For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజూ మిస్ చేయకుండా తినాల్సిన సూపర్ ఫుడ్స్.!!

హెల్త్ కాన్షియస్ నెస్ ఎక్కువగా ఉన్నవారు ప్రతి రోజూ హెల్తీ ఫుడ్ తినడానికి ప్రాధాన్యత ఇస్తుంటారు. డైట్ ను బ్యాలెన్స్ చేసుకోవడం వీరి దిన చర్యలో ఒక బాగం. ఇలా అందరికి ఆరోగ్యం మీద భద్రతా భావం ఎందుకుండదు?

|

హెల్త్ కాన్షియస్ నెస్ ఎక్కువగా ఉన్నవారు ప్రతి రోజూ హెల్తీ ఫుడ్ తినడానికి ప్రాధాన్యత ఇస్తుంటారు. డైట్ ను బ్యాలెన్స్ చేసుకోవడం వీరి దిన చర్యలో ఒక బాగం. ఇలా అందరికి ఆరోగ్యం మీద భద్రతా భావం ఎందుకుండదు? ఆరోగ్యం మీద భద్రతా భావం ఉన్నప్పుడు లైఫ్ లాంగ్ ఆరోగ్యంగా జీవంచగలుగుతాము అందుకే రోజూ తినే ఆహారాల్లో కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు, ఆరోగ్యానికి గ్రేట్ గా సహాయపడుతాయి ?

కొన్ని పరిశోధనలు ఈ విషయాన్ని ఖచ్చితంగా అంగీకరిస్తున్నాయి. రోజూ మనం సహజంగా తీసుకునే ఆహారాల్లోనే అద్భుతమైన ప్రయోజనాలు దాగున్నాయని, అందుకే వాటిలో ఎంపిక చేసుకుని మరీ డైలీ డైట్ లో చేర్చుకోవాలి. ఎక్కువ న్యూట్రీషియన్స్ ఉన్న ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎప్పుడూ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

కాబట్టి, మనం రెగ్యులర్ గా తినే ఆహారాల్లో కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను గురించి పూర్తిగా తెలుసుకోవడం చాలా అవసరం. అలాగే ఇటువంటి ఆహారాలు వారానికి లేదా రెండు వారాలకొకసారి తప్పనిసరిగా చేర్చుకోవడం మంచిది. ఈ క్రింది లిస్ట్ లో ఇచ్చిన పర్టికలర్ ఫుడ్స్ ను డైలీ డైట్ లో చేర్చుకోవడం వల్ల పూర్తి పోషకాలను ఎక్కువగా పొందుతారు !

Super Foods You Must Eat Every Day Without Fail!

రోజూ మనం తినే ఆహారం సమతుల్యం చేసుకోవడం చాలా అవసరం. రోజు మన శరీర ఆరోగ్యానికి కావల్సిన మినిరల్స్, విటమిన్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ , కార్బోహైడ్రేట్స్ మొదలగునవి హెల్తీ బాడీకి తప్పనిసరిగా అవసరమవుతాయి .

అందువల్ల ఇటువంటి ఫుడ్స్ ను మన రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం. మన శరీర ఆరోగ్యాన్ని మెరుగ్గా కాపడగలిగే ఆ ఆహారాల లిస్ట్ ఏంటో ఒక సారి తెలుసుకుందాం....

 అవొకాడో

అవొకాడో

రెగ్యులర్ గా తినే ఆహారాలో అవొకాడో ఒకటి. ఇది టేస్టీ ఫ్రూట్, అవొకాడోలో విటమిన్స్, యాంటీఆక్సిడెంట్స్, అత్యధికంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గిస్తాయి . క్యాన్సర్ నివారిణిగా సహాయపడుతాయి !

గుడ్లు:

గుడ్లు:

రోజుకు ఒక గుడ్డు తినడం వల్ల మన శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్స్ ఎక్కువగా అందిస్తుంది. రోజుకు సరిపడా ప్రోటీన్స్ ను అందివ్వడం వల్ల కండరాలు స్ట్రాంగ్ గా, ఎలాంటి గాయాలు లేకుండా డెవలప్ అవుతాయి.

బాదం:

బాదం:

రోజూ కనీసం 4 బాదంలు తినడం చాలా అవసరం. ఎందుకంటే బాదంలో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది బాడీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

పెరుగు:

పెరుగు:

ప్రతి రోజూ తినే ఆహారాల్లో పెరుగు తప్పనిసరి. పెరుగులో ప్రోబయోటిక్స్, ల్యాక్టిక్ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణశక్తిని , ఇమ్యూనిటి పవర్ ను పెంచుతాయి.

 డార్క్ చాక్లెట్స్:

డార్క్ చాక్లెట్స్:

రోజూ డార్క్ చాక్లెట్ తినడం ఆరోగ్యంగా ఉంటారు. డార్క్ చాక్లెట్స్ లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ ఇమ్యూన్ సిస్టమ్ ను పెంచుతుంది, దాంతో స్ట్రెస్ తగ్గించుకోవచ్చు !

రెడ్ క్యాప్సికమ్

రెడ్ క్యాప్సికమ్

రోజూ తినే ఆహారాల్లో రెడ్ క్యాప్సికమ్ ఒకటి. రెడ్ క్యాప్సికమ్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా అత్యవసరమైనది.

పాలు

పాలు

వెన్న తీసిన పాలు రెగ్యులర్ గా తాగడం వల్ల శరీర ఆరోగ్యానికి అవసరమయ్యే న్యూట్రీషిన్స్ పుష్కలంగా అందుతాయి. పోషణను అందిస్తాయి. కాబట్టి, డైలీ బేసిస్ లో వీటిని తీసుకోవడం చాలా అవసరం.

English summary

Super Foods You Must Eat Every Day Without Fail!

Many of us who are health conscious know that we must eat a balanced diet to remain healthy. However, did you know that there are certain healthy foods that you must eat on a daily basis?
Desktop Bottom Promotion