For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Virat Kohli Diet:కెప్టెన్ కోహ్లీ వర్కవుట్ల విషయంలో తగ్గట్లేదుగా...

|

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫిట్ నెస్ కు ఎంత ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాను శారీరకంగా బలంగా ఉండేందుకు అను నిత్యం అనేక వర్కవుట్లు చేస్తుంటాడు.

క్రికెట్ ఆడే సమయంలో అయినా.. ఇతర సమయంలో అయినా ప్రతిరోజూ ప్రాక్టీస్ మాత్రం చేస్తూనే ఉంటాడు. అందుకే తను ఫిట్ నెస్ విషయంలో ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉంటూ యువ క్రికెటర్లతో పాటు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. అయితే టీమిండియా కెప్టెన్ ప్రస్తుతం ఇంగ్లాండ్ టూర్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ తర్వాత టీమిండియాకు సుమారు 40 రోజుల విరామం దొరకడంతో క్రికెటర్లంతా తమ ఫ్యామిలీతో, సన్నిహితులతో కలిసి విహార యాత్రలకు వెళ్లారు. అందమైన కొత్త ప్రాంతాలను చుట్టేస్తూ.. నూతనోత్తేజాన్ని సొంతం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే విరుష్క జంట కూడా లండన్ చుట్టుపక్కల ప్రదేశాల్లో విహరిస్తూ విశ్రాంతి తీసుకుంటున్నాడు.

అయితే అక్కడ కూడా కెప్టెన్ కోహ్లీ అక్కడ కూడా కఠినమైన వర్కవుట్లు చేస్తూ తన ఫిట్ నెస్ పై పూర్తిగా ఫోకస్ పెట్టాడు. తాజాగా అందుకు సంబంధించిన వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుని అభిమానులను అలరించారు. ఎంతో బరువైన డంబుల్స్, బార్బెల్స్ మోస్తూ తన సాధన పూర్తి చేశాడు. ఇదే విషయంపై ఎందరో మాజీ క్రికెటర్లు తనను ప్రశంసలతో ముంచెత్తారు.

ప్రతి మ్యాచ్ లోనూ దాదాపు హాఫ్ సెంచరీ లేదా సెంచరీ కొట్టే కింగ్ కొహ్లీ వయసు పెరుగుతున్నా కూడా అంత బలంగా ఎలా ఉంటాడు.. మాంసాహారం కూడా మానేసిన ఈ క్రికెటర్ బంతిని బలంగా ఎలా బాదుతాడనే అనుమానం చాలా మందికి వచ్చింది. తన బాడీ ఫిట్ నెస్ కోసం విరాట్ కోహ్లీ గంటల తరబడి జిమ్ లో గడుపుతాడా? ప్రతిరోజూ కఠినమైన వర్కవుట్లను చేస్తాడా? లేదా ఆహారం విషయంలో ఏవైనా జాగ్రత్తలు పాటిస్తాడా అనే ప్రశ్నలన్నింటికీ విరాట్ కోహ్లీనే ఓ ఇంటర్వ్యూలో సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ డైట్ అండ్ ఫిట్ నెస్ సీక్రెట్స్ ఏంటో తెలుసుకుందాం రండి...

ఉదయాన్నే కోడిగుడ్డు..

ఉదయాన్నే కోడిగుడ్డు..

కోహ్లీ ఉదయం తీసుకునే ఆహారంలో కోడిగుడ్డు కచ్చితంగా ఉండాలట. ప్రతిరోజూ మూడు కోడిగుడ్లను బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటారట. దీంతో పాటు ఆకుకూరలు, బ్లాక్ పెప్పర్, వెన్నను క్రమం తప్పకుండా తీసుకుంటాడట. ఆ తర్వాత బొప్పాయి, డ్రాగన్ ఫ్రూట్, పుచ్చకాయను రెగ్యులర్ గా తీసుకుంటాడట. చివరగా గ్రీన్ టీతో తన టిఫిన్ ను ముగిస్తాడట.

లంచ్ సమయంలో లైట్ గా..

లంచ్ సమయంలో లైట్ గా..

