For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మెంతులతో 15 అత్యుత్తమ ఆరోగ్య లాభాలు

మెంతులతో 15 అత్యుత్తమ ఆరోగ్య లాభాలు

By Mallikajuna
|

ప్రతి ఇంట్లో పోపు సామాను పెట్టెలో తప్పక కనిపించేవి మెంతులు. ప్రతి రోజూ మన ఆహారంలో ఏదో ఒక రూపంలో మెంతులను వాడుతుంటాం. మెంతి పొడిని ఊరగాయల్లోనూ, మెంతి గింజలను చారు, పులుసు, పోపులోనూ వాడతాం. మెంతి ఆకులను పప్పుకూరగా, కూరల తయారీలోనూ వాడడం తెలిసిందే. మెంతులలో ఔషధగుణాలనున్నాయని చాలా మందికి తెలుసు. తులను ఆయుర్వేదంలో దీపనీ, మిత్రి అని అంటారు. హిందీలో మెథీ అని పిలుస్తారు. ముదురు పసుపు రంగులో ఉండి, గింజలలోని ఘాటైన సుగంధ తైలాలు, ఔషధ తత్వాన్ని కలిగి ఉంటాయి. గింజలలో కొన్ని రకాల రసాయనాలు ఉంటాయి. గింజల్లోని జిగురు, చెడు రుచి కూడా ఈ రసాయనాల వల్లనే. జీర్ణాశయం సంబంధ సమస్యలకు మెతులు మంచి ఔషధం. స్థూలకాయం, చెడు కొలెస్టరాల్‌, మధుమేహం అదుపునకు ఇవి దోహదపడతాయి.

అనేక జుట్టు సమస్యలకు మంచి పరిష్కారం మెంతులు.:క్లిక్ చేయండి

మెంతులను ఇంగ్లీషులో ఫెనుగ్రీక్ గింజలు అంటారు. వీటికి మంచి సువాసన వున్న కారణంగా వంటకాలలో వాడతారు. మెంతులలో కావలసినంత పీచు వుంటుంది. మెంతి ఆకుల్లో ఇనుము సమృద్ధిగా ఉంటుంది. దీంతోపాటు విటమిన్‌-సి, బి1, బి2, కాల్షియం కూడా ఉంటాయిఅతి తక్కువ కేలరీలు. కనుక మంచి సువాసనగాను, ఆరోగ్యంగా బరువు తగ్గేటందుకు మెంతులను వాడుకోవచ్చు. ముదురు పసుపు రంగులో ఉండి, గింజలలోని ఘాటైన సుగంధ తైలాలు, ఔషధ తత్వాన్ని కలిగి ఉంటాయి. గింజలలో కొన్ని రకాల రసాయనాలు ఉంటాయి. గింజల్లోని జిగురు, చెడు రుచి కూడా ఈ రసాయనాల వల్లనే. జీర్ణాశయం సంబంధ సమస్యలకు మెతులు మంచి ఔషధం. స్థూలకాయం, చెడు కొలెస్టరాల్‌, మధుమేహం అదుపునకు ఇవి దోహదపడతాయి. అంతే కాదు మెంతుల్లో మరన్ని గొప్పు ఔషధ గుణగణాలున్నాయి అవేంటో ఒక సారి తెలుసుకుందాం...

మగవాళ్ల ప్రత్యేక సమస్యలు దివ్వౌషదం ఫెనుగ్రీక్: క్లిక్ చేయండి

బాలింతల్లో పాల ఉత్పత్తిని పెంచుతుంది:

బాలింతల్లో పాల ఉత్పత్తిని పెంచుతుంది:

బాలింతల్లో పాల ఉత్పత్తిని పెంచుతుంది: బాలింతలకు మెంతుల కషాయం, మెంతి కూర పప్పు ఎక్కువగా తినిపిస్తే పాలు ఉత్పత్తి పెరుగుతుంది. తల్లిపాలు తాగే ఎవరైనా సరే ఆరోగ్యంగా పెరుగుతారు. బాలింతలకు మెంతులతో తయారు చేసిన పదార్థాలను తినిపించడం దేశ వ్యాప్తంగా ఉంది. ఉత్తర భారతదేశంలో బాలింతలకు మెంతి హల్వా పెడతారు. మెంతులను నేతిలో వేయించి, మెత్తగా చూర్ణంచేసి, దానికి సమానంగా గోధుమ పిండిని కలిపి,తగినంత పంచదార వేసి హల్వా తయారు చేస్తారు.

