For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జీరా వాటర్ లో ఆశ్చర్యం కలిగించే ఆరోగ్య రహస్యాలు...

|

జీర ఇండియన్ పేరు జీలకర్ర. ప్రపంచ సుగంధ ద్రవ్యాలలో జీలకర్రకు ప్రత్యేక స్ధానం వుంది. ప్రాచీన కాలంలోఈజిప్టు దేశంలో జీలకర్రను మమ్మీలను తయారు చేయటంలో ఒకపదార్ధంగా వాడేవారు. ఎంతో రుచిగా వుండే ఈ జీలకర్ర లేకుండా మనదేశంలో సాధారణంగా ఏ వంటకం వుండదు. ఎలాంటి సామాన్యమైన వంటకం అయినా సరే జీలకర్ర పడితేచాలు అసాధారణ వంటకం అయిపోతుంది. బంగాళ దుంప కుర్మాలో జీలకర్ర తప్పక రుచికి వేస్తారు. రుచి మాత్రమే కాక తినేవారికి ఆరోగ్యాన్ని కూడా కలిగించే ఈ జీలకర్రను ప్రతివారూ తప్పక ఆహారంలో చేరుస్తారు.

జీల‌క‌ర్ర రుచిలోనే కాదు ఆరోగ్యానికి మేలు చేయ‌డంలోనూ రారాజు. జీలకర్రలో కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, సోడియం, పొటాషియం, విటమిన్ ఎ, సి లు ఎక్కువగా ఉన్నాయి. అంతే కాదు జీలకర్రలో డయాబెటిస్, ట్యూమర్స్ మరియు మైక్రోబయల్ ఇన్ఫెక్షన్స్ ను నివారించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . అందుకే ప్రాచీన కాలంలో జీలకర్రను నీటిలో మిక్స్ చేసి ప్రతి రోజూ త్రాగేవారు.

జీలకర్ర వాటర్ త్రాగాలంటే, ముందుగా నీటిని 10 నిముషాలు మరిగించాలి . తర్వాత అందులో జీలకర్ర వేసి, 10 నిముషాలు ఉడికించాలి. తర్వాత ఈ నీటిని ఫిల్టర్ చేయాలి . ఇలా ఫిల్టర్ చేసిన నీటిలో అనేక ఔషధ గుణాలు దాగి ఉన్నాయి . ఈ గోరువెచ్చని నీటితో సూప్ లా తీసుకోవాలి.

జీలకర్రలో కుమినాల్ డీహైడ్ అనే కాంపౌండ్ ఉంటుంది. ఇది ఫైటో కెమికల్. నిజానికి జీలకర్ర టేస్ట్ మరియు వాసన చాలా డిఫరెంట్ గా ఉంటుంది . అంతే కాదు జీరా వాటర్ లోని మరిన్ని బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం...

వ్యాధినిరోధకతను పెంచుతుంది:

వ్యాధినిరోధకతను పెంచుతుంది:

జీలకర్రలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ ఫ్రీరాడికల్ డ్యామేజ్ నుండి మరియు కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ నుండి రక్షణ కల్పిస్తుంది . ఇది వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.

కిడ్నీ హెల్త్ :

కిడ్నీ హెల్త్ :

జీరా వాటర్ కిడ్నీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. జీలకర్రను దోరగా వేయించి అంతకు సమానంగా వేయించని జీలకర్రను కలిపి పొడి చేసుకోవాలి. దీనికి సమానంగా పంచదార వీలైతే ఆవునెయ్యిని కలుపుకొని కుంకుడు కాయంత మాత్రలు చేసుకొని 2 పూటలా 2 చొప్పున మాత్రలు వేసుకొవాలి. దీనివల్ల మూత్ర సంబంధ వ్యాధులు, మూత్రంలో వేడి, మంట పచ్చదనం తగ్గుతాయి. జీకలర్ర కిడ్నీ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది . జీలకర్రవల్ల ఇది ఒక ఉత్తమ ప్రయోజనం. లేదా జీలకర్రను నీటిలో వేసి బాగా మరిగించి రోజంతా తాగుతుండాలి.

