For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్యాన్సర్ కిల్లర్స్ : ఎలాంటి క్యాన్సర్ అయినా తగ్గించే సత్తా వీటికి ఉంది...

|

సహజంగా మనకు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి. ఎలాంటి ఆహారాలు తీసుకోకూడదనే విషయం మనకు తెలుసు . మనం తీసుకొనే ప్రతి ఒక్క ఆహారం మన శరీరంలోని అవయవాలకు, జీవక్రియలకు ఏదో ఒకరకంగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ మద్యకాలంలో ఆరోగ్య నిపుణుల సూచన ప్రకారం మనం రెగ్యులర్ డైట్ లో తీసుకొని చాలా రకాల వెజిటేబుల్స్ యాంటీ క్యాన్సర్ ఫుడ్స్ గా సూచిస్తున్నారు.

ఊపిరితిత్తుల క్యాన్సర్ : ప్రారంభ లక్షణాలు

అవును, ఇది నిజం. ఇవి క్యాన్సర్ కిల్లర్స్, కాబట్టి కొన్ని రకాల వెజిటేబుల్స్ మరియు కొన్ని రకాల ఫ్రూట్స్ ను మీరు ఏమాత్రం తినకుండా ఉండటానికి లేదు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ ద్యాన్ క్యూర్ అన్నవిషయం ఇక్కడ ఖచ్చితంగా ఫాలో అయినట్లైతే, క్యాన్సర్ రాకుండా ముందు జాగ్రత్తగా ఈ ఆహారాలను మన రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల మన శరీరానికి ఆరోగ్యంతో పాటు చిన్న వయస్సులో క్యాన్సర్ బారిన పడే ప్రమాధం ఉండదు.

ప్రేగు క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఈ ఆహారాలు తినడం తప్పనిసరి

మరి క్యాన్సర్ ను నివారించే లేదా క్యాన్సర్ పెరుగుదలను అడ్డుకొనే కొన్ని క్యాన్సర్ కిల్లింగ్ ఫుడ్స్ ...

టమోటోలు:

టమోటోలు:

టమోటోల్లో లైకోపిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఒక యాంటీఆక్సిడెంట్ . ఇది లంగ్, బ్రెస్ట్ మరియు ప్రొస్టేట్ క్యాన్సర్ ను నివారిస్తుంది. టమోటోల్లో లైకోపిన్ అధికంగా ఉంటుంది.

అల్లం:

అల్లం:

అల్లం యాంటీఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ క్యాన్సేరియస్ పదార్థం . దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల క్యాన్సర్ గ్రోత్ లేకుండా నివారించుకోవచ్చు. ముఖ్యంగా మహిళల్లో ఓవేరియన్ క్యాన్సర్ ప్రమాధం ఉండదు.

క్యారెట్స్:

క్యారెట్స్:

క్యారెట్ లో బీటా కెరోటిన్ యాంటీఆక్సిడెంట్స్ క్యాన్సర్ సెల్స్ డెవలప్ కాకుండా కాపాడుతుంది. అలాగే ఇతర కారణాల వల్ల కణాలు డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

వెల్లుల్లి యాంటీ క్యాన్సర్ పదార్థం. వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ క్యాన్సర్ సెల్స్ తో పోరాడుతుంది. వెల్లుల్లి లంగ్స్, బ్రెస్ట్, కోలన్ మరియు ప్రొస్టేట్ క్యాన్సర్స్ ను నివారిస్తుంది.

దానిమ్మ :

దానిమ్మ :

దానిమ్మలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. మరియు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. దానిమ్మ విత్తనాలను జ్యూస్ రూపంలో కాకుండా అలాగే నేరుగా తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

బీన్స్:

బీన్స్:

బీన్స్ లో ఫోటో కెమికల్స్ ఉంటాయి. ఇవి క్యాన్సర్ సెల్స్ గ్రోత్ ను అడ్డుకుంటాయి. బీన్స్ లో ఉండే న్యూట్రీషియన్స్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ను నివారిస్తుంది.

పసుపు:

పసుపు:

పసుపులో కుర్క్యుమిన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంది. ఇది క్యాన్సర్ సెల్స్ తో పోరాడుతుంది. కాబట్టి రెగ్యులర్ వంటకాల్లో పసుపును ఉపయోగించాలి.

ద్రాక్ష:

ద్రాక్ష:

ద్రాక్షలో రెసవర్టరోల్ ఉంటుంది మరియు బెర్రీస్ క్యాన్సర్ సెల్స్ ను పారదోలుతుంది మరియు శరీరంలో ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది.

స్ట్రాబెర్రీస్:

స్ట్రాబెర్రీస్:

స్ట్రాబెర్రీస్ లో ఎలాజిక్ కంటెంట్ ఉంటుంది. మరియు వీటిలో ఉండే విటమిన్ సి క్యాన్సర్ సెల్స్ గ్రోత్ ను అడ్డుకుంటుంది. బెర్రీస్ , స్టొమక్, ఈసోఫోగస్ లంగ్ మరియు మౌత్ క్యాన్సర్ ను నివారిస్తుంది.

గ్రీన్ టీ:

గ్రీన్ టీ:

గ్రీన్ టీలో ఉండే క్యాటచిన్స్ క్యాన్సర్ ను నివారిస్తుంది. అంతే కాదు గ్రీన్ టీలో ఉండే మరికొన్ని కాంపౌండ్స్ లివర్ ను శుభ్రం చేస్తుంది.

ఆకుకూరలు:

ఆకుకూరలు:

ఆకుకూరలు ఈసోఫాగల్ క్యాన్సర్ ను నివారిస్తుంది. లూటిన్ మరియు జియాక్సిథిన్ అనే కాంపౌండ్స్ మీ శరీరంను శుభ్రం చేస్తుంది . ఇది శరీరంను శుభ్రం చేస్తుంది మరియు కొన్ని రకాల క్యాన్సర్స్ ను నివారిస్తుంది.

ఇతర వెజిటేబుల్స్:

ఇతర వెజిటేబుల్స్:

బ్రొకోలి, కేలా మరియు క్యాబేజ్ వంటివి వివిధ రకాల క్యాన్సర్స్ ను నివారిస్తుంది. నోటి, కడుపు, మరియు ఈసోఫోగస్ క్యాన్సర్లను నివారిస్తుంది.

English summary

These 12 Foods Are Cancer Killers!

We are what we eat and we are what we don't eat. When you take a look at any healthy diet that is prescribed by health experts, you will be surprised to see that most of the vegetables that are prescribed are in fact, anti-cancer foods.
Desktop Bottom Promotion