గురకే కదా, ఏం చేస్తుందిలే అని అనుకోకుంటే..చాలా ప్రమాదకరం!

Posted By:
Subscribe to Boldsky

సాధార‌ణంగా చాలా మంది గుర‌క స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతుంటారు. ప‌క్క‌న నిద్ర‌పోయేవారికి ఆ గుర‌క శ‌బ్దం చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. గుర‌క పెట్టే వారికి అది పెద్ద స‌మ‌స్య‌గా అనిపించ‌క‌పోవచ్చు. చాలామంది ఈ గుర‌క స‌మ‌స్య‌ను నిర్ల‌క్ష్యం చేస్తుంటారు. గురకే కదా, ఏం చేస్తుందిలే అని అనుకుంటుంటారు. కానీ, గుర‌క పెట్ట‌డం నిద్రలో శ్వాసకు ఆటంకం కలగజేసే (స్లీప్‌ అప్నియా) సమస్యకు సంకేతం కావొచ్చ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ స్లీప్‌ అప్నియాను పట్టించుకోకపోతే పక్షవాతం, అధిక రక్తపోటు, గుండెజబ్బు వంటి తీవ్రమైన సమస్యల ముప్పు పెరుగుతుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు.

అంతేకాదు, ఈ గుర‌క వ‌ల్ల ....దిగులు, మతిమరుపు, ఏకాగ్రత కుదరకపోవటం, నోరు ఎండిపోవటం, కుంగుబాటు, నిస్సత్తువ వంటి వాటి బారిన ప‌డే ముప్పు పొంచి ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు. అధిక బరువు, ముక్కు దిబ్బడ, నిద్రపోతున్నప్పుడు నోటితో శ్వాస మందులను పడుకోవటానికి ముందు మద్యం లేదా స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకోవటం వ‌ల్ల‌ గురకకు దారితీయొచ్చు. అయితే, కొన్ని ర‌కాల జాగ్రత్తలు పాటించ‌డం వ‌ల్ల గుర‌క‌ను తగ్గించుకునే అవకాశముంది.

గురక గురించి.. గమ్మత్తైన, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్..!

1. బరువు తగ్గించుకోవాలి :

1. బరువు తగ్గించుకోవాలి :

బరువును అదుపులో ఉంచుకోవటం వ‌ల్ల గుర‌కను నియంత్రించ‌వ‌చ్చు.

2. ఆల్కహాల్ మానేయాలి:

2. ఆల్కహాల్ మానేయాలి:

నిద్రపోవటానికి ముందు మద్యం వంటి వాటికి దూరంగా ఉండ‌డం వ‌ల్ల గుర‌క‌ను అరిక‌ట్టవ‌చ్చు.

3. ఇన్ హేలర్స్ వల్ల ఉపశమనం :

3. ఇన్ హేలర్స్ వల్ల ఉపశమనం :

అలర్జీని త‌గ్గించేందుకు ముక్కుతో పీల్చే మందుల‌ను వాడుకోవడం వ‌ల్ల గుర‌కను నివారించ‌వ‌చ్చు. పడకకు వెళ్ళే ముందు ఆవిరి పట్టి శ్వాస మార్గాన్ని శుభ్రపరచుకుంటే అందులో వుండే మ్యూకస్ శుభ్రపడి మంచి నిద్రపడుతుంది.

గురక లేకుండా హాయిగా నిద్రించే మార్గాలు

4. పడుకునే భంగిమ మార్చాలి:

4. పడుకునే భంగిమ మార్చాలి:

చాలా మందికి నిద్ర‌లో వెల్ల‌కిలా ప‌డుకునే అల‌వాటు ఉంటుంది. అలా కాకుండా, పక్కకు తిరిగి పడుకుంటే అంగిలి భాగం శ్వాస మార్గానికి అడ్డుపడకుండా ఉంటుంది. దీంతో, గుర‌కకు చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

5. స్మోకింగ్ మానేయాలి :

5. స్మోకింగ్ మానేయాలి :

గురకకు పొగతాగటం కూడా ఒక కారణం. ఈ అలవాటు గొంతులో మంట, కొద్దిపాటి వాపు కూడా కలిగిస్తుంది. శ్వాస కష్టంగా తీసుకోవలసి వుంటుంది.

6. తలగడ(పిల్లో):

6. తలగడ(పిల్లో):

తలగడలు మెత్తగా వుండరాదు. గట్టిగా వున్న తలగడలపై పడుకుంటే గాలి బాగా ప్రవహిస్తుంది.

గురకతో కునుకు పాట్లా...?చిట్కాలివిగో

7. బెడ్ టైమ్ స్నాక్స్ నివారించండి:

7. బెడ్ టైమ్ స్నాక్స్ నివారించండి:

నిద్రించేముందు స్నాక్స్ ఏవీ తినకండి. పిజ్జాలు, బర్జర్లు, ఛీజ్, పాప్ కార్న వంటివి తినరాదు. వీటిలో కొవ్వు అధికంగా వుండి మ్యూకస్ పేరుకుంటుంది.

8. ముక్కు రంధ్రాలలో

8. ముక్కు రంధ్రాలలో

ముక్కు రంధ్రాలలో మ్యూకస్ శుభ్రపరచుకొని అధికంగా వున్న వెంట్రుకలను కత్తిరిస్తే కూడా గురక తగ్గే అవకాశం వుంది.

English summary

Health Risks Associated With Snoring and Natural ways stop snoring

Snoring is one of the most troublesome problem which a lot of people are facing. You might be deep asleep snoring, but your partner is spending countless nights without getting proper sleep. If this is hurting you and you want to get rid of the problem, then read on...
Story first published: Thursday, August 17, 2017, 18:00 [IST]
Subscribe Newsletter