For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

world sleep day 2020 : గురకతో కునుకు పాట్లా...?చిట్కాలివిగో

గురక చిరాకు తెప్పించడమే కాదు కొన్ని గురకలు భయాన్ని పుట్టిస్తాయి.

|

సాధారణంగా మన పక్కన పడుకున్న వాళ్ళు ఎవరైనా గురక పెడుతుంటే మనకు నిద్ర పట్టదు. మహా చిరాకు పెడుతుంది. అందులోనూ గురకలు కూడా రకరకాలుగా పెడుతుంటారు. గురక చిరాకు తెప్పించడమే కాదు కొన్ని గురకలు భయాన్ని పుట్టిస్తాయి. ఇప్పటికీ కొన్ని పాశ్చాత్య దేశాల్లో మొగుడి గురక తట్టుకోలేక విడాకులకై కోర్టులకు పరుగెత్తిన వాళ్ళూ ఉన్నారంటే ఆశ్చర్యం కలగక తప్పదు. ప్రపంచ జనాభాలో కనీసం 40 శాతం మంది గురకపెట్టే వారే! పిల్లల్లో సైతం ఇది కనబడుతుంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ గురక ఎక్కువవుతుంది. అలాగే బరువు పెరుగుతున్న కొద్దీ ఈ సమస్య పెరుగుతుంది. గురక పెట్టేవాళ్ళు రాత్రి సరిగ్గా నిద్రపోక పగలు కునికి పాట్లు పడుతూ వాహనాలు నడిపేటప్పుడు యాక్సిడెంట్లు చేస్తారని పలు అధ్యయనాల్లో తేలింది.

అంతే కాదు, ఈ గురక పెట్టే వారిలో మరికొన్న లక్షణాలు కూడా ఉన్నాయి. గురక వల్ల నిద్రాభంగం, వేకువజామున తీవ్రంగా తలనొప్పిగా ఉండటం. పగటి నిద్ర, ఏపని చేసినా పని మీద ఏకాగ్రత లేకపోవడం, వ్యక్తిత్వంలో మార్పులు, రాత్రివేళల్లో ఎక్కువ మూత్రం, హై బిపి, హార్ట్‌ ఎటాక్, అంగస్తంభన సమస్యలు లక్షణాలు కనబడుతాయి. ఇలా తీవ్రమైన లక్షణాలున్నప్పుడు డాక్టర్ ను తప్పనిసరిగా కలవాల్సి ఉంటుంది.

గురక అంటే ఏమిటి? శ్వాస లోపలికి తీసుకునేప్పుడు ముక్కు నుంచి స్వరపేటిక వరకు ఎక్కడైనా నాళాలు సన్నబడ్డా, శ్వాసద్వారాలు మూసుకుపోయినా, గాలి లోపలికి బలవంతాన తీసుకుంటున్నప్పుడు వచ్చే శబ్దమే గురక. నాళాలు సన్నగా ఉండడంతో బలవంతాన గాలి తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి గురకలో గాలి ఎక్కువ తీసుకుంటున్నారేమో అనిపిస్తుంది చూసేవారికి. గొతులో ఉండే కండరాల బిగువు తగ్గినప్పుడు అంగిట్లో చివరి భాగాన ఉండే కండరం సాఫ్ట్‌ పాలట్‌తో బాటు చుట్టుపక్కల ఉన్న ఫారింక్స్‌ కండరాలు, కొండ నాలుక బలంగా లోపలికి పీల్చే గాలి వల్ల కంపిస్తాయి. ఈ కంపనం వల్ల వచ్చే శబ్దమే గురక.

నిద్రలో బలవంతాన తీసుకున్న గాలిని తిరిగి సన్నని శ్వాసనాళాల ద్వారా బయటకు నెట్టడం కష్టమై శ్వాస నోటి ద్వారా కూడా జరుగుతుంటుంది. అప్పుడు పెదాలు కంపించి కొన్ని రకాల శబ్దాలు వస్తుంటాయి. ముక్కు షేప్ వంకరగా ఉన్నా, అడినాయిడ్స్‌, టాన్సిల్స్‌ ఉన్నా శ్వాసమార్గం సన్నబడుతుంది. ఊపిరి తేలికగా లోపలికి వెళ్ళదు. గురక వల్ల నిద్ర సరిగా పట్టదు. మెలకువగా ఉన్నప్పటికన్నా నిద్ర పోయేటప్పుడు శ్వాస సరిగా ఉండేట్లు శస్తచ్రికిత్స చేయించుకోవాలి. అడినాయిడ్స్‌, టాన్సిల్స్‌ గాని ఉంటే తీయించాలి. థైరాయిడ్‌ వ్యాధి ఉన్న వాళ్ళు థైరాయిడ్‌ హార్మోన్లు తీసుకోవాలి. ఊబకాయంతో బాధపడేవారు బరువు తగ్గించుకోవాలి. వీటితో పాటు కొన్ని హోం రెమెడీస్ తో కూడా గురకను నివారించుకోవచ్చు. మరి ఆ హోం రెమెడీస్ ఏంటో చూద్దాం....

