For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అత్యధిక ప్రోటీనులున్న వెజిటేబుల్స్: లాభాలు

|

మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసేవి, శరీరంలో మనకు హాని కలిగించే వాటిని తొలగించేవి , మనకి సరిఅయిన ఆకారం ఇచ్చేవి, నిజం చెప్పాలంటే మన జీవత్వానికి మన మనుగడకు ఈ ప్రోటీన్స్ చాలా ముఖ్యం. ఈ ప్రోటీన్స్ అన్నీ, శరీరంలో తయారు అయి మన శరీరంలో జీవ కణాలలో ఉంటాయి. మనం చెయ్యవలసిన పనల్లా మనం తినే ఆహారము ద్వారా వాటి తయారుకి కావలసిన ముడి పదార్దములు అందించటమే.

మనం తినే ఆహారంలో చికెన్ గుడ్లు వంటివి ప్రోటీన్ అధికంగా అంధించే ప్రోటీన్ రియ్ డైట్ అని మీరు అనుకుంటున్నారా?ఈ రెండూ మాత్రమే కాదు, గ్రీన్ వెజిటేబుల్స్ లో కూడా అధికంగా ప్రోటీనులు ఉన్నాయి. వీటి ద్వారా కూడా మనశరీరానికి అవసరం అయ్యే ప్రోటీనులు ఎక్కువగా అందుతాయి. కొంత మొత్తంలో మన శరీరానికి ప్రోటీనులు చాలా అవసరం. మన శరీరానికి ప్రోటీన్ అనేది మన శరీరానికి కావల్సినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి పోషకాంశం. అమినో యాసిడ్స్ సహాయంతో ప్రోటీన్స్ ద్వారా ఫ్యాట్స్ ను విచ్ఛిన్నం చేస్తాయి. అందువల్ల ఫ్యాట్ బర్న్ చేయడానికి మరియు శక్తిని విడుదల చేయడానికి ప్రోటీనులు చాలా అవసరం అవుతాయి.

ప్రోటీన్స్ ఎందులో ఎక్కువగా ఉంటాయనేగా మీ డౌట్? రెగ్యులర్ తీసుకొనే వెజిటేబుల్స్ డైట్ లో ఎక్కువ ప్రోటీనులు ఉంటాయి కాబట్టి, వీటిని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. ప్రోటీనులు అత్యధికంగా ఉన్నఅలాంటీ గ్రీన్ వెజిటేబుల్స్ ఈ క్రింది స్లైడ్ లో ఇవ్వబడింది . ఈ వెజిటేబుల్స్ లో ప్రోటీనులు మాత్రమే కాదు, మినిరల్స్ కూడా అధికమే.

బ్రొకోలీ:

బ్రొకోలీ:

ఇది లోఫ్యాట్ కలిగినటువంటి వెజిటేబుల్ . అంతే కాదు, అధిక ప్రోటీనులు కలిగిన వెజిటేబుల్ కూడా. రెగ్యులర్ గా ఎవరైతే జిమ్ మరియు వ్యాయామం చేస్తారో, అటువంటి వారు తప్పనిసరిగా వారి రెగ్యులర్ డైట్ లో బ్రొకోలిని చేర్చుకోవాలి. బ్రొకోలీలో ఇంకా విటమిన్స్, ఫైబర్ మరియు అత్యధిక మినిరల్స్ నిల్వ ఉంటుంది. అరకప్పు బ్రొకోలీలో 2గ్రాముల ప్రోటీనుల పొందవచ్చు.

ఆస్పరాగస్:

ఆస్పరాగస్:

న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉన్నటువంటి ఈ వెజిటేబుల్ ను ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు. ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ద ఉన్న ప్రతి ఒక్కరూ మరియు అదనపు బరువు తగ్గించుకోవాలనుకొనే వారు తప్పని సరిగా ఆస్పరాగస్ ను తీసుకోవాలి. ఒక కప్పు ఉడికించిన ఆస్పరాగస్ 2గ్రాముల ప్రోటీలుంటాయి . ఇందులో ఇతర మినిరల్స్ న్యూట్రీషియన్ కలిగి ఉండటం వల్ల వీటిని రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి.

