల్ల శరీరంలో ఊబకాయం అభివృద్ధి చెందుతుంది. బొజ్జ వస్తుంది. ఫలితంగా, ఇది అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అటువంటి సందర్భంలో, ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి ఊబకాయం తగ్గించుకోవడం, బొజ్జ కరిగించడం చాలా అవసరం. ఊబకాయం తగ్గించుకోవడాని, బొజ్జ కరిగించుకోవడానికి చాలా మార్గాలున్నాయి. ఊబయాకం తగ్గించుకోవడానికి మరియు బొజ్జ కరిగించుకోడానికి అనేక వ్యాయామాలు, తరగతులు, శిబిరాలు మరియు మందులు అందుబాటులో ఉన్నాయి.

Did You Know Garlic also helpfull for Weight Loss!

ఊబకాయం, బొజ్జ అనేది మనకు పెద్ద తలనొప్పి. అయితే అదే ఊబకాయం , బొజ్జ కరిగించుకోవడానికి కొంతమంది డబ్బును కోల్పోయేలా చేస్తుంది. జిమ్మలకు, ఇతర డైట్లకంటూ ఎంతో డబ్బు ఖర్చు చేస్తుంటారు. సరైన ఆహారం మరియు వ్యాయామంతో ఊబకాయంతో పాటు పొట్టను కూడా కరిగించుకోవచ్చు. దీనికి ఎటువంటి అడ్డదారులు లేవు. డైటింగ్ అంటే మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడం మరియు ఆరోగ్యంగా ఉండటానికి వ్యాయామం చేయడం. నిద్రలేచిన వెంటనే వేడినీరు తాగడం, పచ్చి కూరగాయలు తినడం. అలాంటి ఆహారం వేగంగా బరువు తగ్గడానికి మీకు సహాయపడుతుంది. శరీరంలో ఊబకాయాన్ని కరిగించడానికి అడ్డదారులు తొక్కకుండా. అయితే కొన్ని వంటింటి చిట్కాలును సరిగ్గా ఉపయోగించినట్లయితే ప్రభావవంతంగా పనిచేస్తాయి. బరువు తగ్గడానికి మీకు సహాయపడే కొన్ని ఇంటి నివారణలు ఇక్కడ ఉన్నాయి. అవేంటో చూద్దాం.

వెల్లుల్లి

వెల్లుల్లి

మీరు ఏ రకమైన వంటింటి చిట్కాలను ఉపయోగించాలని చూస్తున్నారో అలాంటి వాటిలో వెల్లల్లి ఒకటి. మనం ప్రతి రోజూ తినే ప్రతి ఆహారంలోనూ దాదాపు వెల్లుల్లి తరచుగా వాడుతుంటాము. ఇది కొంచెం ఘాటైన వాసన కలిగి ఉంటుంది. కానీ ఇందులో చాలా ఔషధ లక్షణాలను కలిగి ఉన్నాయి. వెల్లుల్లిలో విటమిన్ బి 6, విటమిన్ సి, ఫైబర్, మెగ్నీషియం, కాల్షియం, ప్రోటీన్ మరియు చక్కెర ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది మరియు గుండె జబ్బులను నివారిస్తుంది మరియు రక్త నాళాలను సడలించి రక్తం సరిగా ప్రసరించేట్లు చేస్తుంది. బరువు తగ్గడానికి వెల్లుల్లిని ఎలా ఉపయోగించాలో ఇక్కడ మనం తెలుసుకుందాం.

