For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుడ్డు తినండి గుడ్ గా ఉండండి: వరల్డ్ ఎగ్ డే 2015 స్పెషల్

|

గుడ్డు మంచి పౌష్టికాహారం. చిన్నపిల్లలు మొదలుకొని, ముసలివారి వరకు డాక్టర్లు గుడ్డు తినమని చెబుతారు. కోడిగుడ్డు ఎదిగే పిల్లలకు చాలినన్ని ప్రొటీన్లను అందజేస్తుంది. పోష కాహారలేమితో బాధపడేవారిని రోజుకో గుడ్డు తినాల్సిందిగా వైద్యులు సలహాలిస్తుంటారు. గుడ్ల వాడకాన్నీ, దానిలోని ఆరోగ్య ప్రయోజనాల్ని ప్రపంచవ్యాప్తంగా గల ప్రజలకు తెలియజెప్పుతూ ప్రతియేట అక్టోబరు రెండో శుక్రవారం నాడు ‘వరల్డ్‌ ఎగ్‌ డే' నిర్వహించడం జరుగుతుంది.

మన దేశంలో గుడ్డు వాడకం అధికమనే చె ప్పాలి.‚‚‚‚ గుడ్డును పలు రూపాలలో ఆహారంగా తీసుకుంటారు. పచ్చి గుడ్డుసొనను నోటిలో పోసుకొని మింగడం, గుడ్డును ఉడికించి తిన డం, ఉడికించిన గుడ్డు బ్రెడ్‌ ని కలిపి టోస్ట్‌గా కూడా తీసుకుంటారు. అంతేకాకుండా గుడ్డు ను పలావులో, బిర్యానిలో రుచికోసం వాడతా రు, బేకరీలలో కేకుల తయారీల్లో గుడ్డును విరివిగా వాడుతారు. గుడ్డు ఆమ్లెట్‌, బుల్స్‌ ఐ,ఎగ్‌ ఫ్రై... కూరగా వాడుతారు. గుడ్డు ఏ ఒక్క వయసువారికో పరిమితమైన ఆహారం కాదు. బాల్యం నుండి వృద్దాప్యం వరకు అన్ని వయసులలో స్ర్తీ పురుషులు భేదం లేకుండా గుడ్డును తీసుకుంటారు.

READ MORE: జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి ఎగ్ హెయిర్ మాస్క్ లు

గుడ్డుమీద జరుగుతున్న పరిశోధనలు ఏటా కొత్త ఫలితాలను ఇస్తూనేవున్నాయి. గుడ్డును తీసుకోవాల్సిన అవసరాన్ని పదే పదే నొక్కిచె బుతున్నారు. ఉదయం అల్పాహారంతో గుడ్డు తీసుకోవడం మంచిదని తజా అధ్యయనము లో తేలినది. గుడ్డులో సొన శక్తినిస్తుంది. శరీ రంలో ప్రతి అవయవం మీద గుడ్డు ప్రభావం చూపుతుంది. గుడ్డును శాకాహారంగా ప్రకటించి అందరికీ గుడ్డు అందించాలనే ఉద్యమం ఇటీవలి కాలంలో ఊపందుకుంది.

READ MORE: గుడ్డు పచ్చసొనలోకూడా ఆరోగ్యప్రయోజనాలు ఎక్కువే

గుడ్డు ద్వారా మనకందే పోషకాలు: క్యాలరీలు: 70-80, ప్రోటీన్లు : 6 గ్రాములు, క్రొవ్వులు: 5 గ్రాములు, కొలెస్టిరాల్‌: 190 గ్రాములు, నీరు: 87% , గుడ్డులో పలురకాల లవణాలు, అరుదైన లవణాలతో పాటు ఫాస్పరస్‌, అయోడిన్‌, సెలీనియం, ఐరన్‌, జింక్‌లు ఉన్నాయి. ఇవన్నీ శరీరానికి మేలుచేసేవే.

 పిల్లలకు పౌష్టికాహారం:

పిల్లలకు పౌష్టికాహారం:

గుడ్డు పౌష్టికాహారం. శరీరానికి కావల్సిన పోషకాలన్నీ ఇందులో ఉంటాయి. పిల్లల పెరు గుదలకు మంచిది. కూరగా వాడుకోవచ్చు.

కళ్ళ ఆరోగ్యానికి :

కళ్ళ ఆరోగ్యానికి :

కోడి గుడ్డు తింటే దృష్టికి ఎంతో మేలు కలుగుతుంది. రోజు గుడ్డు తినేవారికి శుక్లాలు వచ్చే అవకాశం బాగా తగ్గుతుంది.

 డైటింట్ చేసే వారికి:

డైటింట్ చేసే వారికి:

గుడ్డు తక్కువ క్యాలరీలు శక్తిని ఇస్తుంది సాధారణ సైజు గుడ్డు 80 క్యాలరీలు శక్తిని అందిస్తుంది కాబట్టి డైటింగ్‌లో ఉన్నవారు కూడా గుడ్డును తీసుకోవచ్చు.

బరువు తగ్గించే గుడ్డు:

బరువు తగ్గించే గుడ్డు:

బరువు తగ్గేందుకు గుడ్డు పనికొస్తుంది. అందులో ఉన్న నాణ్యమైన ప్రోటీన్ల వల్ల గుడ్డు తీసుకోగానే కడుపు నిండినట్టుగా అవుతుంది. ఎక్కువ ఆహారం తీసుకోనివ్వదు... అందువల్ల పరిమిత ఆహారం తీసుకొని బరువును నియంత్రించుకోగలుగుతారు.

