For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలోవెరా(కలబంద) జ్యూస్ యొక్క ఆరోగ్యప్రయోజనాలు

By Mallikarjuna
|

అలోవెరా, ఒక చిక్కగా జెల్ గా ఉండే ఒక పదార్థం. అలోవెరా (కలబంద)ను కాలినగాయాలకు, తెగిన గాయాలకు మరియు చర్మ ఇన్ఫెక్షన్లకు అనేక విధాలుగా ఉపయోగిస్తున్నారు. అలోవెరా జెల్ ల్లో అనేక న్యూట్రీషియన్స్, మరియు విటమిన్స్, మినిరల్స్ ఇవి శరీరానికి ఎంత అవసరం అయిన వాటితో నిండి ఉంది. అలోవెరా జ్యూస్ ను ఆరోగ్యకరమైనదిగా పరిగణిస్తూ, దీన్ని రోజుకు ఒక సారైనా తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. అలోవెరాలో ఉండే అనేక యాంటీఆక్సిడెంట్స్ మన శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు నెట్టివేస్తుంది . ఇంకా ఈ జ్యూస్ లో మంచి అమినో యాసిడ్స్ మరియు ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉండి శరీర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

అలోవెరా జ్యూస్ లో ఉన్న అనేక విటమిన్స్ మన శరీరంలోని డ్యామేజ్ అయిన బాడీ సెల్స్ లేదా టిష్యూలను రిపేర్ చేయడానికి సహాయపడుతుంది. ఈ అలోవెరా జెల్ శరీర బాహ్య పరిస్థితులకు స్వీకృతి పెంచడం ద్వారా శరీరం యొక్క రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ అలోవెరా జెల్ శరీరానికి పోషకాలను మరియు శరీరానికి అవసరం అయ్యే వాటిని జతచేస్తుంది.

ఆ అలోవెర జ్యూస్ ను బహుముఖ ప్రయోజనకారి అంటారు. అందుకే ఇది అనేక ఆరోగ్యాప్రయోజనాలు కలిగి ఉన్నప్పటికీ, కొన్ని ప్రత్యే ఆరోగ్యప్రయోజనాలు మీరు తెలుసుకోవడానికి ఈ క్రింది స్లైడ్ ద్వారా అందిస్తున్నాము.

డిటాక్స్ జ్యూస్ :

డిటాక్స్ జ్యూస్ :

నిర్విషీకరణ చేయడానికి అలోవెరా జ్యూస్ చాలా గొప్పది. మన శరీరంలో దెబ్బతిన్న చర్మం కణజాలంకు దారితీస్తుంది. శరీరం యొక్క జీవక్రియలు మరియు శీరరంలోని అవయవాలు సరిగా పనిచేయనప్పుడు, ఈ అలోవెరా జ్యూస్ శరీరంలోని అవయవాలను ఉత్తేజపరుస్తుంది. కాలుష్యం, జంక్ ఫుడ్స్, అనారోగ్యజీవనశైలి మరియు ధూమపానం మరియు మద్యం వంటి వ్యసనాలు ప్రధానంగా టాక్సిన్ ఉత్పత్తి చేసే ఏజెంట్స్ గా ఉంటాయి. అలోవెరా జెల్ లో ఉండే అనే మినిరల్ మరియు యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్,ఇతర న్యూట్రీషియన్స్ టాక్సిన్స్ ను బయటకు నెట్టి వేసి, శరీరాన్ని శుభ్రం చేయడానికి సహాయపడుతుంది.

బరువును తగ్గిస్తుంది:

బరువును తగ్గిస్తుంది:

ప్రతి రోజూ ఒక గ్లాస్ అలోవెరా జ్యూస్ త్రాగడం వల్ల అది బరువు తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. మరియు ఒక క్రమమైన బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇంకా ఈ కలబంద రసం కడుపు మరియు జీర్ణశ్రయ ట్రాక్ ను శుభ్రపరుస్తుంది. దాంతో శరీరంలో బరువు పెరగడానికి కారణం అయ్యే అవాంఛిత పదార్థాలను తొలగించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. దాంతో బరువు తగ్గవచ్చు. ఇంకా ఇది హ్యాంగోవర్ సమస్యలను నివారిస్తుంది.

దంతాల ఆరోగ్యం:

దంతాల ఆరోగ్యం:

అలోవెరా జెల్లో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు కలిగి ఉంది. ఇది చిగుళ్ళను మరియు దంతాలను శుభ్రంగా ఉంచేందుకు సహాయపడుతుంది. ఇంకా అలోవెరా జ్యూస్ మౌత్ ఫ్రెష్ నర్ గా ఉపయోగపడుతుంది. మరియు చెడు శ్వాసను నివారిస్తుంది. ఇంకా ఇది మౌత్ అల్సర్ మరియు చిగుళ్ళనుండి రక్తం కారడాన్ని నివారస్తుంది. అందువల్ల అలోవెర జ్యూస్ దంత సమస్యలకు మంచి ఆరోగ్య ప్రయోజనం .

ఎనర్జీ బూస్టర్:

ఎనర్జీ బూస్టర్:

ప్రతి రోజూ అలోవెరా జ్యూస్ ను ఒక ఎనర్జీ డ్రింక్ గా త్రాగవచ్చు. ఇందులో పుష్కలమైన న్యూట్రీషియన్స్, విటమిన్స్, మరియు మనిరల్స్ శరీరానికి శక్తిని అందిస్తుంది. అలోవెరా జ్యూస్ ను రెగ్యులర్ తీసుకోవడం వల్ల శరీరంలోని అవయవాలు పనిచేసేట్లు ఉద్దీపన కలిగిస్తుంది. అందుకే అలోవెర జ్యూ ఆరోగ్యకరం. ఈ జ్యూస్ లో బహుముఖ ప్రయోజనాలు కలిగి ఉండటం వల్ల ఆరోగ్యానికి మరియు వ్యాధినిరోధక శక్తి పెంచడానికి సహాయపడుతుంది.

చర్మం మరియు జుట్టు ఆరోగ్యానికి మంచిది

చర్మం మరియు జుట్టు ఆరోగ్యానికి మంచిది

చర్మ సంరక్షణకు అవసరమైన అమెనో ఆసిడ్స్‌ మెండుగా కలిగి, విటమిన్‌ బి12, విటమిన్‌ సి, ఇ కాల్షియం, ఐరన్‌(ఇనుము) లెసిథిన్‌, మెగ్నీషియం, మాంగనీస్‌, పొటాషియం, సోడియం, జింక్‌ వంటి ఖనిజాలను కలిగి ఉంటుంది.

చర్మం ఎరుపెక్కడం, రేడియేషన్‌ మూలంగా దెబ్బతిన్న చర్మానికి అలొవెరా జెల్‌ బాగా పనిచేస్తుంది. స్కిన్‌ రాషెస్‌, హెర్పిస్‌ సింప్లెక్స్‌, మొటిమలు, రింగ్‌ వార్మ్‌ తదితర చర్మవ్యాధులకు కలబంద మంచి ఔషధం. చర్మంపై వచ్చే నల్లమచ్చలను ఇది పోగొడుతుంది. సోరియాసిస్‌ గజ్జిలాంటి చర్మవ్యాధులను తగ్గిస్తుంది. చర్మానికి నిగారింపు తీసుకొస్తుంది.

English summary

Health Benefits Of Aloe Vera Juice

The sticky gel filled green plant Aloe Vera has more to it than the odd appearance. Aloe vera is used for treating cuts, burns and skin infections.
Story first published: Tuesday, January 21, 2014, 19:53 [IST]
Desktop Bottom Promotion