వెల్లుల్లిలో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి

వెల్లుల్లిలో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి

అవును, వెల్లుల్లిల్లో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మనకు ఇప్పటికే తెలుసు. మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటే వెల్లుల్లిని ఉపయోగించవచ్చని వివిధ అధ్యయనాలు పేర్కొన్నాయి. మనం వెల్లుల్లి ఎలా తినాలో చాలా ప్రాముఖ్యత ఉంది. వెల్లుల్లిని మనం ఏవిధంగా తీసుకుంటామో దాన్ని బట్టి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. వెల్లుల్లి శక్తి స్థాయిలను పెంచుతుంది మరియు కేలరీలను బర్న్ చేస్తుంది. వెల్లుల్లిలో అల్లిసన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది అల్లిన్ ను అల్లిసిన్‌గా మార్చుతుంది. అధ్యన ప్రకారం వెల్లుల్లిని 45 నిమిషాలు ఓవెన్ లో వెల్లుల్లి తినవచ్చని, తద్వారా దానిలోని ఆరోగ్యఅంశాలు పోవు మరియు ఆరోగ్య ప్రయోజనాలు పొందుతవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. వెల్లుల్లిని చూర్ణం చేసి పది నిమిషాలు వదిలి ఆపై ఒక డిష్‌లో తినాలని చెబుతారు. ఇలా తినడం వల్ల ఎక్కువ ఆరోగ్య లాభాలను పొందుతారని పేర్కొనబడినది. బరువు తగ్గడానికి వెల్లుల్లిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వెల్లుల్లి మరియు తేనె

వెల్లుల్లి మరియు తేనె

తేనె మరియు పచ్చి వెల్లుల్లి కలయిక బరువు తగ్గడానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ మిశ్రమాన్ని తయారు చేయడం చాలా సులభం. 2-3 వెల్లుల్లి పొట్టు తీసి తేనెతో కలపండి. కొద్దిసేపు అలాగే ఉండనివ్వండి, తరువాత పరగడుపుతో తినండి. తాజా తేనె వాడటం మంచిది. ఎందుకంటే ఇందులో సహజ చక్కెర ఉంటుంది. ఇది ప్రాసెస్ చేయబడదు మరియు పాశ్చరైజ్ చేయబడదు.

వెల్లుల్లి మరియు నిమ్మరసం

వెల్లుల్లి మరియు నిమ్మరసం

వెల్లుల్లి నిమ్మరసంతో కలిపి తినవచ్చు. ఒక కప్పు వేడి నీటిలో కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి మరియు అందులోనే ఒక వెల్లుల్లిని కచపచ దంచి ఆ నీటిలో జోడించండి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, నిమ్మరసం మరియు వెల్లుల్లి మీ బరువు తగ్గడానికి సహాయపడతాయి.

పరగడపుతో తీసుకునే వెల్లుల్లి చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది

పరగడపుతో తీసుకునే వెల్లుల్లి చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది

వెల్లుల్లిని గోరువెచ్చని నీటితో కలపి పరకడుపు తాగితే ప్రభావంతమైన ఫలితాలను పొందుతారు. బరువు తగ్గడానికి వెల్లుల్లి వల్ల ఇది అతి పెద్ద ప్రయోజనం. ఉడికించిన వెల్లుల్లి కంటే పచ్చి వెల్లుల్లి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. బరువు తగ్గడానికి ఇది కీలకం. 2-3 వెల్లుల్లిని కచపచ దంచి పది నిముషాల పాటు అలాగే ఉంచి, ఆపై నీటిలో వేసి త్రాగాలి.

బరువు తగ్గడానికి మీరు వెల్లుల్లిని ఉపయోగించే ముందు డైటీషియన్ లేదా న్యూట్రిషనిస్ట్ నుండి సలహా పొందండి. వెల్లుల్లిని అతిగా తినడం మానుకోండి.

English summary

Did You Know Garlic also helpfull for Weight Loss!

Proper diet and intense workout are the ultimate solutions if you plan to lose weight. There are no shortcuts in between. Diet keeps you healthy and workout makes you fit. Drinking warm water in morning, eating green, etc; are some good dietary practices that can help you lose weight faster. It is true that there are no shortcuts for weight loss but you might agree that home remedies sometimes works really great to lose weight. Home remedies are like hacks that give boost to your weight loss mission.
Desktop Bottom Promotion