For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జింజర్ టీలోని 10 అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్

|

జింజర్ టీ ఒక అద్భుతమైన డ్రింక్. జింజర్ టీని త్రాగడం వల్ల ఆ రోజంతా మీరు ఎనర్జిటిక్ గా ఉంటారు. అయితే జింజర్ టీని త్రాగడానికి ప్రత్యేకంగా టైమ్ అంటూ ఏం లేదు. ఏ సమయంలో అయినా త్రాగవచ్చు. ఈ జింజర్ టీని ఉదయం మరియు మద్యహ్నాం లేదా సాయంత్రం ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఎందుకంటే వీటిలో ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి.

ఈ జింజర్ టీలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండి, వృద్ధాప్య లక్షణాలను కనబడనివ్వదు. జింజర్ టీని పాలు మరియు షుగర్ జోడించకుండా, ప్రత్యామ్నాయ పదార్థాలు జోడిస్తే చాలా రిలాక్స్డ్ గా ఫీలవుతారు.

జింజర్ టీలో తేనె, పుదీనా ఆకులు, తులసి ఆకులు వేసి మరిగించి తీసుకోవాలి. ఈ హెల్తీ పదార్థాల వలే అల్లం కూడా...అత్యంత ఆరోగ్యకరమైనది మరియు ఉపయోగకరైనది. అల్లం, జీర్ణ సమస్యలను, శ్వాససంబంధిత సమస్యలను మరియు మలబద్దం వంటి సమస్యలను చాలా ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది..

జింజర్ టీనిి ఐస్డ్ జింజర్ టీ లేదా సమ్మర్ ఈవెనింగ్ డ్రింక్ గా జింజర్ టీని తీసుకోవడం వల్ల మిమ్మల్ని ఉల్లాసభరితంగా మార్చడమే కాదు, అనేక ప్రయోజనాలను పొందవచ్చు. మాములి టీ కంటే జింజర్ టీలో డబుల్ హెల్త్ బెనిటిఫిట్స్ ఉన్నాయి. మరి ఆ బెనిఫిట్స్ గురించి తెలుసుకోవాలంటే ఈ క్రింది స్లైడ్ క్లిచేయాల్సిందే....

1.వాంతులు మరియు వికారం యొక్క ఫీలింగ్ ను నివారిస్తుంది:

1.వాంతులు మరియు వికారం యొక్క ఫీలింగ్ ను నివారిస్తుంది:

ఎక్కడికైన ప్రయాణం చేయడానికి ముందు లేదా ప్రయాణంలో వచ్చే వికారం మరియు వాంతులను నివారించడానికి అల్లం టీ ఒక ఉత్తమ హోం రెమెడీ .

2. పొట్టను చల్లగా..ప్రశాంతంగా ఉంచుతుంది:

2. పొట్టను చల్లగా..ప్రశాంతంగా ఉంచుతుంది:

ఎలాంటి పొట్ట సమస్యలున్నా జింజర్ టీ చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. జింజర్ టీ వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

3. శ్వాససంబంధిత సమస్యలను నివారిస్తుంది:

3. శ్వాససంబంధిత సమస్యలను నివారిస్తుంది:

ఒక కప్పు జింజర్ టీ త్రాగడం వల్ల అన్ని రకాల శ్వాససంబంధిత సమస్యలను తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా జలుబు మరియు దగ్గు నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది . ఇంకా ముక్కుదిబ్బడ నుండి ఉపశమనం కలిగిస్తుంది. అలర్జీల నుండి రక్షణ కల్పిస్తుంది.

4. ఆస్తమాకు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది:

4. ఆస్తమాకు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది:

జింజర్ టీ త్రాగడం వల్ల పొందే హెల్త్ బెనిఫిట్స్ లో ఇది కూడా ఒక ఎఫెక్టివ్ హోం రెమెడీ. ముఖ్యంగా వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు జలుబు, దగ్గు ఉన్నప్పుడు, అల్లం టీని త్రాగడం వల్ల తక్షణ ఉపశమనం పొందవచ్చు .

