For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పేగులను శుభ్రం చేసి, జీర్ణశక్తిని పెంచి, మలబద్దకం నివారించే 10 సూపర్ ఫుడ్స్

|

ప్రస్తుత రోజుల్లో చాలా మంది పొట్ట సంబంధిత సమస్యలతో బాధపడుతున్నా. చాలా మంది ఈ సమస్యలుండటం చాలా సహజం . ఈ సమస్యలకు ముఖ్యకారణం న్యూట్రీషియన్ ఫుడ్స్ తీసుకోకపోవడమే. దానికి తోడు మన జీర్ణాశయం, ప్రేగులు వివిధ రకాల టాక్సిన్స్ తో నిండిపోతుంది . మెడిసిన్స్, వాసిన్స్, వివిధ రకాల హానికరమైన క్రిములతో నిండుతుంది. అద్రుష్టం ఏంటంటే ఎలాంటి హానికారకమైన పదార్థాలైనా మన రెగ్యులర్ డైట్ మరియు జీవన శైలిలో చేసుకొనే మార్పులను బట్టి నివారించుకోవచ్చు.

మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రేగుల ప్రక్షాళన చాలా అవసరం. అంతే కాదు కోలన్ క్లెన్సింగ్ వల్ల కోలన్ క్యాన్సర్ బారీన పడకుండా ఉంటారు. మనం తీసుకొనే ఆహారాల్లో ప్లీతోర అనే కంటెంట్ వల్ల ప్రేగులు ప్రక్షాళన కావింపబడి , మరింత ఉత్తమంగా పనిచేయడానికి సహాయపడుతుంది.

పొట్టలో క్యాన్సర్(కొలరెక్టల్ క్యాన్సర్) లక్షణాలు గుర్తించడం ఎలా...?

ఏ ఆహారంలో పీచు పదార్థం ఉంటుందో అది పేగులను ప్రతిరోజూ క్లీన్‌ చేస్తుంది. విరేచనం సాఫీగా అయ్యేటట్లు చేస్తుంది. మీరు కమలా తొనని నమిలాక రసాన్ని మింగి, ఆ తర్వాత నోటిలోకి వచ్చిన పిప్పిని ఉమ్మి వేస్తారు. ఆ ఊసేదే పీచుపదార్ధం. ఇప్పుడు ఆ రసంతో పాటు పిప్పిని కూడా మింగితే, ఆ రసం రక్తంలోనికి వెళ్లి లాభాన్ని కలిగించినట్లే ఆ పిప్పి మీ పొట్ట, చిన్న పేగులు, పెద్ద పేగుల మొత్తాన్ని, కంచాన్ని పీచు శుభ్రం చేసినట్లుగా చేసుకుంటూ పేగుల్లో చనిపోయిన కణాలను, ఇతర అనవసర పదార్థాలను లాక్కొని విరేచనం గుండా బయటకు వస్తుంది.

పెద్దప్రేగు సమస్యకు ఆహారంతో చిన్నపాటి చికిత్స

ఈ పీచు పదార్థం లేకపోతే మీ పేగులు క్లీన్‌ కావు. పైగా మీకు విరేచనం సరిగా బయటకు రాదు. ఈ పీచు పదార్థం అనేది ప్రకృతి సిద్ధమైన అన్ని ఆహార పదార్థాలలోను ఉంటుంది. ఉదాహరణకు అన్ని కూరగాయల్లోను ఉంటుంది. లేత కూరగాయలను తొక్కలు తీయకుండా వండుకుంటే మంచిది. తొక్క భాగంలో ఎక్కువ పీచు ఉంటుంది. కూరగాయలకు గుండు కొట్టి మరీ వండుకుంటే రేపొద్దున గడ్డకట్టి మలం రాదు. అన్ని రకాల పండ్లలో పీచు ఉంటుంది. ఆకుకూరల్లో కూడా బాగా పీచు పదార్థాలుంటాయి. కొబ్బరిలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి కూరల్లో పొయ్యి మీద నుంచి దింపుకునే ముందు కొబ్బరి కోరు చల్లుకొని తినడం మంది. కోలన్ శుభ్రం చేయడానికి ఇంకా గ్రీన్ టీ, అలోవెర, నిమ్మ, గార్లిక్, అవొకాడో, ఫ్లాక్స్ సీడ్స్, ఆపిల్స్, లీఫీగ్రీన్స్, త్రుణధాన్యాలు, ప్రొబయోటిక్ ఫుడ్స్ ఎక్కువగా సమాయపడుతాయి. వీటితో పాటు మరికొన్ని ఆహారాలు బ్రీఫ్ డీటైల్స్ తో ఈ క్రింది విధంగా...

అలోవెర:

అలోవెర:

ప్రేగు ప్రక్షాళనకు అలోవెర గ్రేట్ గా సహాయపడుతుంది. అలోవెరాలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది . అలోవెరాలో కూడా వివిధ రకాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి . వీటిలో ఆర్గానిక్ బ్రాండ్స్ ఎంపిక చేసుకొని తీసుకోవాలి.

 గ్రీన్ టీ:

గ్రీన్ టీ:

లివర్ ను డిటాక్స్ చేస్తుంది. కాబట్టి గ్రీన్ టీ ని తప్పని సరిగా త్రాగాలి. గ్రీన్ టీ బరువు తగ్గడానికి కూడా బాగా సహాయపడుతుంది.

