For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చలికాలంలో శరీరాన్ని వెచ్చగా మార్చే హెల్తీ వింటర్ ఫుడ్స్

|

డిసెంబర్ వచ్చిందంటే చాలు చలికి సంకేతం. రుతు చక్రంలో చలికాలం ఒక ప్రధానమైన మలుపు. గజగజ వణికించే చలిని తన వెంట తీసుకువస్తుంది. సంవత్సరానికి ఒక సారివచ్చే ఈ శీతాకాలా, చల్లని వాతారణంతో పాటు మన శరీరంలో కూడా అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ శీతాకాలనికి , చలికి తగినవిధంగా మనం సిద్ధిం చేసుకోవాలి .

మారిన సీజన్ కు అనుగుణంగా మన దుస్తులు మారాలి. చలినుండి శరీరాన్ని కాపాడుకోవడం కోసం రక్షక కవచంగా స్వెటర్లు, కాళ్ళకు సాక్సులు, చేతులకు గ్లౌజులు ఉపయోగిస్తాం.. ఇలా దుస్తులు మారితేనే మనం మన దైనందిన జీవనాన్ని యథావిధిగా కొనసాగించ గలుగుతాము. అయితే శరీరానికి బయట రక్షణ సరే..

ఎర్లీ మార్నింగ్ కాపర్ (రాగి) పాత్రలోని నీళ్ళ త్రాగడం వల్ల పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్

శరీరంలోపల ఆరోగ్యం సంగతేంటి? కాలాన్ని బట్టి ఆహారనియమాలు కూడా పాటించాలి. అప్పుడే జీవక్రియ కూడా సక్రమంగా పనిచేస్తుంది. ఆహారం అనేది, అది మీ ఆరోగ్యాన్ని నిర్ణయించే విషయం. మీ శరీర ఆరోగ్యానికి అవసరమైన, సరైన ఆహారం తీసుకోవడం, శరీరం యొక్క బాడీ మాస్ ఇండెక్స్ ను మెయింటైన్ చేయడానికి చాలా అవసరం. సీజన్ బట్టీ మీ శరీరం కూడా సర్దుబాటు చేసుకోవడం అవసరం, కాబట్టి మీరు వింటర్ సీజన్ లో రైట్ ఆహారం తీసుకోవాలి. వింటర్లో తీసుకొనే ఆహారాలు కొంత వెచ్చదనం కలిగించేవిగా ఉండాలి. వింటర్ వెచ్చదనం కోసం తీసుకొనే ఆహారం ఈ సీజన్ కు తగ్గ వింటర్ డైయట్ లిస్ట్ లో చేర్చుకొని ఖచ్చితంగా వాటిని తీసుకోవడం వల్ల చలి నుండి వ్యాధుల నుండి శరీరాన్ని బహిర్గతంగా మరియు అంతర్గతంగా ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతాము.

శీతాకాలంలో వేధించే అలర్జీ సమస్యలకు సులభ చిట్కాలు

మరి ఈ వింటర్ డైయట్ కు సరిపోయే అటువంటి ఆహారాలు కొన్ని మిస్ చేయకుండా తినాల్సినవి మీకోసం....

గ్రీన్ చిల్లీ:

గ్రీన్ చిల్లీ:

వింటర్ సీజన్లో చలి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, చలికి మన శరీరాన్ని వెచ్చగాఉంచుకోవడం చాలా అవసరం. బాడీ టెంపరేచర్ క్రమంగా ఉన్నప్పుడు ఎలాంటి జబ్బులు రావు. ముఖ్యంగా పచ్చిమిర్చిలో ఉండే క్యాప్ససిన్ అనే కాంపౌడ్ శరీరానికి అవసరం అయ్యే వెచ్చదానాన్ని అందిస్తుంది. చలికాలంలో చర్మం పగుళ్లు, బర్నింగ్ సెన్సేషన్ నుండి ఉపశమనం కలిగించడానికి గ్రీన్ చిల్లీ గ్రేట్ గా సహాయపడుతుంది.

ఉల్లిపాయ:

ఉల్లిపాయ:

ఉల్లిపాయలు, సంవత్సరం మొత్తం అందుబాటులో ఉంటాయి. ఎప్పుడైనా, ఏసీజన్ లో అయినా సరే ఉల్లిపాయలు ఆరోగ్యానికి చాలా మంచిది . ఉల్లిపాయలో అనేక ఆరోగ్యప్రయోజనాలున్నాయి . ఇందులో ఉండే విటమిన్ సి వింటర్ సీజన్ లో వచ్చే అనేక ఇన్ఫెక్షన్స్ ను నయం చేసే లక్షణాలున్నాయి. కాబట్టి, పచ్చి ఉల్లిపాయలు తిని, చర్మ మరియు ఉదర సంబంధ ఇన్షెక్షన్స్ నుండి ఉపశమనం పొంది, ప్రీరాడికల్స్ ను తగ్గించుకోండి.

అల్లం:

అల్లం:

శీతాకాలంలో తీసుకొనే ఆహారాల్లో అల్లం కూడా సాధారణ ఆహారవస్తువు. దీన్ని పిల్లలు పెద్దలు ఉపయోగించివచ్చు. అల్లంలో ఉండే వైద్యపరైన గుణగణాల వల్ల శీతాకలంలో ఎదురయ్యే సాధారణ జలువు మరియు ఫ్లూ వంటి జబ్బులను ఎదుర్కొంటుంది. వింటర్ సీజన్ లో ఒక కప్పు జింజర్ టీ తీసుకోవడం వల్ల ఫ్యాటీ ఫుడ్స్ జీర్ణం అవ్వడానికి సహాయపడుతుది మరియు ఎసిడిటిని నివారిస్తుంది. జలుబు మరియు దగ్గు నివారించడానికి అల్లం ఒక ఉత్తమ రెమడీ. వింటర్ సీజన్ లో మీరు తయారుచేసే వంటకాల్లో కొద్దిగా అల్లం చేర్చడం వల్ల మీలో వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవచ్చు.