విరాట్ కోహ్లీ బ్రేక్ ఫాస్ట్ తీసుకున్న తర్వాత లంచ్ మాత్రం లైట్ గా తీసుకుంటాడట. మధ్యాహ్నం లంచ్ సమయంలో ఉడికించిన బంగాళదుంపలు, పాలకూర, ఇతర కూరగాయాలను ఎక్కువగా తీసుకుంటాడట. డిన్నర్ ను మాత్రం డాక్టర్ల సలహా మేరకే స్వీకరిస్తాడట.

ఎలాంటి వర్కవుట్లంటే..

ఎలాంటి వర్కవుట్లంటే..

విరాట్ కోహ్లీ జిమ్ లో ఎక్కువగా ఈ వర్కౌట్లను బాగా ఇష్టపడతాడట. ఇదే విషయాన్ని ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు. తన బరువును బ్యాలెన్స్ చేసుకోవడానికి ఎక్కువగా వెయిట్లు, కార్డియోలను చేయడానికి ఆసక్తి చూపుతాడట. బరువు తగ్గేందుకు ఇది ఉత్తమమైనదని చెప్పాడు. తాను కూడా రెగ్యులర్ గా ఇదే ఫాలో అవుతానన్నాడు.

విరాట్ డైట్ అండ్ ఫిట్ నెస్ సీక్రెట్స్ ఫాలో అయితే ఈజీగా బరువు తగ్గొచ్చు...!విరాట్ డైట్ అండ్ ఫిట్ నెస్ సీక్రెట్స్ ఫాలో అయితే ఈజీగా బరువు తగ్గొచ్చు...!

రెండ్రోజుల విరామం..

రెండ్రోజుల విరామం..

విరాట్ కోహ్లీ వారంలో మొత్తం 5 రోజుల పాటు వర్కవుట్లు చేస్తే... రెండు రోజులు మాత్రం పూర్తిగా విశ్రాంతి తీసుకుంటాడట. వర్కవుట్ల తర్వాత రెస్ట్ అనేది చాలా అవసరమని, వర్కవుట్ల తర్వాత విశ్రాంతి తీసుకుంటేనే బాడీ రీచార్జ్ అవుతుందని.. ఈ విషయాన్ని మరచిపోవద్దని చెప్పాడు.

చెడు అలవాట్లు లేవట..

చెడు అలవాట్లు లేవట..

విరాట్ కోహ్లీ మూడు పదుల వయసు దాటినా కూడా పూర్తి ఫిట్ గా ఉండటానికి కారణం తనకు ఎలాంటి చెడు అలవాట్లు లేకపోవడమే. ఈ విషయంలో కోహ్లీ చాలా మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. తనకు పొగతాగడం మరియు మందు తాగడం అలవాట్లే లేవంట. చాలా మంది సెలబ్రెటీలంతా రాత్రి వేళ పొగతాగడం.. మందు కొట్టడం చేస్తుంటారు. కానీ విరాట్ కోహ్లీ మాత్రం చాలా కంట్రోల్ లో ఉంటాడట.

చిరుతిళ్ల జోలికి వెళ్లడు..

చిరుతిళ్ల జోలికి వెళ్లడు..

విరాట్ కోహ్లీ రాత్రి సమయంలో లైట్ ఫుడ్ తీసుకోవడాన్ని ఇష్టపడతాడట. ముఖ్యంగా ప్రోటీన్ షేక్స్ మరియు పిండి పదార్థాలు(ఆరోగ్యకరమైన వనరులు) ఉండే ఆహారాన్ని తీసుకుంటాడట. అంతేగానీ.. జంక్ ఫుడ్ జోలికి మాత్రం అస్సలు వెళ్లడట.

ఇతర ఆటలు..

ఇతర ఆటలు..

తనకు ఫిట్ నెస్ ముఖ్యం కాబట్టి.. కేవలం క్రికెట్ మాత్రమే కాకుండా అప్పుడప్పుడు ఫుట్ బాల్, వాలీబాల్, టెన్నిస్ వంటి ఆటలు కూడా ఆడుతుంటాడట. ఇలా ఆడటం వల్ల క్రికెట్ పై విసుగు పుట్టకుండా ఉంటుందట. అంతేకాదు ఎక్సర్ సైజ్ చేయడానికి ఇవి అత్యుత్తమైన మార్గాలని చెబుతున్నాడు.

English summary

Virat Kohli's Latest Workout and Diet Tips in Telugu

Here are the Virat Kohli's Latest Workout and Diet Tips in Telugu. Take a look
Story first published: Saturday, July 10, 2021, 16:41 [IST]