For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జిమ్ కు వెళ్లకుండా వెయిట్ తగ్గాలంటే... ఇవి ట్రై చెయ్యండి...

|

మనలో చాలా మంది ప్రతిరోజూ బరువు పెరుగుతున్నామని.. వెంటనే బరువు తగ్గాలని.. అదీ అద్దంలో చూసుకున్న ప్రతిసారీ వెయిట్ లాస్ కోసం జిమ్ లో జాయిన్ కావాలనుకోవడం సహజం.

కానీ నోరూరించే ఫుడ్ ను చూసినప్పుడు బరువు గురించి మొత్తం మరచిపోతారు. దీంతో వెయిట్ ఆటోమేటిక్ పెరుగుతారని తెలిసినా.. అదే కానిచ్చేస్తారు. ఆ తర్వాత జిమ్ లో జాయిన్ అవుతారు. కానీ టైమ్ కుదరక దానికీ సరిగా వెళ్లరు.

వారంలో ఒకసారి.. లేదా రెండు వారాలకు ఒకసారి జిమ్ కు వెళ్లలేక, కఠినమైన ఎక్సర్ సైజులు చేయలేక మానేస్తుంటారు. ముఖ్యంగా బాడీ పెయిన్స్ పేరిట జిమ్ కు వెళ్లడానికి భయపడతారు. అయితే మీరు జిమ్ కు వెళ్లకుండా బరువు తగ్గడానికి కొన్ని సులభమైన మార్గాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి...

ప్రతిరోజూ ఉదయాన్నే..

ప్రతిరోజూ ఉదయాన్నే..

బరువు తగ్గేందుకు మనలో ఒక్కొక్కరు ఒక్క రూట్ ను సెలెక్ట్ చేసుకుంటారు. కొందరు ఎక్సర్ సైజ్ బెటర్ అనుకుంటే.. మరికొందరు డైట్ ఫాలో అయితే చాలని ఫీలవుతారు. అయితే ఇవేవీ చేయకుండా కూడా వెయిట్ లాస్ కావొచ్చు. అందుకోసం ప్రతిరోజూ ఉదయాన్నే బ్లాక్ కాఫీని తాగండి. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఒక వారంలో మీరు 500 కేలరీల వరకు వెయిట్ తగ్గుతారు. మీ ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. షుగర్ ఉండే వారికి కూడా ఇది చాలా మంచిగా పని చేస్తుంది.

యోగా చేయండి..

యోగా చేయండి..

యోగా అనేది మనం ఎప్పుడు.. ఎక్కడ ఉన్నా సులభంగా చేసే వ్యాయామం. దీనికి ఎలాంటి ఎక్విప్ మెంట్స్ అవసరం లేదు. మీ ఇంట్లో లేదా పార్కులో లేదా ఇంకా ఏ ప్రాంతంలో అయినా సులభంగా దీనిని చేయొచ్చు. అయితే మ్యాట్ ఉంటే చాలా మంచిగా ఉంటుంది. అప్పుడప్పుడు అది లేకపోయినా యోగా చేయొచ్చు. ఇది మీ కండరాలను బలంగా మార్చేందుకు దోహదం చేస్తుంది.

టైమ్ కు నిద్ర..

టైమ్ కు నిద్ర..

ఎవరైతే సరైన సమయానికి ఆహారం తీసుకుని.. సరైన సమయంలో నిద్రపోతారో వారికి అనారోగ్యాలు అనేవి దరి చేరవు. అయితే చాలా మంది నిద్ర విషయంలో కొంత నిర్లక్ష్యంగా ఉంటారు. కాబట్టి ఇప్పటినుండి నిద్ర విషయంలో టైమ్ మెయింటెయిన్ చేయండి. దీని వల్ల మీ బాడీలో ఎలాంటి ఫ్యాట్ ఏర్పడదు. దీని వల్ల మీరు సులభంగా బరువు తగ్గొచ్చు.

నీరు ఎక్కువగా..

నీరు ఎక్కువగా..

ఇప్పుడు వేసవి కాలం ప్రారంభమైంది కాబట్టి.. మీరు ఎక్కడికెళ్లినా ఒక వాటర్ బాటిల్ ను వెంట తీసుకెళ్లండి. దాహం వేసిన ప్రతిసారీ నీళ్లను తాగేయండి. ఎందుకంటే మనలో చాలా మంది తాగాల్సిన సమయంలో కాకుండా అనవసరమైన సమయంలో నీళ్లు తాగుతుంటారు. దీంతో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి వీలైనంత ఎక్కువగా నీరు తాగండి. దీని వల్ల వీరు అధిక బరువు నుండి తప్పించుకుంటారు. అంతేకాదు స్లిమ్ గా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

కొన్ని పరిశోధనల్లో..