 పసుపు:

పసుపు:

పసుపులో వింటర్ సీజన్లో వచ్చే అన్ని రకాల చిన్న పెద్ద జుబ్బుల నుండి ఉపశమనం కలిగించే గుణాలు మెండుగా ఉన్నాయి. అంతే కాదు పసుపులో ఉండే యాంటీసెప్టిక్ మరియు యాంటీబ్యాక్టీరియల్ గుణాలు, వింటర్ సీజన్ లో వచ్చే అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ను దూరం చేసి, శరీరానికి వెచ్చదనాన్ని కలిగిస్తాయి.

 స్పైసీ సూప్:

స్పైసీ సూప్:

ఈ వింటర్ లో సూప్స్ అంటే ఇష్టపడని వారుండరేమో. సూప్స్ రుచిగా మాత్రమే కాదు శరీరానికి కావల్సిన శక్తిని అందిస్తుంది. శీతాకాలంలో శరీరానికి వెచ్చదనాన్ని కలిగిస్తుంది.చలి ఎక్కువగా ఉండే ఈ సీజన్ లో ఒక బౌల్ చికెన్ సూప్ చాలా టెప్టింగ్ గా ఉంటుంది. చికెన్ సూప్ తో చాలా ఆరోగ్యప్రయోజనాలున్నాయి . ఇది బరువు తగ్గించే క్రమంలోనే కాకుండా ఇది కడుపు నింపుతుంది మరియు ఇది మీ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. మరియు జలుబు మరియు ఫ్లూతో పోరాడుతుంది.

 కెఫిన్:

కెఫిన్:

పచ్చి కోకా బీన్ మరియు కోకా ఫ్లేవర్ కాదు. ఇది మీ వ్యాధినిరోధక శక్తిని పెంపొందిస్తుంది. కోకా బీన్ లోఫ్లెవనాయిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి వ్యాధినిరోధకతను ఉద్దీపనచేస్తుంది. కోకోగింజలతో తయారు చేసిన పొడిని, ఒక కప్పులో పాలలో మిక్స్ చేసి తాగడం వల్ల అద్భుతమైన టేస్ట్ మాత్రమే కాదు వింటర్ డైయట్ తో శరీరంలో అద్భుతమైన మార్పులు తీసుకొస్తుంది. ఇంకా కోకోలో ఉన్న ఫ్లెవనాయిడ్ వల్ల హర్ట్ సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది. కాబట్టి భోజనంతో లేదా భోజనం తర్వాత కోకోను కొద్దిగా తాగడం ఆరోగ్యానికి మంచిది.

 స్పైసీస్(మసాలాలు):

స్పైసీస్(మసాలాలు):

వింటర్ లో సాధారణంగా వచ్చే జలుబు మరియు ఫ్లూ మరియు వింటర్ సీజన్ లో వచ్చే ఇతర ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడానికి ఇండియన్ మసాలా దినుసులు గ్రేట్ గా సహాయపడుతుంది. ఇండియన్ మసాలాలు శరీరంలో వేడి మాత్రమే పెంచడం కాదు, వ్యాధినిరోధకతకు సపోర్టో చేసి న్యూట్రీషియన్ ను ఇది ఉత్పత్తి చేస్తుంది.

డ్రై ఫ్రూట్స్:

డ్రై ఫ్రూట్స్:

తాజా పండ్లకంటే ఎండిన పండ్లలో పోషకాలు అత్యధికంగా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ తో పాటు నట్స్ ను కూడా తరచూ తినడం వల్ల వింటర్ సీజన్ లో ఎదురయ్యే అనారోగ్య సమస్యలను ఎదుర్కోవడానికి ఇవి బాగా సహాయం చేస్తాయి. కాబట్టి స్నాక్స్ టైమ్ లో వీటికి ప్రాధాన్యత ఇవ్వడం మంచిది.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

ఈ స్పైసీ ఫుడ్ మీ వంటకు మంచి సువాసన జోడించడం మాత్రమే కాదు, జలుబు, ఫ్లూతో పోరాడే లక్షణాలు ఉన్నాయి. వెల్లుల్లి, వ్యాధినిరోధకతను ఎదుక్కోవడానికి బ్లెడ్ సెల్స్ ను పెంచుతుంది.వీటిలో అలిసిన్, అజోయేన్ మరియు థయోసల్ఫేట్ వంటి అంశాలు అనేక ఇన్ఫెక్షన్స్ తో పోరాడి వివిధ రకాల వైరస్ లను చంపేస్తుంది.

 సాల్మన్:

సాల్మన్:

సాల్మన్ ఒక మంచి ఆయిల్ ఫిష్. ఇందులో విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ డి. ఈ విటమన్ డి వ్యాధినిరోధక శక్తిని పెంపొదిస్తుంది. మరియు శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది

English summary

TOP 10 Foods That Keep You Warm In Winter

TOP 10 Foods That Keep You Warm In Winter,You can eat certain foods to stay warm in winter. The Chinese believe that certain foods can impact the body's temperature. Well, generally body heat is more about your metabolism.
Desktop Bottom Promotion