 బిడ్డపుట్టే ప్రక్రియను సులభ తరం చేస్తుంది:

బిడ్డపుట్టే ప్రక్రియను సులభ తరం చేస్తుంది:

బిడ్డపుట్టే ప్రక్రియను సులభ తరం చేస్తుంది: మహిళల్లో యుటేరియన్ కాంట్రాక్షన్ స్టిములేట్ చైల్డ్ బర్త్ ను సులభతరం చేస్తుంది. మరియు ఇది లేబర్ పెయిన్(ప్రసవ నొప్పులను)తగ్గిస్తుంది. అయితే గర్భధారణ సమయంలో మితంగా తీసుకోవాలి.

మహిళల్లో అనేక ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది:

మహిళల్లో అనేక ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది:

గర్భాశయ వ్యాధుల్లోనూ, ఇతర స్ర్తిల వ్యాధుల్లోనూ, పునరుత్పత్తికి చెందిన అంగ ప్రత్యంగాల సమస్యల్లోనూ మెంతులు ఔషధంగా పని చేసినట్లు అధ్యయనాల్లో తేలింది. మెంతుల్లో డే సపోనిన్స్‌లో ఫైటోఈస్ట్రోజన్స్ తయారీకి అవసరమైన ప్రికర్సార్లు - డోయోస్‌జెనిన్స్ అనేవి మహిళల గర్భాశయ ఆరోగ్యాన్ని పెంచుతాయి. ప్రసవం తరువాత మెంతులను వాడితే పేగుల కదలిక మెరుగవడమే కాకుండా గర్భాశయంలో సంచితమైన రక్తం వెలుపలకి వచ్చేసి గర్భాశయ శుద్ధి జరుగుతుంది. రసధాతువు మీద మెంతుల్లోని పోషకాంశాలు పని చేయటం వల్ల తల్లిపాల తయారీకి ఇది సహాయపడుతుంది. నొప్పితో కూడిన బహిష్టులో ఇది వేడిని ఉత్పన్నం చేయటం ద్వారా రక్తప్రసరణను పెంచి దోష సంచితాన్ని తగ్గిస్తుంది.

 రొమ్ము విస్తరిస్తుంది:

రొమ్ము విస్తరిస్తుంది:

బ్రెస్ట్ సైజ్ చిన్నగా ఉన్నవారు, పెంచుకోవాలంటే, రెగ్యులర్ డైట్ లో మెంతులను చేర్చుకోవాలి. మెంతుల్లో ఉండే ఈస్ట్రోజెన్ మహిళల్లో హార్మోనులను బ్యాలెన్స్ చేస్తుంది.

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:

మెంతులు మేదోవహ స్రోతస్సు మీద నేరుగా పని చేయటం వల్ల దీనిని కొలెస్టరాల్‌ని తగ్గించుకోవడానికి ఔషధంగా వాడుకోవచ్చు. కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు రోజుకి 10 నుంచి 20 గ్రాముల మెంతులను నీళ్లకు లేదా వెన్న తీసిన మజ్జిగకు కలిపి తీసుకుంటూ ఉంటే ప్రమాదకరమైన లోడెన్సిటీ లిపో ప్రొటీన్ (ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్) తగ్గినట్లుగా అధ్యయనాల్లో తేలింది.

ఎసిడిక్ రిఫ్లెక్షన్ లేదా హార్ట్ బర్న్ తగ్గిస్తుంది:

ఎసిడిక్ రిఫ్లెక్షన్ లేదా హార్ట్ బర్న్ తగ్గిస్తుంది:

ఒక చెంచా మెంతులను మీ భోజనంలో తీసుకోవడం ద్వారా ఎసిడిక్ రిప్లెక్షన్ మరియు హార్ట్ బర్న్ తగ్గిస్తుంది.