సోయా ప్రొడక్ట్స్:

సోయా ప్రొడక్ట్స్:

సోయాబీన్స్‌లో ప్రోటీన్ల మోతాదు ఎక్కువ. వీటిని సోయా పాలు, సోయా పేస్ట్‌, టోఫూ రూపంలోనూ తీసుకోవచ్చు. మామూలు పాలలో మాదిరిగానే సోయా పాలలోనూ ప్రోటీన్‌ ఉంటుంది. సోయా ప్రొడక్ట్స్ లో ప్రోటీనులు, విటమిన్స్ మరియు మినిరల్స్ అధికంగా ఉంటాయి కాబట్టి, ప్రతి ఒక్కరూ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. ఉడికించిన సోయా ప్రొడక్ట్స్ లో దాదాపు 35గ్రాముల ప్రోటీనులుంటాయి .

కిడ్నీ బీన్స్:

కిడ్నీ బీన్స్:

బీన్స్ లో అన్ని రకాల ప్రోటీలు మరియు ఇతర మినిరల్స్ అధికంగా ఉంటాయి. అత్యధిక ప్రోటీనులు కలిగిన వీటిని భోజనంతో పాటు లేదా భోజనానికి భోజనానికి మధ్య సమయంలో కూడా తీసుకోవచ్చు. మంగ్ బీన్స్, కిడ్నీ బీన్స్, వైట్ బీన్స్, లేదా బ్లాక్ బీన్స్ అన్నింటిలోనూ ప్రోటీనులు అధికంగా ఉంటాయి. వీటిలో ఏవైనా సరే ఒక కప్పు సర్వ్ చేయడం వల్ల 20నుండి25గ్రాముల వరకూ ప్రోటీనులు మన శరీరానికి అందుతాయి.

అరటిపువ్వు:

అరటిపువ్వు:

ఈ గ్రీన్ వెజిటేబుల్లో కూడా ప్రోటీనులు మరియు ఇతర మినిరల్స్ కూడా అధికంగా ఉన్నాయి. ఇది మానవులకు ప్రక్రుతి ప్రసాధించిన ఒక బహుమతి వంటిది. ఈ అరటి పువ్వులో పొటాషియం, మినిరల్స్, డైటరీ ఫైబర్ మరియు ప్రోటీనులు కూడా అధికంగా ఉంటాయి. వంద గ్రాముల అరటిపువ్వులో 30గ్రాముల ప్రోటీనులుంటాయి.

ఆకుకూరలు:

ఆకుకూరలు:

ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలందిస్తాయి . ఇందులో ప్రోటీనులు అదికంగా ఉంటాయి. అరకప్పు ఆకుకూరల్లో 1గ్రాము ప్రోటీనులుంటాయి.

బంగాళదుంపలు:

బంగాళదుంపలు:

బంగాల దుంపల్లో ఇతర ప్రయోజనాలతో పాటు, బంగాళదుంపలో1 నుండి 2 గ్రాముల వరకూ ప్రోటీనులు కలిగి ఉంటాయి.

కాలీఫ్లవర్:

కాలీఫ్లవర్:

బ్రోకోలీ కుంటుంబానికి చెందినటువంటిదే కాలీఫ్లవర్, ఒక కప్పు కాలీఫ్లవర్ లో 2 గ్రాముల ప్రోటీనులుంటాయి.

కీరదోసకాయ:

కీరదోసకాయ:

ఒక కప్పు కీరదోసకాయలో 1గ్రామ్ ప్రోటీనులుంటాయి. కాబట్టి, వీటిని కూడా రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి.

క్యాబేజ్:

క్యాబేజ్:

క్రూసిఫెరస్ ఫ్యామిలికి చెందిన మరో గ్రీన్ లీఫీ వెజిటేబుల్ క్యాబేజ్, ఒక కప్పు క్యాబేజ్ లో రెండు గ్రాముల ప్రోటీనులుంటాయి.

English summary

10 Vegetables Rich In Proteins

If you think only chicken and eggs can provide you a a protein rich diet, think again? There are many vegetables too that are rich in protein and can give you the
Story first published: Tuesday, May 13, 2014, 16:47 [IST]
Desktop Bottom Promotion