For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జీర్ణవ్యవస్థ పనితీరుకి హానికరమైన ఆహారాలు

By Nutheti
|

మనం తీసుకునే ఆహారం తేలికగా ఉన్నప్పుడే డైజెషన్ లో ఎలాంటి సమస్యా ఉండదు. ఎప్పుడూ డైట్ లో ఈజీగా అరిగే ఆహారం ఉండేలా జాగ్రత్త పడాలి. ఒకవేళ మీరు జీర్ణక్రియ సమస్యతో బాధపడుతుంటే.. తీసుకునే ఆహారం విషయంలో చాలా శ్రద్ధ అవసరం. ఏ ఆహారం తీసుకోవాలి.. ఎలాంటి ఆహారం తీసుకోకూడదు అన్న దానిపై అవగాహన ఉండాలి.

READ MORE: జీర్ణక్రియను మెరుగుపరుచుకోవడానికి చిట్కాలు

కొన్ని ఆహార పదార్థాలు జీర్ణ వ్యవస్థపై తీవ్ర దుష్ర్పభావం చూపుతాయి. డైజెస్టివ్ డిజార్డర్ తో బాధపడేవాళ్లు అరుగుదలకు సమస్య తెచ్చిపెట్టే పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. వికారం, కడుపు ఉబ్బరం వంటి లక్షణాలు జీర్ణక్రియ సమస్యను సూచిస్తాయి. జీర్ణవ్యవస్థ పనితీరు సజావుగా సాగాలంటే.. కొన్ని ఆహారాల పదార్థాలను మీ డైట్ లో నుంచి తీసేయాలి.

స్పైసీ ఫుడ్, స్వీట్స్ వంటివి పొట్టలో మరిన్ని సమస్యలు తీసుకొస్తాయి. ఇవి జీర్ణవ్యవస్థ పనితీరును అడ్డుకుంటాయి. కాబట్టి తీసుకునే ఆహారంలో ఫైబర్, పోషకాలు, విటమిన్స్, మినరల్స్ ఉండేలా జాగ్రత్త పడాలి. శరీరానికి కావాల్సిన మోతాదులో ఫైబర్ అందకపోతే జీర్ణవ్యవస్థలో సమస్యలు మొదలవుతాయి. కాబట్టి ఎలాంటి ఆహారాల వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయో చూద్దాం..

స్వీట్స్

స్వీట్స్

స్వీట్స్, సాల్టీ ఫుడ్స్ ఆరోగ్యానికి మంచిది కాదు. జీర్ణక్రియ సరిగా లేదనిపించినప్పుడు స్వీట్స్, సాల్టీ ఫుడ్స్ కి దూరంగా ఉండటం మంచిది. బోర్ కొట్టినప్పుడు ఉప్పుతో నిండి ఉన్న చిప్స్ తినడం కంటే.. ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది.

ఆల్కహాల్

ఆల్కహాల్

ఆల్కహాల్ పొట్టకు, కాలేయానికి మంచిది కాదు. ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. డైజెషన్ ప్రాబ్లమ్ తో ఇబ్బందిపడుతున్నప్పుడు ఆల్కహాల్ కి దూరంగా ఉండాలి.

వేపుళ్లు

వేపుళ్లు

ఎక్కువగా ఫ్రై చేసిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల డయేరియా సమస్య వస్తుంది. అంతేకాదు కడుపు ఉబ్బరం, కాన్స్టిపేషన్ వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. కాబట్టి వేపుళ్లను ఎంత తక్కువగా తీసుకుంటే మీ జీర్ణక్రియ అంత సజావుగా సాగుతుంది.

నిమ్మ, టమోటా

నిమ్మ, టమోటా

స్టమక్ అప్ సెట్ తో బాధపడే వాళ్లు నిమ్మ, టమోటాలు తీసుకోకపోవడం మంచిది. ఇందులో ఆమ్లాలు ఎక్కువగా ఉన్నా.. అవి జీర్ణక్రియకు హానికరం.

పాల ఉత్పత్తులు

పాల ఉత్పత్తులు

పాలు, పాల ఉత్పత్తులు ఆరోగ్యానికి మంచిదే అయినా.. డైజెస్టివ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్లు వీటికి దూరంగా ఉండటం మంచిది.

కాఫీ

కాఫీ

కాఫీలో ఉండే కెపీన్ పొట్టకు మంచిది కాదు. అంతేకాదు పేగులపైనా దుష్ర్పభావం చూపుతుంది. కాబట్టి డైజెషన్ సమస్యలు ఉన్నప్పుడు కాఫీకి దూరంగా ఉంటే మంచిది.

స్పైసీ ఫుడ్

స్పైసీ ఫుడ్

డైజెషన్ సమస్యతో ఇబ్బంది పడే వాళ్లు ఈజీగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం మంచిది. స్పైసీ ఫుడ్ తీసుకుంటే సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశముంది.

ప్రాసెస్డ్ ఫుడ్

ప్రాసెస్డ్ ఫుడ్

ప్రాసెస్డ్ ఫుడ్ లో ఆర్టిఫిషియల్ పదార్థాలు ఎక్కువ ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థ పనితీరుకి హానికరం. ఇందులో ఫైబర్ కూడా ఉండదు. అలాంటి ఫుడ్ కి దూరంగా ఉండటం మంచిది.

English summary

Foods That Are Bad For Digestion: Foods That Harm Your Digesion

When you are already suffering from digestive issues, how wise is it to eat a pizza or a burger? Well, that would surely irritate your stomach. Also, if you consume acidic foods when you are already suffering from acidity, what happens? Well, that would be be dangerous to some parts of your stomach.
Story first published: Wednesday, December 2, 2015, 16:18 [IST]
Desktop Bottom Promotion