For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తిన్న ఆహారం జీర్ణం కావడం లేదా..? మరైతే భోజనంతో పాటు ఇవి తినండి....

|

సహజంగా మనం తీసుకొనే డైట్ లో కొన్ని సూపర్ ఫుడ్స్ చేర్చుకోవడం చాలా అవసరం. ఇవి మన శరీరానికి అవసరం అయ్యే అన్ని రకాల న్యూట్రీషియన్స్ మరియు ప్రోటీన్స్ ను అందిస్తాయి. కొందరు ఆరోగ్య మరియు ఆహార నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రతి రోజూ ఒకటి లేదా రెండు పండ్లను ఖచ్చితంగా తినడం వల్ల శరీరానికి అవసరం అయ్యేంత ఎనర్జీని పొందవచ్చు.

అరటి, మరియు బొప్పాయి వంటి పండ్లు ఉదయం తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా ఎమ్టీ స్టొమక్ తో తీసుకోవడం వల్ల రిజల్ట్ డబుల్ గా ఉంటుంది . ఈ రెండు పండ్లలో ఫైబర్, మరియు సోడియంతో పాటు మరికొన్ని ఇతర పోషకాంశాలు కూడా అధికంగా ఉంటాయి. ఇవి రోజంతా యాక్టివ్ గా ఉండేందుకు సహాయపడుతాయి.

పొట్ట ఉబ్బరం..గ్యాస్..ఎసిడిటిని తగ్గించే ఆహారాలు..!

అలాగే మరికొన్ని రకాల పండ్లను భోజనం చేసిన తర్వాత తినడం మంచిది. ఎందుకంటే ఇవి తిన్న ఆహారాన్ని సులభంగా జీర్ణం అయ్యేందుకు సహాయపడుతాయి . పండ్లలో బేరిపండ్లు మరియు పైనాపిల్ వంటి వాటిలో ఎంజైమ్స్ మరియు ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి గాస్ట్రోఇన్ టెన్షినల్ ట్రాక్ ను మంచి వర్కింగ్ కండీషన్లో ఉంచుతాయి. ఇంకా ఇవి తిన్న ఆహారంను సులభంగా విచ్ఛిన్నం చేసి ప్రోటీనులుగా మారడానికి సహాయపడుతుంది.

ఈ క్రింది లిస్ట్ లో భోజనం తర్వాత తినాల్సినటువంటి పండ్ల వివరాలను ఇవ్వడం జరిగినది. ఇవి భోజనం తర్వాత తినడం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది ...

పియర్స్:

పియర్స్:

పియర్స్(బేరిపండు)చాలా బెస్ట్ ఫుడ్. ఈ పండును కనీసం వారంలో ఒక్కసారైనా తీసుకోవాలి. రీసెంట్ గా జరిపిన పరిశోధన ప్రకారం, బేరిపండు ఫైబర్ ను పుష్కలంగా అంధిస్తుంది. ఈ ఫైబర్ స్మూత్ స్టూల్ గా మారుతుంది. పియర్స్ సోడియం ఉండదు, కొలెస్ట్రాల్ ఉండదు, ఫ్యాట్ ఉండదు, మరియు 190గ్రాముల పొటాషియం ఉంటుంది. ఇది ఒక్కటి చాలు మంచి జీర్ణక్రియ కోసం...

యాపిల్స్:

యాపిల్స్:

యాపిల్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నప్పు యాపిల్ తింటి, జీర్ణ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు . భోజనం చేసిన 15 నిముషాల తర్వాత ఒక్క ఆపిల్ ను తినడం వల్ల తిన్న ఆహారాన్ని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టి, సులభంగా జీర్ణం అయ్యేందుకు సహాయపడుతుంది.

 రాస్బెర్రీ:

రాస్బెర్రీ:

మధుమేహగ్రస్తులు ఎవరైతే జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారో వారు రాస్బెర్రీస్ ను తినడం వల్ల మంచి ఉపయోగం ఉంటుంది. ఈ చిన్న చిన్న బెర్రీస్ లోనే ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది షుగర్ కంటెంట్ ను తగ్గిస్తుంది. అంతే కాదు ఇవి లోక్యాలరీ ఫుడ్ . కాబట్టి, జీర్ణక్రియను మెరుగుపరుచుకోవడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.

బొప్పాయి:

బొప్పాయి:

మీరు తిన్న ఆహారం 24గంటల్లో జీర్ణం అవ్వడాినకి పచ్చిబొప్పాయి గ్రేట్ గా సహాయపడుతుంది . ఈ ఫ్రూట్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది లూజ్ మోషన్ అయినప్పుడు శరీరానికి కావల్సినంత శక్తిని అందిస్తుంది. మరియు బొప్పాయిలో ఉండే పెపైన్ అనే ఎంజైమ్ ప్రోటీన్ గా విచ్చిన్నమై, తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది.

 అరటిపండ్లు:

అరటిపండ్లు:

అరటిపండ్లు నార్మల్ బౌల్ ఫంక్షన్స్ కు సహాయపడుతుంది . అందువల్ల వీటిని ఉదయం పరగడపున తినడం లేదా భోజనం తర్వాత తినడం మంచిది . ఏవిధంగా తీసుకొన్నా, తిన్న ఆహారంను సులభంగా జీర్ణం అయ్యేందుకు సహాయపడుతుంది.

పైనాపిల్:

పైనాపిల్:

పైనాపిల్ తినడానికి పుల్లగా అనిపించవచ్చు. కానీ, దాని వెనుక అనేక ఆరోగ్యరహస్యాలు దాగి ఉన్నాయి. .ఈ ఫ్రూట్ జీర్ణక్రియకు చాలా మేలు చేస్తుంది. మరియు ఇందులో ఉండే బ్రొమోలిన్ అనే ఎంజైమ్ తిన్న ఆహారంను బ్రేక్ చేయడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.

 ఫిగ్స్:

ఫిగ్స్:

ఒక కప్పు డ్రైడ్ ఫిగ్స్ లో 15 గ్రాముల ఫైబర్ కలిగి ఉంటుంది. భోజనం చేసిన తర్వాత ఒక కప్పు ఫిగ్స్ తినడం వల్ల జీర్ణక్రియ మరింత బెటర్ గా ఉంటుంది.

అవొకాడో:

అవొకాడో:

ఈ ఫ్రూట్ లో చెప్పలేనన్ని ఆరోగ్యప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా న్యూట్రీషియన్స్, విటమిన్స్ మరియు ఫైబర్ అధికంగా ఉన్నాయి. ఇవి ఎనర్జీని అందివ్వడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . తిన్న ఆహారం జీర్ణం అవ్వడానికి ఒక పీస్ అవొకాడో తింటే చాలు మంచి ఫలితం ఉంటుంది.

English summary

Eat These Fruits To Improve Digestion: Health Tips in Telugu

Super-foods should be a must add to your daily diet since they provide you with all the nutrients and proteins. According to the experts, one must consume at least two to three types of fruits everyday to gain the required energy.
Story first published: Monday, November 2, 2015, 17:53 [IST]
Desktop Bottom Promotion