ర‌క్త‌హీన‌త‌

ర‌క్త‌హీన‌త‌

రక్తంలో హీమోగ్లోబిన్ తయారవటానికి కావలసిన ముఖ్యమైన పోషకమైన ఐర‌న్ జీల‌క‌ర్ర‌లో పుష్క‌లంగా ఉంటుంది. శ‌రీరంలో ఐర‌న్ లోపం వ‌ల్ల వ‌చ్చే అనీమియా త‌గ్గించుకోవ‌డానికి జీరా బాగా స‌హాయ‌ప‌డుతుంది. ర‌క్త‌హీన‌త ఎక్కువ‌గా పిల్ల‌లు, ఆడ‌వాళ్ల‌లో క‌నిపిస్తుంది. కాబ‌ట్టి జీల‌క‌ర్ర‌ను రెగ్యుల‌ర్ గా తీసుకోవ‌డం మంచిది.

క్యాన్సర్ నివారిణి:

క్యాన్సర్ నివారిణి:

జీలకర్రను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లను నివారించుకోవచ్చు . రెగ్యులర్ గా జీరా వాటర్ త్రాగడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, స్టొమక్ క్యాన్సర్ మరియు లివర్ క్యాన్సర్ ను నివారిస్తుంది. ఎందుకంటే వీటిలో ఉండే యాంటీ కార్సినోజిక్ లక్షణాలు గ్రేట్ గా సహాయపడుతాయి.

నిద్రలేమి సమస్యను నివారిస్తుంది:

నిద్రలేమి సమస్యను నివారిస్తుంది:

జీరా వాటర్ కొన్ని నిద్రసమస్యలను నివారిస్తుంది. నిద్రలేమి సమస్యతో బాధపడే వారు . జీలకర్ర నీటిని తాగుతుంటే మంచి ఫలితం ఉంటుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. :

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. :

జీరా వాటర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది . ఆకలిని పెంచుతుంది. లాలాజల ఉత్పత్తికి సహాయపడుతుంది.

గొంతు నొప్పి నివారిస్తుంది:

గొంతు నొప్పి నివారిస్తుంది:

జీరా వాటర్ గొంతునొప్పిని నివారిస్తుంది. కొద్దిగా జీరా వాటర్ తాగాలి మరియు అదే నీటితో గార్గిలింగ్ చేయడం వల్ల గొంతు నొప్పి నివారించబడుతుంది.

హైపర్ టెన్షన్ నివారిస్తుంది:

హైపర్ టెన్షన్ నివారిస్తుంది:

జీరావాటర్లో బ్లడ్ ప్రెజర్ లెవల్స్ ను నార్మల్ చేస్తుంది మరియు హైపర్ టెన్షన్ ను నివారిస్తుంది.

శరీరాన్ని తగిన హైడ్రేషన్లో ఉంచుతుంది:

శరీరాన్ని తగిన హైడ్రేషన్లో ఉంచుతుంది:

జీరా బాటర్ మొత్తం బాడీ సిస్టమ్ ను హైడ్రేషన్లో ఉంచుతుంది. ఇందులో ఉండే కొన్ని మెడిసినల్ గుణాల వల్ల బాడీ హైడ్రేట్ అవుతుంది.

బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది:

బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది:

జీరా వాటర్ వల్ల మరో అమేజింగ్ బెనిఫిట్ , బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది.

కొన్ని రకాల హెల్త్ సమస్యలను నయం చేస్తుంది:

కొన్ని రకాల హెల్త్ సమస్యలను నయం చేస్తుంది:

జీరా వాటర్లో ఉండే మెడిసినల్ గుణాలు దంతక్షయం, కళ్ళ సమస్యలు, ప్రేగు సమస్యలు, జాయింట్ సమస్యలు, బ్రీతింగ్ సమస్యలు, వాపులు మరియు చలిని నివారిస్తుంది.

పాలను వ్రుద్దిచేస్తుంది:

పాలను వ్రుద్దిచేస్తుంది:

జీరా వాటర్లో ఉండే ఔషధగుణాల వల్ల కొత్తగా తల్లైన వారిలో పాలపడటానికి గ్రేట్ గా సహాయపడుతుంది.

English summary

12 Ways Jeera Water Benefits Your Health జీరా వాటర్ లోని అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ ...

Jeera is the Indian name for cumin seeds. These seeds contain medicinal properties. Though they have a slightly spicy taste, they have many health benefits. In fact, cumin seeds are part of many Indian recipes.
Story first published: Tuesday, February 9, 2016, 18:50 [IST]
Desktop Bottom Promotion