1. పెప్పర్ మింట్ ఆయిల్:

1. పెప్పర్ మింట్ ఆయిల్:

పెప్పర్ మింట్ ఆయిల్ గొంతు, మరియు శ్వాసనాళాల వాపును తగ్గిస్తుంది. దాంతో శ్వాస సులభంగా అయ్యేట్లు చేస్తుంది. నీటిలో కొద్దిగా పెప్పర్ మింట్ ఆయిల్ మిక్స్ చేసి, నిద్రించే ముందు నోట్లో వేసుకొని గార్గిలింగ్ చేసుకోవాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

2. పసుపు:

2. పసుపు:

పసుపులో యాంటీ సెప్టిక్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. నాజల్ ప్యాసేజ్ ను క్లియర్ చేస్తుంది . ముక్కులో ఏలాంటి బ్లాక్స్ ఏర్పడకుండా పసుపు నివారిస్తుంది . పసుపును గోరువెచ్చని పాలలో వేసుకొని త్రాగడం వల్ల ప్రభావం మరింత ఎఫెక్టివ్ గా ఉంటుంది.

3. వెల్లుల్లి రెబ్బలు:

3. వెల్లుల్లి రెబ్బలు:

సైనస్ వల్ల వచ్చే నాజల్ బ్లాకేజ్ ను నివారించడంలో వెల్లుల్లి గ్రేట్ గా సహాయపడుతుంది . వెల్లుల్లిల్లో ఉండే హీలింగ్ లక్షణాలు బ్లాకేజ్ ను క్లియర్ చేసి, శ్వాసనాళాల్లో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. దాంతో మంచి నిద్ర పడుతుంది.

4. ఆలివ్ ఆయిల్:

4. ఆలివ్ ఆయిల్:

గురక నివారించడానికి ఆలివ్ ఆయిల్ ఎఫెక్టివ్ హోం రెమెడీ. ఎందుకంటే ఆలివ్ ఆయిల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . ఇది ఇన్ఫ్లమేషన్ తగ్గించడంతో పాటు, రెస్పరేటరీ సిస్టమ్ ను సులభం చేస్తుంది.

5. యాలకలు:

5. యాలకలు:

యాలకలు, బ్లాక్ అయిన శ్వాసనాళాలను, క్లియర్ చేస్తుంది. సాఫీగా శ్వాస జరిగేలాగా చేస్తుంది. దాంతో గురక రాకుండా నివారించుకోవచ్చు. అరకప్పు నీటిలో యాలకలు వేసి మరిగించి, నిద్రించే ముందు గోరువెచ్చగా త్రాగింతే మంచి ఫలితం ఉంటుంది.

6. తేనె:

6. తేనె:

తేనె గొంతు నొప్పి, వాపు తగ్గిస్తుంది. దాంతో గురక నుండి ఉపశమనం పొందవచ్చు. ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా తేనె మిక్స్ చేసి, నిద్రించే ముందు త్రాగడం వల్ల గురకను నివారించుకోవచ్చు.

7.చమోమెలీ :

7.చమోమెలీ :

చమోమెలీ(చామంతి)లొ ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గురకను నివారించడంలో చాలా గొప్పగా సహాయపడుతుంది . దాంతో ముక్కులోని కండరాలు వదులైన బెటర్ గా నిద్రపడుతుంది. చమోమెటీ టీని త్రాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

English summary

7 Natural Cures For Snoring

Snoring is one the most problems faced by every second person. Snoring can be annoying and disrupt other's sleep. Snoring is when structures in the throat vibrate and make noise. Snoring is considered as a sleep disorder. Heavy snoring may require medical help for it increases the risk of heart disease. However, it can also be reduced using home remedies.
Desktop Bottom Promotion