For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పైనాపిల్ జ్యూస్ లో దాగున్న అమేజింగ్ హెల్త్ సీక్రెట్స్..!

By Swathi
|

మీరు ఏదైనా డిఫరెంట్ టేస్ట్, ఫ్లేవర్ ఉండే ఫ్రూట్ జ్యూస్ తాగాలని అనుకుంటున్నారా ? అయితే.. పైనాపిల్ జ్యూస్ ట్రై చేయండి. టేస్ట్ తోపాటు ఇందులో.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. చాలా కొద్దిమందకి మాత్రమే పైనాపిల్ జ్యూస్ లోని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసు.

తాజా పైనాపిల్ జ్యూస్ లో విటమిన్స్, ఎంజైమ్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. బెర్రీస్ కలిపి చేసినా, కేవలం పైనాపిల్ తో జ్యూస్ చేసి తీసుకున్నా.. అద్భుతమైన పోషకాలు పొందవచ్చు. ప్లాంట్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఒబేసిటీ రిస్క్ తగ్గించుకోవచ్చు. డయాబెటిస్, హార్ట్ డిసీజ్ లకు దూరంగా ఉండవచ్చు.

పైనాపిల్ జ్యూస్ తీసుకోవడం వల్ల.. జుట్టుకి, చర్మానికి మంచి పోషణ అందుతుంది. శరీరానికి ఎనర్జీ అందుతుంది. ఒక కప్పు పైనాపిల్ ముక్కల్లో 80క్యాలరీలు, 2 గ్రాముల ఫైబర్, 1 గ్రాము ప్రొటీన్ ఉంటుంది. కాబట్టి పైనాపిల్ జ్యూస్ ని తరచుగా తాగుతూ ఉండాలి అనడానికి ఖచ్చితమైన కారణాలు.

చర్మానికి

చర్మానికి

స్వీట్ గా, టేస్టీగా ఉండే.. పైనాపిల్ జ్యూస్ లో విటమిన్స్, అస్కోర్బిక్ యాసిడ్ ఉంటుంది. ఇవి.. శరీరంలోని రకరకాల భాగాలకు మంచిది. ముఖ్యంగా చర్మానికి ఇవి చాలామంచిది. ఈ పైనాపిల్ లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది.. చర్మంలో ఎలాస్టిసిటీని మెరుగ్గా ఉంచుతుంది. అలాగే పైనాపిల్ జ్యూస్ ని చర్మానికి ఉపయోగించడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిస్తుంది.

బలమైన ఎముకలు

బలమైన ఎముకలు

పైనాపిల్ జ్యూస్ తాగడం వల్ల ఎముకలు బలంగా, హెల్తీగా మారతాయి. ఎందుకంటే.. ఇందులో మాంగనీస్ ఉంటుంది. ఇది.. ఆరోగ్యంపై పాజిటివ్ ప్రభావం చూపుతుంది. పైనాపిల్ లో బ్రొమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది.. వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.

పళ్లు తెల్లగా మారడానికి

పళ్లు తెల్లగా మారడానికి

మీ పళ్లు తెల్లగా మారాలంటే.. పైనాపిల్ జ్యూస్ ని రెగ్యులర్ గా తీసుకోవాలి. దీనివల్ల క్రిములు ఉన్న పళ్లను తెల్లగా మార్చేస్తుంది. అలాగే పళ్లగా తెల్లగా ఉండటానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి.. పాచి పేరుకోకుండా అడ్డుకుంటుంది. అలాగే చిగుళ్లను స్ట్రాంగ్ గా చేస్తుంది.

హార్ట్ హెల్త్

హార్ట్ హెల్త్

కరోనరీ హార్ట్ డిసీజ్ లకు దూరంగా ఉండటంలో.. పైనాపిల్ జ్యూస్ సహాయపడుతుంది. అలాగే.. రక్త ప్రసరణ సజావుగా సాగడానికి సహాయపడుతుంది.

క్యాటరాక్ట్ నియంత్రణ

క్యాటరాక్ట్ నియంత్రణ

పైనాపిల్ జ్యూస్ లో ఉండే విటమిన్ సి.. క్యాటరాక్ట్స్ నుంచి కళ్లను కాపాడుతుంది. అలాగే.. కంటి ఆరోగ్యానికి మంచిది. పైనాపిల్ జ్యూస్ లో బీటా కెరోటిన్, విటమిన్ ఏ ఉంటాయి. ఇవి.. కళ్లను హెల్తీగా ఉంచడంలో.. కీలకపాత్ర పోషిస్తాయి.

ఇమ్యునిటీ

ఇమ్యునిటీ

జలుబు చేసినప్పుడు.. ఒక వారంపాటు.. మీరు ఏ పనిచేయలేకపోతారు. పైనాపిల్ జ్యూస్ ఒక గ్లాస్ తాగడం వల్ల జలుబు దూరంగా ఉంటుంది. విటమిన్ సితోపాటు అనేక పోషకాలు ఉండటం వల్ల.. ఇమ్యునిటీ స్ట్రాంగ్ గా, హెల్తీగా ఉండేలా చేస్తుంది.

కిడ్నీ స్టోన్

కిడ్నీ స్టోన్

ఫైబర్, పొటాషియం పైనాపిల్ జ్యూస్ లో ఉండటం వల్ల.. గుండె హెల్తీగా ఉంటుంది. అలాగే.. కిడ్నీల్లో స్టోన్స్ ఏర్పడటాన్ని అడ్డుకుంటుంది. కాబట్టి పైనాపిల్ జ్యూస్ ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల.. అనేక వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. అద్భుతమైన పోషకాలు పొందవచ్చు.

English summary

Reasons To Drink Pineapple Juice

Reasons To Drink Pineapple Juice. Are you looking for a fruit juice that has an exceptionally interesting flavour? Then make sure to go to a grocery store and buy pineapple juice, which is known to have countless health benefits.
Story first published:Wednesday, August 17, 2016, 16:26 [IST]
Desktop Bottom Promotion