డయాబెటిస్ కంట్రోల్ చేస్తుంది

డయాబెటిస్ కంట్రోల్ చేస్తుంది

ఇది మూత్ర వ్యవస్థను పరిపుష్టం చేస్తుంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని దీని మధుమేహ నియంత్రణ శక్తిని వినియోగించుకోవచ్చు. ప్యాంక్రియాస్ (క్లోమ గ్రంథి)ని పోషించే కొవ్వు మేటలను ఇది శుభ్రం చేస్తుంది. మెంతులు టైప్ 1, టైప్ 2 మధుమేహాలు రెండింటిలోనూ ఔషధంగా పని చేస్తుంది. మెంతుల్లో ఉండే ట్రైగోనెల్లిన్, కౌమారిన్ అనే తత్వాలు మధుమేహం మీద పని చేస్తాయి. మధుమేహ నియంత్రణ కోసం మెంతులను రోజుకి 50 గ్రాములను, రెండు మూడు డోసులుగా విభజించి తీసుకోవాల్సి ఉంటుంది.

మలబద్దకం:

మలబద్దకం:

మలబద్దకంగా ఉంటే 2-3 చెంచాల గింజలు నానబెట్టి తింటే విరేచనం సాఫీగా అవుతుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది :

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది :

కఫానికి వాతానికి వ్యతిరేకంగా మెంతులు పనిచేయటం వల్ల జీర్ణక్రియలో ఆలస్యం, గ్యాస్, పొట్ట ఉబ్బరింపు తదితర సమస్యలతో కూడిన అజీర్ణాన్ని మెంతులు సరిచేయగలుగుతుంది. మెంతులు నీళ్ల విరేచనాలను, అలాగే పేగుల లోపలి వాపును తగ్గిస్తుంది. మెంతుల్లోని జిగురు తత్వం పేగుల్లో తయారైన అల్సర్లని తగ్గించడంతోపాటు మలం విచ్చుకొని తయారయ్యేలా చేస్తుంది. అందుకే ఇది సౌమ్యమైన విరేచనకారిగా పని చేస్తుంది. మెంతుల్లోని చేదు తత్వాలు కాలేయాన్ని శక్తివంతం చేస్తాయి. అలాగే పోషక తత్వాల విలీనానికి సహాయపడతాయని అధ్యయనాల్లో తేలింది.

 జ్వరం మరియు గొంతు సమస్యలను నివారిస్తుంది:

జ్వరం మరియు గొంతు సమస్యలను నివారిస్తుంది:

మెంతులను తేనె మరియు నిమ్మరసంతో కలిపి తీసుకుంటే జ్వరం నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది మరియు గొంత సంబంధిత సమస్యలను నివారిస్తుంది.

కోలెన్ క్యాన్సర్ నివారిస్తుంది:

కోలెన్ క్యాన్సర్ నివారిస్తుంది:

మెంతుల్లో ఉన్న ఫైబర్ కంటెంట్ శరీరం లోని టాక్సిన్స్ ను తగ్గించి శరీరాన్ని న్యూరిష్ చేస్తుంది. దాంతో కోలెన్ క్యాన్సర్ నుండి రక్షణ కల్పిస్తుంది.

ఆకలి కంట్రోల్ చేసి బరువు తగ్గిస్తుంది:

ఆకలి కంట్రోల్ చేసి బరువు తగ్గిస్తుంది:

వెయిట్ లాస్ డైట్ లో మెంతులను చేర్చుకోవడం వల్ల ఆకలిని అరికడుతుంది. ఉదయం పరగడపును నానబెట్టిన మెంతులు తింటే , కడుపు నిండుగా ఉన్న భావన కలిగి ఆకలి కంట్రోల్ చేస్తుంది.

స్కిన్ ఇన్ఫ్లమేషన్ మరియు స్కార్స్ తగ్గిస్తుంది:

స్కిన్ ఇన్ఫ్లమేషన్ మరియు స్కార్స్ తగ్గిస్తుంది:

మెంతి పేస్ట్ లో ముంచిన ఒక శుభ్రమైన వస్త్రంను చర్మం ఇన్ఫెక్షన్స్ అయిన ప్రదేశంలో అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇది స్కిన్ బర్న్, బొబ్బలు, తామర వంటి వాటి నుండి చర్మానికి ఉపశమనం కలిగిస్తుంది.

