For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

24 టిప్స్ : మీరు తినే ఈ ఆహారమే వ్యాధుల నివారణకు మంచి మెడిసిన్..!

|

మనలో చాలా మంది, చిన్న జబ్బు చేస్తే చాలు చాలా హైరాన పడిపోతుంటారు. వెంటనే మెడికల్ షాపుకు వెళ్ళి ఏదో ఒక టాబ్లెట్ లేదా పిల్స్ తెచ్చి వేసుకుంటారు. అయితే ఇలా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా సొంత వైద్యం చేసుకోవడం వల్ల ఉన్న జబ్బు తగ్గడానికి బదులు సైడ్ ఎఫెక్ట్స్ పెరుగుతాయి. అయితే పురాతన కాలంలో ఏదైనా ఒక జబ్బు చేసిందంటే అందుకు ప్రక్రుతిలో సహజసిద్దంగా ఉండే మూలికలే ఔషధాలుగా ఉపయోగించేవారు. వీటకంటే ముందు ఆహారాలనే ఔషధంగా ఉపయోగించేవారు. ఈ విషయం ఆ కాలం నాటి అమ్మమ్మలను, తాతయ్యలను అడగితే తెలుస్తుంది. అంతే కాదు ఈ ఆహారాలల్లో జబ్బులను త్వరగా నయం చేసే గుణాలు ఎక్కువగా ఉండేవి. మరి ఇప్పుడు మనం ఎందుకు ఆహారాలతో జబ్బును నివారించుకోలేకపోతున్నాము?

ప్రస్తుత కాలంలో ఆర్గానిక్ ఫుడ్స్ కంటే కెమికల్ ఫుడ్స్ ఎక్కువైనందున జబ్బుల త్వరగా తగ్గడం లేదు. అయితే కొన్ని ముఖ్యమైన ఆహారాలు కెమికల్స్ తో పండించినా వాటిలో పోషక, ఔషదవిలువలు ఏమాత్రం తగ్గవు. వీటిలో న్యూట్రీషియన్స్, హీలింగ్ ప్రొపర్టీస్ అధికంగా ఉన్నాయి. మనకు అందుబాటులో ఉండే ఆహారాల్లోనే ఎన్నో ఔషధగుణాలున్నాయి. ఇవి శరీరానికి పోషణ అందివ్వడంతో పాటు అనేక వ్యాధులను నివారించడంలో సహాయపడుతునాయి.

అయితే ఇప్పటికే మీరు వేరే ఇతర జబ్బులు లేదా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నట్లైతే వాటినివారణకు తప్పసరిపగా మెడికల్స్ హెల్ఫ్ అవసరం అవుతుంది. వైద్యపరమైన చికిత్సతో పాటు, ఈ ఆహారాలను కూడా రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే, వ్యాధులను దూరం చేసుకోవచ్చు. చిన్న వయస్సు నుండి ఈటింగ్ హ్యాబిట్స్ మరియు లైఫ్ స్టైల్ మార్చుకోవడం వల్ల ఇమ్యూన్ పవర్ ను ఇప్పటి నుండి పెంచుకోవడం వల్ల వయస్సైనప్పుడు వ్యాధుల బారీన పడకుండా నివారించుకోవచ్చు.

కొన్ని ఆరోగ్య సమస్యలను నివారించుకోవడానికి మనకు అందుబాటులో ఉండే కొన్ని ఆహారాలు ఈ క్రింది విధంగా..

హైబ్లడ్ ప్రెజర్ :

హైబ్లడ్ ప్రెజర్ :

ఆలివ్ ఆయిల్ , సెలరీ హైబ్లడ్ ప్రెజర్ ను తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఆలివ్ ఆయిల్ ను రెగ్యులర్ వంటల్లో ఒక బాగం చేసుకోండి.

జలుబు

జలుబు

రెగ్యులర్ డైట్ లో వెల్లుల్లి చేర్చుకోవడం వల్ల అనేక వ్యాధులు నివారించబడుతాయి. ముఖ్యంగా డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది, కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. జలుబు నివారించబడుతుంది

మెమరీ పవర్ :

మెమరీ పవర్ :

మెమరీ పవర్ పెంచుకోవాలంటే జింక్ అధికంగా తీసుకోవాలి. జింక్ అధికంగా ఉన్న నట్స్, గుమ్మడి, ఫిష్ వంటి వాటిలో జింక్ అత్యధికంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల మెమరీ పవర్ పెరుగుతుంది

హెవీ ఫీవర్

హెవీ ఫీవర్

ఒక కప్పు పెరుగులో ఒక టీస్పూన్ తేనె మిక్స్ చేసి తినడం వల్ల సీజనల్ గా వచ్చే హై ఫీవర్ ను నివారించుకోవచ్చు.

బ్రెస్ట్ క్యాన్సర్:

బ్రెస్ట్ క్యాన్సర్:

బాడీలో ఈస్ట్రోజెన్ లెవల్స్ ను మెయింటైన్ చేయాడినికి క్యాబేజ్ గ్రేట్ గా సహాయపడుతుంది. ఈ క్రమంలోనే మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ నివారించడానికి క్యాబేజ్ గ్రేట్ రెమెడీ .

డయోరియా

డయోరియా

అరటి పండ్లు మంచి రెమెడీ. అయితే ఆపిల్ ను కట్ చేసి కొద్దిసేపు అలాగే ఉంచితే, కొద్దిగా డార్క్ గా మారుతుంది. దీన్ని తినడం వల్ల డయోరియా తగ్గుతుంది.

