For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరోగ్యకరమైన గుండెకు ఆరోగ్యకరమైన స్నాక్స్

By Mallikajuna
|

మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవం గుండె, మనం ప్రాణంతో ఉన్నామనడానికి గుండే ప్రధాన అంశం . గుండె నుండి మన శరీరంలోని మిగిలిన బాగాలన్నింటి రక్తం సరఫరా అవుంది. గుండె కొట్టుకోవడం అనేది మానవ ఉనికిని తెలిపే ఒక ముఖ్యమైన పారామీటర్ గా ఉంది. మన శరీరంలో గుండెకు ఏ చిన్న ఆరోగ్యసమస్య వచ్చినా, మొత్తం శరీరం యొక్క పనితీరుపై ప్రభావం చూపుతుంది. ఒక ఆరోగ్యకరమైన గుండు ఒక ఆరోగ్యకరమైన జీవితాన్ని మరియు దీర్ఘకాలంలో బ్రతికే అవకాశాన్ని కల్పిస్తుంది.

గుండె సంబంధిత జబ్బులు మరియు సమస్యలు, వంశపారంపర్యంగా, జన్యుపరంగా లేదా క్రమంగా అభివృద్ధి చెంది ఉండవచ్చు . మొదటి రెండు రకాల గుండె వ్యాధులను నిరోధించడానికి ముందు జాగ్రత్తగా తీసుకొనే పద్ధతులు ఎక్కువగా లేవు. గుండె వ్యాధులు అభివృద్ధి చెందిన హార్ట్ డిసీజస్ ను క్రింది నివారణ చర్యలు ద్వారా నివారించచ్చు . క్రమంగా గుండె సంబంధిత వ్యాధులు అభివృద్ధి చెండానికి ముఖ్య కారణం అనారోగ్యకరమైన జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు మరియు అలవాట్లు. ఫలితంగా గుండె సంబంధిత సమస్యలు మరియు హార్ట్ స్ట్రోక్ మరియు హైకొలెస్ట్రాల్ కు దారితీస్తుంది.
మీ గుండెను సురక్షితంగా ఉంచే టాప్ 15 ఫుడ్స్...!

గుండె సమస్యలను నివారించేందుకు కొన్ని మంచి అలవాట్లు, క్రమం తప్పకుండా వ్యాయామం ఆరోగ్యకరమైన ఆహారం స్వీకరించటం మరియు తినడం వంటి చేయాలి. ముఖ్యంగా గుండె సమస్యలు వచ్చినప్పుడు ఆహారపు అలవాట్లు చాలా ముఖ్యమైనవి . ఆరోగ్యకరమైన స్నాక్స్ మరియు మంచిఆహారం ఆరోగ్యకరమైన గుండెకు సహాయపడుతుంది . గుండె ఆరోగ్యంగా నిర్వహించడానికి క్రమంగా తినడానికిఅనేక రకాలైన స్నాక్స్ ఉన్నాయి . మరి గుండెను ఆరోగ్యంగా ఉంచే ఆ స్నాక్స్ ఏంటో ఒకసారి చూద్దాం..

గుండె కోసం కొన్ని ఆరోగ్యకరమైన స్నాక్స్ : -

ఓట్స్ -

ఓట్స్ -

ఈ మద్య కాలంలో గుండెజబ్బుల నివారణకు, కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచడానికి ఓట్స్ ని వాడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నిజంగా ఓట్స్ కి కొలెస్ట్రాల్ నియంత్రించే శక్తి ఉందా అంటే ఉందనే చెప్పాలి. వీటిల్లో ఉండే ప్రత్యేక పీచు పదార్థం బెటాగ్లూకాన్. ఇది పైత్య రస ఆమ్లాలతో కలిసి శరీరంలోని కొలెస్ట్రాల్ ని నియంత్రణలో ఉంచుతుంది. ఈ మద్య కాలంలో గుండెజబ్బుల నివారణకు, కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచడానికి ఓట్స్ ని వాడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నిజంగా ఓట్స్ కి కొలెస్ట్రాల్ నియంత్రించే శక్తి ఉందా అంటే ఉందనే చెప్పాలి. వీటిల్లో ఉండే ప్రత్యేక పీచు పదార్థం బెటాగ్లూకాన్. ఇది పైత్య రస ఆమ్లాలతో కలిసి శరీరంలోని కొలెస్ట్రాల్ ని నియంత్రణలో ఉంచుతుంది. ఇదే రకం పీచు పదార్థం బార్లీలో కూడా ఉంటుంది.

