For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రతిరోజూ అరగ్లాసు దానిమ్మ జ్యూస్, 3కర్జూరాలు తింటే ఏమవుతుంది ?

దానిమ్మ, కర్జూరం రెండింటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ రెండింటిని సపరేట్ గా తీసుకోవడం కంటే.. కాంబినేషన్ గా తీసుకోవడం వల్ల అనేక వ్యాధులను అరికట్టవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.

By Swathi
|

అరగ్లాసు దానిమ్మ రసంతోపాటు మూడు కర్జూరాలు తీసుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చని, ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని.. ఓ అధ్యయనం తేల్చింది. ఈ రెండు ఫ్రూట్స్ లో దాగున్న హెల్త్ బెన్ఫిట్స్ అమోఘంగా ఉంటే.. ఈ రెండింటి కాంబినేషన్ తీసుకోవడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు అందిస్తాయట. దానిమ్మలోని విత్తనాలను వడకట్టకుండా గ్రైండ్ చేసి తీసుకుంటే.. మరింత ఎక్కువ ఫలితాలు పొందవచ్చని ఈ స్టడీస్ చెబుతున్నాయి.

pomegranate juice and dates

దానిమ్మ, కర్జూరం రెండింటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ రెండింటిని సపరేట్ గా తీసుకోవడం కంటే.. కాంబినేషన్ గా తీసుకోవడం వల్ల అనేక వ్యాధులను అరికట్టవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. మరి 3కర్జూరాలు, అరగ్లాసు దానిమ్మ రసం తీసుకోవడం వల్ల పొందే అమేజింగ్ బెన్ఫిట్స్ ఏంటో చూద్దాం..

హెల్తీ ఫ్రూట్స్

హెల్తీ ఫ్రూట్స్

దానిమ్మ, కర్జూరం రెండూ.. ప్రపంచంలోనే అత్యంత హెల్తీ ఫ్రూట్స్ అని డాక్టర్లు చెబుతున్నారు. ఈ రెండింటినీ రెగ్యులర్ గా తీసుకోవడం ఎక్కువ ఫలితాలు పొందవచ్చు.

వారానికి మూడుసార్లు

వారానికి మూడుసార్లు

ఒక కప్పు ఇంట్లోనే తయారు చేసుకున్న దానిమ్మ జ్యూస్, 3 డేట్స్ కాంబినేషన్ ని వారానికి కనీసం మూడుసార్లు తీసుకోవడం వల్ల.. శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది.

గుండె

గుండె

ఈ రెండింటి కాంబినేషన్ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. స్ట్రోక్, హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు రాకుండా నివారించవచ్చు. అయితే ప్రతిరోజూ అరగ్లాసు దానిమ్మ జ్యూస్, మూడు కర్జూరాలు తినడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ రిస్క్ తగ్గించుకోవచ్చు.

కొలెస్ట్రాల్

కొలెస్ట్రాల్

దానిమ్మ, కర్జూరాల కాంబినేషన్ మిశ్రమం తీసుకోవడం వల్ల.. కొలెస్ట్రాల్ లెవెల్స్ ని చాలా వేగంగా తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

బ్లడ్

బ్లడ్

దానిమ్మ హిమోగ్లోబిన్ పెంచడంలో సహాయపడుతుంది. అయితే.. దానిమ్మతోపాటు, కర్జూరాలు కలిపి తీసుకోవడం వల్ల.. బ్లడ్ వెజెల్స్ ని క్లెన్స్ చేయడానికి సహాయపడుతుంది.

కణాలకు

కణాలకు

దానిమ్మ జ్యూస్ లో పాలీఫెనాలిక్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి కణాలు డ్యామేజ్ అవకుండా కాపాడతాయి.

చెడు కొలెస్ట్రాల్

చెడు కొలెస్ట్రాల్

డేట్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి.. ధమనుల్లో పేరుకునే.. చెడు కొలెస్ట్రాల్ ని ఎఫెక్టివ్ గా అరికడతాయి. కాబట్టి.. ఈ అద్భుతమైన రెమెడీని ప్రతిరోజూ తీసుకోవడం మంచిది.

English summary

Amazing Health Benefits of pomegranate juice and dates

Amazing Health Benefits of pomegranate juice and dates. Now, researchers have found that the combination of pomegranate juice and dates can actually help you win the war against heart disease.
Story first published: Thursday, October 20, 2016, 12:50 [IST]
Desktop Bottom Promotion