డీహైడ్రేషన్

డీహైడ్రేషన్

వాటర్ మెలోన్ తినాలి. వాటర్ మెలోన్ లో 90శాతం నీరు ఉంటుంది. పుచ్చకాయలో ఉండే లైకోపిన్ అనే కంటెంట్ క్యాన్సర్ నివారిణిగా పనిచేస్తుంది. పొటాషియం అందిస్తుంది.

నిద్రలేమి

నిద్రలేమి

ఒక కప్పు పాలలో కొద్దిగా తేనె మిక్స్ చేసి ప్రతి రోజూ నిద్రించే ముందు తాగితే త్వరగా ఉపశమనం కలుగుతుంది. దాంతో త్వరగా నిద్రలోకి జారుకుంటారు.

బోన్ సమస్యలు

బోన్ సమస్యలు

పైనాపిల్ తినడం వల్ల బోన్ సమస్యలు నివారించుకోవచ్చు. పైనాపిల్లో మ్యాంగనీస్ అధికంగా ఉంటుంది. ఇది ఓస్టిరియో ఫోసిస్ ను నివారిస్తుంది. ఇది ఫ్రాక్చర్స్ ను త్వరగా నయం చేయడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

ఇమ్యూనిటి పెంచుతుంది

ఇమ్యూనిటి పెంచుతుంది

జామ, బొప్పాయి పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది వ్యాధినిరోధకత పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది ఫైబర్ కంటెంట్ ను అంధిస్తుంది.

కిడ్నీ స్టోన్స్ :

కిడ్నీ స్టోన్స్ :

ఆరెంజ్ జ్యూస్ ను రెగ్యులర్ గా తాగడం వల్ల కిడ్నీ స్టోన్స్ నివారించుకోవచ్చు. ఆరెంజ్ కామన్ కోల్ట్ ను నివారిస్తుంది.

ఫ్రీరాడికల్స్ డ్యామేజ్

ఫ్రీరాడికల్స్ డ్యామేజ్

బెర్రీస్ ను తినడం వల్ల అందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ ఫ్రీరాడికల్ డ్యామేజ్ ను నివారిస్తుంది. ఫ్రీరాడికల్స్ డ్యామేజ్ ను నివారించడంలో స్ట్రాబెర్రీ మరియు బ్లూ బెర్రీస్ టాప్ లిస్ట్ లో ఉంటాయి

ప్రొస్టేట్ సమస్యలు

ప్రొస్టేట్ సమస్యలు

డైలీ డైట్లో టమోటోలను చేర్చుకోవడం వల్ల ఇది పురుషుల్లో ప్రొస్టేట్ సమస్యలను నివారిస్తుంది.

అల్సర్

అల్సర్

క్యాబేజ్ ను రెగ్యులర్ గా తినడం వల్ల గ్యాస్ట్రిక్ అల్సర్ ను నివారించుకోవచ్చుజ ఇది అల్సర్ ను తగ్గిస్తుంది.

ధమనుల్లో బ్లాక్స్ నివారిస్తుంది:

ధమనుల్లో బ్లాక్స్ నివారిస్తుంది:

అవొకాడోలో ఉండే అమినోయాసిడ్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అలాగే ఇది కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది.

తలనొప్పి

తలనొప్పి

నార్మల్ గా వచ్చే తలనొప్పి, మైగ్రేన్ హెడ్ వంటి వివిధ రకాల తలనొప్పులను ఫిష్ ఆయిల్ తగ్గిస్తుంది. ఫిష్ ఆయిల్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.

ఆర్థ్రైటిస్

ఆర్థ్రైటిస్

సార్డిన్స్ మరియు సాల్మన్ వంటి చేపలు ఇమ్యూనిటిని పెంచుతుంది.

బ్లడ్ షుగర్ :

బ్లడ్ షుగర్ :

పీనట్స్ మరియు బ్రొకోలీలో క్రోమియం ఎక్కువగా ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్ లెవల్స్ న రెగ్యులేట్ చేయడానికి సహాయపడుతుంది.

స్ట్రోక్

స్ట్రోక్

గ్రీన్ టీని రెగ్యులర్ గా తాగుతుంటే స్ట్రోక్ సమస్యలుండవు. ఇది ధమనులను క్లియర్ చేస్తుంది.

ప్రిమెనుష్ట్రువల్ సిండ్రోమ్

ప్రిమెనుష్ట్రువల్ సిండ్రోమ్

ఆందోళన, అలసట, మరియు డిప్రెషన్ తగ్గించడంలో కార్న్ ఫ్లేక్స్ గ్రేట్ గా సహాయపడుతాయి.

బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ :

బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ :

క్రాన్ బెర్రీ జ్యూస్ ను తాగడం వల్ల,బ్లాడర్ లోని బ్యాక్టీరియాను నివారిస్తుంది. దాంతో బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ నివారించుకోవచ్చు .

స్టొమక్ అప్ సెట్ :

స్టొమక్ అప్ సెట్ :

పొట్ట సమస్యలను నివారించడంలో అరటి మరియు అల్లం గ్రేట్ రెమెడీ. ఇది వికారంను తగ్గించడంలో గ్రేట్ రెమెడీ.

ఆస్త్మా

ఆస్త్మా

శ్వాస సంబంధిత సమస్యలను నివారించడంలో ఉల్లిపాయ గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది శ్వాస సమస్యలకు సంబంధించిన లక్షణాలు నివారిస్తుంది.

దగ్గు

దగ్గు

దగ్గు నివారణకు కేయాన్ పెప్పర్ గుడ్ రెమడీ. అయితే దీనిని పరిమితంగా మాత్రమే తీసుకోవాలి.

English summary

24 Tips: How To Use Food As Medicine

For most of us, medicines are tablets and pills. But in the ancient times, food was both food and medicine too. Yes, many foods have healing effects and that is why you can use foods to prevent and heal certain disorders.
Desktop Bottom Promotion