For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బీట్ రూట్, క్యాబేజ్, నిమ్మరసం..మిశ్రమంతో అద్భుత ఫలితాలు..!

క్యాబేజ్, బీట్ రూట్, నిమ్మరసం మిశ్రమం జీర్ణవ్యవస్థకు చాలా హెల్తీ అని మీకు తెలుసా ? అయితే.. ఈ రెసెపీ సీక్రెట్స్ ఏంటో మీరే చూడండి..

By Swathi
|

మీరు యంగ్ గా ఉన్నప్పుడు మీ గ్రాండ్ మదర్ చెప్పే సలహాలను వింటారా ? ఒకవేళ వినడం లేదంటే.. మన పూర్వీకులు వ్యాధులను నయం చేయడానికి ఉపయోగించిన కొన్ని న్యాచురల్ రెమెడీస్ ఉన్నాయి. అవి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

మనుషులకు వ్యాధులు కొత్తేమి కాదు. అనేక వ్యాధులు, ఇన్ఫెక్షన్లు డాక్టర్ల దగ్గరకు వెళ్లేలా చేస్తాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు గురైనా.. మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటాం. రకరకాల వ్యాధులను నివారించడానికి మోడ్రన్ సైన్స్ సహాయపడుతున్నమాట నిజమే. కానీ.. వాటి వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. అవి మనకు హాని చేస్తాయి.

ఉదాహరణకు దగ్గు తగ్గడానికి దగ్గు సిరప్ తీసుకుంటారు. దగ్గు నుంచి ఉపశమనం కలిగించినా.. కాన్ట్సిపేషన్, అలసట వంటి రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎదురయ్యే అవకాశాలుంటాయి. అందుకే చాలా మంది ఈ కాలంలో న్యాచురల్ రెమెడీస్ నే ఫాలో అవుతున్నారు.

క్యాబేజ్, బీట్ రూట్, నిమ్మరసం మిశ్రమం జీర్ణవ్యవస్థకు చాలా హెల్తీ అని మీకు తెలుసా ? అయితే.. ఈ రెసెపీ సీక్రెట్స్ ఏంటో మీరే చూడండి..

కావాల్సిన పదార్థాలు

కావాల్సిన పదార్థాలు

క్యాబేజీ తురుము అర కప్పు

బీట్ రూట్ తురుము అర కప్పు

నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు

తయారు చేసే విధానం

తయారు చేసే విధానం

పైన సూచించిన అన్ని పదార్థాలను మిక్సీలో వేసి బ్లెండ్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయిన తర్వాత ఒక కప్పులోకి తీసుకోవాలి. ప్రతిరోజూ రాత్రి భోజనం తర్వాత కనీసం 15 రోజులపాటు తీసుకోవాలి.

క్లెన్స్

క్లెన్స్

ఈ అమేజింగ్ డ్రింక్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థను క్లెన్స్ చేస్తుంది. దీనివల్ల జీర్ణ సంబంధ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

కాన్ట్సిపేషన్

కాన్ట్సిపేషన్

ఈ డ్రింక్ కాన్ట్సిపేషన్ నుంచి చాలా తేలికగా రిలీఫ్ ని అందిస్తుంది. అయితే రెగ్యులర్ గా తాగినప్పుడే ఫలితాలు పొందవచ్చు.

హెల్తీ డైట్

హెల్తీ డైట్

ఈ డ్రింక్ తాగుతున్నాం కదా.. డైట్ మిస్ చేయకూడదు. హెల్తీ డైట్ ఫాలో అయినప్పుడే.. ఈ డ్రింక్ ద్వారా మెరుగైన ఫలితాలు పొందవచ్చు. ఆయిలీ, ఫ్యాటీ ఫుడ్స్ ని తీసుకోవడం తగ్గించాలి.

టాక్సిన్స్

టాక్సిన్స్

క్యాబేజ్, బీట్ రూట్, నిమ్మరసం కాంబినేషన్ పేగులలో పేరుకున్న మలినాలను తొలగించడానికి సహాయపడుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.

English summary

Eat Cabbage And Beetroot With Lemon Juice For 3 Days And Watch What Happens!

Eat Cabbage And Beetroot With Lemon Juice For 3 Days And Watch What Happens! Try this healthy natural remedy and make way for exceptional health!
Desktop Bottom Promotion