For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ లైఫ్ ను హెల్తీగా మార్చేసే ఫ్రూట్ అండ్ వెజ్ స్మూతీస్ ..

|

ప్రస్తుత మోడ్రన్ ప్రపంచంలో...ఉరుకుల పరుగుల జీవితంలో వ్యక్తుల జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకొన్నాయి. ముఖ్యంగా జీవనశైలిలో మార్పుల వల్ల అనేక అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఆహారం పట్ల సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల విటమిన్ల లోపంతో హార్మోనుల్లో లోపం దాంతో వివిధ రకాల సమస్యల భారి పడుతున్నారు. డైట్ విషయంలో ఒక్క ఆహారం మాత్రమే కాదు, స్మూతీస్ కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. స్మూతీస్ శరీరానికి అవసరం అయ్యే అన్ని పోషకాలను అందిస్తుంది. వీటిని తయారుచేసి తీసుకోవడం చాలా సులభం.

మరి స్మూతీస్ తయారుచేయడానికి ఏం చేయాలి? ఏమేమికావాలి? సింపుల్ గా ఒక బ్లెండర్, ఫ్రెష్ ఫ్రూట్స్ లేదా వెజిటేబుల్స్ మరియు బేస్.
బేస్ కోసం పాలు మరియు పెరుగు మరియు నీళ్లు. ముఖ్యంగా స్మూతీస్ కోసం ముఖ్యంగా కావల్సినవి పండ్లు, వెజిటేబుల్స్, ముఖ్యంగా వీటిలో ఉండే ఫైబర్ వేస్ట్ చేయకుండా ఉపయోగించుకోవాలి.

మరి స్మూతీస్ వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం...

ప్రయోజనం # 1:

ప్రయోజనం # 1:

స్మూతీస్ సూపర్ న్యూట్రీషయిన్. మీరు మీకు అవసరం అయ్యే అన్ని రకాల విటమిన్స్ మరియు మినిరల్స్ అందిస్తుంది. కాబట్టి, అన్ని రకాల పండ్లు లేదా వెజిటేబుల్స్ తో స్మూతీస్ తయారుచేసుకోవచ్చు.

ప్రయోజనం # 2:

ప్రయోజనం # 2:

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది . అందుకు ముఖ్య కారణం స్మూతీస్ కోసం ఉపయోగించే అన్ని రకాల పండ్లు మరియు వెజిటేబుల్స్ లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం.

ప్రయోజనం # 3:

ప్రయోజనం # 3:

ఒక ముఖ్య విషయం ఏంటంటే స్మూతీస్ ద్వారా మీరు మీశరీరంకు అవసరం అయ్యే ఎక్కువ ఫైబర్ ను అందివ్వవచ్చు. నిజానికి గ్రీన్ స్మూతీస్ వల్ల ఇది ఒక గ్రేట్ హెల్త్ బెనిఫిట్.

ప్రయోజనం # 4:

ప్రయోజనం # 4:

స్మూతీస్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ద్వారా బౌల్ మూమెంట్ మరింత బెటర్ ఉండి, మలబద్దకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.

ప్రయోజనం # 5:

ప్రయోజనం # 5:

కొన్ని పరిశోధనల ప్రకారం ఎవరైతే రెగ్యులర్ గా స్మూతీస్ తీసుకుంటారో వారిలో శారీరిక మరియు మానసిక స్థితి బాగుంటుందిని రుజువు చేశాయి.

ప్రయోజనం # 6:

ప్రయోజనం # 6:

మీరు ఎప్పుడైతే శరీరానికి అవసరం య్యే న్యూట్రీషియన్ అందివ్వాలనుకుంటారో..అప్పుడు స్మూతీస్ ఒక బెస్ట్ ఎంపిక . ఈ స్మూతీస్ ద్వారా వ్యాధినిరోధకశక్తి ఎక్కువగా ఉంటుంది.

ప్రయోజనం # 7:

ప్రయోజనం # 7:

గ్రీన్ స్మూతీస్ ద్వారా మరో ఉత్తమ ప్రయోజనం, ఎనర్జీ లెవల్స్ గొప్పగా ఉంటాయి . స్మూతీస్ తీసుకోవడం ఒక్కసారి ప్రారంభించారంటే , ఇక ఆ రోజంతా ఉత్సాహంగా కనబడుతారు.

ప్రయోజనం # 8:

ప్రయోజనం # 8:

రెగ్యులర్ గా స్మూతీస్ తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేషన్ లో ఉంటుంది .డీహైడ్రేషన్ సమస్యను మీ దరి చేరనివ్వదు.

ప్రయోజనం # 9:

ప్రయోజనం # 9:

అలాగే మీ శరీరంలో టాక్సిన్స్ తొలగించడానికి ఈ స్మూతీస్ గ్రేట్ గా సహాయపడుతాయి . దాంతో మీ చర్మం మరింత కాంతివంతంగా మెరుస్తుంటుంది.

ప్రయోజనం # 10:

ప్రయోజనం # 10:

గ్రీన్ స్మూతీస్ తో మరో హెల్త్ బెనిఫిట్. వీటిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి? ఇక ఇంత కంటే హెల్తీ డ్రింక్ మరోకటి ఏంకావాలి? మీరు బరువు తగ్గించుకోవాలనే లక్ష్యం మరింత సులభతరం అవుతుంది.

English summary

How Smoothies Change Your Life For Good: Health Tips in Telugu

How Smoothies Change Your Life For Good: Health Tips in Telugu.Healthy smoothies serve many purposes. They are the easiest way to nourish your body with all nutrients. They are easy to prepare and easy to consume.
Story first published: Wednesday, September 23, 2015, 16:23 [IST]
Desktop Bottom Promotion