 నిమ్మరసం:

నిమ్మరసం:

సిట్రస్ పండ్లు, ముఖ్యంగా నిమ్మ కోలన్ (పెద్ద ప్రేగును)శుభ్రం చేయడానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ప్రతి రోజూ ఉదయం ఒక గ్లాసు లెమన్ జ్యూస్ త్రాగడం వల్ల శరీరాన్ని డిటాక్స్ చేసి మరియు శుభ్రపరుస్తుంది. శరీరంలోని మలినాలను తొలగిస్తుంది.నిమ్మరసంలో యాంటీఆక్సిడెంట్స్ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల ఇది కోలన్ శుభ్రం చేయడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.కాబట్టి, ప్రతి రోజూ ఉదయం నిద్రలేవగానే గోరువెచ్చని నీటిలో నిమ్మరం పిండి, తేనె మిక్స్ చేసి తీసుకోవాలి.

తృణధాన్యాలు:

తృణధాన్యాలు:

వీటిలో లోక్యాలరీస్, లో కొలెస్ట్రాల్ కలిగి మరియు సులభంగా జీర్ణ అవ్వడానికి సహాయపడే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. పాస్తా, బ్రెడ్ మరియు పిండిపదార్థాలు ఎక్కువగా తీసుకోవడం మంచిది . ఇవి కోలన్ క్లెన్సింగ్ కు సహాయపడుతాయి మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.

గార్లిక్:

గార్లిక్:

వెల్లుల్లి వాసన అంటే పడనివారు చాలా మందే ఉండవచ్చు. అయితే గుండె ఆరోగ్యాన్నిఆరోగ్యంగా ఉంచుతుంది, అంతే కాదు పెద్దప్రేగు ను శుభ్రపరచేటటువంటి ఆహారాల్లో ఇది ఒకటి.

 ఫ్లాక్స్ సీడ్స్:

ఫ్లాక్స్ సీడ్స్:

ఫ్లాక్సీడ్స్ ల ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ , యాంటీఆక్సిడెంట్స్ మరియు నేచురల్ ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ఒక ఉత్తమ మార్గం. ఫ్లాక్ సీడ్స్ నీటిని గ్రహించి కోలన్ ను విస్త్రుతపరుస్తుంది. దాంతో టాక్సిన్ మరియు మ్యూకస్ ను శరీరం నుండి బయటకు నెట్టేస్తుంది. దాంతో పాటు, క్యాన్సర్, గుండె జబ్బులను మరియు డయాబెటిస్ ను నివారిస్తుంది.

 అవొకాడో:

అవొకాడో:

అవొకాడోలో కూడా ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికం. ఇవి కోలన్ ను శుభ్రం చేస్తుంది. మరియు జీర్ణ సమస్యలను నిరోధిస్తుంది. ఓమేగా 3 ఫ్యాటీ ఆయిల్స్ పెద్ద ప్రేగు గోడకు ఒక లూబ్రికెంట్ వలే పనిచేస్తుంది. అన్ని ఆహారపు అణువులను మరియు వ్యర్థాలను మరియు విషాలను బయటకు విసర్జింపబడుతుంది.

 గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ :

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ :

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఆకుకూరలు కోలన్ (పెద్ద ప్రేగును)శుభ్రం చేయడానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. డైజిస్టివ్ ట్రాక్ (జీర్ణ కోశాన్ని) శుభ్రంగా ఉంచడానికి ఇవి గ్రేట్ గా సహాయపడుతాయి.

ఆపిల్:

ఆపిల్:

కోలన్ శుభ్రం చేయడంలో ఆపిల్ జ్యూస్ ఒక ఉత్తమ హోం రెమెడీ. రెగ్యులర గా ఆపిల్ జ్యూస్ త్రాగడం వల్ల బౌల్ మూమెంట్ ను ఫ్రీగా ఉంటుంది. టాక్సిన్స్ ను బ్రేక్ చేస్తుంది మరియు లివర్ మరియు జీర్ణ వ్యవస్థ యొక్క ఆరోగ్యంను రక్షిస్తుంది.

ప్రొబయోటిక్ ఫుడ్స్:

ప్రొబయోటిక్ ఫుడ్స్:

రెగ్యులర్ డైట్ లో పెరుగును చేర్చుకోవడం వల్ల కోలన్ ను హెల్తీగా ఉంచుతుంది. ప్రోబయోటిక్ ఫుడ్, పెరుగు తీసుకోవడం వల్ల ప్రేగులో మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తుంది మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది . మరియు ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ ను తగ్గిస్తుంది . మరియు వీటిలో ఉండే క్యాల్షియంకోలన్ యొక్క సెల్ లైనింగ్ ను తగ్గిస్తుంది.

English summary

10 Super Foods That Clean Up Your Intestines

Nowadays, gastrointestinal issues have become quite common in a majority of people. The main reason for this is that a large amount of people gorge on the foods that lack nutrients that are necessary for a healthy digestive system.
Story first published: Tuesday, March 22, 2016, 17:47 [IST]
Desktop Bottom Promotion