హార్ట్ కు మేలు చేసే గుడ్డు:

హార్ట్ కు మేలు చేసే గుడ్డు:

గుడ్డు తినటం వల్ల గుండె జబ్బులు పెరుగుతాయన్నది అపోహ మాత్రమేనని ఒక అధ్యయనం వల్ల వెల్లడయ్యింది. వాస్తవంగా గుడ్డు తినేవారిలో రక్తనాళాలు మూసుకుపో వటం లేదా గుడెజబ్బులు రావటం బాగా తక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు.

మెదడుకు పదును పెట్టే గుడ్డు:

మెదడుకు పదును పెట్టే గుడ్డు:

మెడడుకు ఆరోగ్యాన్నిచ్చే పదార్థాలు గుడ్డులో ఉన్నాయి. గుడ్డుసొనలో 300 మైక్రోగ్రాములు కోలిన్‌ అనే పోషక పదార్థం ఉంది. ఇది మెదడు కణాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మెదడులో సమాచార రవాణాన్ని మెరుగుపరుస్తుంది, మెదడు నుండి సంకేతాలు వేగంగా చేరవేయడంలో కూడా కోలిన్‌ ప్రాత్ర వహిస్తుంది.

 గర్భిణీ స్త్రీలకూ ఓ గుడ్డు:

గర్భిణీ స్త్రీలకూ ఓ గుడ్డు:

గుడ్డులో ఉన్న ఐరన్‌ శరీరం చాలా సులభంగా గ్రహిస్తుంది. అలా గ్రహించే రూపంలో ఐరన్‌ ఉన్నందున గుడ్డు గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు ఎంతో మేలు చేస్తుంది.

 మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది:

మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది:

గుడ్డును ఆహారంగా తీసుకోవటానికి, కొలెస్టరాల్‌కి ఎటువంటి సంబంధం లేదు. ప్రతి రోజూ రెండు కోడి గుడ్లు తీసుకునే వారికి లైపిడ్సులో ఎటువంటి మార్పు లేకపోవడం గమనించారు. పైగా గుడ్డు వలన శరీరానికి మేలు చేసే కొలెస్టరాల్‌ పెరుగుతుందని తేలింది.

రొమ్ము క్యాన్సర్ :

రొమ్ము క్యాన్సర్ :

స్త్రీలలో రొమ్ము క్యాన్సర్‌ రాకుండా కాపాడే శక్తి గుడ్డుకి ఉందని పరిశోధనల్లో తేలింది. ఒక అధ్యయనంలో... వారంలో 6 రోజులు గుడ్డు ఆహారంగా స్త్రీలకు ఇచ్చారు... అప్పుడు వారిలో రొమ్ము క్యాన్సర్‌ బారిన పడే అవకాశం 44 శాతం తగ్గినట్లు తేలినది.

టెస్టోస్టిరాల్ లెవల్స్ పెంచుతుంది:

టెస్టోస్టిరాల్ లెవల్స్ పెంచుతుంది:

గుడ్డు పచ్చసొనలో జింక్ పుష్కలంగా ఉంటుంది. గుడ్డులో పుష్కలమైన మినిరల్స్ ఉంటాయి. ఈ మినిరల్స్ ఇతర ఆహార పదార్థాల్లో లభ్యం కావు. కాబట్టి, గుడ్డు పచ్చ సొన తినడం వల్ల పురుషుల్లో మేల్ హార్మోన్స్ పెరుగుతాయి.

రక్తం గడ్డకట్టడం తగ్గుతుంది:

రక్తం గడ్డకట్టడం తగ్గుతుంది:

చాలా రోజుల నుండి మీరు గుడ్డు అధిక కొలెస్ట్రాల్ కలిగినినదని, ఇది గుండె ఆరోగ్యానికి మంచిది కాదని మీరు వింటూనే ఉంటారు. అయితే, గుడ్డు పచ్చసొనలోని, ప్రోటీన్స్ రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది.

యాంటీఇన్ఫ్లమేటరీ:

యాంటీఇన్ఫ్లమేటరీ:

ఇది అధికంగా యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంది. అంటే, ఎవరైతే నొప్పులు మరియు ఇన్ఫ్లమేటరీ వ్యాధులు ఓస్టిపోరియోసి, లేదా ఆర్ధరైటిస్ వంటి లక్షణాలు కలిగి ఉంటారో వారికి, గుడ్డులోని పచ్చసొన నొప్పులను నివారిస్తుంది.

విటమిన్ బి12 అధికంగా ఉంటుంది:

విటమిన్ బి12 అధికంగా ఉంటుంది:

గుడ్డు పచ్చసొనలో విటమిన్ బి12పుష్కలంగా ఉంటుంది. కండరాల పునరుత్పత్తిని పెంచుతుంది. పచ్చసొనలోని పోషకాంశాలు. కండాలు విశ్రాంతికి బాగా సహాయపడుతాయి.

English summary

13 Proven Health Benefits of Eggs : World Egg Day 2015 Special

Eggs are among the few foods that I would classify as “superfoods.”They are loaded with nutrients, some of which are rare in the modern diet. Here are 10 health benefits of eggs that have been confirmed in human studies.
Desktop Bottom Promotion