For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ డైలీ డైట్ లో మెంతులను కంపల్సరీ చేర్చుకోవాలి..! ఎందుకు ?

By Swathi
|

మెంతులు ఇండియన్ వంటకాల్లో అమోఘమైన రుచిని, సువానసనను అందిస్తాయి. ఆవకాయ పచ్చళ్లు, కూరల్లో పసందైన రుచికి మెంతులను వాడతారు. పప్పులో మెంతులను లేదా మెంతి ఆకులను ఉపయోగిస్తారు. ఇది అమోఘమైన రుచితో పాటు, అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

మెంతుల రుచికి మరేది సాటి రాదు. ఈ మెంతులను వంటకాల్లో ఖచ్చితంగా చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే.. దీన్ని ఎందుకు చేర్చుకోవాలి అనడానికి కొన్ని కారణాలను కూడా చెబుతున్నారు. మెంతుల ప్రయోజనాలు తెలిస్తే.. మీరు కంపల్సరీ వీటిని డైలీ డైట్ లో ఉపయోగిస్తారని సలహా ఇస్తున్నారు.

వెజిటబుల్ కర్రీ, పరాఠా, పప్పు వంటి వాటిల్లో ఈ ఫ్లేవర్ దట్టిస్తే చాలు. ఏదో ఒక రూపంలో మెంతులు తీసుకోవడం చాలా అవసరం. దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలే కాదు చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. అలాగే రాత్రి నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తీసుకోవడం వల్ల శరీరంలోని మలినాలు బయటకుపోయి.. మెటబాలిజం పెరుగుతుందని చెబుతున్నారు. మరి మెంతులను డైలీ డైట్ లో చేర్చుకుంటే పొందే ఫలితాలేంటో చూద్దాం..

కొలెస్ట్రాల్ లెవల్ తగ్గిస్తుంది

కొలెస్ట్రాల్ లెవల్ తగ్గిస్తుంది

మెంతుల ద్వారా పొందే మరో అద్భుతమైన ప్రయోజనం ఇది. ఇందులో ఉండే పోషకాలు.. కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిస్తాయి. అలాగే కొలెస్ట్రాల్ గ్రహించడాన్ని అరికడతాయి.

బ్లడ్ షుగర్ లెవెల్స్

బ్లడ్ షుగర్ లెవెల్స్

మీ ఫ్యామిలీలో ఎవరికైనా షుగర్ ఉందంటే మీరు ఖచ్చితంగా మీ డైట్ లో మెంతులను చేర్చుకోవాలి. ఇందులో ఉండే గలాక్టోమనా ఆహారాల నుంచి షుగర్ గ్రహించడాన్ని తగ్గిస్తుంది. మెంతుల్లో ఉండే ఎమినో యాసిడ్స్ ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి.

హార్ట్ డిసీజ్

హార్ట్ డిసీజ్

ఒత్తిడి, అనారోగ్య ఆహారపు అలవాట్ల కారణంగా.. గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి మెంతులు లేదా డ్రై మెంతి ఆకులను వంటకాల్లో ఉపయోగిస్తే. .గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఉండే పొటాషియం హార్ట్ హెల్త్ కి సహాయపడతాయి.

జ్వరం, గొంతు నొప్పి

జ్వరం, గొంతు నొప్పి

డైట్ లో మెంతులు చేర్చుకోవాలి అనడానికి ఇదో ముఖ్యకారణం. ఇది గొంతు నొప్పి, వాపు, జ్వరం వంటి లక్షణాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. శ్వాస తేలికగా ఆడుతుంది. జ్వరంగా ఉన్నప్పుడు చికెన్ సూప్ లలో మెంతులను యాడ్ చేసుకుంటే.. మంచి ఉపశమనం కలుగుతుంది.

బరువు తగ్గడానికి

బరువు తగ్గడానికి

బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేసి విసిగిపోయారా ? అయితే ఈ ఎఫెక్టివ్ టిప్ ట్రై చేయండి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో.. కొన్ని మెంతులను నమలండి. దీనివల్ల ఆకలి కంట్రోల్ ఉండే.. ఎక్కువ ఆహారాలు తీసుకోకుండా అడ్డుకట్టవేస్తుంది. ఇదో అద్భుతమైన ప్రయోజనం.

బ్రెస్ట్ మిల్క్

బ్రెస్ట్ మిల్క్

పాలు ఇచ్చే తల్లులు డైలీ డైట్ లో మెంతులను చేర్చుకుంటే.. మంచి ఫలితం ఉంటుంది. డైయాసిజెన్ ఉండటం వల్ల.. ఇది పాల ఉత్పత్తిని పెంచుతుంది.

రుతుక్రమంలో నొప్పి

రుతుక్రమంలో నొప్పి

పీరియడ్స్ సమయంలో చాలామంది పొట్టనొప్పి వంటి రకరకాల సమస్యలతో బాధపడతారు. కాబట్టి మీరు మీ ఆహారంలో మెంతులను చేర్చుకుంటే.. అలాంటి ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. కూరల్లో మెంతిపొడి వాడినా సరిపోతుంది.

కోలన్ క్యాన్సర్

కోలన్ క్యాన్సర్

ఇందులో ఉండే సొల్యుబుల్ ఫైబర్స్ కారణంగా కోలన్ క్యాన్సర్ నుంచి దూరంగా ఉండటానికి సహాయపడుతుంది. కాబట్టి దీన్ని డైట్ లో చేర్చుకుంటే.. హెల్తీగా ఉండవచ్చు.

English summary

8 Reasons To Include Methi In Your Food

8 Reasons To Include Methi In Your Food. Fenugreek is one of the best whole spices that makes the Indian cuisine so very tasty and unique. It is popularly known as 'Methi’.
Story first published:Monday, May 30, 2016, 10:00 [IST]
Desktop Bottom Promotion