Latest Updates
-
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.!
క్రాన్ బెర్రీ జ్యూస్ వల్ల మహిళలు పొందే ఆరోగ్య ప్రయోజనాలు
క్రాన్ బెర్రీ జ్యూస్ వల్ల మహిళలు పొందే ఆరోగ్య ప్రయోజనాలు
సాధారణంగా పురుషులతో పోల్చితే మహిళల్లో చాల త్వరగా ఇన్ఫెక్షన్ సోకుతుంది అందుకే మహిళలు మంచి ఆరోగ్యకరమైన ఆహారాలను వారి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలని సూచిస్తుంటారు. ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా పట్టిపీడించే సమస్య యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ . ఈ సమస్యను 10 మందిలో కనీసం నలుగురు బాధపడుతుంటారు.
కాబట్టి, ఈ యూటిఐ సమస్యను నివారించుకోవడానికి క్రాన్ బెర్రీ జ్యూస్ ఒక ముఖ్యమైన పదార్థం. ఈ ఎర్రని బెర్రీ మహిళల ఆరోగ్యానికి చాలా ఎఫెక్టిగా పనిచేస్తుంది. ఎందుకంటే మహిళల్లో క్యాన్సర్ ను నివారిస్తుంది మరియు బరువును తగ్గిస్తుంది . ఒక వారంలో అరగ్లాస్ క్రాన్ బెర్రీ జ్యూస్ ను రెండు సార్లు త్రాగడం వల్ల ఇది హెల్తీగా మరియు యాక్టివ్ గా ఉండటానికి సహాయపడుతుంది.
మరో ప్రక్క కాన్ బెర్రీ జ్యూస్ మహిళలకు చాలా మంచిది. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో ఈ జ్యూస్ చాలా ఉపయోగపడుతుంది. అంతే కాదు రక్తహీనతతో బాధపడే వారికి కూడా ఇది చాలా ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది . అంతే కాదు మరికొన్ని ఎఫెక్టివ్ బెనిఫిట్స్ కూడా ఈ క్రింది విధంగా ఉన్నాయి... అవేంటో ఒక సారి చూద్దాం..

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది:
క్రాన్ బెర్రీ జ్యూస్ మహిళలకు చాలా మేలు చేస్తుంది . యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ నివారించడానికి సహాయపడుతుంది. ఎందుకంటే క్రాన్ బెర్రీ జ్యూస్ లో ఉండే ప్రొయాంతోసైనడిన్స్ క్రాన్ బెర్రీ జ్యూస్ లో కనుగొనడం జరిగింది . ఇది బ్లాడ్ వాల్స్ కు చుట్టుకొని ఉండటం వల్ల యూరినరీ ట్రాక్ లో బ్యాక్టీరియాను నివారిస్తుంది .

హార్ట్ కు చాలా మేలు చేస్తుంది:
అవును క్రాన్ బెర్రీ జ్యూస్ గుండెకు చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే మరికొన్ని ఔషధగుణాలు హార్ట్ లో బ్లాక్ అయిన రక్తగడ్డలును కరిగించి ప్రమాధం నుండి రక్షిస్తుంది . ఈ క్రాన్ బెర్రీ హార్ట్ అటాక్ రిస్క్ ను తగ్గిస్తుంది.

బరువు తగ్గిస్తుంది:
క్రాన్ బెర్రీ జ్యూస్ లో ఆర్గానిక్ యాసిడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల మహిళలు దీన్ని తీసుకోవడం చాలా ఆరోగ్యకరం. శరీరంలో పేర్కొన్న ఫ్యాట్ ను కరిగించి త్వరగా బరువు తగ్గించడానికి సహాయపడుతుంది.

క్యాన్సర్ ను నివారిస్తుంది:
క్రాన్ బెర్రీ జ్యూస్ లో ఉండే కెమికల్స్ బ్రెస్ట్ క్యాన్సర్ ను నివారించే లక్షణాలుండటం వల్ల దీన్ని మహిళలు తీసుకోవడం చాలా ఆరోగ్యకరం.

గర్భణీలకు చాలా మంచిది:
క్రాన్ బెర్రీ జ్యూస్ లో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల గర్భిణీలు దీన్ని తీసుకోవచ్చు. ఇది ప్రీమెచ్యుర్ బర్త్ ను నివారిస్తుంది.

వ్యాధినిరోధకతను నివారిస్తుంది:
క్రాన్ బెర్రీ జ్యూస్ వల్ల మరో హెల్త్ బెనిఫిట్ ఇది ఎక్కువ ఎనర్జీని అందిస్తుంది. వర్క్ చేసే మహిళలు వీటిని తప్పనిసరంగా రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

కీళ్ళనొప్పులను నివారిస్తుంది:
క్రాన్ బెర్రీ జ్యూస్ లో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అలాగే ఈ పండులో క్యాల్షియం అధికంగా ఉంది. ఇది కీళ్ళనొప్పులను ప్రమాదంను తగ్గిస్తుంది.



Click it and Unblock the Notifications