కొన్ని పరిశోధనల్లో..

కొందరు బరువు తగ్గేందుకు ఫ్యాట్ ఫ్రీ ఆహారం తీసుకోవాలని డిసైడ్ అవుతారు. అయితే కొవ్వు పదార్థాలు తీసుకున్నా కూడా ఎక్కువగా వెయిట్ లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి పాల ఉత్పత్తులకు సంబంధించిన పదార్థాలు తిన్న వారు కూడా సులభంగా బరువు తగ్గారని కొన్ని అధ్యయనాల్లో తేలింది.

చిరుతిళ్లను తినండి..

చిరుతిళ్లను తినండి..

మీకు ఎప్పుడైనా బాగా ఆకలి వేసినప్పుడు వెంటనే తినేస్తే ఏ సమస్యా ఉండదు. ముఖ్యంగా చాలా మంది ఉదయాన్నే వాకింగ్ లేదా జాగింగ్ కు వెళ్లినప్పుడు బాగా ఆకలి అవుతుంది. అప్పుడు వారు ఎలాంటి ఆహారం తీసుకోరు. దీంతో వారు మరింత ఎక్కువగా తింటూ ఉంటారు. దీంతో వెయిట్ ఈజీగా పెరిగిపోతారు. అలా కాకుండా మీ వద్ద ఏదైనా చిరుతిళ్లను ఉంచుకోండి. మీకు ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు వాటిని తినండి. దీని వల్ల వెయిట్ కంట్రోల్ లో ఉంటుంది.

సైకిల్ తొక్కేయండి..

సైకిల్ తొక్కేయండి..

మనలో చాలా మందికి సైకిల్ తొక్కే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా చిన్నప్పుడు మనం సైకిల్ తొక్కేందుకు బాగా ఇష్టపడేవాళ్లం. కానీ పెద్దయ్యాక దానికి గుడ్ బై చెప్పేసి, బైక్ లేదా కారు వంటి వాటిపై ఆసక్తి చూపుతుంటాం. అయితే ఈ సైకిల్ తొక్కడాన్ని మరోసారి ప్రారంభించండి. దీని వల్ల మీ బాడీలో క్యాలరీలు కరగడంతో పాటు ఎంతో ఉత్సాహం, ఆనందం కూడా మీ సొంతం అవుతుంది.

గేమ్స్ ఆడండి..

గేమ్స్ ఆడండి..

మీ రెగ్యులర్ లైఫ్ లో గేమ్స్ ను కూడా ఒక భాగం చేసుకుంటే.. మీరు ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. ఇలా చేస్తే మీకు తెలియకుండానే బరువు తగ్గుతారు. టెన్నిస్, బాస్కెట్ బాల్, వాలీబాల్, ఫుట్ బాల్, బ్యాడ్మింటన్ ఇలా ఏదో ఒక ఆటను మీ స్నేహితులతో కలిసి ఆడండి. దీని వల్ల మీ క్యాలరీలు సులభంగా తగ్గుతాయి. అయితే దీన్ని ఎక్సర్ సైజుగా మాత్రం భావించకండి.

మెట్లెక్కడం..

మెట్లెక్కడం..

మీరు రెగ్యులర్ ఆఫీసుకు వెళ్తున్నా.. మీరు మీ అపార్ట్ మెంటులో లేదా ఇంకా ఎక్కడైనా పై ఫ్లోర్ లో ఉంటే లిఫ్ట్ ను వాడకండి. మెట్లను రెగ్యులర్ గా వాడండి. దీని వల్ల మీ బాడీలో చాలా క్యాలరీలు ఖర్చవుతాయి. దీని వల్లే ఎన్నో లాభాలున్నాయని గుర్తుంచుకోండి.

రన్నింగ్ చేయండి..

రన్నింగ్ చేయండి..

వెయిట్ లాస్ అయ్యేందుకు అన్నింటికన్నా సులవైన మార్గం రన్నింగ్ చేయడం. మీరు ఎక్కడున్నా.. ప్రతిరోజూ ఉదయం స్పోర్ట్స్ షూస్ వేసుకుని, మంచి మ్యూజిక్ వింటూ కొంత దూరం పరిగెడితే చాలు.. మీ వెయిట్ ను సులభంగా తగ్గించుకోవచ్చు. అయితే కనీసం ఇరవై నిమిషాల పాటు రన్నింగ్ చేసేలా ప్లాన్ చేసుకోండి. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి.

English summary

Ways To Slim Without The Gym In Telugu

Here are these ways to slim without the gym in Telugu. Take a look
Story first published: Wednesday, March 3, 2021, 11:48 [IST]