For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్రెయిన్ షార్ప్ గా ఉండాలంటే వీటిని ఖచ్చితంగా తినకండి..!

|

మీరు మంచి జ్ఞాపకశక్తిని మరియు మెమరీ పవర్ కలిగి ఉండాలని కోరుకుంటున్నారా? అవును అయితే, అప్పుడు మీరు మీ రెగ్యులర్ డైట్ టో కొన్ని హెల్తీ ఫుడ్స్ ను చేర్చుకోవాల్సి ఉంటుంది.

మన శరీరంలో బ్రెయిన్ అత్యంత ముఖ్యమైన అవయవమని మనందరికీ తెలిసిన విషయమే.అలాంటి బ్రెయిన్ సరిగా పనిచేయకపోతే లేదా అనారోగ్యానికి గురైనట్లైతే ఏం జరుగుతుంది? బాడీలోని ఇతర అవయవాలన్నీ కూడా పనిచేయడం మందగిస్తాయి. బ్రెయిన్ సరిగా పనిచేయకపోతే, శరీరంలో మొత్తం నాడీ వ్యవస్థ మీద తీవ్ర దుష్ప్రభావం పడుతుంది.

కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలు రెగ్యులర్ గా తినడం వల్ల బ్రెయిన్ పవర్ ను షార్స్ గా ఉంచుకోవచ్చు. అలాగే కొన్ని మెదడు ఆరోగ్యాన్ని క్షీణింపచేసే పదార్థాలకు దూరంగా ఉండటం వల్ల కూడా బ్రెయిన్ ను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

హెల్తీ బ్రెయిన్ అంటే లర్నింగ్ ఎబిలిటీస్ మంచిగా ఉండటం, జ్ఞాపకశక్తి, చురుకుగా ఉండటం, సంజ్ఞాత్మక నైపుణ్యాలు, మానసిక ఆరోగ్యంగా అన్నీ హెల్తీగా ఉండటాన్నే హెల్తీ బ్రెయిన్ అంటారు.

మంచి జ్ఞాపకశక్తి కోసం అనుసరించదగిన డైట్ టిప్స్ చాలానే ఉన్నాయి. ఇవి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల నేచురల్ గా డిప్రెషన్ ను తగ్గించుకోవచ్చు.

కాబట్టి, మీరు హెల్తీ అండ్ షార్ప్ బ్రెయిన్ పొందాలంటే మీ రెగ్యులర్ డైట్ నుండి మీరు కొన్ని ఖచ్చితంగా తొలగించాలి. అవేంటో తెలుసుకుందా, బ్రెయిన్ హెల్త్ ను కాపాడుకుందాం...

ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ :

ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ :

ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ మన ఆహారాలకు మంచి ఫ్లేవర్ ను అందిస్తుంది. అలాగే బ్రెయిన్ సెల్స్ క్షీణతకు దారితీస్తుందని, దాంతో మతిమరుపు వంటి బ్రెయిన్ సమస్యలకు కారణమవుతుందని రీసెంట్ గా జరిగిన పరిశోధలన ద్వారా వెల్లడైనది .

చేపలు

చేపలు

కొన్ని రకాల చేపల్లో మెర్క్యురి ఎక్కువగా ఉంటుంది. ఇది బ్రెయిన్ సెల్స్ మీద ప్రభావం చూపుతుంది,. నెగటివ్ గా పనిచేసేలా చేస్తుంది. కాబట్టి మెర్క్యురి ఎక్కువగా ఉన్న ఆహారాకలు దూరంగా ఉండాలి.

బేకరీ ప్రొడక్ట్స్ :

బేకరీ ప్రొడక్ట్స్ :

బేకరీ ఫుడ్స్ లో పాస్ట్రీస్(రొట్టెలు), బ్రెడ్ లో మార్గరిన్ ఎక్కువగా ఉండటం వల్ల, ఇవి మెదడులోని కణాలు ముడుచుకోయేలా చేయండ లేదా మెదడు వాపుకు గురిచేస్తాయి.

పాస్తా

పాస్తా

హెల్తీ అండ్ షార్స్ బ్రెయిన్ కోసం డైట్ టిప్స్ అనుసరించే వారు, తప్పనిసరిగా నివారించాల్సి ఫుడ్స్ లో పాస్త ఒకటి. ఎందుకంటే పాస్తాలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిలో ఉండే ఫ్యాట్స్ మెమరీ ఫంక్షన్స్ ను తగ్గిస్తుంది, మెదడు క్షీణించడానికి కారణమవుతుంది. కాబట్టి, ఇటువంటి ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది.

సాఫ్ట్ డ్రింక్స్

సాఫ్ట్ డ్రింక్స్

సాప్ట్ డ్రింక్స్ (శీతల పానీయాలు)లలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది బ్రెయిన్ హెల్త్ మీద తీవ్రప్రభావం చూపుతుంది. హైపోథాలమస్ కు డ్యామేజింగ్ ఎఫెక్ట్స్ ను కలిగిస్తుంది.

ప్రాసెస్ ఫుడ్స్

ప్రాసెస్ ఫుడ్స్

ఫ్రెంచ్ ఫ్రైస్, పిజ్జా వంటి ‘‘జంక్ ఫుడ్స్’’ బ్రెయిన్ హెల్త్ కు అంత మంచివి కావు, ఇవి బ్రెయిన్ సెల్స్ ను ఇన్ఫ్లమేషన్ కు గురిచేస్తుంది మరియు హైపర్ టెన్షన్ కు కారణమవుతుంది.

ఆల్కహాల్

ఆల్కహాల్

ఆల్కహాల్ బ్రెయిన్ మీద నేరుగా ప్రభావం చూపుతుంది. మెమరీ వంటి బ్రెయిన్ ఫంక్షన్ కు హాని కలిగిస్తుంది. బ్రెయిన్ సెల్స్ ను క్షీణింప చేయడంతోపాటు, డిప్రెషన్ కు దారితీస్తుంది.

English summary

Avoid These Common Foods If You Want A Healthy Brain!

Do you wish to have good cognitive and memory skills? If yes, then there are certain natural foods for a healthy brain that you must make a part of your diet. If you are wondering how to improve the health of your brain, then you should start by following a healthy diet. As we all know, the brain is one of the most important organs of our body and if the brain does not function well or if it is unhealthy, then the rest of our regular body functions will be seriously affected.
Story first published: Tuesday, August 30, 2016, 17:40 [IST]
Desktop Bottom Promotion