For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పరకడుపున ఒకే ఒక వెల్లుల్లి రెబ్బ చాలు.. మెడిసిన్స్, డాక్టర్స్ అవసరమే లేదు..!

ఉదయాన్నే పరకడుపున ఒకే ఒక వెల్లుల్లి రెబ్బ తింటే శరీరంలో కనిపించే అద్భుత మార్పులను తెలుసుకున్నారంటే.. క్రమం తప్పకుండా.. ఈ టిప్ ఫాలో అయిపోతారు.

By Swathi
|

ఉదయాన్నే వెల్లుల్లి తినడం, అది కూడా పరకడుపున తినడం అనేది చాలా హెల్తీ అని ఎక్స్ పర్ట్స్ సూచిస్తున్నారు. ఇలా ఉదయాన్నే పరకడుపున ఒకే ఒక వెల్లుల్లి రెబ్బ తింటే శరీరంలో కనిపించే అద్భుత మార్పులను తెలుసుకున్నారంటే.. క్రమం తప్పకుండా.. ఈ టిప్ ఫాలో అయిపోతారు.

Have One Garlic Clove Every Morning & Watch Out For These Amazing Benefits

పచ్చి వెల్లుల్లి రెబ్బ తినడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అనేది ఇప్పుడు కనిపెట్టినది కాదు.. మన పురాతన కాలం నుంచే అలవాటు కొనసాగుతోంది. తీవ్రమైన జలుబు, ఇతర సమస్యలతో బాధపడేటప్పుడు మన అమ్మమ్మలు కూడా సలహా ఇచ్చే ఉంటారు. వెల్లుల్లి తింటే త్వరగా నయం అవుతుందని.

వెల్లుల్లిలో ఉండే యాంటీ బయోటిక్ గుణాలు అనేక అనారోగ్య సమస్యలను తేలికగా నయం చేస్తుంది. అజీర్ణం, హైబ్లడ్ ప్రెజర్, సాధారణ జలుబుని చిటికెలో నివారిస్తుంది. అలాగే ఇమ్యునిటీ లెవెల్స్ ని వేగంగా పెంచుతుంది.

వెల్లుల్లి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇందులో చాలా ముఖ్యమైన అల్లిసిన్ ఉంటుంది. ఇది చాలా కీలకమైన ఔషధగుణాలను కలిగి ఉంటుంది. చాలామంది వెల్లుల్లిని ప్రతి వంటకానికి విభిన్నమైన రుచి అందించడానికి ఉపయోగిస్తారు. కానీ.. కొంతమందికి వెల్లుల్లి పడదు. వాళ్లకు చాలా సైడ్ ఎఫెక్ట్స్ కి కారణమవుతుంది. కాబట్టి మితంగా తీసుకోవాలి. మరి వెల్లుల్లిని ఉదయాన్నే తినడం వల్ల పొందే అమేజింగ్ బెన్ఫిట్స్ ఏంటో చూద్దాం..

ఇమ్యునిటీ పెరగడానికి

ఇమ్యునిటీ పెరగడానికి

వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ ఇమ్యునిటిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ప్రతిరోజూ ఉదయాన్నే పరకడుపున ఒకే ఒక వెల్లుల్లి రెబ్బ తింటే.. చాలా త్వరగా, తేలికగా వ్యాధినిరోధక శక్తి పెరగడానికి సహాయపడుతుంది.

హై బ్లడ్ ప్రెజర్

హై బ్లడ్ ప్రెజర్

హైబ్లడ్ ప్రెజర్ తో బాధపడేవాళ్లకు వెల్లుల్లి ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది. ఉదయాన్నే పరకడుపున ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలను తీసుకోవడం వల్ల హైపర్ టెన్షన్ ని తగ్గించడానికి సహాయపడుతుంది.

జలుబు నివారించడానికి

జలుబు నివారించడానికి

వెల్లుల్లి ఇమ్యునిటి లెవెల్ పెంచడం ద్వారా శరీరంలో ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా అడ్డుకుంటుంది. వెల్లుల్లిని ఉదయం పరకడుపున తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు వంటి ఇన్ఫెక్షన్స్ దూరంగా ఉంటాయి.

గుండె వ్యాధుల రిస్క్

గుండె వ్యాధుల రిస్క్

వెల్లుల్లి బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్ రిస్క్ ని కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. అలాగే మంచి కొలెస్ట్రాల్ లెవెల్స్ ని మెయింటెయిన్ చేస్తుంది. దీనివల్ల గుండె సంబంధిత వ్యాధుల రిస్క్ తగ్గించడానికి సహాయపడుతుంది.

క్యాన్సర్ అరికట్టడానికి

క్యాన్సర్ అరికట్టడానికి

పచ్చి వెల్లుల్లి రెబ్బని ఉదయాన్నే పరకడుపున తీసుకోవడం వల్ల వివిధ రకాల క్యాన్సర్ల రిస్క్ ని తగ్గించవచ్చు. పొట్ట, యూటెరైన్, ప్రొస్టేట్ వంటి క్యాన్సర్లను దూరంగా ఉంచుతుంది. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ క్యాన్సర్ సెల్స్ ని నాశనం చేస్తుంది.

శరీరాన్ని డెటాక్స్ చేస్తుంది

శరీరాన్ని డెటాక్స్ చేస్తుంది

వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో హానికారక మలినాలను తొలగించడానికి సహాయపడుతుంది. కాబట్టి ఉదయాన్నే పరకడుపున వెల్లుల్లి రెబ్బ తింటే శరీరం డెటాక్సిఫై అవుతుంది.

డిమెంటియా

డిమెంటియా

వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ కణాలను డ్యామేజ్ చేయడాన్ని అరికడుతుంది. దీంతో వయసు పెరిగే కొద్దీ వచ్చే డిమెంటియా సమస్యను అడ్డుకోవచ్చు. కాబట్టి ఉదయాన్నే ఒక వెల్లుల్లి రెబ్బను క్రమం తప్పకుండా తినండి.

ఎముకల ఆరోగ్యం

ఎముకల ఆరోగ్యం

వెల్లుల్లి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఉదయాన్నే పరకడుపున వెల్లుల్లి తింటే.. శరీరంలో ఈస్ట్రోజెన్ లెవెల్స్ ని పెంచుతుంది. దీనివల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.

English summary

Have One Garlic Clove Every Morning & Watch Out For These Amazing Benefits

Have One Garlic Clove Every Morning & Watch Out For These Amazing Benefits. There are several health benefits of garlic if taken in the right amount early in the morning. This article explains about it.
Story first published: Monday, December 12, 2016, 16:07 [IST]
Desktop Bottom Promotion