 బ్యూటీ ప్రొండక్ట్:

బ్యూటీ ప్రొండక్ట్:

ఆకులను దంచి పేస్ట్‌గా ముఖానికి రాస్తే ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. పొడి బారడడం తగ్గుతుంది. వైట్‌హెడ్స్ నివారణలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ ఔషధం మెంతి ఆకుల మిశ్రమం. తాజాగా ఉండే గుప్పెడు మెంతి ఆకులను తీసుకుని రోట్లో వేసి మెత్తగా నూరి, ఆ పేస్టును ముఖంమీద వైట్‌హెడ్స్ అధికంగా ఉండే చోట బాగా అప్లయ్ చేసి రాత్రంతా అలాగే ఉంచుకోవాలి. తెల్లారగానే లేచి గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే కొన్ని రోజులకు వైట్‌హెడ్స్ బారినుంచి విముక్తి అవ్వచ్చు. వైట్‌హెడ్స్ నివారణలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ ఔషధం మెంతి ఆకుల మిశ్రమం. తాజాగా ఉండే గుప్పెడు మెంతి ఆకులను తీసుకుని రోట్లో వేసి మెత్తగా నూరి, ఆ పేస్టును ముఖంమీద వైట్‌హెడ్స్ అధికంగా ఉండే చోట బాగా అప్లయ్ చేసి రాత్రంతా అలాగే ఉంచుకోవాలి. తెల్లారగానే లేచి గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే కొన్ని రోజులకు వైట్‌హెడ్స్ బారినుంచి విముక్తి అవ్వచ్చు.

జుట్టు సమస్యలకు ఉత్తమ పరిష్కారం:

జుట్టు సమస్యలకు ఉత్తమ పరిష్కారం:

ఆకును దంచి పేస్ట్‌గా చేసి తలకు రాస్తే చుండ్రు, వెంట్రుకలు రాలడం తగ్గుతాయి. వెంట్రుకలు నిగనిగలాడతాయి. మెంతి పొడి పట్టించి స్నానం చేస్తే చుండ్రు, వెంట్రుకలు రాలడం తగ్గుతాయి. మెంతి పిండి మంచి కండీషనర్‌గా పనిచేస్తుంది.

 బరువు తగ్గిస్తుంది:

బరువు తగ్గిస్తుంది:

మెంతులలో కార్బోహైడ్రేట్లు తక్కువ. ఫలితంగా మీకు అధిక బరువు చేరదు. బరువు తగ్గాలంటే మీరు కేలరీలు తగ్గించాలి. మెంతులు చాలా తక్కువ కేలరీలు కలిగి వుంటాయి. మెంతులు ఎలా తినాలి? 1. ఒక స్పూన్ మెంతులను రాత్రంతా నీటిలో నానపెట్టాలి. వేడినీటితో ఉదయంవేళ ఖాళీ కడుపుతో తినాలి. ఇవి మీలోని వ్యర్ధ పదార్ధాలను విసర్జించటమే కాదు బరువును గణనీయంగా తగ్గిస్తాయి. జీర్ణశక్తిని పెంచుతాయి. లేదా వేడి నీటితో వాటిని నమిలివేయవచ్చు.2. మెంతి పొడి - మెంతులను పెనంపై వేడి చేసి అవి బాగా వేగిన తర్వాత పౌడర్ గా చేసుకొని చల్లబడినతర్వాత తినవచ్చు. గాలి చొరని డబ్బాలో ఈ మెంతి పొడి వుంచాలి. పెరుగు తో కలిపి తినవచ్చు. లేదా మసాలా దినుసులుగా వాడవచ్చు.

English summary

15 health benefits of methi

Fenugreek, popularly called Greek Hay is a wonder medicine curing numerous health problems in no time. The culinary spice is widely used in Asia and some parts of Europe. The seeds contain many nutrients like protein, vitamin C, niacin, potassium, diosgenin, lysine, tryptophan and saponins.
Desktop Bottom Promotion