బ్రౌన్ బ్రెడ్ శాండ్విచ్ -

బ్రౌన్ బ్రెడ్ శాండ్విచ్ -

తృణధాన్యాలలో అనేకమైన ఫైటోన్యూట్రియంట్స్ పుష్కలంగా గుండుకు చాలా మేలు చేస్తాయి. బ్రౌన్ బ్రెండ్ ను తృణధాన్యాలు తయారు చేస్తారు. అదేవిధంగా , కూరగాయలలో ఆరోగ్యానికి మేలుచే విటమిన్లు , ఖనిజాలు మరియు పోషక చాలా ఉన్నాయి. వాటిలో బాట్ మిక్సింగ్ చేసి బ్రౌన్ బ్రెడ్ తో తీసుకోవడం వల్ల మన గుండెను ఆరోగ్యకరంగా ఉంచుకోవచ్చు . బ్రౌన్ బ్రెడ్ తో పాటు బచ్చలికూర ఆకులు , టమోటాలు , దోసకాయ మరియు ఉల్లిపాయ వంటి కూరగాయలు జోడించి ఒక హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ను తయారుచేయవచ్చు. ఈ బ్రేక్ ఫాస్ట్ ను చాలా సులభంగా మరియు త్వరగా తయారుచేయవచ్చు . ఇది ఇతర జంక్ ఫుడ్స్ కంటే చాలా ఆరోగ్యకరమైనది. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

సూపులు:

సూపులు:

సూపులు చాలా త్వరగా తయారుచేసుకొనేటటువంటి స్నాక్ . సూప్ లు కడుపు నింపడంతో పాటు ఆరోగ్యానికి చాలా మంచిది. సూపులను వివిధ రకాల పప్పులు మరియు వెజిటేబుల్స్ తో తాయరుచేయవచ్చు. ఆకుకూరలు మరియు టమోటో సూపులు గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో అత్యధికంగా న్యూటీషియన్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ గుండెఆరోగ్యానికి మరింత మేలు చేస్తాయి. సూపులను స్నాక్ గాను మరియు డిన్నర్ కు తీసుకోవచ్చు.

మొలకల ఛాట్: -

మొలకల ఛాట్: -

మొలకలు కొలెస్ట్రాల్ సంతులనం చేయడానికి మరియు గుండెను ఆరోగ్యకరంగా ఉండానికి అవసరం అయ్యే పూర్తి పోషకాంశాలను కలిగి ఉంది. ప్రతి రోజూ ఒక బౌల్ మొలకలకు ఉల్లిపాయలు, టమటోలు మరియు మసాలాలు మిక్స్ చేసి ఒక ఆరోగ్యకరమైన స్నాక్ గా తయారుచేసి హెల్తీ స్నాక్ గా తీసుకోవచ్చు. స్ప్రాట్ చాట్ ను నిమ్మరసం మరియు బ్లాక్ పెప్పర్ ఉపయోగించి తయారుచేయవచ్చు . ఆరోగ్యకరమైన గుండె కోసం మొలకల ఛాట్ ను హెల్తీ స్నాక్ లిస్ట్ లో చేర్చుకోవడం మర్చిపోకండి.

పెరుగు మరియు పండ్లు -

పెరుగు మరియు పండ్లు -

పెరుగు మరియు తాజా పండ్లు కడుపు నింపడం మాత్రమే కాదు, ఇది ఆరోగ్యకరం కూడా మరియు గుండెకు పూర్తి ఎనర్జీని అంధిస్తుంది. ఇందులో చాలా తక్కువ కొవ్వు కలిగి ఉండి, పూర్తి యాంటిఆక్సిడెంట్స్ ను కలిగి ఉంటుంది. పెరుగు మరియు పండ్లు ఒక రుచికరమైన స్నాక్ గా తయారుచేసుకోవచ్చు. ఈ రెండింటి కాంబినేషన్ గుండె ఆరోగ్యానికి చాలా మంచి మరియు ఇందులో చాలా తక్కువ సాచురేటెడ్ ఫ్యాట్స్ కలిగి ఉంటాయి. దాంతో గుండె ఆరోగ్యకరంగా ఉంటుంది.

English summary

Healthy snacks for heart

Our heart is the organ which keeps us alive and sound. It is the source of the blood that runs all around our body. The heart beat is the first vital parameters of human existence. A small problem with the health of our heart can cause serious problems to our whole body functioning. A healthy heart depicts a healthy and long life.
Desktop Bottom Promotion