5. ఇన్ ఫ్లమేషన్ తగ్గిస్తుంది:

5. ఇన్ ఫ్లమేషన్ తగ్గిస్తుంది:

జింజర్ టీ వల్ల ఇది ఒక మ్యాజికల్ బెనిఫిట్. ముఖ్యంగా స్పోర్ట్స్ లో ఉన్నవారు, రుమటాయిడ్, ఆర్థరైటిస్ తో బాధపడేవారుకి ఇన్ఫ్లమేషన్ నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది . బర్నింగ్ సెన్షేషన్, ఇన్ఫ్లమేషన్, ఇమ్మెన్సి పెయిన్, వాపు, కండరాలు మరియు జాయింట్ పెయిన్ నివారిస్తుంది .

6. మెనుష్ట్రువల్ సమస్యలు:

6. మెనుష్ట్రువల్ సమస్యలు:

జింజర్ లో ;ఉండే జిన్జేరోల్స్ ఈ హార్మోన్ల ఉత్పత్తిని అరికట్టి, రుతుసమయంలో వచ్చే నొప్పుల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. జింజర్ రుతుసమయంలో తిమ్మిరులు లాగ వచ్చే శరీరంలోని పిత్త ను కూడా తగ్గిస్తుంది, తద్వారా రుతుసమయ నొప్పి కూడా తగ్గుతుంది. ప్రతిరోజూ ఒక కప్పు జింజర్ టీ తాగితే (రుతుసమయానికి 2-3 రోజుల ముందు) రుతుక్రమం ఆలస్యంగా రావడం, రుతుసమయంలో నొప్పి లను అరికట్టవచ్చు.

7 రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది:

7 రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది:

జింజర్ ఎక్కువగా గుండె ఆరోగ్యాన్ని పెంపొందించే ఒక మూలికగా గుర్తించబడింది. ఎందుకంటే అల్లం టీలో విటమిన్ సి, మెగ్నీషియం, మినిరల్స్, అమినోయాసిడ్స్ వంటి పుష్కలంగా ఉండటం వల్ల రక్తప్రసరణను మెరుగుపరచడంలో గ్రేట్ గా పనిచేస్తుంది.

8. వ్యాధినిరోధకతను పెంపొందిస్తుంది:

8. వ్యాధినిరోధకతను పెంపొందిస్తుంది:

అల్లం టీ త్రాగటం వలన,అల్లంలో అధిక స్థాయిలో అనామ్లజనకాలు ఉండుట వలన మీ రోగనిరోధక శక్తి బలోపేతం చేయటానికి సహాయపడుతుంది. మరియు కొలెస్ట్రాల్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేస్తుంది. దాంతో స్ట్రోక్ వంటి వాటిని అరికట్టవచ్చు.

9. ఒత్తిడి తగ్గిస్తుంది:

9. ఒత్తిడి తగ్గిస్తుంది:

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి ప్రధాన ఆరోగ్య సమస్యగా ఉండి. అల్లం టీ మీ ఒత్తిడి మరియు ఉద్రిక్తతను తగ్గించే లక్షణాలను కలిగి ఉంది. దీనికి కారణం బలమైన వాసన మరియు వైద్య లక్షణాలు కలయిక అయ్యివుండవచ్చు. ఒత్తిడిగా ఉన్నప్పుడు ఒక కప్పు అల్లం టీ త్రాగడం వల్ల తక్షణం ఉపశమనం పొందవచ్చు.

10. ఫెర్టిలిటికి సహాయపడుతుంది:

10. ఫెర్టిలిటికి సహాయపడుతుంది:

ఇలా చెప్పుకుంటూ పోతే, అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ముగింపుగా కొన్ని పరిశోధన ప్రకారం అల్లం టీ స్పెర్మ్ క్వాలిటీ మరియు క్వాంటిటీ పెంచతుందని నిర్ధారించారు . అంతే కాదు, పురుషుల్లో ఎలాంటి అంగస్తంభన సమస్యలున్నా నివారిస్తుందని తెలియజేశారు.

English summary

10 Health Benefits Of Ginger Tea

Now, with this healthy drink if you add ginger, the health benefits of ginger tea become double. A cup of iced ginger tea on a hot summer evening soothes your senses and also provides lots of health advantages.
Story first published: Friday, May 22, 2015, 16:14 [IST]
Desktop Bottom Promotion